Categories
యోబు

యోబు 25

1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యు

త్తరమిచ్చెను–

2 అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి

ఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగ

జేయును.

3 ఆయన సేనలను లెక్కింప శక్యమా?

ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?

4 నరుడు దేవునిదృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?

స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు

కాగలడు?

5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు

నక్షత్రములు పవిత్రమైనవి కావు.

6 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు

పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/25-1edde2b5dbf9050d335cf18244d202f0.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 26

1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–

2 శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి?

బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?

3 జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి?

సంగతిని ఎంత చక్కగా వివరించితివి?

4 నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి?

ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?

5 జలములక్రిందను వాటి నివాసులక్రిందనుఉండు

ప్రేతలు విలవిలలాడుదురు.

6 ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది

నాశనకూపము బట్టబయలుగా నున్నది.

7 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ

విశాలమును ఆయన పరచెను

శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.

8 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ

ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.

9 దానిమీద మేఘమును వ్యాపింపజేసి

ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.

10 వెలుగు చీకటుల సరిహద్దులవరకు

ఆయన జలములకు హద్దు నియమించెను.

11 ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ

మొంది అదరును

12 తన బలమువలన ఆయన సముద్రమును రేపును

తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.

13 ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు

అందమువచ్చును.

ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.

14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.

ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి

మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.

గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/26-5f8473cb1023bb1d935392a7c241c774.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 27

1 యూబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను–

2 నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను

బట్టియు

దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను

బట్టియు

3 నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు

నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు

4 నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు

నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.

5 మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను

మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను

విడువను.

6 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును

నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము

నన్ను నిందింపదు.

7 నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక

నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక.

8 దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము

తీసివేయునప్పుడు

భక్తిహీనునికి ఆధారమేది?

9 వానికి బాధ కలుగునప్పుడు

దేవుడు వాని మొఱ్ఱ వినునా?

10 వాడు సర్వశక్తునియందు ఆనందించునా?

వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన

చేయునా?

11 దేవుని హస్తమునుగూర్చి నేను మీకు ఉపదేశించెదను

సర్వశక్తుడుచేయు క్రియలను నేను దాచిపెట్టను.

12 మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు

మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు

చుందురు?

13 దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది

ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము

14 వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత

పడుటకే గదావారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.

15 వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట

బడెదరువారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

16 ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను

జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ

పరచుకొనినను

17 వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు

దాని కట్టుకొనెదరు

నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.

18 పురుగుల గూళ్లవంటి యిండ్లువారు కట్టుకొందురు

కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లువారు

కట్టుకొందురు.

19 వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల

లేవరు

కన్నులు తెరవగానే లేకపోవుదురు.

20 భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు

కొనును

రాత్రివేళ తుపాను వారిని ఎత్తికొనిపోవును.

21 తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవుదురు

అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును

22 ఏమియు కరుణ చూపకుండ

దేవుడు వారిమీద బాణములు వేయునువారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు

అటు పారిపోవుదురు.

23 మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురువారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/27-e533759c750eef1ccbf9b04fec2a5eff.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 28

1 వెండికి గని గలదు

పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.

2 ఇనుమును మంటిలోనుండి తీయుదురు

రాళ్లు కరగించి రాగి తీయుదురు.

3 మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు

గాఢాంధకారములోను మరణాంధకారములోను

ఉండు రత్నములను వెదకుచువారు భూమ్యంతములవరకు సంచరింతురు.

4 జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు

సొరంగము త్రవ్వుదురువారు పైసంచరించువారిచేత మరువబడుదురు

అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు

అటు అల్లాడుచుందురు.

5 భూమినుండి ఆహారము పుట్టును

దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.

6 దాని రాళ్లు నీలరత్నములకు స్థానము

దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.

7 ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు

డేగ కన్నులు దాని చూడలేదు

8 గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు.

సింహము ఆ మార్గమున నడవలేదు

9 మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు

పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల

ద్రోయుదురు.

10 బండలలో వారు బాటలు కొట్టుదురువారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.

11 నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టుదురు

మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు

12 అయితే జ్ఞానము ఎక్కడ దొరకును?

వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?

13 నరులు దాని విలువను ఎరుగరు

ప్రాణులున్న దేశములో అది దొరకదు.

14 అగాధము–అది నాలో లేదనును

సముద్రము–నాయొద్ద లేదనును.

15 సువర్ణము దానికి సాటియైనది కాదు

దాని విలువకొరకై వెండి తూచరాదు.

16 అది ఓఫీరు బంగారమునకైనను

విలువగల గోమేధికమునకైనను

నీలమునకైనను కొనబడునది కాదు.

17 సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు

ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.

18 పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట

ఎత్తనేకూడదు.

జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది

19 కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు.

శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.

20 అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును?

వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?

21 అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది

ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.

22 మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన

మును మరణమును అనును.

23 దేవుడే దాని మార్గమును గ్రహించును

దాని స్థలము ఆయనకే తెలియును.

24 ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు.

ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.

25 గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు

ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన

వాటిని కొలిచి చూచినప్పుడు

26 వర్షమునకు కట్టడ నియమించినప్పుడు

ఉరుముతోకూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు

27 ఆయన దాని చూచి బయలుపరచెను

దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.

28 మరియు–యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన

మనియు

దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన

నరులకు సెలవిచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/28-e329b30394cf74e65da91e89ba16c825.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 29

1 యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను–

2 పూర్వకాలముననున్నట్లు నేనున్నయెడల ఎంతో

మేలు

దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు

నేనున్నయెడల ఎంతో మేలు

3 అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను

ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు

చుంటిని.

4 నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల

ఎంతో మేలు

అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగానుండెను.

5 సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను

నా పిల్లలు నా చుట్టునుండిరి

6 నేను పెట్టిన అడుగెల్ల నేతిలోపడెను

బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా

పారెను.

7 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు

రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు

8 యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి

ముసలివారు లేచి నిలువబడిరి.

9 అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యి

వేసికొనిరి.

10 ప్రధానులు మాటలాడక ఊరకొనిరివారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.

11 నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట

వంతునిగా ఎంచెను.

నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్య

మిచ్చెను.

12 ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను

తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి

పించితిని.

13 నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి

వచ్చెను

విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని

14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని

గనుక అది నన్ను ధరించెను

నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు

ఆయెను.

15 గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని.

16 దరిద్రులకు తండ్రిగా ఉంటిని

ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచా

రించితిని.

17 దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని.వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.

18 అప్పుడు నేనిట్లనుకొంటిని–నా గూటియొద్దనే నేను

చచ్చెదను

హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.

19 నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును

మంచు నా కొమ్మలమీద నిలుచును.

20 నాకు ఎడతెగని ఘనత కలుగును

నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.

21 మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి

నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.

22 నేను మాటలాడిన తరువాత వారు మారుమాట

పలుకకుండిరి.

గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.

23 వర్షముకొరకు కనిపెట్టునట్లువారు నాకొరకు కని

పెట్టుకొనిరి

కడవరి వానకొరకైనట్లువారు వెడల్పుగా నోరు

తెరచుకొనిరి.

24 వారు ఆశారహితులై యుండగా వారిని దయగా

చూచి చిరునవ్వు నవ్వితిని

నా ముఖప్రకాశములేకుండ వారేమియు చేయరైరి.

25 నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను

ఏర్పరచితిని

సేనలో రాజువలెను

దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/29-1d052c4440a1627d2fe0ac2389a834f7.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 30

1 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు

నన్ను ఎగతాళి చేయుదురు.

వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో

నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.

2 వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును?వారి పౌరుషము పోయినది.

3 దారిద్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై

ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య

ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు

తిరుగులాడుదురు

4 వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు

తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.

5 వారు నరులమధ్యనుండి తరిమివేయబడినవారు

దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులువారిని తరుముచు కేకలు వేయుదురు.

భయంకరమైన లోయలలోను

6 నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర

ముండవలసి వచ్చెను.

7 తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు

ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.

8 వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని

పుట్టినవారువారు దేశములోనుండి తరుమబడినవారు.

9 అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు

నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.

10 వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి

దూరముగా పోవుదురు

నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు

11 ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను

కావునవారు నాకు లోబడక కళ్లెము వదలించు

కొందురు.

12 నా కుడిప్రక్కను అల్లరిమూక లేచునువారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు

పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన

ప్రయత్నములను నామీద సాగింతురు.

13 వారు నిరాధారులైనను

నా మార్గమును పాడుచేయుదురు

నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ

జేయుదురు

14 గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లువారు

వచ్చెదరు

ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.

15 భీకరమైనవి నామీద పడెను

గాలి కొట్టివేయునట్లువారు నా ప్రభావమును కొట్టి

వేయుదురు

మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.

16 నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది

ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి

17 రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు

నట్లున్నవి

నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.

18 మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును

మెడచుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను

ఇరికించుచున్నది.

19 ఆయన నన్ను బురదలోనికి త్రోసెను

నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.

20 నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర

మేమియు నియ్యకున్నావు

నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.

21 నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి

నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు

22 గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని

పోజేయుచున్నావు

తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు

23 మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత

సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని

నాకు తెలియును.

24 ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా?

ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా?

25 బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?

దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా?

26 నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు

కీడు సంభవించెను

వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.

27 నా పేగులు మానక మండుచున్నవి

అపాయదినములు నన్నెదుర్కొనెను.

28 సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను

సంచరించుచున్నాను

సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.

29 నేను నక్కలకు సోదరుడనైతిని

నిప్పుకోళ్ల జతకాడనైతిని.

30 నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది

కాకవలన నా యెముకలు కాగిపోయెను.

నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది

నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/30-a15395399b40d54a2cb8efedef0c1e96.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 31

1 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని

కన్యకను నేనేలాగు చూచుదును?

2 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ

యేమగును?

ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?

3 దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా

పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.

4 ఆయన నా ప్రవర్తన నెరుగును గదా

నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా

5 అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల

మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల

6 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి

కొనునట్లు

7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక.

నేను త్రోవవిడిచి నడచినయెడల

నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన

యెడల

మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల

8 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక

నేను నాటినది పెరికివేయబడును గాక.

9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల

నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న

యెడల

10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక

ఇతరులు ఆమెను కూడుదురు గాక.

11 అది దుష్కామకార్యము

అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము

12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము

అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.

13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె

మాడగా

నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును?

ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి

ప్రత్యుత్తరమిత్తును?

15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడ పుట్టింపలేదా?

గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను

విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను

17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె

మైనను తిననియ్యక

నేను ఒంటరిగా భోజనముచేసినయెడలను

18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను

బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

19 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలనువారు నా గొఱ్ఱెలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన

యెడలను

20 గుమ్మములో సహాయము దొరకుననుకొనిన

తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక

నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని

దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి

నాయొద్ద పెరిగెను.

నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని

వానికి నేను మార్గదర్శినైతిని.

23 దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు

ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.

24 సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను

–నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో

నేను చెప్పినయెడలను

25 నా ఆస్తి గొప్పదని గాని

నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను

సంతోషించినయెడలను

26 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని

చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా

అతనినేగాని చూచి

27 నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడివారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను

పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును.

28 అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర

మగును.

29 నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను

సంతోషించినయెడలను

అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించినయెడలను

30 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను

శపించలేదు

పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనేలేదు.

31 –అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని

చూపింపగలవారెవరని

నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను

32 పరదేశిని వీధిలో ఉండనియ్యక

నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.

33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని

34 మహా సమూహమునకు భయపడియు

కుటుంబముల తిరస్కారమునకు జడిసియు

నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక

రొమ్ములో నా పాపమును కప్పుకొనినయెడల

పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును

35 నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో

కోరుచున్నాను;

ఇదిగో నా చేవ్రాలు గురుతు.

ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు

నాకుత్తరమిచ్చును గాక.

36 నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి

కొందును

నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.

37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు

వలె నేనాయనయొద్దకు వెళ్లెదను.

38 నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను

దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల

39 క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను

దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన

యెడలను

40 గోధుమలకు ప్రతిగా ముళ్లును

యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక.

యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/31-f08dc52f33b0f7ba2f67c428e50fdc9b.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 32

1 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.

2 అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతనిమీద బహుగా కోపగించెను.

3 మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.

4 వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.

5 అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.

6 కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను–

నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు

ఆ హేతువుచేతను నేను భయపడి నా తాత్పర్యము

మీకు తెలుపుటకు తెగింపలేదు.

7 వృద్ధాప్యము మాటలాడదగును

అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని

నేననుకొంటిని;

8 అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది

సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ

జేయును.

9 వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు

బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.

10 కావున నేను–నా మాట నంగీకరించుడని మనవి చేసికొనుచున్నాను.

నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.

11 ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా

నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని

మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

12 మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని

అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు

ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.

13 కావున–మాకు జ్ఞానము లభించినదనియు

దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు

పలుకకూడదు.

14 అతడు నాతో వాదమాడలేదు

మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర

మియ్యను.

15 వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు

పలుకుటకు వారికి మాటయొకటియులేదు.

16 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారువారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?

17 నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను

నేనును నా తాత్పర్యము తెలిపెదను.

18 నా మనస్సునిండ మాటలున్నవి

నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది.

19 నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె

నున్నది

క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా

నున్నది.

20 నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను

నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.

21 మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష

పాతినై యుండను.

నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను

22 ముఖస్తుతి చేయుట నా చేత కాదు

అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను

శీఘ్రముగా నిర్మూలము చేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/32-61b77ed033236907b9762c19dcfad8a9.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 33

1 యోబూ, దయచేసి నా వాదము నాలకించుము

నా మాటలన్నియు చెవిని బెట్టుము.

2 ఇదిగో నేను మాటలాడ నారంభించితిని

నా నోట నా నాలుక ఆడుచున్నది.

3 నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి

నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.

4 దేవుని ఆత్మ నన్ను సృజించెను

సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను

5 నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము

నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె

మాడుము.

6 దేవునియెడల నేనును నీవంటివాడను

నేనును జిగటమంటితో చేయబడినవాడనే

7 నావలని భయము నిన్ను బెదరించదు

నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.

8 నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను

నీ మాటల ధ్వని నాకు వినబడెను.

9 ఏమనగా–నేను నేరములేని పవిత్రుడను

మాలిన్యములేని పాపరహితుడను.

10 ఆయన నామీద తప్పులు పెట్టించుటకు సమయము

వెదకుచున్నాడు

నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.

11 ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు.

నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను

చున్నావు.

12 ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు

నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.

13 తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తర

మియ్యడు

దేవుడు నరులశక్తికి మించినవాడు, నీవేల ఆయనతో

పోరాడుదువు?

14 దేవుడు ఒక్కమారే పలుకును

రెండు మారులు పలుకును

అయితే మనుష్యులు అది కనిపెట్టరు

15 మంచముమీదకునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు

కలలో రాత్రి కలుగు స్వప్నములలో

16-18 –నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు

తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు

గోతికి పోకుండ వారిని కాపాడునట్లు

కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు

ఆయన వారి చెవులను తెరవచేయునువారికొరకు ఉపదేశము సిద్ధపరచును.

19 వ్యాధిచేత మంచమెక్కుటవలనను

ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట

వలనను వాడు శిక్షణము నొందును

20 రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును

21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును

బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు

కొని వచ్చును

22 వాడు సమాధికి సమీపించును

వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.

23 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ

జేయుటకు

వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్య

వర్తియైయుండినయెడల

24 దేవుడు వానియందు కరుణ జూపి–

పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును

ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.

25 అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును.

వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.

26 వాడు దేవుని బతిమాలుకొనినయెడల

ఆయన వానిని కటాక్షించును

కావునవాడు ఆయన ముఖము చూచి సంతోషిం

చును

ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.

27 అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు

ఇట్లని పలుకును–

యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము

చేసితిని

అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ

లేదు

28 కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన

విమోచించియున్నాడు

నా జీవము వెలుగును చూచుచున్నది.

29-30 ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత

వెలిగింపబడునట్లు

కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని

మానవులకొరకు రెండు సారులు మూడు సారులు

ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.

31 యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము

మౌనముగా నుండుము నేను మాటలాడెదను.

32 చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో

ప్రత్యుత్తరము చెప్పుము

మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు

చున్నాను.

33 మాట యేమియు లేనియెడల నీవు నా మాట

ఆలకింపుము

మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించె

దను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/33-986ea937182f01e35cb31c8d8d54ef83.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 34

1 అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను

2 –జ్ఞానులారా, నా మాటలు వినుడి

అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి

3 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు

చెవి మాటలను పరీక్షించును.

4 న్యాయమైనదేదో విచారించి చూతము రండి

మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి

కొందము రండి.

5 –నేను నీతిమంతుడను

దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

6 న్యాయవంతుడనైయుండియు నేను అబద్ధికునిగా

ఎంచబడుచున్నాను

నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని

గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.

7 యోబువంటి మానవుడెవడు?

అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానము

చేయుచున్నాడు.

8 అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను

భక్తిహీనులకు సహవాసి ఆయెను.

9 –నరులు దేవునితో సహవాసము చేయుటవారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు

చెప్పుకొనుచున్నాడు.

10 విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి

దేవుడు అన్యాయము చేయుట అసంభవము.

సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

11 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి

కిచ్చును

అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల

మిచ్చును.

12 దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు

సర్వశక్తుడు న్యాయము తప్పడు.

13 ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా?

ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?

14 ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనినయెడల

తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనినయెడల

15 శరీరులందరు ఏకముగా నశించెదరు

నరులు మరల ధూళియై పోవుదురు.

16 కావున దీని విని వివేచించుము

నా మాటల నాలకింపుము.

17 న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా?

న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా?

18 నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను

మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?

19 రాజులయెడల పక్షపాతము చూపనివానితోను

బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని

తోను ఆలాగు పలుకుట తగునా?

వారందరు ఆయన నిర్మించినవారు కారా?

20 వారు నిమిషములో చనిపోవుదురు

మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు

బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.

21 ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది

ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.

22 దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు

చీకటియైనను మరణాంధకారమైననులేదు.

23 ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు

బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి

అగత్యములేదు.

24 విచారణలేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము

చేయుచున్నాడువారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.

25 వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు

రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు

నలుగగొట్టబడుదురు.

26 దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.

27 ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి

ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.

28 బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి

దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.

29 ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింపగలవాడెవడు?

ఆయన తన ముఖమును దాచుకొనినయెడల

ఆయనను చూడగలవాడెవడు?

అది అనేకులనుగూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన

దైనను ఒకటే

30 భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లువారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు

లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు

31 ఒకడు–నేను శిక్షనొందితిని

నేను ఇకను పాపము చేయను

32 నాకు తెలియనిదానిని నాకు నేర్పుము

నేను దుష్కార్యము చేసియున్నయెడల ఇకను చేయనని

దేవునితో చెప్పునా?

33 నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా?

లేనియెడల నీవుందువా?

నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన

దానిని పలుకుము.

34 వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు

నాతో నీలాగు పలుకుదురు–

35 యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు.

అతని మాటలు బుద్ధిహీనమైనవి

36 దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున

అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో

కోరుచున్నాను.

37 అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు

కొనుచున్నాడు

మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు

పెంచుచున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/34-8a636d4f72be3200a7e566b6b088f944.mp3?version_id=1787—