Categories
కీర్తనలు

కీర్తనలు 37

దావీదు కీర్తన.

1 చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము

దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.

2 వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు.

పచ్చని కూరవలెనే వాడిపోవుదురు

3 యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము

దేశమందు నివసించి సత్యము ననుసరించుము

4 యెహోవానుబట్టి సంతోషించుము

ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము

నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము

నెరవేర్చును.

6 ఆయన వెలుగునువలె నీ నీతిని

మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.

7 యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు

కనిపెట్టుకొనుము.

తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము

దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన

పడకుము.

8 కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము

వ్యసనపడకుము అది కీడుకే కారణము

9 కీడుచేయువారు నిర్మూలమగుదురు

యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును

స్వతంత్రించుకొందురు.

10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురువారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు

కనబడకపోవుదురు.

11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు

బహు క్షేమము కలిగి సుఖించెదరు

12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురువారినిచూచి పండ్లు కొరుకుదురు.

13 వారి కాలమువచ్చుచుండుట ప్రభువు చూచు

చున్నాడు.వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.

14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై

యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై

భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు

15 వారి కత్తి వారి హృదయములోనే దూరునువారి విండ్లు విరువబడును.

16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను

బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్ఠము.

17 భక్తిహీనుల బాహువులు విరువబడును

నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు

18 నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడువారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.

19 ఆపత్కాలమందువారు సిగ్గునొందరు

కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.

20 భక్తిహీనులు నశించిపోవుదురు

యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి

యుందురు

అది కనబడకపోవునట్లువారు పొగవలె కనబడక

పోవుదురు.

21 భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు

నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.

22 యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని

స్వతంత్రించుకొందురు

ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.

23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును

వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.

24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు

గనుక

అతడు నేలను పడినను లేవలేక యుండడు.

25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై

యున్నాను

అయినను నీతిమంతులు విడువబడుట గానివారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి

యుండలేదు.

26 దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురువారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.

27 కీడుచేయుట మాని మేలుచేయుము అప్పుడు నీవు

నిత్యము నిలుచుదువు

28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు

ఆయన తన భక్తులను విడువడు

వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని

భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.

29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురువారు దానిలో నిత్యము నివసించెదరు.

30 నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించునువారి నాలుక న్యాయమును ప్రకటించును.

31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో

నున్నది వారి అడుగులు జారవు.

32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని

చంపజూతురు.

33 వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడువారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు

లుగా ఎంచడు.

34 యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము

ఆయన మార్గము ననుసరించుము

భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను

హెచ్చించును

భక్తిహీనులు నిర్మూలముకాగా నీవు చూచెదవు.

35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి

యుంటిని

అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు

వర్ధిల్లియుండెను.

36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు

లేకపోయెను

నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

37 నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము

సమాధానపరచువారి సంతతి నిలుచును గాని

38 ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు

భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.

39 యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము

బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము.

40 యెహోవావారికి సహాయుడై వారిని రక్షించునువారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక

ఆయన భక్తిహీనులచేతిలోనుండి వారిని విడిపించి

రక్షించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/37-eabdf24a69bfb430f18eaf6a9a55ad70.mp3?version_id=1787—

0 replies on “కీర్తనలు 37”

Leave a Reply to గ ణేష్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *