Categories
కీర్తనలు

కీర్తనలు 3

అబ్షాలోమను తన కుమారుని యెదుటనుండి పారిపోయి నప్పుడు దావీదు రచించిన కీర్తన.

1 యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు

నామీదికి లేచువారు అనేకులు.

2 –దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని

నన్నుగూర్చి చెప్పువారు అనేకులు(సెలా.)

3 యెహోవా, నీవే నాకు కేడెముగాను

నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.

4 ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు

ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును.

5 యెహోవా నాకు ఆధారము,

కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును

6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ

రించినను నేను భయపడను

7 యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము

నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు

వాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.

8 రక్షణ యెహోవాది

నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక.(సెలా.)

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/3-15abd1c6bcf85bf03b3d45a2368cc3c1.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 4

ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన.

1 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము

ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే

నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

2 నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమాన

ముగా మార్చెదరు?

ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు?

ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?

3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొను

చున్నాడని తెలిసికొనుడి.

నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.

4 భయమునొంది పాపము చేయకుడి

మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో

ధ్యానము చేసికొని ఊరకుండుడి(సెలా.)

5 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను

నమ్ముకొనుడి

6 –మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.

యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.

7 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతో

షముకంటె

అధికమైన సంతోషము నీవు నా హృదయములో

పుట్టించితివి.

8 యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును

నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా

నివసింపజేయుదువు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/4-3a8b9ef608c198e9a04c21a4d4aa43e6.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 5

ప్రధాన గాయకునికి. పిల్లనగ్రోవితో పాడదగినది. దావీదు కీర్తన.

1 యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము

నా ధ్యానముమీద లక్ష్యముంచుము.

2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.

నిన్నే ప్రార్థించుచున్నాను.

3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు

వినబడును

ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి

కాచియుందును.

4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు

చెడుతనమునకునీయొద్ద చోటులేదు

5 డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు

పాపము చేయువారందరు నీకసహ్యులు

6 అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు

కపటము చూపి నరహత్య జరిగించువారు యెహో

వాకు అసహ్యులు.

7 నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో

ప్రవేశించెదను

నీయెడల భయభక్తులుకలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు

చూచి నమస్కరించెదను

8 యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టి

నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము

నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.

9 వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంట

వారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.

10 దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.

11 నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు

నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము

ఆనందధ్వని చేయుదురు.

12 యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే

కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు

కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి

ఉల్లసింతురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/5-c6af2e04ef4130cc70151ec15cc0c63b.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 6

ప్రధాన గాయకునికి. అష్టమశృతిమీద తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన.

1 యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము

నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.

2 యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను

కరుణించుము

యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను

బాగుచేయుము

3 నా ప్రాణము బహుగా అదరుచున్నది.

యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?

4 యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము

నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.

5 మరణమైనవారికి నిన్నుగూర్చిన జ్ఞాపకము లేదు

పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుదురు?

6 నేను మూలుగుచు అలసియున్నాను

ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.

నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.

7 విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి

నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.

8 యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు

పాపముచేయువారలారా, మీరందరు నాయొద్దనుండి

తొలగిపోవుడి.

9 యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు

యెహోవా నా ప్రార్థన నంగీకరించును.

10 నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/6-992303693e859ba8db7dece70201193b.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 7

బెన్యామీను వంశస్థుడైన కూషుచెప్పిన మాటల విషయమై దావీదు యెహోవానుగూర్చి పాడినది. వీణనాదసహిత గీతము.

1 యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి

యున్నాను

నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.

నన్ను తప్పించువాడెవడును లేకపోగా

2 వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ

నన్ను తప్పించుము.

3 యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసిన

యెడల

4 నాచేత పాపము జరిగినయెడల

నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడు

చేసినయెడల

5 శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము

నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము

నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము.

నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా.(సెలా.)

6 యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము

నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము

నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము

న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.

7 జనములు సమాజముగా కూడి నిన్ను

చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.

8 యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు

యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను

బట్టియు నా విషయములో

నాకు న్యాయము తీర్చుము.

9 హృదయములను అంతరింద్రియములను

పరిశీలించు నీతిగల దేవా,

10 దుష్టుల చెడుతనము మాన్పుము

నీతిగలవారిని స్థిరపరచుము

యథార్థ హృదయులను రక్షించు దేవుడే

నా కేడెమును మోయువాడై యున్నాడు.

11 న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును

ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

12 ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును

పదునుపెట్టును

తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు

13 వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు

తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు

14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన

పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్ధమును కనియున్నాడు.

15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు

తాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.

16 వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును

వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.

17 యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను

సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/7-3fbee243371aa14d4e9ea05e2247006a.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 8

ప్రధానగాయకునికి. గిత్తీత్ రాగమునుబట్టి పాడతగినది. దావీదు కీర్తన.

1 యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహి

మను కనుపరచువాడా,

భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము

గలది.

2 శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై

నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి

పిల్లలయొక్కయు స్తుతుల మూలమున

నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు.

3 నీ చేతిపనియైన నీ ఆకాశములను

నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా

4 నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి

వాడు?

నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?

5 దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసి

యున్నావు.

మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి

యున్నావు.

6 నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు.

7 గొఱ్ఱెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని

అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర

మత్స్యములను

8 సముద్రమార్గములలో సంచరించువాటినన్నిటిని

వాని పాదములక్రింద నీవు ఉంచియున్నావు.

9 యెహోవా మా ప్రభువా

భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము

గలది!

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/8-fa81617722d6174a0375a73d3e8dc2a1.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 9

ప్రధానగాయకునికి. ముత్లబ్బేను అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.

1 నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను

స్తుతించెదను

యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ

రించెదను.

2 మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి

హర్షించుచున్నాను

నీ నామమును కీర్తించెదను.

3 నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము

తీర్చుచున్నావు

నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు

తీర్చుచున్నావు

4 కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురు

నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.

5 నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను

నశింపజేసి యున్నావు

వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టి

యున్నావు.

6 శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ

నిర్మూలమైరి

నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండ

బొత్తిగా నశించెను.

7 యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై

యున్నాడు.

న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును

స్థాపించియున్నాడు.

8 యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును

యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.

9 నలిగినవారికి తాను మహా దుర్గమగును

ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును

10 యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి

పెట్టువాడవు కావు

కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు

11 సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి

ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.

12 ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు

బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును

వారి మొఱ్ఱను ఆయన మరువడు.

13 నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు

సీయోను కుమార్తె గుమ్మములలో

నీ రక్షణనుబట్టి హర్షించునట్లు

యెహోవా, నన్ను కరుణించుము.

14 మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించు

వాడా,

నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను

చూడుము.

15 తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి.

తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

16 యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి

యున్నాడు.

దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.)

17 దుష్టులును దేవుని మరచు జనులందరును

పాతాళమునకు దిగిపోవుదురు.

18 దరిద్రులు నిత్యము మరువబడరు

బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని

నశించదు.

19 యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక

నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.

20 యెహోవా, వారిని భయపెట్టుము

తాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక.(సెలా.)

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/9-bf72dcc8a0956c476729eb1a5bd6edf9.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 10

1 యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచు

చున్నావు?

ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు?

2 దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కు

కొందురు గాక

3 దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు

లోభులుయెహోవాను తిరస్కరింతురు

4 దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను

కొందురు

దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

5 వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు

నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అంద

కుండును.వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరిం

తురు.

6 –మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము

అని వారు తమ హృదయములలో అనుకొందురు

7 వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను

నిండియున్నది

వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

8 తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచి

యుందురు

చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు

వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి

చూచును.

9 గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో

పొంచి యుందురు

బాధపడువారిని పట్టుకొన పొంచి యుందురు

బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.

10 కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు.

11 –దేవుడు మరచిపోయెను

ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అనివారు తమ హృదయములలో అనుకొందురు.

12 యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువక

నీ చెయ్యి యెత్తుము

13 దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ

చేయవని వారు తమ హృదయములలో అను

కొనుటయేల?

14 నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతి

కారము చేయుటకై

నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు

నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు

తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు

15 దుష్టుల భుజమును విరుగగొట్టుము

చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు

దానిని గూర్చి విచారణ చేయుము.

16 యెహోవా నిరంతరము రాజై యున్నాడు

ఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి.

17 యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు

నట్లు

బాధపడువారి కోరికను నీవు విని యున్నావు

18 తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై

నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/10-0b63d63375cc1b0e33c17b0267bf91bc.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 11

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా శరణుజొచ్చియున్నాను

–పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము

అని మీరు నాతో చెప్పుట యేల?

2 దుష్టులు విల్లెక్కుపెట్టి యున్నారు

చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై

తమ బాణములు నారియందు సంధించియున్నారు

3 పునాదులు పాడైపోగా

నీతిమంతులేమి చేయగలరు?

4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు

యెహోవా సింహాసనము ఆకాశమందున్నది

ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు

తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

5 యెహోవా నీతిమంతులను పరిశీలించును

దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అస

హ్యులు,

6 దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును

అగ్నిగంధకములును వడగాలియువారి పానీయభాగమగును.

7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు

వాడు

యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/11-78ab34004580c254b4c88d0c175d9b46.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 12

ప్రధానగాయకునికి. అష్టమశ్రుతిమీద పాడదగినది. దావీదు కీర్తన.

1 యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి

విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.

2 అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు

మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు

పెదవులతో పలుకుదురు.

3 యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని

బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.

4 –మా నాలుకలచేత మేము సాధించెదము

మా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను

కొందురు.

5 –బాధపడువారికి చేయబడిన బలాత్కారమును

బట్టియు

దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను

రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను

అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

6 యెహోవా మాటలు పవిత్రమైనవి

అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి

యంత పవిత్రములు.

7 యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు

ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు.

8 నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు

దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/12-ad56172f2fa9fa461984aa96281020b2.mp3?version_id=1787—