Categories
యెషయా

యెషయా 22

1 దర్శనపులోయనుగూర్చిన దేవోక్తి

2 –ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కియున్నారు?

అల్లరితో నిండి కేకలువేయు పురమా,

ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా,

నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు

యుద్ధములో వధింపబడలేదు.

3 నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత

కొట్టబడకుండ పట్టబడినవారైరి.

మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు

పారిపోయిరి

4 నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను

నాకు విముఖులై యుండుడి

నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను

ఓదార్చుటకు తీవరపడకుడి.

5 దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు

నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి

యున్నాడు

ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును

ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని

వినబడును.

6 ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి

అంబులపొదిని వహించియున్నది.

కీరు డాలు పై గవిసెన తీసెను

7 అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి

గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు.

8 అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను

ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధము

లను కనిపెట్టితివి.

9 దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి

పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి

నీళ్లను మీరు సమకూర్చితిరి.

10 యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును

గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి

11 పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల

మధ్యను చెరువు కట్టితిరి

అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచినవారు కారు

పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య

పెట్టకపోతిరి.

12 ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి

చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును

సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా

మిమ్మును పిలువగా

13 రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు

14 కాగా ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు–మీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.

15 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము

16 –ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు?

నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల?

ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు

శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు

17 ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు

యెహోవా నిన్ను వడిగా విసరివేయును

ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును

18 ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు

విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును.

నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన

వాడా,

అక్కడనే నీవు మృతిబొందెదవు

నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును

19 నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె

దను

నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.

20 ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి

21 అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత అతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును.

22 నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని

భుజముమీద ఉంచెదను

అతడు తీయగా ఎవడును మూయజాలడు

అతడు మూయగా ఎవడును తీయజాలడు

23 దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర

పరచెదను

అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల

సింహాసనముగా నుండును.

24 గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న

చెంబులను

అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల

లందరిని అతనిమీద వ్రేలాడించెదరు.

25 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెల

విచ్చుచున్నాడు

ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు

ఊడదీయబడి తెగవేయబడి పడును

దానిమీదనున్న భారము నాశనమగును

ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/22-5502810f74b6378230d42b31a1ec6184.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 23

1 తూరునుగూర్చిన దేవోక్తి

–తర్షీషు ఓడలారా, అంగలార్చుడి

తూరు పాడైపోయెను

ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు

కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి

చేయబడెను.

2 సముద్రతీరవాసులారా, అంగలార్చుడి

సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సర

కులతో నిన్ను నింపిరి.

3 షీహోరు నది ధాన్యము నైలునది పంట

సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను

తూరువలన జనములకు లాభము వచ్చెను.

4 సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము

మాటలాడుచున్నది

–నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను

యౌవనస్థులను పోషింపనిదానను

కన్యకలను పెంచనిదానను.

5 ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరునుగూర్చి

మిక్కిలి దుఃఖింతురు.

6 తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ

లార్చుడి.

7 నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన

కాలముననుండిన పట్టణమిదేనా?

పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన

దిదేనా?

8 దాని వర్తకులు రాజసమానులు

దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు

కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ

నెవడు ఉద్దేశించెను?

9 సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట

కును

భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ

నుద్దేశించెను.

10 తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను

నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.

11 ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను

రాజ్యములను కంపింపజేసెను

కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని

గూర్చి ఆజ్ఞాపించెను.

12 మరియు ఆయన

–సీదోను కన్యకా, చెరపబడినదానా,

నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి

పొమ్ము

అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు

13 ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన

ముగా ఉండరు

అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా

చేసియున్నారు.వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు.

14 తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడై

పోయెను.

15 ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున

డెబ్బది సంవత్సరములు మరవబడును

డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో

ఉన్నట్లు జరుగును, ఏమనగా

16 మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో

తిరుగులాడుము

నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం

చుము

అనేక కీర్తనలు పాడుము.

17 డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును

దర్శించును

అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త

లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.

18 వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు

ప్రతిష్ఠితమగును

అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు

యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు

భోజనమునకును ప్రశస్త వస్త్రములకును

ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/23-80ea57723d9aa7bd06358e925bdebec3.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 24

1 ఆలకించుడి

యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు

ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు

దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.

2 ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును

దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును

దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును

కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును

అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి

కలుగును

వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలు

గును.

3 దేశము కేవలము వట్టిదిగా చేయబడును

అది కేవలము కొల్లసొమ్మగును.

యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు

4 –దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది

లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది

భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.

5 లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు

కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు.

దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను.

6 శాపము దేశమును నాశనముచేయుచున్నది

దాని నివాసులు శిక్షకు పాత్రులైరి

దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు

కొద్దిగానే యున్నారు.

7 క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది

ద్రాక్షావల్లి క్షీణించుచున్నది

సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు.

తంబురల సంతోషనాదము నిలిచిపోయెను

8 ఉల్లసించువారి ధ్వని మానిపోయెను

సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.

9 పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము

త్రాగరు

పానము చేయువారికి మద్యము చేదాయెను

10 నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను

ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి

యున్నది.

11 ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు

వేయుచున్నారు

సంతోషమంతయు అస్తమించెను

దేశములో ఆనందము లేదు.

12 పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు

విరుగగొట్టబడెను.

13 ఒలీవ చెట్టును దులుపునప్పుడును

ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు

కొనునప్పుడును జరుగునట్లుగా

భూమిమధ్య జనములలో జరుగును.

14 శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు

యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్నవారు కేకలువేయుదురు.

15 అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో

వాను ఘనపరచుడి

సముద్ర ద్వీపవాసులారా,ఇశ్రాయేలు దేవుడైన

యెహోవా నామమును ఘనపరచుడి.

16 నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత

ములు మనకు వినబడెను.

అప్పుడు నేను–అయ్యో నాకు శ్రమ

నేను చెడిపోతిని చెడిపోతిని.

మోసము చేయువారు మోసము చేయుదురు

మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.

17 భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను

గుంటయు ఉరియు నీకు తటస్థించెను

18 తూములు పైకి తీయబడియున్నవి

భూమి పునాదులు కంపించుచున్నవి

19 భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది

భూమి కేవలము తునకలై పోవుచున్నది

భూమి బహుగా దద్దరిల్లుచున్నది

20 భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది

పాకవలె ఇటు అటు ఊగుచున్నది

దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది

పడి యికను లేవదు.

భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు

గుంటలో పడును

గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.

21 ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత

స్థల సమూహమును

భూమిమీదనున్న భూరాజులను దండించును

22 చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగావారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు

బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు.

23 చంద్రుడు వెలవెలబోవును

సూర్యుని ముఖము మారును

సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ

మీదను యెరూషలేములోను రాజగును.

పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/24-456482c032e30779d6ed2cfc528086e9.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 25

1 యెహోవా, నీవే నా దేవుడవు

నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె

దను

నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస

రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు

నెరవేర్చితివి

2 నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము

పాడుగాను

అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు

చేసితివి

అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.

3 భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా

నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి

దరిద్రులకు కలిగినశ్రమలో వారికి శరణ్యముగాను

గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల

కుండ నీడగాను ఉంటివి.

4 కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు

భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.

5 ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు

అన్యుల ఘోషను అణచివేసితివి

మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు

బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.

6 ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా

సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు

చేయును

మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును

మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును

మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

7 సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును

సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము

మీద ఆయన తీసివేయును

8 మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి

వేయును.

ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప

బిందువులను తుడిచివేయును

భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును

ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

9 ఆ దినమున జనులీలాగు నందురు

–ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని

యున్న మన దేవుడు

మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే

ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

10 యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును

పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు

మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు.

11 ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లువారు దానిమధ్యను తమ చేతులను చాపుదురు

వారెన్ని తంత్రములు పన్నినను యెహోవావారి

గర్వమును అణచివేయును.

12 మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను

ఆయన క్రుంగగొట్టును

వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/25-5837990881307987da2b5e610c032daa.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 26

1 ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన

పాడుదురు–

బలమైన పట్టణమొకటి మనకున్నది

రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను

ఆయన నియమించియున్నాడు.

2 సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు

ద్వారములను తీయుడి.

3 ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో

వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు.

ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి

యున్నాడు.

4 యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము

యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

5 ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును

దిగగొట్టువాడు

ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను

ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

6 కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కుచున్నవి.

7 నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును

నీతిమంతుల త్రోవను నీవు సరాళముచేయుచున్నావు.

8 యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని

మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము

మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది.

9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది

నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది.

నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని

నేర్చుకొందురు.

10 దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరువారు ధర్మక్షేత్రములో నివసించినను

యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము

చేయుదురు.

11 యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు

దాని చూడనొల్లరు

జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు

దురు

నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మ్రింగివేయును.

12 యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు

నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని

సఫలపరచుదువు.

13 యెహోవా, మా దేవా,

నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి

ఇప్పుడు నిన్నుబట్టియే నీ నామమును స్మరింతుము

14 చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు

అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి

వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.

15 యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును

వృద్ధిచేసితివి.

దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు

మహిమపరచుకొంటివి.

16 యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి

నీ శిక్ష వారిమీద పడినందునవారు విశేషముగా దీన

ప్రార్థనలు చేసిరి

యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా

17 గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు

మేము నీ సన్నిధిలో నున్నాము.

18 మేము గర్భము ధరించి వేదనపడితిమి

గాలిని కన్నట్టు ఉంటిమి

మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి

లోకములో నివాసులు పుట్టలేదు.

19 మృతులైన నీవారు బ్రదుకుదురు

నావారి శవములు సజీవములగును

మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స

హించుడి.

నీ మంచు ప్రకాశమానమైన మంచు

భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20 నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు

లను శిక్షించుటకు

యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు

చున్నాడు

భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ

తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21 నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము

నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము

ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/26-e8c0087a95391167bd2cab35734ee1fb.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 27

1 ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన

ఖడ్గము పట్టుకొనును

తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును

ఆయన దండించును

సముద్రముమీదనున్న మకరమును సంహరించును.

2 ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును

దానిగూర్చి పాడుడి.

3 యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను

ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను

ఎవడును దానిమీదికి రాకుండునట్లు

దివారాత్రము దాని కాపాడుచున్నాను.

4 నాయందు క్రోధము లేదు

గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన

యెడల

యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా

జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.

5 ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింప

వలెను

నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధాన

పడవలెను.

6 రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రా

యేలు చిగిర్చి పూయును.వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.

7 అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని

కొట్టెనా?

అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు

చంపబడెనా?

8 నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష

విధించితివి.

తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని

తొలగించితివి

9 కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ

శ్చిత్తము చేయబడును

ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము.

ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె

అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు

దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల

లేవవు.

10 ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ

బడును

విసర్జింపబడిన నివాసస్థలముగానుండును

అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను

తినును.

11 దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును

స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు.వారు బుద్ధిగల జనులు కారు

వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు.వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.

12 ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు

కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య

మును త్రొక్కును.

ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని

కూర్చబడుదురు.

13 ఆ దినమున పెద్ద బూర ఊదబడును

అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును

ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు,

యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో

వాకు నమస్కారము చేయుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/27-5864f2bf601b2201bb0e521fcb7b06fe.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 28

1 త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ .

కిరీటమునకు శ్రమ

వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణ

మునకు శ్రమ

ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన

లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.

2 ఆలకించుడి, బలపరాక్రమములుగలవాడొకడు

ప్రభువుకు ఉన్నాడు

ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల

ప్రవాహమును

ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు

ఆయన తన బలముచేత పడద్రోయువాడు.

3 త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము

కాళ్లతో త్రొక్కబడును.

4 ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు

పుష్పమువంటిదాని సుందరభూషణము

వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూ

రపు పండువలె అగును

దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని

చేతిలో పడినవెంటనే

అది మ్రింగివేయబడును.

5 ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం

చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగానుండును

సౌందర్యముగల మకుటముగా నుండును.

6 ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు

తీర్చ నేర్పు ఆత్మగాను

గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి

పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.

7 అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు

మద్యమువలన తత్తరపడుదురు

యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన

సొక్కి సోలుదురు

ద్రాక్షారసము వారిని మ్రింగివేయుచున్నది

మద్యమువలన తత్తరపడుచున్నారు

దర్శనము కలుగునప్పుడు సోలుదురు

తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.

8 వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల

తోను నిండియున్నవి

అవి లేనిచోటు లేదు.

9 వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ

జేయును?

తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

10 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ

సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి

సూత్రము

కొంత ఇచ్చట కొంత అచ్చట

చెప్పుచున్నాడని వారనుకొందురు.

11 నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి

12 ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు

13 నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను

ఈ జనులతో మాటలాడుచున్నాడు.

అయినను వారు విననొల్లైరెరి.

కావునవారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు

బడి పట్టబడునట్లు

ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ

సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి

సూత్రము

కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము

మీకు వచ్చును.

14 కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు

అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి

15 –మేము మరణముతో నిబంధన చేసికొంటిమి

పాతాళముతో ఏకమైతిమి

ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు

అది మాయొద్దకు రాదు

అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి

మాయక్రింద దాగియున్నాము

అని మీరు చెప్పుకొనుచున్నారే.

16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు

–సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను

నేనే

అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి

బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది

విశ్వసించువాడు కలవరపడడు.

17 నేను న్యాయము కొలనూలుగాను

నీతి మట్టపుగుండుగాను పెట్టెదను

వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును

దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

18 మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ

బడును

పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలు

వదు

ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగు

దురు

19 వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును

ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది

వచ్చును

ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము

పుట్టును.

20 పండుకొనుటకు మంచము పొడుగు చాలదు

కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.

21 నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్య

మును చేయుటకు

అపూర్వమైన తన కార్యము నొనరించుటకు

ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు

యెహోవా లేచును

గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును.

22 మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాస

కులై యుండకుడి

భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప

బడెను

ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన

నేను దాని సమాచారము వింటిని

23 చెవియొగ్గి నా మాట వినుడి

ఆలకించి నేను పలుకునది వినుడి

24 దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా?

అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?

25 అతడు నేల చదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ

చల్లును

తెల్ల జీలకఱ్ఱ చల్లును

గోధుమలు వరుసగా విత్తును

యవలను తానేర్పరచిన చేనిలో చల్లును

దాని అంచున మెరపమొలకలు వేయును గదా?

26 వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు

ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.

27 సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత

నూర్చడు

బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని

కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల

గొట్టును గదా?

28 మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా?

సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు

ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని

మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా!

29 జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని

నేర్చుకొందురు.

ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్ర

హించువాడు ఆయనే

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/28-64e6fb67eac91054bce6bbdece2fb48e.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 29

1 అరీయేలుకు శ్రమ

దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ

సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి

పండుగలను క్రమముగా జరుగనీయుడి.

2 నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును

కలుగును

అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.

3 నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము

వేయుదును.

నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.

4 అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు

నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం

డును

కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును

నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.

5 నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత

విస్తారముగానుండును

బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలెనుండును

హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభ

వించును.

6 ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను

సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల

తోను

సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.

7 అరీయేలుతో యుద్ధముచేయు సమస్త జనుల సమూహ

మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము

చేయువారును

దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము

వలె ఉందురు.

8 ఆకలిగొన్నవాడు కలలో భోజనముచేసి మేల్కొనగా

వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును

దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా

సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని

యున్నట్లును

సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల

సమూహమంతటికి సంభవించును.

9 జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి

మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి

ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు

మద్యపానము చేయకయే తూలుచున్నారు.

10 యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి

యున్నాడు

మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి

యున్నాడు

మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి

యున్నాడు.

11 దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ

వాక్యములవలె ఉన్నది

ఒకడు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర

ములు తెలిసినవానికి వానిని అప్పగించును;

అతడు–అది నావలన కాదు అది గూఢార్థముగా

ఉన్నదని చెప్పును.

12 మరియు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర

ములు తెలియనివానికి దానిని అప్పగించును

అతడు–అక్షరములు నాకు తెలియవనును.

13 ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు

–ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు

పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని

తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారువారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు

లనుబట్టి వారు నేర్చుకొనినవి.

14 కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య

కార్యము జరిగింతును

బహు ఆశ్చర్యముగా జరిగింతునువారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగునువారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.

15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో

పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ.

మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి

యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరి

గించువారికి శ్రమ.

16 అయ్యో, మీరెంత మూర్ఖులు?

కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా?

చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి–ఇతడు

నన్ను చేయలేదనవచ్చునా?

రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి–ఇతనికి

బుద్ధిలేదనవచ్చునా?

17 ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను

ప్రదేశము ఫలవంతమైన పొలమగును

ఫలవంతమైన పొలము వనమని యెంచబడును.

18 ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు

అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను

గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

19 యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక

మగును

మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ

దేవునియందు అనందించెదరు.

20 బలాత్కారులు లేకపోవుదురు

పరిహాసకులు నశించెదరు.

21 కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమునుబట్టి

యితరులను పాపులనుగా చేయుచు

గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని

ఉరి నొడ్డుచు

మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు

నరకబడుదురు.

22 అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా

యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల

విచ్చుచున్నాడు

–ఇకమీదట యాకోబు సిగ్గుపడడు

ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.

23 అతని సంతానపువారు తమ మధ్య నేనుచేయు

కార్యమును చూచునప్పుడు

నా నామమును పరిశుద్ధపరచుదురు

యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు

ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.

24 చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు

సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.

Categories
యెషయా

యెషయా 30

1 యెహోవా వాక్కు ఇదే

–లోబడని పిల్లలకు శ్రమ

పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు

నన్ను అడుగక ఆలోచనచేయుదురు

నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు

2 వారు నా నోటి మాట విచారణచేయక

ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు

ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా

ణము చేయుదురు.

3 ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును

ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.

4 యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడువారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు

5 వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ

మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక

సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై

సిగ్గుపడుదురు.

6 దక్షిణ దేశములోనున్న క్రూరమృగములనుగూర్చిన

దేవోక్తి

సింహీ సింహములును పాములును

తాపకరమైన మిడునాగులు నున్న

మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు

గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని

ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు

కొని

తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని

తీసికొని పోవుదురు.

7 ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్పయోజన

మైనది

అందుచేతను–ఏమియు చేయక ఊరకుండు గప్పాల

మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

8 రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము

సాక్ష్యార్థముగా నుండునట్లు

నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ

ములో లిఖింపుము

9 వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు

యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

10 దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును

–యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి

మృదువైన మాటలనే మాతో పలుకుడి

మాయాదర్శనములను కనుడి

11 అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి

ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట

ఎత్తకుడి

అని భవిష్యద్ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

12 అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు

ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక

13 ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

14 కుమ్మరికుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు

విడిచిపెట్టక దాని పగులగొట్టును

పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని

గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క

పెంకైనను దొరకదు.

15 ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింప

బడెదరు

మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము

కలుగును.

16 అయినను మీరు సమ్మతింపక–అట్లు కాదు, మేము

గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి

కాగా మీరు పారిపోవలసి వచ్చెను.

మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే

కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా

నుందురు.

17 మీరు పర్వతముమీదనుండు కొయ్యవలెను

కొండమీదనుండు జెండావలెను అగువరకు

ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు

అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు.

18 కావున మీయందు దయచూపవలెనని యెహోవా

ఆలస్యమువేయుచున్నాడు

మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి

యున్నాడు

యెహోవా న్యాయముతీర్చు దేవుడు

ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.

19 సీయోనులో యెరూషలేములోనే యొక జనము

కాపురముండును.

జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు

ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు

ణించును

ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

20 ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును

ఇకమీదట నీ బోధకులు దాగియుండరు

నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

21 మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను

–ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి

యొక శబ్దము నీ చెవులకు వినబడును.

22 చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును

పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు

అపవిత్రపరతురు

హేయములని వాటిని పారవేయుదురు.

–లేచిపొమ్మని దానితో చెప్పుదురు.

23 నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన

వాన ఆయన కురిపించును

భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును

అది విస్తార సార రసములు కలదై యుండును

ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో

మేయును.

24 భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట

తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో

కలిసిన మేత తినును.

25 గోపురములు పడు మహా హత్యదినమున

ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి

కొండమీదను

వాగులును నదులును పారును.

26 యెహోవా తన జనుల గాయముకట్టి వారి దెబ్బను

బాగుచేయు దినమున

చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును

సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక

దినమున ప్రకాశించినట్లుండును.

27 ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు

పొగతోకూడినదై

యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది

ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి

ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

28 ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన

నదివలె ఉన్నది

వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము

లను గాలించును

త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.

29 రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు

సంగీతము పాడుదురు.

ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క

పర్వతమునకు

పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి

కలుగునట్టి హృదయసంతోషము కలుగును.

30 యెహోవా తన ప్రభావముగల స్వరమును విని

పించును

ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను

పెళపెళయను గాలివాన వడగండ్లతోను

తన బాహువు వాలుట జనులకు చూపించును.

31 యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది

ఆయన స్వరము విని భీతినొందును.

32 యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక

దండమువలని ప్రతి దెబ్బ

తంబుర సితారాల నాదముతో పడును

ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు

యుద్ధము చేయును.

33 పూర్వమునుండి తోఫెతుసిద్ధపరచబడియున్నది

అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది

లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి

యున్నాడు

అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది

గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని

రగులబెట్టును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/30-eb490685281b7c2ff9805d75fb7a97de.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 31

1 ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు

యెహోవాయొద్ద విచారింపకయు

సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను

ఆధారము చేసికొని

వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యు

లనియువారిని ఆశ్రయించువారికి శ్రమ.

2 అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు.

మాట తప్పక దుష్టుల యింటివారిమీదను

కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన

లేచును.

3 ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు

ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ

కావు

యెహోవా తన చెయ్యిచాపగా సహాయముచేయు

వాడు జోగును

సహాయము పొందువాడు పడును

వారందరు కూడి నాశనమగుదురు.

4 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు

–తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము

కూడిరాగా

సింహము కొదమసింహము

వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య

పడకయు

తనకు దొరికినదానిమీద గర్జించునట్లు

సైన్యములకధిపతియగు యెహోవా

యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని

దాని కొండమీదికిని దిగి వచ్చును.

5 పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు

సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును

కాపాడును

దాని కాపాడుచు విడిపించుచునుండును

దానికి హానిచేయక తప్పించుచునుండును.

6 ఇశ్రాయేలీయులారా,

మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో

ఆయనవైపు తిరుగుడి.

7 మీకు మీరు పాపము కలుగజేసికొని

మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను

సువర్ణ విగ్రహములను

ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.

8 నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలు

దురు

మనుష్యునిది కాని కత్తిపాలగుదురు.

ఖడ్గ మెదుటనుండివారు పారిపోవుదురు

9 వారి పడుచువారు దాసులగుదురు

భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును

వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక

దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో

ఆయన కొలిమియు ఉన్నవి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/31-d33f5c2c73c527efdc211c238c129ec5.mp3?version_id=1787—