Categories
యెషయా

యెషయా 2

1 యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు

ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన

కలిగిన దేవోక్తి–

2 అంత్యదినములలో పర్వతములపైన యెహోవామందిర

పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల

కంటె ఎత్తుగా ఎత్తబడును

ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి

వచ్చెదరు

3 ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము

యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు

వెళ్లును.

జనములు గుంపులు గుంపులుగా వచ్చి

–యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత

మునకు మనము వెళ్లుదము రండి

ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును

మనము ఆయన త్రోవలలో నడుచుదము

అని చెప్పుకొందురు.

4 ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును

అనేక జనములకు తీర్పుతీర్చునువారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను

తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు

జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును

యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

5 యాకోబు వంశస్థులారా, రండి

మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

6 యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన

జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారువారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు

అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు

వారిని విసర్జించియున్నావు.

7 వారి దేశము వెండి బంగారములతో నిండియున్నదివారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు

వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథ

ములకు మితిలేదు.

8 వారి దేశము విగ్రహములతో నిండియున్నదివారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి

నమస్కారము చేయుదురు

9 అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడు

దురు

కాబట్టి వారిని క్షమింపకుము.

10 యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ

మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము

మంటిలో దాగి యుండుము.

11 నరుల అహంకారదృష్టి తగ్గింపబడును

మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును

ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

12 అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము

గల ప్రతిదానికిని

విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు

యెహోవా నియమించియున్నాడు

అవి అణగద్రొక్కబడును.

13 ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు

వృక్షములకన్నిటికిని

బాషాను సింధూర వృక్షములకన్నిటికిని

14 ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15 ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి

కోటకును

16 తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల

కన్నిటికిని

ఆ దినము నియమింపబడియున్నది.

17 అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును

మనుష్యుల గర్వము తగ్గింపబడును

ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18 విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

19 యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు

ఆయన భీకర సన్నిధినుండియు

ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు

మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల

బొరియలలో దూరుదురు.

20-21 ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప

లేచునప్పుడు

ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ

మాహాత్మ్యమునుండియు

కొండల గుహలలోను బండబీటలలోను

దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై

చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ

ములను

ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

22 తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని

లక్ష్యపెట్టకుము;

వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/2-0bab4628880c14fe0a74acb273da695b.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 3

1 ఆలకించుడి

ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా

పోషణమును పోషణాధారమును

అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు

2 శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను

3 సోదెకాండ్రను పెద్దలను పంచదశాధిపతులను

ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను

ఎరిగినవారిని మాంత్రికులను

యెరూషలేములోనుండియు యూదాదేశములో

నుండియు తీసివేయును.

4 బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదనువారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

5 ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు

తన పొరుగువానిని ఒత్తుడు చేయును.

పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును

గర్వించి తిరస్కారముగా నడుచును.

6 ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని

–నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై

యుందువు

ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును

7 అతడు ఆ దినమున కేకవేసి–నేను సంరక్షణ కర్తనుగా

ఉండనొల్లను

నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు

నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.

8 యెరూషలేము పాడైపోయెను యూదా నాశన

మాయెను

యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటుచేయు

నంతగా

వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా

ఉన్నవి.

9 వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును.

తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని

బయలుపరచుదురు.

తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి

శ్రమ

10 –మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుమువారు తమ క్రియల ఫలము అనుభవింతురు.

11 దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.

12 నా ప్రజలవిషయమై నేనేమందును?

బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని

ఏలుచున్నారు.

నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారువారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు.

13 యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు

జనములను విమర్శించుటకు లేచియున్నాడు

14 యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను

విమర్శింప వచ్చుచున్నాడు.

మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి

మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే

యున్నది

15 నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు?

బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు?

అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా

సెలవిచ్చుచున్నాడు.

16 మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా–

సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండై

మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు

కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించుచున్నారు;

17 కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి

చేయును

యెహోవావారి మానమును బయలుపరచును.

18 ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద

భూషణములను

సూర్యబింబ భూషణములను

చంద్రవంకలను భూషణములను

19-20 కర్ణభూషణములను కడియములను నాణెమైన ముసుకు

లను

కుల్లాయీలను కాళ్ల గొలుసులను

ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణెలను

21 రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

22 ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను

సంచులను

23 చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను

పాగాలను శాలువులను తీసివేయును.

24 అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును

నడికట్టుకు ప్రతిగా త్రాడును

అల్లిన జడకు ప్రతిగా బోడితలయు

ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు

అందమునకు ప్రతిగా వాతయును ఉండును.

25 ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు

యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు

26 పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును

ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/3-fb1ab5613f4fefe807315a93d417b599.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 4

1 ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు

కొని

– మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే

కట్టుకొందుము,

నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు

మని చెప్పుదురు.

2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష

ణమునగును.

ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి

భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము

గాను ఉండును.

3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో

నిలువబడినవానికి

అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ

లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4 తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు

సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు

యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి

తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5 సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని

ఉత్సవ సంఘములమీదను

పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా

ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6 మహిమ అంతటిమీద వితానముండును

పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను

చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/4-3da1d56025caacaa8e67a09a4348eb42.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 5

1 నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి

అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి

పాడెదను వినుడి.

సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొక

ద్రాక్షతోట యుండెను

2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో

శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను

దానిమధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష

తొట్టిని తొలిపించెను.

ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను

గాని అది కారుద్రాక్షలు కాచెను

3 కావున యెరూషలేము నివాసులారా, యూదావార

లారా,

నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ

వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

4 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి

దానికి చేయగలను?

అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు

అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?

5 ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు

కార్యమును మీకు తెలియజెప్పెదను

నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి

వేసెదను.

అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని

పాడుచేసెదను

6 అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు

దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును

దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.

7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు

యెహోవా ద్రాక్షతోట

యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము.

ఆయన న్యాయము కావలెనని చూడగా బలా

త్కారము కనబడెను

నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

8 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో

నివసించునట్లు

ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు

కొను మీకు శ్రమ.

9 నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు

యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల

విచ్చెను.

–నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు

అనేకములు నివాసులులేక పాడైపోవును.

10 పది ఎకరములద్రాక్షతోట ఒక కుంచెడు రస

మిచ్చును

తూమెడుగింజల పంట ఒక పడి యగును.

11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము

తమకు మంట పుట్టించువరకు చాల రాత్రివరకు

పానముచేయువారికి శ్రమ.

12 వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను

వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు

చేయుదురుగాని యెహోవా పని యోచింపరు

ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి

పోవుచున్నారు

వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు

సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.

14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరి

మితముగా తన నోరు తెరచుచున్నది

వారిలో ఘనులును సామాన్యులును

ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

15 అల్పులు అణగద్రొక్కబడుదురు

ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును

16 సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి

మహిమపరచబడును

పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధపరచు

కొనును.

17 అది మేతబీడుగానుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట

మేయును

గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు

అనుభవింతురు.

18 భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొనువారికి శ్రమ.

బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమవారు ఇట్లనుకొనుచున్నారు

19 –ఆయనను త్వరపడనిమ్ము

మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను

దానిని వెంటనే చేయనిమ్ము

ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు

తెలియబడునట్లు

అది మా యెదుట కనబడనిమ్ము

20 కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి

వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారి శ్రమ.

చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి

శ్రమ.

21 తమ దృష్టికి తాము జ్ఞానులనియు

తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు

కొనువారికి శ్రమ.

22 ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని

మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.

23 వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని

తీర్పు తీర్చుదురు

నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

24 సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మ

శాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు

ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక

రించుదురు.

కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు

నట్లు

ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లిపోవునువారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.

25 దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద

మండుచున్నది.

ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని

కొట్టగా పర్వతములు వణకుచున్నవి.

వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి

యున్నవి.

ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు

ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

26 ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు

ధ్వజము నెత్తును

భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల

గొట్టును

అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.

27 వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను

లేడు.

వారిలో ఎవడును నిద్రపోడుకునుకడు

వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు

తెగిపోదు.

28 వారి బాణములు వాడిగలవివారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి

వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన

ములువారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును

29 ఆడుసింహము గర్జించినట్లువారు గర్జించుదురు

కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు

వేటను పట్టుకొని అడ్డమేమియులేకుండ దానిని

ఎత్తుకొని పోవుదురు

విడిపింపగలవాడెవడును ఉండడు.

30 వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద

గర్జనచేయుదురు

ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు

కనబడును

అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటి

యగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/5-8bcb8fa1b1ff162e25310f1f7fcaaf4b.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 6

1 రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.౹

2 ఆయనకు పైగా సెరాపులునిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.౹

3 వారు–సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.౹

4 వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమముచేత నిండగా

5 నేను–అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనులమధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.౹

6 అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

7 –ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.౹

8 అప్పుడు–నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను–చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా

9 ఆయన–నీవు పోయి యీ జనులతో ఇట్లనుము –మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.౹

10 వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.౹

11 – ప్రభువా, ఎన్నాళ్లవరకని నేనడుగగా ఆయన–నివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

12 యెహోవా మనుష్యులను దూరముగా తీసికొనిపోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.౹

13 దానిలో పదియవభాగము మాత్రము విడువ బడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/6-0b5176f1923d771fbbc0405423facd60.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 7

1 యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను

2 అప్పుడు–సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

3 అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను–ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము

4 –భద్రముసుమీ, నిమ్మళించుము; పొగరాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.౹

5 సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు

6 మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.౹

7 అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆ మాట నిలువదు, జరుగదు.౹

8 దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీను రాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.౹

9 షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.

10-11 యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను– నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.౹

12 ఆహాజు–నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా

13 అతడు–ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?

14 కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలనుపేరు పెట్టును.౹

15 కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.౹

16 కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాకమునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును.౹

17 యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమదినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటివరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

18 ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.౹

19 అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.

20 ఆ దినమున యెహోవా నది (యూఫ్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.

21 ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱెలను పెంచుకొనగా

22 అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా ఈ దేశములో విడువ బడిన వారందరును పెరుగు తేనెలను తిందురు.

23 ఆ దినమున వెయ్యి వెండి నాణెముల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలు రక్కసి చెట్లును పెరుగును.౹

24 ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకొని జనులు అక్క డికి పోవుదురు.౹

25 పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చ పొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱెలు త్రొక్కుటకును ఉప యోగమగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/7-a497996196443b774c13638364f10191.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 8

1 మరియు యెహోవా–నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్, హాష్ బజ్,అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయుము.౹

2 నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా

3 నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా– అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్అను పేరు పెట్టుము.౹

4 ఈ బాలుడు–నాయనా అమ్మా అని అననేరకమునుపు అష్షూరురాజును అతని వారును దమస్కుయొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

5-6 మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను–ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.౹

7 కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.౹

8 అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.

9 జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు;

దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి

మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు

నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

10 ఆలోచనచేసికొనినను అది వ్యర్థమగును

మాట పలికినను అది నిలువదు.

దేవుడు మాతోనున్నాడు.

11 ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను

12 –ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడివారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు

పడకుడి.

13 సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను

కొనుడి

మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే

దిగులుపడవలెను

అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.

14 అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ

ములకు తగులు రాయిగాను

అభ్యంతరము కలిగించు బండగాను ఉండును

యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను

ఉండును

15 అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు

చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.

16 ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను

ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.

17 యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి

కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు

చున్నాను

ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.

18 ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయులమధ్య ఉన్నాము.

19 వారు మిమ్మును చూచి–కర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?

20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.౹

21 అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;౹

22 భూమితట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/8-a4a5ac2d0cdc9e54720d8ebf4e187675.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 9

1 అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ

లేదు

పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును

నఫ్తాలి దేశమును అవమానపరచెను

అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా

యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును

మహిమగలదానిగా చేయుచున్నాడు.

2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు

మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

3 నీవు జనమును విస్తరింపజేయుచున్నావువారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు

కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు

దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లువారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

4 మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని

నీవు విరిచియున్నావు

వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను

విరిచియున్నావు.

5 యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును

రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో

వేయబడి దహింపబడును.

6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను

మనకు కుమారుడు అనుగ్రహింపబడెను

ఆయన భుజముమీద రాజ్యభారముండును.

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు

నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని

అతనికి పేరు పెట్టబడును.

7 ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ

మును కలుగునట్లు

సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును

నియమించును

న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు

టకు

అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును.

సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని

నెరవేర్చును.

8 ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా

అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.

9 అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును

ప్రజలకందరికి తెలియవలసియున్నది.

10 వారు–ఇటికలతో కట్టినది పడిపోయెను

చెక్కిన రాళ్లతో కట్టుదము రండి;

రావికఱ్ఱతో కట్టినది నరకబడెను,

వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని

అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.

11 యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని

హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు.

12 తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును

నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేయవలెననియున్నారు

ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.

ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

13 అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు

సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.

14 కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి

తలను తోకను తాటికమ్మను రెల్లును

ఒక్క దినమున కొట్టివేయును.

15 పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.

16 ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు

వారిని వెంబడించువారు వారిచేత మ్రింగివేయబడు

దురు.

17 వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు

ప్రతి నోరు దుర్భాషలాడును

కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతో

షింపడు

వారిలో తలిదండ్రులు లేనివారియందైననువారి విధవరాండ్రయందైనను జాలిపడడు.

ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు

ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

18 భక్తిహీనత అగ్నివలె మండుచున్నది

అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి

పొదలలో రాజును

అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును.

19 సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతవలన

దేశము కాలిపోయెను.

జనులును అగ్నికి కట్టెలవలె నున్నారువారిలో ఒకనినొకడు కరుణింపడు.

20 కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని

ఇంకను ఆకలిగొని యుందురు;

ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని

ఇంకను తృప్తిపొందక యుందురు

వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును

21 మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను

భక్షించును

వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు.

ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు

ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/9-6419daaa2bf7cc069da180b06c9f32f1.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 10

1 విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలె

ననియు

2 తలిదండ్రులులేనివారిని కొల్లపెట్టుకొనవలెననియు

కోరి

న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించు

టకును

నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును

అన్యాయపు విధులను విధించువారికిని

బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని

శ్రమ.

3 దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున

మీరేమి చేయుదురు?

సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు?

మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?

4 వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు

హతులైనవారి క్రింద కూలుచున్నారు

ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు

ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

5 అష్షూరీయులకు శ్రమవారు నాకోపమునకు సాధనమైన దండము

నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

6 భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను

దోపుడుసొమ్ము దోచుకొనుటకును

కొల్లపట్టుటకును వీధులను త్రొక్కించుటకును

నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి

కాజ్ఞాపించెదను.

7 అయితే అతడు ఆలాగనుకొనడు

అది అతని ఆలోచనకాదు;

నాశనము చేయవలెననియు

చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని

ఆలోచన.

8 అతడిట్లనుకొనుచున్నాడు

–నా యధిపతులందరు మహారాజులు కారా?

9 కల్నో కర్కెమీషువలె నుండలేదా?

హమాతు అర్పాదువలె నుండలేదా?

షోమ్రోను దమస్కువలె నుండలేదా?

10 విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి

చిక్కినవి గదా?

వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల

విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?

11 షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసి

నట్లు

యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక

పోదునా అనెను.

12 కావున సీయోను కొండమీదను యెరూషలేము

మీదను

ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత

నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని

ఫలమునుబట్టియు

అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని

శిక్షింతును.

13 అతడు–నేను వివేకిని

నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని

నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను

దోచుకొంటిని

మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని

14 పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు

జనముల ఆస్తి నా చేత చిక్కెను.

ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు

రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను

కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు

నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొను

చున్నానని అనుకొనును.

15 గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా?

రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా?

కోల తన్నెత్తువానిని ఆడించినట్లును

దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?

16 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా

బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపునువారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.

17 ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును

అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును;

అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ

పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని

మ్రింగివేయును.

18 ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా

శరీర ప్రాణములతోకూడ అతని అడవికిని

అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను

అది నాశనము చేయును.

19 అతని అడవిచెట్ల శేషము కొంచెమగును

బాలుడు వాటిని లెక్కపెట్టవచ్చును.

20 ఆ దినమున ఇశ్రాయేలు శేషమును

యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును

తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక

సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన

యెహోవాను

నిజముగా ఆశ్రయించెదరు.

21 శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు

దేవునివైపు తిరుగును.

22 నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండి

నను

దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణ

యింపబడెను.

23 నీతి ప్రవాహమువలె వచ్చును

ఏలయనగా తాను నిర్ణయించిన సమూలనాశనము

ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా

సర్వలోకమున కలుగజేయును.

24 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా

ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–సీయోనులో నివసించుచున్న నా జనులారా,

ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి

నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము.

25 ఇకను కొద్ది కాలమైన తరువాత నాకోపము చల్లారునువారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

26 ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు

సైన్యములకధిపతియగు యెహోవా

తన కొరడాలను వానిమీద ఆడించును.

ఆయన దండము సముద్రమువరకు వచ్చును

ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును.

27 ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి

వేయబడును.

నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును

నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.

28 అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు

మిగ్రోను మార్గముగా పోవుచున్నారు

మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు

29 వారు కొండసందు దాటి వచ్చుచున్నారు

రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు

సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.

30 గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి

లాయిషా, ఆలకింపుము

అయ్యయ్యో, అనాతోతు

31 మద్మేనా జనులు పారిపోవుదురు

గిబానివాసులు పారిపోదురు

32 ఈ దినమే దండు నోబులో దిగును

ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూష

లేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు

33 చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు

యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా

మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి

పడిపోవును.

34 ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును

లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/10-2ff5a9ca28540c1fe5cb4aeb41d3ee19.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 11

1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును

వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

2 యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ

ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ

తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు

ఆత్మ అతనిమీద నిలుచును

3-4 యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా

ఉండును.

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు

తాను వినుదానినిబట్టి విమర్శచేయడు

నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును

భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ

చేయును

తన వాగ్దండముచేత లోకమును కొట్టును

తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

5 అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును

నడికట్టుగా ఉండును.

6 తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును

చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును

దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు

కూడుకొనగా

బాలుడు వాటిని తోలును.

7 ఆవులు ఎలుగులు కూడి మేయును

వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును

ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8 పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్దఆటలాడును

మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును

9 నా పరిశుద్ధపర్వతమందంతటను ఏ మృగమును హాని

చేయదు నాశముచేయదు

సముద్రము జలముతో నిండియున్నట్టు

లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

10 ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు

యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ

చేయును

ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.

11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును

అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు

పత్రోసులోనుండియు కూషులోనుండియు

ఏలాములోనుండియు షీనారులోనుండియు

హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు

విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన

చెయ్యి చాచును

12 జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ

బెట్టును

భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును

భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి

పోయిన యూదా వారిని సమకూర్చును.

13 ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును

యూదా విరోధులు నిర్మూలమగుదురు

ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు

యూదా ఎఫ్రాయిమును బాధింపడు

14 వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు

పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు

ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు

ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు

అమ్మోనీయులు వారికి లోబడుదురు

15 మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క

అఖాతమును నిర్మూలము చేయును

వేడిమిగల తన ఊపిరిని ఊదును

యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును

ఏడు కాలువలుగా దాని చీలగొట్టును

పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని

చేయును.

16 కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన

దినమున వారికి దారి కలిగినట్లు

అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు

రాజమార్గముండును

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/11-45bd682b1f8f0897207b6b55cb3a62ad.mp3?version_id=1787—