Categories
కీర్తనలు

కీర్తనలు 23

దావీదు కీర్తన.

1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు

చున్నాడు

శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.

3 నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు

తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు

చున్నాడు.

4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను

ఏ అపాయమునకు భయపడను

నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ

దండమును నన్ను ఆదరించును.

5 నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ

పరచుదువు

నూనెతో నా తల అంటియున్నావు

నా గిన్నె నిండి పొర్లుచున్నది.

6 నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా

వెంట వచ్చును

చిరకాలము యెహోవా మందిరములో నేను నివా

సము చేసెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/23-475230586fb505c3f893b8e2f83ad273.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 24

దావీదు కీర్తన.

1 భూమియు దాని సంపూర్ణతయు

లోకమును దాని నివాసులును యెహోవావే.

2 ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను

ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.

3 యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు?

ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?

4 వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు

కపటముగా ప్రమాణము చేయకయు

నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి

యుండువాడే.

5 వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును

తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.

6 ఆయన నాశ్రయించువారు

యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే.(సెలా.)

7 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి

మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన

తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.

8 మహిమగల యీ రాజు ఎవడు?

బలశౌర్యములుగల యెహోవా

యుద్ధశూరుడైన యెహోవా.

9 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి,

పురాతనమైన తలుపులారా,

మహిమగల రాజు ప్రవేశించునట్లు

మిమ్మును లేవనెత్తికొనుడి.

10 మహిమగల యీ రాజు ఎవడు?

సైన్యములకధిపతియగు యెహోవాయే.

ఆయనే యీ మహిమగల రాజు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/24-31aa58e2a45338e2919f0dee19a028d9.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 25

దావీదు కీర్తన.

1 యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి

కొనుచున్నాను.

2 నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను

నన్ను సిగ్గుపడనియ్యకుము

నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము

3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు.

హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు

నొందుదురు.

4 యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము

నీ త్రోవలను నాకు తేటపరచుము.

5 నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము

చేయుము.

నీవే నా రక్షణకర్తవైన దేవుడవు

దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.

6 యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము

నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము

అవి పూర్వమునుండి యున్నవే గదా.

7 నా బాల్యపాపములను నా అతిక్రమములను

జ్ఞాపకము చేసికొనకుము.

యెహోవా నీ కృపనుబట్టి

నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.

8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై

యున్నాడు

కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు

ఉపదేశించును.

9 న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును

తన మార్గమును దీనులకు నేర్పును.

10 ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన

శాసనములను గైకొనువారి విషయములో

యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై

యున్నవి

11 యెహోవా, నా పాపము బహు ఘోరమైనది

నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.

12 యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో

వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి

బోధించును.

13 అతని ప్రాణము నెమ్మదిగా ఉండును

అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.

14 యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు

గల వారికి తెలిసియున్నది

ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

15 నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి

యున్నది

ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.

16 నేను ఏకాకిని, బాధపడువాడను

నావైపు తిరిగి నన్ను కరుణింపుము.

17 నా హృదయవేదనలు అతివిస్తారములు

ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.

18 నా బాధను నా వేదనను కనుగొనుము

నా పాపములన్నిటిని క్షమింపుము.

19 నా శత్రువులను చూడుము, వారు అనేకులు

క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.

20 నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడ

నియ్యకుము

నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.

21 నీకొరకు నేను కనిపెట్టుచున్నాను

యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును

గాక.

22 దేవా, వారి బాధలన్నిటిలోనుండి

ఇశ్రాయేలీయులను విమోచింపుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/25-ecfc187cf9b540b9cd7263825cd3380b.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 26

దావీదు కీర్తన.

1 యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించు

చున్నాను

నాకు తీర్పు తీర్చుము

ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను

నమ్మిక యుంచియున్నాను.

2 యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం

చుము

నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో

ధించుము.

3 నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను

నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను

4 పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను

వేషధారులతో పొందుచేయను.

5 దుష్టుల సంఘము నాకు అసహ్యము

భక్తిహీనులతో సాంగత్యముచేయను

6 నిర్దోషినని నా చేతులు కడుగుకొందును

యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును.

7 అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును.

నీ ఆశ్చర్యకార్యములను వివరింతును.

8 యెహోవా, నీ నివాసమందిరమును

నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు

చున్నాను.

9 పాపులతో నా ప్రాణమును చేర్చకుము

నరహంతకులతో నా జీవమును చేర్చకుము.

10 వారి చేతిలో దుష్కార్యములు కలవువారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.

11 నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను

నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము.

12 సమభూమిలో నా పాదము నిలిపియున్నాను

సమాజములలో యెహోవాను స్తుతించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/26-ca44267606568781545f18e363d297e1.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 27

దావీదు కీర్తన.

1 యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు,

నేను ఎవరికి భయపడుదును?

యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

2 నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి

వచ్చినప్పుడు

నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి

3 నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను

నా హృదయము భయపడదు

నామీదికి యుద్ధము రేగినను

దీనిలో నేను ధైర్యము విడువకుందును.

4 యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని

దానిని నేను వెదకుచున్నాను.

యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల

యములో ధ్యానించుటకును

నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర

ములో నివసింప గోరుచున్నాను.

5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును

తన గుడారపు మాటున నన్ను దాచును

ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.

6 ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల

కంటె ఎత్తుగా నా తలయెత్తబడును.

ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు

బలులు అర్పించెదను.

నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము

చేసెదను.

7 యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము

కరుణతో నాకుత్తరమిమ్ము.

8 నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా

–యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని

నా హృదయము నీతో అనెను.

9 నీ ముఖమును నాకు దాచకుము

కోపముచేత నీ సేవకుని తోలివేయకుము.

నా సహాయుడవు నీవే

రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము

నన్ను విడువకుము

10 నా తలిదండ్రులు నన్ను విడిచినను

యెహోవా నన్ను చేరదీయును.

11 యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము.

నాకొరకు పొంచియున్నవారిని చూచి

సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.

12 అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును

నా మీదికి లేచియున్నారు.

నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము

13 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు

నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?

14 యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము

ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా

నుంచుకొనుము

యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/27-9b3d5ea5b18d6ee913e0678b95de62ca.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 28

దావీదు కీర్తన.

1 యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను

నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి

ఆలకింపుము

నీవు మౌనముగా నుండినయెడల

నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.

2 నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు

నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు

నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.

3 భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయు

నట్టు నన్ను లాగి వేయకుము.వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని

తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు

దురు

4 వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి

ప్రతికారము చేయుము.వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుమువారికి తగిన ప్రతిఫలమిమ్ము.

5 యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు

ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు

కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము

చేయును.

6 యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు

ఆయనకు స్తోత్రము కలుగును గాక.

7 యెహోవా నా ఆశ్రయము, నా కేడెము

నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక

నాకు సహాయము కలిగెను.

కావున నా హృదయము ప్రహర్షించుచున్నది

కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

8 యెహోవా తన జనులకు ఆశ్రయము

ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.

9 నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ

దింపుమువారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/28-cc73a40db81a3c2b8f429bd3208c68b2.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 29

దావీదు కీర్తన.

1 దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి

ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి

2 యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును

ఆయనకు ఆరోపించుడి

ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన

యెదుట సాగిలపడుడి.

3 యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది

మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు.

మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.

4 యెహోవా స్వరము బలమైనది

యెహోవా స్వరము ప్రభావము గలది.

5 యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును

యెహోవా లెబానోను దేవదారు వృక్షములను

ముక్కలుగా విరచును.

6 దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును

లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు

వేయునట్లు ఆయన చేయును.

7 యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప

జేయుచున్నది.

8 యెహోవా స్వరము అరణ్యమును కదలించును

యెహోవా కాదేషు అరణ్యమును కదలించును

9 యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును

అది ఆకులు రాల్చును.

ఆయన ఆలయములోనున్నవన్నియు ఆయనకే ప్రభా

వము అనుచున్నవి.

10 యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను

యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.

11 యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును

యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి

వారి నాశీర్వదించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/29-17c8aadd61072b30fc0fbf87c05e4f73.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 30

గృహప్రతిష్టాపనగానము. దావీదు కీర్తన.

1 యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో

షింపనియ్యక నీవు నన్నుద్ధరించియున్నావు

అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.

2 యెహోవా నా దేవా,

నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.

3 యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును

లేవదీసితివి

నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి.

4 యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి

ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమునుబట్టి

ఆయనను స్తుతించుడి.

5 ఆయన కోపము నిమిషమాత్రముండును

ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును.

సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను

ఉదయమున సంతోషము కలుగును.

6 –నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను

కొంటిని.

7 యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర

పరచితివి

నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత

జెందితిని

8 యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని

నా ప్రభువును బతిమాలుకొంటిని.

–నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన

ఏమి లాభము?

9 మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి

అది వివరించునా?

10 యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము

యెహోవా, నాకు సహాయుడవై యుండుము

11 నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు

నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి

యున్నావు.

12 నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము

నన్ను ధరింపజేసియున్నావు

యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించె

దను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/30-f8b9060573897435cb3bfbb3aa5453c5.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 31

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను

నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము

నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.

2 నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము

నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను

ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.

3 నా కొండ నా కోట నీవే

నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము

4 నా ఆశ్రయదుర్గము నీవే.

నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా

ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.

5 నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను

యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు

నీవే.

6 నేను యెహోవాను నమ్ముకొనియున్నాను

వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అస

హ్యులు.

7 నీవు నా బాధను దృష్టించియున్నావు

నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు

కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో

షించెదను.

8 నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు

విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

9 యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను

కరుణింపుము

విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది

నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.

10 నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను

నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి

నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది

నా యెముకలు క్షీణించుచున్నవి.

11 నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను

నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను

నా నెళవరులకు భీకరుడనై యున్నాను

వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి

పోవుదురు.

12 మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని

ఓటికుండవంటి వాడనైతిని.

13 అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు

నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారువారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది.

నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.

14 యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను

–నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.

15 నా కాలగతులు నీ వశములోనున్నవి.

నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము

నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.

16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము

నీ కృపచేత నన్ను రక్షింపుము.

17 యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు

నొందనియ్యకుము

భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందువారు మౌనులైయుందురు గాక.

18 అబద్ధికుల పెదవులు మూయబడును గాక.వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి

మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.

19 నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి

యుంచిన మేలు యెంతో గొప్పది

నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు

సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

20 మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ

సన్నిధి చాటున వారిని దాచుచున్నావు

వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచు

చున్నావు

21 ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను

ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు

ఆయన స్తుతినొందును గాక.

22 భీతిచెందినవాడనై–నీకు కనబడకుండ నేను నాశన

మైతిననుకొంటిని

అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా

నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి.

23 యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను

ప్రేమించుడి

యెహోవా విశ్వాసులను కాపాడును

గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతి

కారము చేయును.

24 యెహోవాకొరకు కనిపెట్టువారలారా,

మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/31-ccebed3583cb3cebfe19b38033900f56.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 32

దావీదు కీర్తన. దైవధ్యానము.

1 తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు

తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు

ధన్యుడు.

2 యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు

ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.

3 నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన

నా ఆర్తధ్వనివలన

నాయెముకలు క్షీణించినవి.

4 దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను

నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.(సెలా.)

5 నా దోషమును కప్పుకొనక

నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని

–యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు

కొందుననుకొంటిని.

నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.(సెలా.)

6 కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను

ప్రార్థనచేయుదురు.

విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను

నిశ్చయముగా అవి వారిమీదికి రావు.

7 నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను

రక్షించెదవు

విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు

8 నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ

మును నీకు బోధించెదను

నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను

9 బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద

వలెనైనను మీరు ఉండకుడి

అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను

కళ్లెముతోను బిగింపవలెను.

10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి

యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవ

రించుచున్నది.

11 నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి

ఉల్లసించుడి

యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము

చేయుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/32-bc1bf49574f74832a27076fdcdfccefb.mp3?version_id=1787—