Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 9

1 మరియు నేను చెవులార వినునట్లు ఆయనగట్టిగా ఈ మాటలు ప్రకటించెను–ఒక్కొకడు తాను హతముచేయు ఆయుధమును చేతపట్టుకొని–పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను.౹

2 అంతలో ఒక్కొ కడు తాను హతముచేయు ఆయుధమును చేతపట్టుకొని, ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు, అవిసె నారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించి యిత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి.౹

3 ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా

4 యెహోవా–యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని వారికాజ్ఞాపించి

5 నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను–మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైననులేకుండ అందరిని హతము చేయుడి.౹

6 అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా

7 ఆయన–మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైనవారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోనివారిని హతము చేయసాగిరి.౹

8 నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని–అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా

9 ఆయన నాకీలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలు వారియొక్కయు యూదావారియొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది; వారు–యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని, దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపియున్నారు.౹

10 కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను.౹

11 అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనినవాడు వచ్చి–నీవు నాకాజ్ఞాపించినట్లు నేను చేసితినని మనవి చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/9-d9f2743ad2e41e1448168564433a8f0d.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 10

1 నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలమువంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను.౹

2 అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనినవానితో యెహోవా–కెరూబు క్రింద నున్న చక్రములమధ్యకు పోయి, కెరూబులమధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.౹

3 అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.౹

4 యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.౹

5 దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.౹

6 –కెరూబులమధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.౹

7 కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;౹

8 అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవహస్తరూప మొకటి కనబడెను;౹

9 నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.౹

10 ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండియొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.౹

11 అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను.౹

12 ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.౹

13 నేను వినుచుండగా–తిరుగు డని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.౹

14 కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖములుండెను; మొదటిది కెరూబుముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజుముఖము.౹

15 ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.౹

16 కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.౹

17 జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను

18 యెహోవా మహిమ మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా

19 కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితోకూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.౹

20 కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపెట్టితిని.౹

21 ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్కలును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.౹

22 మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 11

1 పిమ్మట ఆత్మ నన్నుఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్నుదింపగా గుమ్మపు వాకిట ఇరువదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి.౹

2 అప్పుడాయన నాకీలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా– యీ పట్టణము పచనపాత్రయనియు, మనము మాంస మనియు, ఇండ్లు కట్టుకొన అవసరములేదనియుచెప్పు కొనుచు

3 ఈ పట్ణణములో పాపము యోచించి దురా లోచన చేయువారు వీరే.౹

4 కావున వారికి విరోధముగా ప్రవచింపుము; నరపుత్రుడా, ప్రవచింపుము.౹

5 అంతట యెహోవా ఆత్మ నామీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా –నీవు ఈ మాట వారికి తెలియజేయుము, యెహోవా సెలవిచ్చిన మాట యిదే–ఇశ్రాయేలీయులారా, మీరీ లాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభి ప్రాయములు నాకు తెలిసేయున్నవి.౹

6 ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీచేత హతులైన వారితో వీధులు నిండియున్నవి.౹

7 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – మీరు హతముచేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచనపాత్ర, యీ పట్టణములోనుండి మిమ్మును వెళ్ల గొట్టుదును.౹

8 మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీమీదికి ఖడ్గము రప్పించెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

9 మరియు మీకు శిక్ష విధించి పట్టణములోనుండి మిమ్మును వెళ్లగొట్టి అన్యులచేతికి మిమ్ము నప్పగించుదును.౹

10 ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గముచేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.౹

11 మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచనపాత్రగా ఉండదు; నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును.౹

12 అప్పుడు మీ చుట్టు నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడల ననుసరింపక మానితిరో యెవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు.౹

13 నేను ఆప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెత్తి–అయ్యో, ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా? అని మొఱ్ఱపెట్టితిని.

14 అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

15 –నరపుత్రుడా, యెరూషలేము పట్టణపువారు–ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్య బడెను, మీరు యెహోవాకు దూరస్థులుగా నుండుడి, అని యెవరితో చెప్పుచున్నారో వారందరు ఇశ్రాయేలీయులై నీకు సాక్షాద్బంధువులును నీచేత బంధుత్వధర్మము నొందవలసినవారునై యున్నారు.౹

16 కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్లిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.౹

17 కాగా నీవు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆయా జనములమధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలోనుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలుదేశమును మీ వశము చేసెదను.౹

18 వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.౹

19 వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.౹

20 అప్పుడు వారు నాకు జనులైయుందురు నేను వారికి దేవుడనై యుందును.౹

21 అయితే తమ విగ్రహములను అనుసరించుచు, తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింప బూనువారిమీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

22 కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.౹

23 మరియు యెహోవా మహిమ పట్టణములోనుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకుపైగా నిలిచెను.౹

24 తరువాత ఆత్మ నన్నుఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.౹

25 అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/11-850ddf24a507bfac8c61dfae4b26b921.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 12

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడక యున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.౹

3 నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని, పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై, నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీని చూచి విచారించు కొందురేమో

4 దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసికొనునట్లువారు చూచుచుండగా నీ సామగ్రిని పగటియందు బయటికి తీసికొనివచ్చి వారు చూచుచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను

5 వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము

6 వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజముమీద పెట్టుకొని నేల కనబడకుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని.౹

7 ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజముమీద పెట్టుకొంటిని

8 ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

9 –నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము

10 –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును

11 కాబట్టి వారికీమాట చెప్పుము–నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు

12 మరియు వారిలో ప్రధాను డగువాడు రాత్రియందు సామగ్రిని భుజముమీద పెట్టుకొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చు కొనవలెనని గోడకు కన్నమువేసి నేల చూడకుండ ముఖము కప్పుకొని పోవును

13 అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును

14 మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండు వారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను

15 నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహో వానైయున్నానని వారు తెలిసికొందురు

16 అయితే నేను యెహోవానైయున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను.

17 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

18 –నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి

19 దేశములోని జనులకీలాగు ప్రకటించుము–యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలుదేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు

20 నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసి కొనునట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును.

21 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

22 –నరపుత్రుడా దినములు జరిగి పోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి?

23 కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము–దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెర వేరును

24 వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదె గాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు.౹

25 యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

26 మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

27 –నరపుత్రుడా–వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగినతరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా

28 కాబట్టి నీవు వారితో ఇట్లనుము– ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/12-3cf28a38d78c59fa14b3b49f4f2b0b95.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 13

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ప్రవచించు చున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవ చించి, మనస్సువచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుము–యెహోవా మాట ఆలకించుడి.౹

3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–దర్శనమేమియు కలుగ కున్నను స్వబుద్ధిననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.౹

4 ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు.౹

5 యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.౹

6 వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.౹

7 నేను సెలవియ్యకపోయినను–ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పినయెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా?

8 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

9 వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.౹

10 సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.౹

11 ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము–వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.౹

12 ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి–మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా?

13 ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నాకోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,౹

14 దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.౹

15 ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నాకోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పనితీరెనని మీతో చెప్పుదును.౹

16 యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

17 మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము

18 –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయుస్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.౹

19 అబద్ధపుమాటల నంగీకరించు నా జనులతో అబద్ధపుమాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.౹

20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక

21 మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.౹

22 మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.౹

23 మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/13-e09830b5c80204ba5126f28fbe913030.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 14

1 అంతట ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా

2 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

3 –నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?

4 కావున నీవు వారికి సంగతి తెలియజేసి యీలాగు చెప్పుము– ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని తమ యెదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తయొద్దకువచ్చు ఇశ్రాయేలీయులందరు

5 తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను.౹

6 కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– మీ విగ్రహములను విడిచిపెట్టి మీరుచేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి

7 ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.౹

8 ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలోనుండి నేను వారిని నిర్మూలము చేసెదను.౹

9 మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలోనుండి వానిని నిర్మూలముచేసెదను

10 ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాముచేయు అతిక్రమములన్నిటిచేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి, నా జనులగునట్లును నేను వారికి దేవుడనైయుండు నట్లును

11 వారు ఆలాగున తమకు కలుగజేసికొనిన దోషమునకు శిక్షనొందుదురు, ప్రవక్తయొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును, ఇదే యెహోవా వాక్కు.

12 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

13 –నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారములేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును

14 నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములోనుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

15 బాటసారులు సంచరింపకుండ ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా

16 ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

17 నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి–నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చినయెడల

18 ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

19 అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మ రించినయెడల

20 నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు

21 ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేముమీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు

22 దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లువారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపెట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు

23 మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/14-7bb72261b75d123e3c804fe5b329e854.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 15

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ద్రాక్షచెట్టుకఱ్ఱ అడవిచెట్లలోనున్న ద్రాక్షచెట్టుకఱ్ఱ తక్కినచెట్లకఱ్ఱకంటెను ఏమైన శ్రేష్ఠమా?

3 యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యేయొక ఉపకరణము తగిలించుటకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా?

4 అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా?

5 కాలక ముందు అది యే పనికిని తగక పోయెనే; అగ్ని దానియందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా?

6 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను అగ్ని కప్పగించిన ద్రాక్షచెట్టు అడవి చెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్థులును ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను.౹

7 నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.౹

8 వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/15-302b145ba5b66e477b3c3ba0966ce6ac.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 16

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము

3 –ప్రభువైన యెహోవా యెరూషలేమునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు–నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశసంబంధమైనవి; నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.౹

4 నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి.౹

5 ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి.౹

6 అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి– నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని.౹

7 మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను.౹

8 మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధనచేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

9 అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీమీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి

10 విచిత్రమైన కుట్టుపెని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.౹

11 మరియు ఆభరణములచేత నిన్ను అలంకరించి నీచేతులకు కడియములుపెట్టి నీ మెడకు గొలుసు తగిలించి

12 నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని.౹

13 ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టుపెనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి.౹

14 నేను నీ కను గ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరిపూర్ణముకాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశం సించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

15 అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసికొని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారినిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్ల పోతివి.౹

16 మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలంకరింపబడిన ఉన్నతస్థలములను ఏర్పరచి, వాటిమీద పండుకొని వ్యభిచారము చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగకూడనివి, అట్టివియునిక జరుగవు.౹

17 నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసికొని నీవు పురుషరూప విగ్రహములను చేసికొని వాటితో వ్యభిచరించితివి.౹

18 మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి, నా తైలమును నా ధూపమును వాటికర్పించితివి.౹

19 భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసికొని యింపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి, ఆలాగున జరిగెను గదా? యిదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

20-21 మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మ్రింగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి, నీ జారత్వము చాలకపోయెననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి యప్పగించితివి.౹

22 నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగానుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చు కొనక ఇన్ని హేయక్రియలను ఇంక జారత్వమును చేయుచు వచ్చితివి.౹

23 ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ; యిదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

24 నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలిపీఠములను ఏర్పరచితివి,౹

25 ప్రతి అడ్డదోవను నీ బలిపీఠముకట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.౹

26 మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి.౹

27 కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను.౹

28 అంతటితో తృప్తినొందక అష్షూరువారితోను నీవు వ్యభిచరించితివి, వారితోకూడి జారత్వము చేసినను తృప్తినొందకపోతివి.౹

29 కనానుదేశము మొదలుకొని కల్దీయదేశమువరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు.౹

30 నీ హృదయమెంత బలహీన మాయెను! సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటిని జరిగించుటకై

31 నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక బలిపీఠమును కట్టుచు, వేశ్యచేయునట్లు చేయక, జీతము పుచ్చుకొననొల్లక యుంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి

32-33 అన్యులను చేర్చుకొనును గదా? పురుషులు వేశ్యలకు పడుపుసొమ్మిచ్చెదరు గదా? నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.౹

34 నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమ్మిచ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు.

35 కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము

36 –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరచుకొనిన దానినిబట్టియు, నీ విటకాండ్రనుబట్టియు, హేయ విగ్రహములనుబట్టియు, నీవు వాటికప్పగించిన నీ బిడ్డల రక్తమునుబట్టియు,౹

37 నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను.౹

38 జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును.౹

39 వారి చేతికి నిన్ను అప్పగించెదను, నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు.౹

40 వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు.౹

41 వారు నీ యిండ్లను అగ్నిచేత కాల్చుదురు, అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు, ఈలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక యుందువు;౹

42 ఈ విధముగా నీమీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీయెడల మాని పోవును, ఇకను ఆయాసపడకుండ నేను శాంతము తెచ్చు కొందును.౹

43 నీ యౌవనదినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి, గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటెను, ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తననుబట్టి నేను నీకు శిక్ష విధింతును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

44 సామెతలు చెప్పువారందరును–తల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదే యని నిన్నుగూర్చియందురు.౹

45 పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు, పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్కచెల్లెండ్రతో నీవు సాటి దానవు; నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు,౹

46 నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు.౹

47 అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారుచేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి.౹

48 నీవును నీ కుమార్తెలును చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.౹

50 వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.౹

51 షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసినవాటి కంటె నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి; నీవు ఇన్ని హేయక్రియలుచేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరచితివి.౹

52 నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము.౹

53 నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చునట్లు

54 అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారివలెనే అపాయమొందిన నీ వారిని మరల స్థాపించెదరు.౹

55 సొదొమయు దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రో నును దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలును మీ పూర్వస్థితికి వచ్చెదరు.౹

56 నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా

57 నీదుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించియున్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రస్తావమెత్తక పోతివి.౹

58 నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి; ఇదే యెహోవా వాక్కు

59 ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు – చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను.౹

60 నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.౹

61 నీ అక్కచెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.౹

62 నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను.౹

63 నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/16-8b9e9f4ce7d31058b62f2c25e7271e4f.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 17

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, నీవు ఉపమానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా – ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

3 నానావిధములగు విచిత్ర వర్ణములుగల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.౹

4 అది దాని లేతకొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక పురమందు దానిని నాటెను.౹

5 మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.౹

6 అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను; దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను; ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలువేసెను.౹

7 పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించుమంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదులకాలువ లోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను.౹

8-9 కావున నీవీలాగు ప్రకటింపుము –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా? అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు.౹

10 అది నాటబడినను వృద్ధి పొందునా? తూర్పుగాలి దానిమీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే యెండి పోవును.

11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

12 –తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము–ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.౹

13-14 మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేకయుండునట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుటవలన అది నిలిచియుండునట్లును, అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమవంతులను తీసికొనిపోయెను.౹

15 అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు

16 ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

17 యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.౹

18 తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు.౹

19 ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు– అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపు దును,౹

20 అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాసఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.౹

21 మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలిసికొనునట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయినవారందరును ఖడ్గముచేత కూలుదురు, శేషించినవారు నలుదిక్కుల చెదరిపోవుదురు.

22 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటుదును.౹

23 ఇశ్రాయేలుదేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.౹

24 దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవు నట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/17-72e32237c722d72d15004d412d6dce21.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 18

1 మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు?

3 నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

4 మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.౹

5 ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి

6 పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,౹

7 ఎవనినైనను బాధపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

8 వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి

9 యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల ననుసరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

10 అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి

11 చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,౹

12 దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహములతట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,౹

13 అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹

14 అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా

15 పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు,౹

16 ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

17 బీదవాని మీద అన్యాయముగా చెయ్యివేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండినయెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.౹

18 అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును.౹

19 అయితే మీరు–కుమారుడు తన తండ్రియొక్క దోషశిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవ శ్యముగా బ్రదుకును.౹

20 పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోషశిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోషశిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.౹

21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.౹

22 అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.౹

23 దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

24 అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులుచేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.౹

25 అయితే–యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది?

26 నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును?

27 మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించినయెడల తన ప్రాణము రక్షించుకొనును.

28 అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.౹

29 అయితే ఇశ్రాయేలీయులు–యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు.౹

30 కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.౹

31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

32 మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/18-198e82831b22e54ef2be87d8fa922423.mp3?version_id=1787—