Categories
సామెతలు

సామెతలు 3

1 నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము

నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.

2 అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు

సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.

3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము

వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము.

నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.

4 అప్పుడు దేవునిదృష్టియందును మానవుల దృష్టియందును

నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.

5 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక

నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక

ముంచుము

6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు

ఒప్పుకొనుము

అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

7 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు

యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము

8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును

నీ యెముకలకు సత్తువయు కలుగును.

9 నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును

నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.

10 అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును

నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి

పొరలి పారును.

11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు

ఆయన గద్దింపునకు విసుకవద్దు.

12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా

యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.

13 జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు

వివేచన కలిగిన నరుడు ధన్యుడు.

14 వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట

మేలు

అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట

మేలు.

15 పగడములకంటె అది ప్రియమైనది

నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.

16 దాని కుడిచేతిలో దీర్ఘాయువును

దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.

17 దాని మార్గములు రమ్యమార్గములు

దాని త్రోవలన్నియు క్షేమకరములు.

18 దాని నవలంబించువారికి అది జీవవృక్షము

దాని పట్టుకొనువారందరు ధన్యులు.

19 జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను

వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.

20 ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి

మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.

21 నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను

భద్రము చేసికొనుము

వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము

22 అవి నీకు జీవముగాను

నీ మెడకు అలంకారముగాను ఉండును

23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు

నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.

24 పండుకొనునప్పుడు నీవు భయపడవు

నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.

25 ఆకస్మికముగా భయము కలుగునప్పుడు

దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు

26 యెహోవా నీకు ఆధారమగును

నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.

27 మేలుచేయుట నీ చేతనైనప్పుడు

దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.

28 ద్రవ్యము నీయొద్ద నుండగా

–రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో

అనవద్దు.

29 నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు

వానికి అపకారము కల్పింపవద్దు.

30 నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు.

31 బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము

వాడుచేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు

32 కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు

యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.

33 భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును

నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.

34 అపహాసకులను ఆయన అపహసించును

దీనునియెడల ఆయన దయ చూపును.

35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు.

బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/3-6e781457de599042ed3255fcfe3b8e60.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 4

1 కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి

మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి

2 నేను మీకు సదుపదేశము చేసెదను

నా బోధను త్రోసివేయకుడి.

3 నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని

నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక

కుమారుడనైయుంటిని.

4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను

– నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము

నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.

5 జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము

నా నోటిమాటలను మరువకుము.

వాటినుండి తొలగిపోకుము.

6 జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను

కాపాడును

దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.

7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.

నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.

8 దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును.

దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.

9 అది నీ తలకు అందమైన మాలిక కట్టును

ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.

10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల

నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.

11 జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను

యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.

12 నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు.

నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.

13 ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము

అది నీకు జీవము గనుక దాని పొందియుండుము

14 భక్తిహీనుల త్రోవను చేరకుము

దుష్టుల మార్గమున నడువకుము.

15 దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము.

దానినుండి తొలగి సాగిపొమ్ము.

16 అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు

ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.

17 కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు

బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు

18 పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు

నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,

19 భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము

తాము దేనిమీద పడునది వారికి తెలియదు.

20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము

నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.

21 నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము

నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.

22 దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.

23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును

కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును

భద్రముగా కాపాడుకొనుము

24 మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము

పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.

25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను

నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

26 నీవు నడచు మార్గమును సరాళము చేయుము

అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.

27 నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము

నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/4-368d6e4aa4286a825fb4603ac9c9431e.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 5

1 నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము

వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము

2 అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు

తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.

3 జారస్త్రీ పెదవులనుండి తేనె కారును

దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

4 దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు

అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,

5 దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును

దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును

6 అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు

దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు

తిరుగును.

7 కుమారులారా, నా మాట ఆలకింపుడి

నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.

8 జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి

దూరముగా చేసికొనుము

దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.

9 వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును

క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు

10 నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు

నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.

11 తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు

12 అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని?

నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?

13 నా బోధకుల మాట నేను వినకపోతిని

నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు

14 నేను సమాజ సంఘములమధ్యనుండినను

ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే

యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలు

గుచు నుందువు.

15 నీ సొంతకుండలోని నీళ్లు పానము చేయుము

నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.

16 నీ ఊటలు బయటికి చెదరిపోదగునా?

17 వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?

అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ

అవి నీకే యుండవలెను గదా.

18 నీ ఊట దీవెన నొందును.

నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.

19 ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి

ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు

చుండుము.

ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

20 నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై

యుందువు?

పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?

21 నరుని మార్గములను యెహోవా యెరుగును

వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.

22 దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును

వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

23 శిక్షలేకయే అట్టివాడు నాశనమగును

అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/5-8984039db1646cbbc8adb5e64adefbaf.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 6

1 నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన

యెడల

పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల

2 నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు

నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు

3 నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి.

నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని

బలవంతము చేయుము.

ఈలాగు చేసి తప్పించుకొనుము

4 నీ కన్నులకు నిద్రయైనను

నీ కనురెప్పలకుకునుకుపాటైనను రానియ్యకుము.

5 వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును

ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును

తప్పించుకొనుము.

6 సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము

వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

7 వాటికి న్యాయాధిపతి లేకున్నను

పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను

8 అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును

కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

9 సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు?

ఎప్పుడు నిద్రలేచెదవు?

10 ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని

కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని

నీవనుచుందువు

11 అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్యము

నీయొద్దకు వచ్చును.

ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.

12 కుటిలమైన మాటలు పలుకువాడు

పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు

13 వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును

వ్రేళ్లతో గురుతులు చూపును.

14 వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది

వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.

15 కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును

వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.

16 యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు

ఏడును ఆయనకు హేయములు

17 అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు

నిరపరాధులను చంపు చేతులును

18 దుర్యోచనలు యోచించు హృదయమును

కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును

19 లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు

అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము

నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.

21 వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము

నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.

22 నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును

నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును.

నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.

23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును.

శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

24 చెడు స్త్రీయొద్దకు పోకుండను

పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను

అవి నిన్ను కాపాడును.

25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము

అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన

నియ్యకుము.

26 వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక

మాత్రము మిగిలియుండును.

మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.

27 ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల

వాని వస్త్రములు కాలకుండునా?

28 ఒకడు నిప్పులమీద నడిచినయెడల

వాని పాదములు కమలకుండునా?

29 తన పొరుగువాని భార్యను కూడువాడు ఆప్రకారమే

నాశనమగును

ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.

30 దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన

యెడల

యెవరును వాని తిరస్కరింపరు గదా.

31 వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను

తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.

32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు

ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

33 వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును

వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.

34 భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది

ప్రతికారముచేయు కాలమందు అట్టివాడు కనికర

పడడు.

35 ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు

ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/6-50f94db893d44eebab1db179a4e14cf4.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 7

1 నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము

నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.

2 నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల

నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల

నీవు బ్రదుకుదువు.

3 నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము

నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము

4 జ్ఞానముతో–నీవు నాకు అక్కవనియు

తెలివితో–నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.

5 అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను

ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను

కాపాడును.

6 నా యింటి కిటికీలోనుండి

నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా

7 జ్ఞానములేనివారిమధ్యను

యౌవనులమధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు

నాకు కనబడెను.

8 –సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల

రాత్రివేళ

9 వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు

చుండెను

దాని యింటిమార్గమున నడుచుచుండెను.

10 అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ

ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.

11 అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని

పాదములు దాని యింట నిలువవు.

12 ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను

అది యుండును.

ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.

13 అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను

సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను

14 –సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని

నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను

15 కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా

నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి

16 నా మంచముమీద రత్నకంబళ్లను

ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను

నేను పరచియున్నాను.

17 నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్కచల్లి

యున్నాను.

18 ఉదయమువరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము

పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదమురమ్ము.

19 పురుషుడు ఇంట లేడు

దూరప్రయాణము వెళ్లియున్నాడు

20 అతడు సొమ్ముసంచి చేతపట్టుకొని పోయెను.

పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను–

21 అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు

కొనెను

తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని

పోయెను.

22 వెంటనే పశువు వధకు పోవునట్లును

పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

23 తనకు ప్రాణహానికరమైనదని యెరుగక

ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును

వాని గుండెను అంబు చీల్చువరకు

వాడు దానివెంట పోయెను.

24 నా కుమారులారా, చెవియొగ్గుడి

నా నోటి మాటల నాలకింపుడి

25 జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము

దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.

26 అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు

అది చంపినవారు లెక్కలేనంతమంది

27 దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము

ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/7-13865f98d93d7ae40f4d0e3939f2b1b6.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 8

1 జ్ఞానము ఘోషించుచున్నది

వివేచన తన స్వరమును వినిపించుచున్నది

2 త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను

నడిమార్గములలోను అది నిలుచుచున్నది

3 గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను

పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు

గట్టిగా ప్రకటన చేయుచున్నది

4 – మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను

నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.

5 జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి

బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.

6 నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి

నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

7 నా నోరు సత్యమైన మాటలు పలుకును

దుష్టత్వము నా పెదవులకు అసహ్యము

8 నా నోటి మాటలన్నియు నీతిగలవి

వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు

9 అవియన్నియు వివేకికి తేటగాను

తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.

10 వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి

మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.

11 జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది

విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.

12 జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా

చేసికొనియున్నాను

సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.

13 యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట

చెడుతనము నసహ్యించుకొనుటయే.

గర్వము అహంకారము దుర్మార్గత

కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.

14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు

నా వశము

జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే.

15 నావలన రాజులు ఏలుదురు

అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు.

16 నావలన అధిపతులును లోకములోని ఘనులైన

న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు.

17 నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను

నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు

18 ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు

నాయొద్ద నున్నవి.

19 మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన

కలుగు ఫలము మంచిది

ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడిదొడ్డది.

20 నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను

నడచుచున్నాను.

21 నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదునువారి నిధులను నింపుదును.

22 పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య

ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను

కలుగజేసెను.

23 అనాదికాలము మొదలుకొని మొదటినుండి

భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను

నియమింపబడితిని.

24 ప్రవాహజలములు లేనప్పుడు

నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.

25 పర్వతములు స్థాపింపబడకమునుపు

కొండలు పుట్టకమునుపు

26 భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు

నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను

పుట్టితిని.

27 ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు

మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు

నేనక్కడ నుంటిని.

28 ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు

జలధారలను ఆయన బిగించినప్పుడు

29 జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు

ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు

భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు

30 నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో

షించుచు

నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.

31 ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు

నరులను చూచి ఆనందించుచునుంటిని.

32 కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి

నా మార్గముల ననుసరించువారు ధన్యులు

33 ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై

యుండుడి.

34 అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని

నా ద్వారబంధములయొద్ద కాచుకొని

నా ఉపదేశము వినువారు ధన్యులు.

35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును

యెహోవా కటాక్షము వానికి కలుగును.

36 నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును

నాయందు అసహ్యపడువారందరు మరణమును

స్నేహించుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/8-da75ecbadb4f4b8be270020085e799b5.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 9

1 జ్ఞానము నివాసమును కట్టుకొని

దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది

2 పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది

భోజనపదార్థములను సిద్ధపరచియున్నది

3 తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది

పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి

4 – జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది.

తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది

5 – వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి

నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి

6 ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి

తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.

7 అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును.

భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.

8 అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు

నిన్ను ద్వేషించును.

జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.

9 జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత

జ్ఞానము నొందును

నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి

నొందును.

10 యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే

జ్ఞానమునకు మూలము

పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.

11 నావలన నీకు దీర్ఘాయువు కలుగును

నీవు జీవించు సంవత్సరములు అధికములగును.

12 నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును

నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.

13 బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది

అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు.

14 అది తన ఇంటివాకిట కూర్చుండును

ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును.

15 ఆ దారిని పోవువారిని చూచి

తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి

16 – జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును.

17 అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి–దొంగి

లించిన నీళ్లు తీపి

చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.

18 అయితే అచ్చట ప్రేతలున్నారనియు

దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియువారి ఎంతమాత్రమును తెలియలేదు.

సొలొమోను చెప్పిన సామెతలు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/9-e02d328c21230662810318d99b8cddf4.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 10

1 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును

బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.

2 భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు

నీతి మరణమునుండి రక్షించును.

3 యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు

భక్తిహీనుని ఆశను భంగముచేయును.

4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును

శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.

5 వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు

కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.

6 నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును

బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.

7 నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర

మగును

భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును

8 జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును

పనికిమాలిన వదరుబోతు నశించును.

9 యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును.

కుటిలవర్తనుడు బయలుపడును.

10 కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును

పనికిమాలిన వదరుబోతు నశించును.

11 నీతిమంతుని నోరు జీవపు ఊట

భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.

12 పగ కలహమును రేపును

ప్రేమ దోషములన్నిటిని కప్పును.

13 వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును

బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.

14 జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు

మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.

15 ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము

దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.

16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము

భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.

17 ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో

ఉన్నాడు

గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.

18 అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు

కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.

19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు

తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

20 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది

భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.

21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును

బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.

22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును

నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు.

23 చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది

వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.

24 భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి

వచ్చును

నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.

25 సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును.

నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.

26 సోమరి తనను పని పెట్టువారికి

పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.

27 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట

దీర్ఘాయువునకు కారణము

భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.

28 నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును.

భక్తిహీనుల ఆశ భంగమై పోవును.

29 యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము

పాపముచేయువారికి అది నాశనకరము.

30 నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు

భక్తిహీనులు దేశములో నివసింపరు.

31 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును

మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.

32 నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు

పలుకును

భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/10-90d65dd3e367d156cc68afc641a27559.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 11

1 దొంగత్రాసు యెహోవాకు హేయము

సరియైన గుండు ఆయనకిష్టము.

2 అహంకారము వెంబడి అవమానము వచ్చును

వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును

ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.

4 ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు

నీతి మరణమునుండి రక్షించును.

5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము

చేయును

భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

6 యథార్థవంతుల నీతి వారిని విమోచించును

విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

7 భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును

బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.

8 నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును

భక్తిహీనుడు బాధపాలగును

9 భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి

నాశనము తెప్పించును

తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.

10 నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము

భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.

11 యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును

భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.

12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు.

వివేకియైనవాడు మౌనముగా నుండును.

13 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట

పెట్టును

నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

14 నాయకులు లేని జనులు చెడిపోవుదురు

ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

15 ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును.

పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

16 నెనరుగల స్త్రీ ఘనతనొందును.

బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

17 దయగలవాడు తనకే మేలు చేసికొనును

క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

18 భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును

నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

19 యథార్థమైన నీతి జీవదాయకము

దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే

చేయును

20 మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు

యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.

21 నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు.

నీతిమంతుల సంతానము విడిపింపబడును.

22 వివేకములేని సుందరస్త్రీ

పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.

23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది

భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు

తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.

25 ఔదార్యముగలవారు పుష్టినొందుదురు.

నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

26 ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు

దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.

27 మేలుచేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ

చేయును

కీడుచేయ గోరువానికి కీడే మూడును.

28 ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును

నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

29 తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతం

త్రించుకొనును

మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.

30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము

జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

31 నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు

భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి

ఫలము పొందుదురు గదా?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/11-423308a71c811fd0b630df992f860508.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 12

1 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు

గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు

2 సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును

దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పుతీర్చును.

3 భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు

నీతిమంతుల వేరు కదలదు

4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము

సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.

5 నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు

భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.

6 భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి

వంటివి

యథార్థవంతుల నోరు వారిని విడిపించును.

7 భక్తిహీనులు పాడై లేకపోవుదురు

నీతిమంతుల యిల్లు నిలుచును.

8 ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడబడును

కుటిలచిత్తుడు తృణీకరింపబడును.

9 ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను

వానికంటె

దాసుడుగల అల్పుడు గొప్పవాడు.

10 నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో

చూచును

భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.

11 తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును

వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.

12 భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపేక్షించుదురు

నీతిమంతుల వేరు చిగుర్చును.

13 పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి

నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.

14 ఒకడు తన నోటి ఫలముచేత తృప్తిగా మేలుపొందును

ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.

15 మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది

జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును.

16 మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును

వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.

17 సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును

కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.

18 కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు

జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.

19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును

అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

20 కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు

సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష

భరితులగుదురు.

21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు.

భక్తిహీనులు కీడుతో నిండియుందురు.

22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు

సత్యవర్తనులు ఆయనకిష్టులు.

23 వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును

అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి

చేయుదురు.

24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు

సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును.

25 ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును

దయగల మాట దాని సంతోషపెట్టును.

26 నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును

భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.

27 సోమరి వేటాడినను పట్టుకొనడు

చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.

28 నీతిమార్గమునందు జీవము కలదు

దాని త్రోవలో మరణమే లేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/12-3896bd000fc1d71338029b264146a981.mp3?version_id=1787—