Categories
యెషయా

యెషయా 42

1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు

నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు

ప్రియుడు

అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను

అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

2 అతడు కేకలు వేయడు అరువడు

తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు

3 నలిగిన రెల్లును అతడు విరువడు

మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు

అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.

4 భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు

మందగిలడు నలుగుడుపడడు

ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.

5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి

భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి

దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా

ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

6-7 గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును

బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి

తెచ్చుటకును

చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి

వెలుపలికి తెచ్చుటకును

యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి

నీ చేయి పట్టుకొనియున్నాను

నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య

జనులకు వెలుగుగాను నిన్ను నియమించి

యున్నాను.

8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని

నా మహిమను నేనిచ్చువాడను కాను

నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద

నియ్యను.

9 మునుపటి సంగతులు సంభవించెను గదా

క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను

పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.

10 సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము

లోని సమస్తమా,

ద్వీపములారా, ద్వీప నివాసులారా,

యెహోవాకు క్రొత్త గీతము పాడుడి

భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.

11 అరణ్యమును దాని పురములును కేదారు నివాస

గ్రామములును బిగ్గరగా పాడవలెను

సెల నివాసులు సంతోషించుదురు గాక

పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు

గాక.

12 ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని

యాడుదురు గాక

ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక

13 యెహోవా శూరునివలె బయలుదేరును

యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును

ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించునువారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.

14 చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని

ఊరకొని నన్ను అణచుకొంటిని

ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత

ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు

నున్నాను.

15 పర్వతములను కొండలను పాడుచేయుదును

వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును

నదులను ద్వీపములుగా చేయుదును

మడుగులను ఆరిపోచేయుదును.

16 వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను

వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును

వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను

చక్కగాను చేయుదును

నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును

17 చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ

ములను చూచి

మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి

కేవలము సిగ్గుపడుచున్నారు.

18 చెవిటివారలారా, వినుడి

గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో

చించుడి.

19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు?

నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

20 నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని

గ్రహింపకున్నావువారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.

21 యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై

ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.

22 అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు

సొమ్మాయెను.

ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో

చిక్కుపడియున్నారువారు బందీగృహములలో దాచబడియున్నారు

దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు

అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును

లేడు.

23 మీలో ఎవడు దానికి చెవి యొగ్గును?

రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?

24 యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమివారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి

ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి

యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు,

దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు

యెహోవాయే గదా?

25 కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ

బలమును కుమ్మరించెను

అది వానిచుట్టు అగ్ని రాజచేసెను

అయినను వాడు దాని గ్రహింపలేదు

అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున

పెట్టలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/42-fdd6d5ab0f8068279c01dea476b7c41c.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 43

1 అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు

యెహోవా

ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల

విచ్చుచున్నాడు

–నేను నిన్ను విమోచించియున్నాను

భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను

నీవు నా సొత్తు.

2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును

నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు.

నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు

నిన్ను కాల్చవు

3 యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు

పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను

నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి

యున్నాను

నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి

నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా

మనుష్యులను అప్పగించుచున్నాను

నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు

చున్నాను.

5 భయపడకుము, నేను నీకు తోడైయున్నాను

తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను

పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.

6 అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను

బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను

దూరమునుండి నా కుమారులను

భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.

7 నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని

నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము

నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.

8 కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైనవారిని తీసికొని రండి

9 సర్వజనులారా, గుంపుకూడి రండి

జనములు కూర్చబడవలెను

వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు?

పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు

దురు?

తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు

లను తేవలెను

లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.

10 మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని

గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన

నా సేవకుడును నాకు సాక్షులు

నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా

తరువాత ఏ దేవుడు నుండడు.

11 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష

కుడు లేడు.

12 ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే

దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ

తయు మీలోనుండియుండలేదు

నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే

యెహోవా వాక్కు.

13 ఈ దినము మొదలుకొని నేనే ఆయనను

నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు

నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?

14 ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–

మీ నిమిత్తము నేను బబులోను పంపితిని

నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదనువారి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను

పడవేసెదను.

15 యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను

ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.

16-17 సముద్రములో త్రోవ కలుగజేయువాడును

వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును

రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు

నగు యెహోవా

ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురువారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.

18 మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి

పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.

19 ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను

ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా?

నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను

ఎడారిలో నదులు పారజేయుచున్నాను.

20 నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య

ములో నీళ్లు పుట్టించుచున్నాను

ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను

అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును

నన్ను ఘనపరచును

21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును

ప్రచురము చేయుదురు.

22 యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు

ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

23 దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు

తేలేదు

నీ బలులచేత నన్ను ఘనపరచలేదు

నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత

పెట్టలేదు

ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.

24 నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు

రూకలిచ్చి కొనలేదు

నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు

సరే గదా.

నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి

నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.

25 నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము

లను తుడిచివేయుచున్నాను

నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

26 నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము

నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును

వివరించుము.

27 నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు

నామీద తిరుగుబాటు చేసినవారే.

28 కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర

పరచితిని

యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ

పాలు చేసితిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/43-f3b700a32eb43132a43a4e12cddc6648.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 44

1 అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను

ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు

సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు

సెలవిచ్చుచున్నాడు

–నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన

యెషూరూనూ, భయపడకుము.

3 నేను దప్పిగలవానిమీద నీళ్లను

ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను

నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను

నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

4 నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో

ఎదుగునట్లువారు ఎదుగుదురు.

5 ఒకడు–నేను యెహోవావాడననును, మరియొకడు

యాకోబు పేరు చెప్పుకొనును,

మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి

ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.

6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా

వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా

ఈలాగు సెలవిచ్చుచున్నాడు

నేను మొదటివాడను కడపటివాడను

నేను తప్ప ఏ దేవుడును లేడు.

7 ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని

నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల

వాడెవడు?

అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప

వలెను

ఆ సంగతి నాకు ప్రచురింపవలెను

అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను

తెలియజెప్పువారై యుండవలెను.

8 మీరు వెరవకుడి భయపడకుడి

పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి

తెలియజేయలేదా?

మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు

డున్నాడా?

నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే

నెరుగను.

9 విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారువారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు

తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు

కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.

10 ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని

నొక దేవునిగా నిరూపించువాడెవడు?

11 ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు

ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు

చేయబడి నిలువబడవలెను

నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.

12 కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని

చేయును

సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత

దాని చేయును.

అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును

నీళ్లు త్రాగక సొమ్మసిల్లును

13 వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీచి చిత్రిక

లతో దాని చక్కచేయును

కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును

మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల

దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.

14 ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును

శ్మశానవృక్షమును గాని సరళవృక్షమును గాని

సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో

ఏదో ఒకదానిని తీసికొనును

ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును

15 ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును

వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును

నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును

ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును

దానికి నమస్కారము చేయును

దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.

16 అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ

ముతో మాంసము వండి భక్షించియున్నాడు

తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు

ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను

కొనుచున్నాడు

17 దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న

విగ్రహమును చేయించుకొనును

దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు

–నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

18 వారు వివేచింపరు గ్రహింపరు

చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను

గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ

బడెను.

19 ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము

కాల్చితిని

నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని

దానితో మాంసము వండుకొని భోజనముచేసితిని

మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని

చేయుదునా?

చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును

ఆలోచింపడు

యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.

20 వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు

మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది

వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు

నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను

కొనుటకు వానికి బుద్ధి చాలదు.

21 యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము

నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని

ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు

నేను నిన్ను మరచిపోజాలను.

22 మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను

మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి

యున్నాను

నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు

మళ్లుకొనుము.

23 యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు

ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి

భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి

పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి

వృక్షమా, సంగీతనాదము చేయుడి.

యెహోవా యాకోబును విమోచించును

ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్న

తునిగా కనుపరచుకొనును

24 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను

నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను

నేనే భూమిని పరచినవాడను

25 నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థముచేయు

వాడను

సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను

జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా

చేయువాడను నేనే.

26 నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను

నా దూతల ఆలోచన నెరవేర్చువాడను

–యెరూషలేము నివాసస్థలమగుననియు

యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు

నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను

బాగుచేయువాడను నేనే.

27 నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని

ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను

28 కోరెషుతో–నా మందకాపరీ, నా చిత్తమంతయు

నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే.

యెరూషలేముతో–నీవు కట్టబడుదువనియు దేవాలయ

మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు

చున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/44-49167e098c029ff3cf06202597dbaf1b.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 45

1 అతని పక్షమున జనములను జయించుటకు నేను

అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను

నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని

యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను

అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును

గురించి సెలవిచ్చుచున్నాడు.

2 –నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల

ములను సరాళముచేసెదను.

ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను

విడగొట్టెదను.

3 పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన

యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు

అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను

రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.

4 నా సేవకుడైన యాకోబు నిమిత్తము

నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను

నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని.

నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

5 నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు

నేను తప్ప ఏ దేవుడును లేడు.

6 తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు

నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను

నట్లు

నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని

యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును

లేడు

7 నేను వెలుగును సృజించువాడను

అంధకారమును కలుగజేయువాడను

సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే

యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు

వాడను.

8 ఆకాశమండలము నీతిని కురిపించునట్లు

అంతరిక్షమా, మహావర్షము వర్షించుము

భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి

నీతిని మొలిపించును గాక

యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.

9 మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను

సృజించినవానితో వాదించువానికి శ్రమ.

జిగటమన్ను దాని రూపించువానితో నీవేమిచేయు

చున్నావని అనదగునా?

వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

10 నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి

శ్రమ

నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి

శ్రమ.

11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు

–రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా?

నా కుమారులనుగూర్చియు నా హస్తకార్యములను

గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?

12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న

నరులను నేనే సృజించితిని

నా చేతులు ఆకాశములను విశాలపరచెను

వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

13 నీతినిబట్టి కోరెషును రేపితిని

అతని మార్గములన్నియు సరాళముచేసెదను

అతడు నా పట్టణమును కట్టించును

క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు

కొనకయు

నేను వెలివేసినవారిని అతడు విడిపించును

14 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు

–ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును

నీకు దొరుకును

దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి

నీవారగుదురువారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ

యెదుట సాగిలపడుదురు

–నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ

దేవుడును లేడు

ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు

విన్నపము చేసెదరు.

15 ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను

మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.

16 విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి

వారందరు విస్మయము పొందియున్నారు.

ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.

17 యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది

యున్నది

మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొంద

కయు నుందురు.

18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు;

ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర

పరచెను

నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప

లేదు

నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను

ఆయన సెలవిచ్చునదేమనగా–

యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

19 అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట

లాడలేదు

–మాయాస్వరూపుడనైనట్టునన్ను వెదకుడని

యాకోబు సంతానముతో నేను చెప్పలేదు

నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను

యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు

యెహోవాను నేనే.

20 కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా,

దగ్గరకు వచ్చి కూడుకొనుడి

తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని

దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.

21 మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ

జేయుడి

జనులు కూడుకొని ఆలోచనచేసికొందురు గాక;

పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ

జేసినవాడెవడు?

చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?

యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు

లేడు.

నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే

నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

22 భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి

రక్షణ పొందుడి

దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

23 –నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి

నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు

నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను

నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది

అది వ్యర్థము కానేరదు.

24 యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను

గూర్చి చెప్పుదురు

ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు

ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు

25 యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు

నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/45-64565674048affe9cab2103eaf1263cd.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 46

1 బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది

వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను

మోయబడుచున్నవి

2 మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి

అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి

పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.

3 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా,

గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన

వారలారా,

తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక

పెట్టుకొనినవారలారా,

నా మాట ఆలకించుడి.

4 ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల

వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను

నేనే

నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే

నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

5 మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు?

మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?

6 దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై

సంచినుండి బంగారము మెండుగా పోయువారును

వెండి తూచువారును

దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి

పిలుతురు.

7 వారు భుజముమీద దాని నెక్కించుకొందురు

దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు

ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును

ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు

వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.

8 దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి

అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి

9 చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి

దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు

నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.

10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర

వేర్చుకొనెదననియు చెప్పుకొనుచు

ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు

చున్నాను.

పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని

తెలియజేయుచున్నాను.

11 తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను

దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర

వేర్చువానిని పిలుచుచున్నాను

నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను

ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.

12 కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా,

నా మాట ఆలకించుడి

13 నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున

లేదు

నా రక్షణ ఆలస్యము చేయలేదు

సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను

ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు

చున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/46-8b6ea22b0000953b4b615c4a745d4b13.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 47

1 కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో .

కూర్చుండుము

కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద

కూర్చుండుము

నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు

ఇకమీదట చెప్పరు.

2 తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము

నీ ముసుకు పారవేయుము

కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము

కాలిమీది బట్ట తీసి నదులు దాటుము.

3 నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము

వెల్లడియగును

నేను ప్రతి దండన చేయుచు నరులను మన్నింపను.

4 సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ

దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి

పేరు.

5 కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి

పొమ్ము

రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు

నిన్నుగూర్చి చెప్పరు.

6 నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర

పరచి వారిని నీ చేతికి అప్పగించితిని

నీవు వారియందు కనికరపడక వృద్ధులమీద నీ కాడి

మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.

7 నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని

వీటిని ఆలోచింపకపోతివి

వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.

8 కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు

–నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు

నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను

చూడనని

అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము

9 –ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర

శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ

వించును.

నీవు అధికముగా శకునము చూచినను

అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధార

ముగా చేసికొనినను

ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.

10 నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును

నన్ను చూడడని అనుకొంటివి

–నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను

కొనునట్లుగా

నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.

11 కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట

జాలవు

ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు

నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా

వచ్చును.

12 నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ

కర్ణపిశాచ తంత్రములను

నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము

ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో

ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో

13 నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు

జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి

నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదు

రేమో ఆలోచించుము.

14 వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది

జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన

లేక యున్నారు

అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి

కాచుకొనదగినది కాదు.

15 నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి

ఆలాగే జరుగుచున్నది

నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారముచేయువారు తమతమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు

నిన్ను రక్షించువాడొకడైన నుండడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/47-97d5d2c681a9cbe6e1f8dc59647dc974.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 48

1 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు .

కలిగినవారలారా,

యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై

యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు

ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు

నీతిసత్యములను అనుసరింపనివారలారా,

ఈ మాట ఆలకించుడి.

2 వారు–మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టు

కొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు

సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు

పేరు.

3 పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల

కాలముక్రిందట తెలియజేసితిని

ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను

వాటిని ప్రకటించితిని

నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ

వించెను.

4 నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ

నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

5 –నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు

నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోతవిగ్రహము

దీని నియమించెననియు

నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమా

చారము నీకు తెలియజేసితిని

అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని

6 నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలో

చించుము

అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా?

తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట

నీకు తెలియజేయుచున్నాను

7 అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి

ఇప్పుడు కలుగునవియే.

అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు,

ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండ

లేదు.

8 అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు

పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు

నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది

మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని

పించుకొంటివని నాకు తెలియును.

9 నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ

మునుబట్టి నాకోపము మానుకొనుచున్నాను

నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు

కొనుచున్నాను.

10 నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు

ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని

11 నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను

నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను

మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.

12 యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి

యొగ్గి వినుము.

నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను

13 నా హస్తము భూమి పునాదివేసెను

నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను

నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు

నిలుచును.

14 మీరందరు కూడివచ్చి ఆలకించుడి

వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును?

యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకా

రము బబులోనునకు చేయును

అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

15 నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని

నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును.

నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి

16 ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను

కాను

అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న

వాడను

ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు

నన్ను పంపెను

17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన

యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును

నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరు

చున్నాను

ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను

నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.

19 నీ సంతానము ఇసుకవలె విస్తారమగును

నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును

వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు

మరువబడదు

20 బబులోనునుండి బయలువెళ్లుడి

కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి

యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె

నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి

భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రక

టించుడి.

21 ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు

దప్పిగొనలేదు

రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక

జేసెను

ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా

బయలుదేరెను.

22 దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు

చున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/48-b1cae8a140d35ac7e6183699b45073f0.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 49

1 ద్వీపములారా, నా మాట వినుడి,

దూరముననున్న జనములారా, ఆలకించుడి,

నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను

తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని

ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.

2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు

తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు

నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి

తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.

3 ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు

నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన

నాతో చెప్పెను.

4 అయినను–వ్యర్థముగా నేను కష్టపడితిని

ఫలమేమియులేకుండ నా బలమును వృథాగా వ్యయ

పరచియున్నాననుకొంటిని

నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము

నా దేవునియొద్దనే యున్నది.

5 యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు

నాకు బలమాయెను

కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకో

బును తిరిగి రప్పించుటకు

ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు

నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల

విచ్చుచున్నాడు

6 –నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును

ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును

నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము;

భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు

సాధనమగుటకై

అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి

యున్నాను.

7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు

యెహోవా

మనుష్యులచేత నిరాకరింపబడినవాడును

జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు

వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–యెహోవా నమ్మకమైనవాడనియు

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె

ననియు రాజులు గ్రహించి లేచెదరు

అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి

నీకు ఉత్తరమిచ్చితిని

రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని.

–బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను

–బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు

దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి

పెట్టుటకై

నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

9 మార్గములలో వారు మేయుదురు

చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును

10 వారియందు కరుణించువాడు వారిని తోడుకొని

పోవుచు

నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును

కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు

ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.

11 నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను

నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

12 చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు

వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు

వచ్చుచున్నారు

వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.

13 శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా

తన జనులను ఓదార్చియున్నాడు

ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ,

సంతోషించుము

పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

14 అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి

యున్నాడు

ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన

చంటిపిల్లను మరచునా?

వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.

16 చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి

యున్నాను

నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి

17 నీ కుమారులు త్వరపడుచున్నారు

నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో

నుండి బయలు వెళ్లుచున్నారు.

18 కన్నులెత్తి నలుదిశల చూడుము

వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు

నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు

పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవువారిని అలంకారముగా ధరించుకొందువు

నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని

యెహోవా సెలవిచ్చుచున్నాడు.

19 నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి

స్థలములును నాశనము చేయబడిన నీ భూమియువారికి ఇరుకుగా ఉండును

నిన్ను మ్రింగివేసినవారు దూరముగా ఉందురు.

20 నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా

రులు

–ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది.

ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో

చెప్పుదురు.

21 అప్పుడు నీవు–నేను నా పిల్లలను పోగొట్టుకొని,

సంతానహీనురాలను, ఒంటరినై

ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా?

వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా

డెవడు?

నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ

ఉండిరి?

అని నీ మనస్సులో నీవనుకొందువు.

22 ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–నేను జనములతట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను

జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నానువారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు

నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

23 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి

రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరువారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము

చేసెదరు

నీ పాదముల ధూళి నాకెదరు.

అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని

పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు

తెలిసికొందువు.

24 బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన

గలడు?

భీకరులుచెరపెట్టినవారు విడిపింపబడుదురా?

25 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–బలాఢ్యులు చెరపెట్టినవారు సహితము విడిపింప

బడుదురు

భీకరులు చెరపెట్టినవారు విడిపింపబడుదురు

నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము

చేసెదను

నీ పిల్లలను నేనే రక్షించెదను.

26 యెహోవానైన నేనే నీ రక్షకుడననియు

యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు

లందరు ఎరుగునట్లు

నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె

దను

క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము

చేత వారు మత్తులగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/49-777fc34a35f1d0eb98fb0bb25b4594dd.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 50

1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక

ఎక్కడనున్నది?

నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని?

మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి

మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము

చేయబడెను.

2 నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల?

నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల?

నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?

విడిపించుటకు నాకు శక్తిలేదా?

నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును

నదులను ఎడారిగా చేయుదును

నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత

చచ్చిపోవును.

3 ఆకాశమున చీకటి కమ్మజేయుచున్నాను

అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను

4 అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు

కలుగునట్లు

శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి

యున్నాడు

శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి

యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

5 ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా

నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు

వినకుండ నేను తొలగిపోలేదు.

6 కొట్టువారికి నా వీపును అప్పగించితిని

వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్ప

గించితిని

ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము

దాచుకొనలేదు

7 ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు

గనుక నేను సిగ్గుపడలేదు

నేను సిగ్గుపడనని యెరిగి

నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.

8 నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై

యున్నాడు

నాతో వ్యాజ్యెమాడువాడెవడు?

మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము

నా ప్రతివాది యెవడు?

అతని నాయొద్దకు రానిమ్ము.

9 ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును

నామీద నేరస్థాపనచేయువాడెవడు?

వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు

చిమ్మెట వారిని తినివేయును.

10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట

వినువాడెవడు?

వెలుగులేకయే చీకటిలో నడచువాడు

యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని

నమ్ముకొనవలెను.

11 ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు

పెట్టుకొనువారలారా,

మీ అగ్ని జ్వాలలో నడువుడి

రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి

నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది

మీరు వేదనగలవారై పండుకొనెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/50-7ea06966f2f28143763f7f542f243b24.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 51

1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు

వారలారా, నా మాట వినుడి

మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో

చించుడి

మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో

చించుడి

2 మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి

మిమ్మును కనిన శారాను ఆలోచించుడి

అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని

అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు

చేసితిని.

3 యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు

దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి

దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు

దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు

నట్లు చేయుచున్నాడు

ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు

సంగీతగానమును దానిలో వినబడును

4 నా ప్రజలారా, నా మాట ఆలకించుడి

నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి.

ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును

జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియ

మింతును.

5 నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది

నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది

నా బాహువులు జనములకు తీర్పుతీర్చును

ద్వీపవాసులు నాతట్టు చూచి నిరీక్షణ గలవా

రగుదురువారు నా బాహువును ఆశ్రయింతురు.

6 ఆకాశమువైపు కన్నులెత్తుడి

క్రింద భూమిని చూడుడి

అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును

భూమి వస్త్రమువలె పాతగిలిపోవును

అందలి నివాసులు అటువలెచనిపోవుదురు

నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.

7 నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి

నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా,

ఆలకించుడి

మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ

మాటలకు దిగులుపడకుడి.

8 వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి

వేయును

బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని

కొరికివేయును

అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర

తరములుండును.

9 యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు

కొమ్ము

పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి

నట్లు లెమ్ము

రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే

గదా?

మకరమును పొడిచినవాడవు నీవే గదా?

10 అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన

వాడవు నీవే గదా?

విమోచింపబడినవారు దాటిపోవునట్లు

సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు

నీవే గదా?

11 యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో

సీయోనునకు తిరిగి వచ్చెదరు

నిత్యసంతోషము వారి తలలమీద ఉండునువారు సంతోషానందము గలవారగుదురు

దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

12 నేను నేనే మిమ్ము నోదార్చువాడను

చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు

భయపడుదువు?

13 బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు

వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు,

ఆకాశములను వ్యాపింపజేసి

భూమి పునాదులనువేసిన యెహోవాను

నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా?

బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

14 క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును

అతడు గోతిలోనికి పోడు చనిపోడు

అతనికి ఆహారము తప్పదు.

15 నేను నీ దేవుడనైన యెహోవాను

సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని

రేపువాడను నేనే.

సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు

పేరు.

16 నేను ఆకాశములను స్థాపించునట్లును

భూమి పునాదులను వేయునట్లును

నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును

నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను

కప్పియున్నాను.

17 యెరూషలేమా, లెమ్ము లెమ్ము

యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు

కొని త్రాగినదానా,

తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా,

నిలువుము.

18 ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప

గలవాడెవడును లేకపోయెను.

ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయి పట్టు

కొనువాడెవడును లేకపోయెను.

19 ఈ రెండు అపాయములు నీకు సంభవించెను

నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు?

పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను,

నేను నిన్నెట్లు ఓదార్చుదును?

నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు

దుప్పి వలలో చిక్కు పడినట్లు

వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.

20 యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోనువారు నిండియున్నారు.

21 ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా,

ఈ మాట వినుము.

22 నీ ప్రభువగు యెహోవా

తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు

సెలవిచ్చుచున్నాడు

–ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ

పాత్రను

నీ చేతిలోనుండి తీసివేసియున్నాను

నీవికను దానిలోనిది త్రాగవు.

23 నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను

మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమనివారు నీతో చెప్పగా

నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు

దానిని వంచితివి గదావారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/51-b3d0778299ed4ce3c3935f60d9daa906.mp3?version_id=1787—