Categories
కీర్తనలు

కీర్తనలు 133

యాత్రకీర్తన. దావీదుది.

1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట

ఎంత మేలు! ఎంత మనోహరము!

2 అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా

కారి అతని అంగీల అంచువరకు దిగజారిన

పరిమళ తైలమువలెనుండును

3 సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు

వలె నుండును.

ఆశీర్వాదమును శాశ్వత జీవమును

అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి

యున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/133-4608261fcd3cbdb8ed5fce3256cfa016.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 134

యాత్రకీర్తన.

1 యెహోవా సేవకులారా,

యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార

లారా,

2 మీరందరు యెహోవాను సన్నుతించుడి.

పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను

తించుడి.

3 భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో

నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/134-9228bc7c48e0da154b679df482a8debe.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 135

1 యెహోవాను స్తుతించుడి

యెహోవా నామమును స్తుతించుడి

యెహోవా సేవకులారా,

2 యెహోవా మందిరములో

మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు

వారలారా,

యెహోవాను స్తుతించుడి.

3 యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి

ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.

4 యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను

తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు

కొనెను.

5 యెహోవా గొప్పవాడనియు

మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు

నేనెరుగుదును.

6 ఆకాశమందును భూమియందును

సముద్రములయందును మహాసముద్రములన్నిటి

యందును

ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు

7 భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే.

వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే

తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

8 ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి

చూలులను ఆయన హతముచేసెను.

9 ఐగుప్తూ, నీమధ్యను ఫరోయెదుటను అతని ఉద్యో

గస్థుల యెదుటను

ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరి

గించెను.

10 అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను

ఆయన హతము చేసినవాడు.

11 అమోరీయుల రాజైన సీహోనును, బాషానురాజైన ఓగును

హతము చేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.

12 ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను

ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను

అప్పగించెను.

13 యెహోవా, నీ నామము నిత్యము నిలుచును

యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము

లుండును.

14 యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును

తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.

15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి

అవి మనుష్యుల చేతిపనులు.

16 వాటికి నోరుండియు పలుకవు

కన్నులుండియు చూడవు

17 చెవులుండియు వినవు

వాటి నోళ్లలో ఊపిరి లేశమైనలేదు.

18 వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు

వారందరును వాటితో సమానులగుదురు.

19 ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను

తించుడి

అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను

తించుడి

20 లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి

యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహో

వాను సన్నుతించుడి.

21 యెరూషలేములో నివసించు యెహోవా

సీయోనులోనుండి సన్నుతింపబడును గాక

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/135-5698742f7a2595b9d0d1d40f14724c0d.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 136

1 యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా

స్తుతులు చెల్లించుడి

ఆయన కృప నిరంతరముండును.

2 దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి

ఆయన కృప నిరంతరముండును.

3 ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి

ఆయన కృప నిరంతరముండును.

4 ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు

ఆయన కృప నిరంతరముండును.

5 తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను

ఆయన కృప నిరంతరముండును.

6 ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు

ఆయన కృప నిరంతరముండును.

7 ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు

ఆయన కృప నిరంతరముండును.

8 పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను

ఆయన కృప నిరంతరముండును.

9 రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను

చేసెను

ఆయన కృప నిరంతరముండును.

10 ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను

ఆయన కృప నిరంతరముండును.

11 వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను

ఆయన కృప నిరంతరముండును.

12 చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను

ఆయన కృప నిరంతరముండును.

13 ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను.

ఆయన కృప నిరంతరముండును.

14 ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో

జేసెను

ఆయన కృప నిరంతరముండును.

15 ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను

ఆయన కృప నిరంతరముండును.

16 అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను

ఆయన కృప నిరంతరముండును.

17 గొప్ప రాజులను ఆయన హతముచేసెను

ఆయన కృప నిరంతరముండును.

18 ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను

ఆయన కృప నిరంతరముండును.

19 అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను

ఆయన కృప నిరంతరముండును.

20 బాషానురాజైన ఓగును ఆయన హతము చేసెను

ఆయన కృప నిరంతరముండును.

21 ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను

ఆయన కృప నిరంతరముండును.

22 తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా

అప్పగించెను

ఆయన కృప నిరంతరముండును.

23 మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను

ఆయన కృప నిరంతరముండును.

24 మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను

ఆయన కృప నిరంతరముండును.

25 సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు

ఆయన కృప నిరంతరముండును.

26 ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి

ఆయన కృప నిరంతరముండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/136-b8e9b1c0c434ccaf2e42e0ab7df10b76.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 137

1 బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు

మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు

చుంటిమి.

2 వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు

తగిలించితిమి.

3 అచ్చట మనలను చెరగొన్నవారు–ఒక కీర్తనపాడుడి

అనిరి

మనలను బాధించినవారు

–సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి

అని మనవలన ఉల్లాసము గోరిరి

4 అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు

పాడుదుము?

5 యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల

నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

6 నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల,

నా ముఖ్య సంతోషముకంటె

నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల

నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.

7 యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము

చేసికొనుము

యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు

తెచ్చుకొనుము.

–దానిని నాశనముచేయుడి

సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా.

8 పాడు చేయబడబోవు బబులోను కుమారీ,

నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము

చేయువాడు ధన్యుడు

9 నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు

వాడు ధన్యుడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/137-3cd79f94a318b74a907b9cf96c6426f8.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 138

దావీదు కీర్తన.

1 నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుచున్నాను

దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.

2 నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారముచేయు

చున్నాను

నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు

గొప్పచేసియున్నావు.

నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా

స్తుతులు నేను చెల్లించెదను.

3 నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి.

నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.

4 యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన

మాటలువిని

నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.

5 –యెహోవా మహా ప్రభావముగలవాడనివారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసె

దరు.

6 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను

లక్ష్యపెట్టును

ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.

7 నేను ఆపదలలో చిక్కుబడి యున్నను నీవు నన్ను

బ్రదికించెదవు

నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై

నీవు నీచేయి చాపెదవు

నీ కుడిచేయి నన్ను రక్షించును.

8 యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును.

యెహోవా, నీ కృప నిరంతరముండును

నీ చేతికార్యములను విడిచిపెట్టకుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/138-0a6d521a4b83013a6bfa2212d5988f1b.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 139

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని

యున్నావు

2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును

నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు

గ్రహించుచున్నావు.

3 నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు,

నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

4 యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే

అది నీకు పూర్తిగా తెలిసియున్నది.

5 వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు

నీ చేయి నామీద ఉంచియున్నావు.

6 ఇట్టి తెలివి నాకు మించినది

అది అగోచరము అది నాకందదు.

7 నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును?

నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?

8 నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు

నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను

ఉన్నావు

9 నేను వేకువ రెక్కలు కట్టుకొని

సముద్ర దిగంతములలో నివసించినను

10 అక్కడను నీ చేయి నన్ను నడిపించును

నీ కుడిచేయి నన్ను పట్టుకొనును

11 –అంధకారము నన్ను మరుగుచేయును

నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను

కొనినయెడల

12 చీకటియైనను నీకు చీకటి కాకపోవును

రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును

చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి

నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును

ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి

అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు

చున్నాను

నీ కార్యములు ఆశ్చర్యకరములు.

ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15 నేను రహస్యమందు పుట్టిననాడు

భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా

నిర్మింపబడిననాడు

నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు

16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను

చూచెను

నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే

నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము

లాయెను.

17 దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి

వాటి మొత్తమెంత గొప్పది.

18 వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక

కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి

నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.

19 దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు

నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.

20 వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు

మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము

చేయుదురు.

21 యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు

చున్నాను గదా?

నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను

గదా!

22 వారియందు నాకు పూర్ణద్వేషము కలదువారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను

23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము

నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

24 నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో

చూడుము

నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/139-0e8ae9143792bcc745d806f70de4215f.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 140

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి

పింపుము

బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను

కాపాడుము.

2 వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ

నలు చేయుదురువారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.

3 పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి

చేయుదురువారి పెదవులక్రింద సర్పవిషమున్నది.(సెలా.)

4 యెహోవా, భక్తిహీనులచేతిలోపడకుండ నన్ను

కాపాడుము.

బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను

రక్షింపుము.

నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే

శించుచున్నారు.

5 గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారువారు త్రోవప్రక్కను వల పరచియున్నారు.

నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు.(సెలా.)

6 అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు

చున్నాను

–యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు

చెవియొగ్గుము.

7 ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము

యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.

8 యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుమువారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన

సాగింపకుము.(సెలా.)

9 నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడలవారి పెదవుల చేటు వారిని ముంచును గాక

10 కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాకవారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు

కూల్చబడుదురుగాక

అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక

11 కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక

ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును

గాక.

12 బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు

ననియు

దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు

నేనెరుగుదును.

13 నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ

తాస్తుతులు చెల్లించెదరు

యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/140-f2847bef95de5e8a872eb9aefd140bec.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 141

దావీదు కీర్తన.

1 యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను

నాయొద్దకు త్వరపడి రమ్ము

నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము

2 నా ప్రార్థన ధూపమువలెను

నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను

నీ దృష్టికి అంగీకారములగును గాక.

3 యెహోవా, నా నోటికి కావలియుంచుము

నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.

4 పాపము చేయువారితోకూడ

నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు

నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుమువారి రుచిగల పదార్థములు నేను తినకయుందును

గాక.

5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమువారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము

నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన

చేయుచున్నాను.

6 వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడ

ద్రోయబడుదురు.

కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని

అంగీకరించుచున్నారు.

7 ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు

మాయెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి.

8 యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు

చూచుచున్నవి

నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ

కుము.

9 నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి

పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి

కాపాడుము.

10 నేను తప్పించుకొని పోవుచుండగా

భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/141-663eb00a4d30fbb23a324fae6c29a229.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 142

గుహలో నున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. దైవధ్యానము.

1 నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను.

ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను.

2 బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ

పెట్టుచున్నాను

నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొను

చున్నాను.

3 నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా

మార్గము నీకు తెలియును

నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో

చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.

4 నా కుడిప్రక్కను నిదానించి చూడుము

నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను

ఆశ్రయమేదియు నాకు దొరకలేదు

నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు.

5 యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను

నా ఆశ్రయదుర్గము నీవే

సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని

నేననుకొంటిని.

6 నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి

యొగ్గుము

నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో

నుండి నన్ను విడిపింపుము.

7 నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు

చెరసాలలోనుండి నా ప్రాణమును తప్పింపుము

అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట

చూచి

నీతిమంతులు నన్నుబట్టి అతిశయపడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/142-5ce196d20e9460640fca7b599c9e2b04.mp3?version_id=1787—