Categories
యెషయా

యెషయా 32

1 ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన

చేయును

అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

2 మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు

చాటైన చోటువలెను ఉండును

ఎండినచోట నీళ్లకాలువలవలెను

అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను

ఉండును.

3 చూచువారి కన్నులు మందముగా ఉండవు

వినువారి చెవులు ఆలకించును.

4 చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును

నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

5 మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు

కపటి ఉదారుడనబడడు.

6 మూఢులు మూఢవాక్కులు పలుకుదురు

భక్తిహీనముగా నడుచుకొందురు

యెహోవానుగూర్చి కానిమాటలాడుచు

ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు

దప్పిగొనినవారికి పానీయములేకుండ చేయుచు

హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

7 మోసకారి సాధనములును చెడ్డవి

నిరుపేదలు న్యాయవాదన చేసినను

కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు

దురాలోచనలు చేయుదురు.

8 ఘనులు ఘనకార్యములు కల్పించుదురువారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.

9 సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి

నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.

10 నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు

మీకు తొందర కలుగును

ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.

11 సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి

నిర్విచారిణులారా, తొందరపడుడి

మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె

పట్ట కట్టుకొనుడి.

12 రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా

వల్లుల విషయమైవారు రొమ్ము కొట్టుకొందురు.

13 నా జనుల భూమిలో

ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల

తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును.

పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు

14-15 నగరి విడువబడును జనసమూహముగల పట్టణము

విడువబడును

కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ

లుగా ఉండును

అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు

మేయు భూమిగాను ఉండును

అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత

మైన భూమి వృక్షవనముగానుండును.

16 అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల

భరితమైన భూమిలో నీతి దిగును

17 నీతి సమాధానము కలుగజేయును

నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.

అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ

స్థానములయందును సుఖకరమైన నివాసముల

యందును నివసించెదరు

18-19 అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు

పడును

పట్టణము నిశ్చయముగా కూలిపోవును.

20 సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను

గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/32-3e13b51fcbfebf506d2572fc50cfcdb4.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 33

1 దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు

నీకు శ్రమ

నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు

శ్రమ

నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన

బడెదవు

నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను

వంచించెదరు.

2 యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు

కరుణించుము

ఉదయకాలమున వారికి బాహువుగాను

ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను

ఉండుము.

3 మహాఘోషణ విని జనములు పారిపోవును

నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు.

4 చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచ

బడును

మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు

దురు

5 యెహోవా మహాఘనత నొందియున్నాడు

ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను

నీతితోను సీయోనును నింపెను.

6 నీకాలములో నియమింపబడినది స్థిరముగానుండును

రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు

కలుగును

యెహోవా భయము వారికి ఐశ్వర్యము.

7 వారి శూరులు బయట రోదనముచేయుచున్నారు

సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు.

8 రాజమార్గములు పాడైపోయెను

త్రోవను నడచువారు లేకపోయిరి

అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమాన

పరచెను నరులను తృణీకరించెను.

9 దేశము దుఃఖించి క్షీణించుచున్నది

లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది

షారోను ఎడారి ఆయెను

బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి.

10 యెహోవా ఇట్లనుకొనుచున్నాడు

–ఇప్పుడే లేచెదను

ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను.

ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను.

11 మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును

కందురు.

మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయుచున్నది.

12 జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను

నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును.

13 దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి

సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.

14 సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు

వణకు భక్తిహీనులను పట్టెను.

మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప

గలడు?

మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ

సించును?

15 నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట

లాడుచు

నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు

లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని

హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని

చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు

ఉన్నతస్థలమున నివసించును.

16 పర్వతములలోని శిలలు అతనికి కోటయగును

తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి

శాశ్వతముగా ఉండును.

17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె

దవు

బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన

బడును.

18 నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును.

జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు?

తూచువాడెక్కడ ఉన్నాడు?

బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?

19 నాగరికములేని ఆ జనమును

గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య

భాషయు

పలుకు ఆ జనమును నీవికను చూడవు.

20 ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న

సీయోను పట్టణమును చూడుము

నిమ్మళమైన కాపురముగాను

తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష

లేమును చూచును

దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో

ఒక్కటియైనను తెగదు.

21 అచ్చట యెహోవా ప్రభావముగలవాడై

మన పక్షముననుండును, అది విశాలమైన నదులును

కాలువలును ఉన్న స్థలముగా ఉండును

అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు

గొప్ప ఓడ అక్కడికి రాదు.

22 యెహోవా మనకు న్యాయాధిపతి

యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు

ఆయన మనలను రక్షించును.

23 నీ ఓడత్రాళ్లు వదలిపోయెను

ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు

చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు

సొమ్ము విభాగింపబడును

కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.

24 నాకు దేహములో బాగులేదని అందులో నివసించు

వాడెవడును అనడు

దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/33-cc8ddb547743dbd08faf9008d96afc10.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 34

1 రాష్టములారా, నాయొద్దకు వచ్చి వినుడి

జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి

భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో

పుట్టినదంతయు వినును గాక.

2 యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది

వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చుచున్నది

ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.

3 వారిలో చంపబడినవారు బయట వేయబడెదరువారి శవములు కంపుకొట్టును

వారి రక్తమువలన కొండలు కరగిపోవును.

4 ఆకాశసైన్యమంతయు క్షీణించును

కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును.

ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు

అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి

సైన్యమంతయు రాలిపోవును.

5 నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును

ఎదోముమీద తీర్పుతీర్చుటకు

నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును

6 యెహోవా ఖడ్గము రక్తమయమగును

అది క్రొవ్వుచేత కప్పబడును

గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము

చేతను

పొట్టేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప

బడును

ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును

ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.

7 వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె

లును దిగిపోవుచున్నవి

ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నదివారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.

8 అది యెహోవా ప్రతిదండనచేయు దినము

సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.

9 ఎదోము కాలువలు కీలగును

దాని మన్ను గంధకముగా మార్చబడును

దాని భూమి దహించు గంధకముగా ఉండును.

10 అది రేయింబగళ్లు ఆరక యుండును

దాని పొగ నిత్యము లేచును

అది తరతరములు పాడుగానుండును

ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు

11 గూడబాతులును ముళ్ళ పందులును దాని ఆక్రమించు

కొనును

గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును

ఆయన తారుమారు అను కొలనూలును చాచును

శూన్యమను గుండును పట్టును.

12 రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ

లేకపోవుదురు

దాని అధిపతులందరు గతమైపోయిరి.

13 ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును

దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును

అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు

సాలగాను ఉండును

14 అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును

అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును

అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును

15 చిత్తగూబ గూడు కట్టుకొనును

అచ్చట గుడ్లుపెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును

అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతోకూడు

కొనును.

16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి

ఆ జంతువులలో ఏదియు లేక యుండదు

దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు

నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే

ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును.

17 అవి రావలెనని ఆయన చీట్లువేసెను

ఆయన కొలనూలు చేతపట్టుకొని వాటికి ఆ దేశమును

పంచిపెట్టును.

అవి నిత్యము దాని ఆక్రమించుకొనును

యుగయుగములు దానిలో నివసించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/34-8cb77b67132afcba680c50cb8d3214c3.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 35

1 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును

అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును

2 అది బహుగా పూయుచు ఉల్లసించును

ఉల్లసించి సంగీతములు పాడును

లెబానోను సౌందర్యము దానికి కలుగును

కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును

అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును

చూచును.

3 సడలిన చేతులను బలపరచుడి

తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.

4 తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి

–భయపడక ధైర్యముగా ఉండుడి

ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు

ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును

ఆయన చేయును

ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.

5 గ్రుడ్డివారి కన్నులు తెరవబడును

చెవిటివారి చెవులు విప్పబడును

6 కుంటివాడు దుప్పివలె గంతులువేయును

మూగవాని నాలుక పాడును

అరణ్యములో నీళ్లు ఉబుకును

అడవిలో కాలువలు పారును

7 ఎండమావులు మడుగులగును

ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును

నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును

తుంగగడ్డియు మేతయు పుట్టును.

8 అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును

అది పరిశుద్ధ మార్గమనబడును

అది అపవిత్రులు పోకూడని మార్గము

అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును

మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక

యుందురు

9 అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని

ఎక్కవు, అవి అక్కడ కనబడవు

విమోచింపబడినవారే అక్కడ నడచుదురు

10 యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి

సీయోనునకు వచ్చెదరు

వారి తలలమీద నిత్యానందముండునువారు ఆనందసంతోషములుగలవారై వచ్చెదరు.

దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/35-2c2060fc5b49419d7f1534d653bc72eb.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 36

1 హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.౹

2 అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకి రేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా

3 హిల్కీయా కుమారుడును రాజు గృహనిర్వాహకుడునునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.౹

4 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను – ఈ మాట హిజ్కియాతో తెలియ జెప్పుడి–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా –నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్ర యాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?

5 యుద్ధవిషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?

6 నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.౹

7 మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.౹

8 కావున చిత్త గించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.౹

9 లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే.౹

10 యెహోవా సెలవు నొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు–ఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.౹

11 ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు–చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

12 రబ్షాకే–ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి

13 గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెను–మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా–

14 హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.౹

15 యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి–యెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.౹

16 హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండును.౹

17 అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు.౹

18 ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను?

19 అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?

20 యెహోవా నా చేతిలోనుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.౹

21 అయితే–అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి.౹

22 గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/36-042d8c510bbb16b88d036f5eaa4af302.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 37

1 హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకుపోయి

2 గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయాయొద్దకు పంపెను.౹

3 వీరు గోనెపట్ట కట్టుకొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి– హిజ్కియా సెలవిచ్చునదేమనగా–ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.౹

4 జీవముగల దేవుని దూషించుటకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.౹

5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా

6 యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–అష్షూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.౹

7 అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.

8 అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.౹

9 అంతట కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను.౹

10 –యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడి–యెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.౹

11 అష్షూరురాజులు సకలదేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?

12 నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులుగాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

13 హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి

14 హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి

15 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను–

16 యెహోవా, కెరూబులమధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవై యున్నావు.౹

17 సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.౹

18 యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి

19 వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లుగాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.౹

20 యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.

21 అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను–ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.౹

22 అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా–

సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయు చున్నది

ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది

యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.

23 నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి?

నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి?

ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా?

24 నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు

పలికితివి

నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర

ములమీదికిని

లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను

ఎత్తుగల దాని దేవదారు వృక్షములను

శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను

వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని

కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని

ప్రవేశించియున్నాను.

25 నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను

నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల

నన్నిటిని ఎండిపోచేసియున్నాను

26 నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు

పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు

నీకు వినబడలేదా?

ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ

లుగా చేయుట నా వలననే సంభవించినది.

27 కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి.

విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను

కాడవేయని చేలవలెను అయిరి.

28 నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు

లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును

నాకు తెలిసేయున్నవి.

29 నామీద నీవు వేయు రంకెలును

నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను

నా గాలము నీ ముక్కునకు తగిలించెదను

నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను

నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

30 మరియు యెషయా చెప్పినదేమనగా–హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనమువిత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.౹

31 యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.౹

32 శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు, తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.౹

33 కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.౹

34 ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.౹

35 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.౹

36 అంతట యెహోవాదూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్షయెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి.౹

37 అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత

38 అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/37-0c31b2aca25f279dd184e648bffdb729.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 38

1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి–నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా

2 అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని

3 –యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా

4 యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

5 –నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము–నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా–నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;౹

6 ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.౹

7 యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;౹

8 ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.

9 యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము

పొందిన తరువాత అతడు రచియించినది.

10 –నా దినములమధ్యాహ్నకాలమందు నేను పాతాళ

ద్వారమున పోవలసి వచ్చెను.

నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

11 యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను

చూడకపోవుదును.

మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక

పోవుదునని నేననుకొంటిని.

12 నా నివాసము పెరికివేయబడెను

గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి

కొని పోబడెను.

నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా

జీవము ముగించుచున్నాను

ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు

ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

13 ఉదయమగువరకు ఓర్చుకొంటిని

సింహము ఎముకలను విరచునట్లు

నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను

ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ

లాడితిని గువ్వవలె మూల్గితిని

ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం

చెను

నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట

బడి యుండుము.

15 నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే

నెరవేర్చెను.

నాకు కలిగిన వ్యాకులమునుబట్టి

నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు

కొందును.

16 ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు

వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది

నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయు

దువు

17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు

కారణమాయెను

నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి

నుండి విడిపించితివి.

నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార

వేసితివి.

18 పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా

స్తుతి చెల్లింపదు

సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం

చరు.

19 సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు

ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు

చున్నాను.

తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు

యెహోవా నన్ను రక్షించువాడు

20 మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో

తంతివాద్యములు వాయింతుము.

21 మరియు యెషయా–అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను.౹

22 మరియు హిజ్కియా–నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/38-631b33a493f2eb3018babd1af327ea96.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 39

1 ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగియై బాగు పడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా

2 హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన యింటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్తవస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములుగల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను.౹

3 పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చి–ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని యడుగగా హిజ్కియా–బబులోనను దూరదేశమునుండి వారు వచ్చియున్నారని చెప్పెను.౹

4 నీ యింట వారేమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా–నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.౹

5 అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను–యెహోవా సెలవిచ్చు మాట వినుము

6 –రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

7 మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.౹

8 అందుకు హిజ్కియా–నీవు తెలియజేసిన యెహోవాఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/39-443f54d024ae06938631418dc90eadc6.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 40

1 మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

2 –నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి

యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి

ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను

ఆమె దోషరుణము తీర్చబడెను

యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల

నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము

ఆమెకు ప్రకటించుడి.

3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు

ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ

పరచుడి

ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము

చేయుడి.

4 ప్రతి లోయను ఎత్తు చేయవలెను

ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను

వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ

వలెను.

5 యెహోవా మహిమ బయలుపరచబడును

ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు

ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

6 ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు

చున్నాడు

–నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు.

సర్వశరీరులు గడ్డియై యున్నారు

వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది

7 యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి

యెండును పువ్వువాడును

నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

8 గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును

మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

9 సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా,

ఉన్నతపర్వతము ఎక్కుము

యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా,

బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి

–ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు

ప్రకటించుము.

10 ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా

ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై

వచ్చును

ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది

ఆయనచేయు ప్రతికారము ఆయనకు ముందుగా

నడచుచున్నది.

11 గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును

తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున

ఆనించుకొని మోయును

పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.

12 తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు?

జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు?

భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు?

త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు?

తూనికచేత కొండలను తూచినవాడెవడు?

13 యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు?

ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు?

14 ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు?

న్యాయమార్గమునుగూర్చి ఆయనకు నేర్పినవాడెవడు?

ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు?

ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?

15 జనములు చేదనుండి జారు బిందువులవంటివి

జనులు త్రాసుమీది ధూళివంటివారు

ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.

16 సమిధలకు లెబానోను చాలకపోవును

దహనబలికి దాని పశువులు చాలవు

17 ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానేయుండును

ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను

ఎంచబడును.

18 కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు?

ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?

19 విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును

కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును

దానికి వెండి గొలుసులు చేయును

20 విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని

మ్రాను ఏర్పరచుకొనును

కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని

వాని వెదకి పిలుచుకొనును.

21 మీకు తెలియదా? మీరు వినలేదా?

మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా?

భూమిని స్థాపించుటనుబట్టి మీరు దాని గ్రహింపలేదా?

22 ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు

దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు

ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును

వ్యాపింపజేసెను

ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస

స్థలముగా ఏర్పరచెను.

23 రాజులను ఆయనలేకుండచేయును

భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు

లుగా చేయును.

24 వారు నాటబడగనే విత్తబడగనేవారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే

ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు

సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని

ఎగరగొట్టును.

25 నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి

చేయుదురు?

అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

26 మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను?

వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు

దేరజేసి వీటన్నిటికిని పేరులుపెట్టి పిలుచువాడే

గదా.

తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము

చేతను ఆయనయొక్కటియైనను విడిచిపెట్టడు.

27 యాకోబూ–నా మార్గము యెహోవాకు మరుగై

యున్నది

నా న్యాయము నా దేవునిదృష్టికి కనబడలేదు అని

నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు

చెప్పుచున్నావు?

28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను

సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు

ఆయన సొమ్మసిల్లడు అలయడు

ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

29 సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే

శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

30 బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు

యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు

31 యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము

పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు

అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/40-503b1eadbef47d5e8f6cf6000822bea6.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 41

1 ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి .

జనములారా, నూతనబలము పొందుడి.వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను

వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము

రండి.

2 తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు

నుండి రేపి పిలిచినవాడెవడు?

ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు

రాజులను లోబరచుచున్నాడు

ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు

ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు

చున్నాడు.

3 అతడు వారిని తరుముచున్నాడు

తాను ఇంతకుముందు వెళ్లనిత్రోవనే సురక్షితముగ

దాటిపోవుచున్నాడు.

4 ఎవడు దీని నాలోచించి జరిగించెను?

ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన

యెహోవానగు నేనే

నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.

5 ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు

వణకుచున్నవి

జనులు వచ్చి చేరుచున్నారు

6 వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు

ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు

కొందురు.

7 అతుకుటనుగూర్చి

–అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని

ప్రోత్సాహపరచును

సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు

వానిని ప్రోత్సాహపరచును

విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని

బిగించును.

8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన

యాకోబూ,

నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9-10 భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల

నుండి పిలుచుకొనినవాడా,

నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక

యేర్పరచుకొంటిననియు

నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను

భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను

దిగులుపడకుము నేను నిన్ను బలపరతును

నీకు సహాయము చేయువాడను నేనే

నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం

దును.

11 నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె

దరు

నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12 నీతో కలహించువారిని నీవు వెదకుదువుగాని వారిని

కనుగొనలేకపోవుదువు

నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు

అభావులగుదురు.

13 నీ దేవుడనైన యెహోవానగు నేను–భయపడకుము

నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు

నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

14 పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రా

యేలూ, భయపడకుడి

నేను నీకు సహాయము చేయుచున్నాను

అని యెహోవా సెలవిచ్చుచున్నాడు

నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

15 కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి

మ్రానుగా నిన్ను నియమించియున్నాను

నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయు

దువు

కొండలను పొట్టువలె చేయుదువు

16 నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును

సుడిగాలి వాటిని చెదరగొట్టును.

నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు

ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.

17 దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకకవారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది,

యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను

ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

18 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము

చేసెననియు

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు

తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు

నట్లు

19 చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను

లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను

అరణ్యమును నీటిమడుగుగాను

ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.

20 నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ

చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం

చెదను

అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి

వృక్షములను నాటెదను.

21 –వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు

మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు

చున్నాడు.

22 జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ

జెప్పుడి

పూర్వమైనవాటిని విశదపరచుడి

మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు

వాటిని మాకు తెలియజెప్పుడి

లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

23 ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి

అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము

మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు

మేలైనను కీడైనను చేయుడి.

24 మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము

మిమ్మును కోరుకొనువారు హేయులు.

25 ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను

నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ

దిక్కునుండి వచ్చుచున్నాడు

ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు

నట్లు

అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.

26 మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు

తెలియజెప్పినవాడెవడు?

ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ

కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు?

దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా

డెవడును లేడు

మీ మాటలు వినువాడెవడును లేడు.

27 ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో

చెప్పిన వాడను నేనే

యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని

నేనే పంపితిని.

28 నేను చూడగా ఎవడును లేకపోయెను

నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల

ఆలోచనకర్త యెవడును లేకపోయెను.

29 వారందరు మాయాస్వరూపులువారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు

శూన్యములు

అవి వట్టిగాలియై యున్నవి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/41-84ae47c250bcc80e2f28269728d4e530.mp3?version_id=1787—