Categories
యోబు

యోబు 15

1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున

ప్రత్యుత్తరమిచ్చెను–

2 జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తర

మియ్యదగునా?

తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా?

3 వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా?

నిష్‌ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?

4 నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు.

దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.

5 నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది.

వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

6 నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి

నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.

7 మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?

నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?

8 నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా?

నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

9 మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు?

మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?

10 నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు

మీరిన పురుషులును మాలో నున్నారు

నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.

11 దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా?

ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము

తేలికగా నున్నదా?

12 నీ హృదయము ఏల క్రుంగిపోయెను?

నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?

13 దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు?

నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?

14 శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు?

నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15 ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మిక

యుంచడు.

ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

16 అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు

త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి

అపవిత్రుడు గదా.

17 నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును

నేను చూచినదానిని నీకు వివరించెదను.

18 జ్ఞానులు తమపితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక

చెప్పిన బోధను నీకు తెలిపెదను.

19 అన్యులతో సహవాసము చేయక

తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన

జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

20 తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును

హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు

బాధనొందును.

21 భీకరమైన ధ్వనులు వాని చెవులలోబడును, క్షేమ

కాలమున పాడుచేయువారు వాని మీదికి

వచ్చెదరు.

22 తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు

వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.

23 అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు

తిరుగులాడును.

అంధకారదినము సమీపించుచున్నదని వానికి

తెలియును.

24 శ్రమయు వేదనయు వానిని బెదరించును.

యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని

పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనును.

25 వాడు దేవునిమీదికి చేయి చాపును

సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.

26 మూర్ఖుడై ఆయనను మార్కొనును

తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.

27 వాని ముఖము క్రొవ్వు పెట్టియున్నది

వాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగి

యున్నవి.

28 అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు

ఎవరును నివసింపకూడని యిండ్లలో

దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు

29 కావునవారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి

నిలువదు.వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు

30 వారు చీకటిని తప్పించుకొనరు

అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును

దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.

31 వారు మాయను నమ్ముకొనకుందురు గాక; వారు మోసపోయినవారు

మాయయే వారికి ఫలమగును.

32 వారి కాలము రాకముందే అది జరుగును

అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.

33 ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని

రాల్చును.

ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని

రాల్చును.

34 భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును.

లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

35 వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము

కందురువారి కడుపున కపటము పుట్టును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/15-ba2b6ab39f8d2d638db248199b6fb76f.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 16

1 అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–

2 ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను

మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.

3 ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?

నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?

4 నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాట

లాడవచ్చును.

నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును

మీవైపు చూచి నా తల ఆడింపవచ్చును.

5 అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల

పరచుదును

నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును

6 నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు

నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును?

7 ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి

యున్నాడు

నా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు

8 నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు.

ఇది కూడ నామీద సాక్ష్యముగా నున్నది

నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.

9 ఆయన తన కోపముచేత నామీదపడి నన్ను చీల్చెను.

ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను

నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

10 జనులు నామీద తమ నోరు తెరతురు

నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు.వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు

11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు

భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.

12 నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను

ముక్కలు చెక్కలు చేసియున్నాడు

మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా

చేసియున్నాడు.

తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

13 ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి

కనికరములేక నా తుండ్లను పొడిచెను

నా పైత్యరసమును నేలను పారబోసెను.

14 కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగ

గొట్టెను

పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.

15 నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని

నా కొమ్మును ధూళితో మురికిచేసితిని.

16 నాచేత బలాత్కారము జరుగకపోయినను

నా ప్రార్థన యథార్థముగా నుండినను

17 ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది

నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.

18 భూమీ, నా రక్తమును కప్పివేయకుము

నా మొఱ్ఱకు విరామము కలుగకుండునుగాక.

19 ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములో

నున్నాడు

నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమం

దున్నాడు.

20 నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు.

నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడ

వలెననియు

21 నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యె

మాడవలెననియు కోరి

నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహ

ముగా విడుచుచున్నాను.

22 కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని

మార్గమున నేను వెళ్లుదును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/16-7524c7d827898c8cc1638e62165e96ec.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 17

1 నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను .

సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.

2 ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగా

నున్నవి.

3 ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ

అంతట నీవే పూటపడుము

మరి యెవడు నా నిమిత్తము పూటపడును?

4 నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి

కావున నీవు వారిని హెచ్చింపవు.

5 ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో

వాని పిల్లల కన్నులు క్షీణించును.

6 ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి

యున్నాడు

నలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.

7 నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను

నా అవయవములన్నియు నీడవలె ఆయెను

8 యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు

నిర్దోషులు భక్తిహీనులస్థితి చూచి కలవరపడుదురు.

9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక

ప్రవర్తించుదురు

నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

10 మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడి

మీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.

11 నా దినములు గతించెను

నా యోచన నిరర్థకమాయెను

నా హృదయ వాంఛ భంగమాయెను.

12 రాత్రి పగలనియు

చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.

13 ఆశ యేదైన నాకుండినయెడల పాతాళము నాకు

ఇల్లు అను ఆశయే.

చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను

14 –నీవు నాకు తండ్రివని గోతితోను

నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను

మనవి చేయుచున్నాను.

15 నాకు నిరీక్షణాధారమేది?

నా నిరీక్షణ యెవనికి కనబడును?

16 ధూళిలో విశ్రాంతి దొరకగా

అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/17-0640e2ca58b6337e6568f9734909b243.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 18

1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను–

2 మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు?

మీరు ఆలోచనచేసి ముగించినయెడల మేము మాటలాడెదము.

3 మీ దృష్టికి మృగములుగాను

మూఢులుగాను మేమెంచబడుట ఏల?

4 కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా,

నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?

నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?

5 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.

6 వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును

7 వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును.

8 వారు వాగురలమీద నడచువారు

తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.

9 బోను వారి మడిమెను పట్టుకొనును

వల వారిని చిక్కించుకొనును.

10 వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.

11 నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగ

జేయును

భయములు వారిని వెంటాడి తరుమును.

12 వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును.

13 అది వారి దేహ అవయవములను భక్షించును

మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.

14 వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికి

వేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.

15 వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము

చేయుదురు

16 వారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.

క్రింద వారి వేళ్లు ఎండిపోవును

పైన వారి కొమ్మలు నరకబడును.

17 భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు

మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.

18 జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు

భూలోకములోనుండి వారిని తరుముదురు.

19 వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను

ఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు

ఒకడైనను ఉండడు.

20 తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచి

విస్మయమొందుదురు

పూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.

21 నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి

పట్టును

దేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/18-35df0504eba1b3bfb4af04540c13d7c8.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 19

1 అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను–

2 ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?

ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?

3 పదిమారులు మీరు నన్ను నిందించితిరి

సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

4 నేను తప్పుచేసినయెడల

నా తప్పు నా మీదికే వచ్చును గదా?

5 మిమ్మును మీరు నామీద హెచ్చించుకొందురా?

నా నేరము నామీద మీరు మోపుదురా?

6 ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు

తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు

తెలిసికొనుడి.

7 నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను

మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీక

రింపబడదు

సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని

న్యాయము దొరకదు.

8 నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు.

నా త్రోవలను చీకటి చేసియున్నాడు

9 ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు

తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.

10 నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని

ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణా

ధారమును పెల్లగించెను.

11 ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను

నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.

12 ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరి

నా గుడారముచుట్టు దిగిరి.

13 ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసి

యున్నాడు

నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.

14 నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు

నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.

15 నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా

ఎంచెదరు

నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.

16 నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండ

నున్నాడు

నేను వాని బతిమాలవలసి వచ్చెను.

17 నా ఊపిరి నా భార్యకు అసహ్యము

నేనుకనిన కుమారులకు నా వాసన అసహ్యము.

18 చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు

నేను లేచుట చూచినయెడల బాలురు నామీద

దూషణలు పలికెదరు.

19 నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని

నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.

20 నా యెముకలు నా చర్మముతోను నా మాంసము

తోను అంటుకొని యున్నవి

దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడియున్నది

21 దేవుని హస్తము నన్ను మొత్తియున్నది

నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద

జాలిపడుడి.

22 నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక

దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?

23 నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరు

చున్నాను.

అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో

కోరుచున్నాను.

24 అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీస

ముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో

కోరుచున్నాను.

25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత

ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీర

ముతోనేను దేవుని చూచెదను.

27 నామట్టుకు నేనే చూచెదను.

మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను

చూచెదను

నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి

28 జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని

మీరు–మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచినయెడల

29 మీరు ఖడ్గమునకు భయపడుడి

తీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన

దోషములకు శిక్ష నియమింపబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/19-6660c37b7e3f4f2b3ff40f56343c30b4.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 20

1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున

ప్రత్యుత్తరమిచ్చెను–

2 ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత

తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

3 నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు

నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి

యున్నది.

4 దుష్టులకు విజయము కొద్దికాలముండును

భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును.

5 ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము

మొదలుకొని

ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

6 వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను

మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

7 తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ

నశించుదురు.వారిని చూచినవారు–వారేమైరని యడుగుదురు.

8 కల యెగసిపోవునట్లువారు గతించి కనబడక పోవుదురు

రాత్రి స్వప్నము దాటిపోవునట్లువారు తరిమి వేయ

బడుదురు.

9 వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమునవారు మరి ఎప్పుడును కనబడరు

10 వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.

11 వారి యెముకలలో యౌవనబలము నిండియుండునుగాని

అదియు వారితోకూడ మంటిలో పండుకొనును.

12 చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.

13 దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దాని

నుంచుకొనిరి.

14 అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును

అది వారిలోపట నాగుపాముల విషమగును.

15 వారు ధనమును మ్రింగివేసిరి గాని యిప్పుడు దానిని

మరల కక్కివేయుదురు.

వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.

16 వారు కట్లపాముల విషమును పీల్చుదురు

నాగుపాము నాలుక వారిని చంపును.

17 ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.

18 దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో

దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు

19 వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించు

కొనినను దానిని కట్టి పూర్తిచేయరు.

20 వారు ఎడతెగక ఆశించినవారు

తమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మును

తాము రక్షించుకొనజాలరు.

21 వారు మ్రింగివేయనిది ఒకటియు లేదు గనుక వారి

క్షేమస్థితి నిలువదు.

22 వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమునవారు ఇబ్బందిపడుదురు

దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికి

వచ్చును.

23 వారు కడుపు నింపుకొననైయుండగా

దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును.

24 ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారి

పోగా

ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.

25 అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును

అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు

తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.

26 వారి ధననిధులు అంధకారపూర్ణములగును

ఊదనక్కరలేని అగ్ని వారిని మ్రింగివేయును

వారి గుడారములో మిగిలినదానిని అది కాల్చి

వేయును.

27 ఆకాశము వారి దోషమును బయలుపరచును

భూమి వారిమీదికి లేచును.

28 వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును

దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.

29 ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము

దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/20-4820db96f1a0959d77faaa172ba70fda.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 21

1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–

2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడి

నా మాట మీ ఆదరణమాటకు ప్రతిగా నుండుగాక.

3 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను

నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము

చేయవచ్చును.

4 నేను మనుష్యునిగురించిమొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు

గనుక నేను ఏల ఆతురపడకూడదు?

5 నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి

నోటిమీద చేయి వేసికొనుడి.

6 నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకే

మియు తోచకున్నది

నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.

7 భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?

8 వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచ

బడుచున్నది.

9 వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా

నున్నవి

దేవుని దండము వారిమీద పడుటలేదు.

10 వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.

11 వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి

పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు.

12 తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు

సానికనాదము విని సంతోషించుదురు.

13 వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు

ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.

14 వారు–నీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదు

నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.

15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?

మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి

లాభము కలుగును? అని వారు చెప్పుదురు

16 వారి క్షేమము వారి చేతిలో లేదు

భక్తిహీనుల యోచన నాకు దూరముగానుండును గాక.

17 భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.

18 వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను

గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు

ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు

గదా.

19 వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును

దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారు

చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే

ప్రతిఫలమిచ్చును గాక

20 వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక

సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురు

గాక.

తమ జీవితకాలము సమాప్తమైన తరువాత

21 తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి

చింత ఏమి?

22 ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?

పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

23 ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను

తన యెముకలలో మూలుగ బలిసియుండగను

24 సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు

ఆయుష్యముతో మృతినొందును

25 వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనో

దుఃఖముగలవాడై మృతినొందును.

26 వారు సమానముగ మంటిలో పండుకొందురు పురు

గులు వారిద్దరిని కప్పును.

27 మీ తలంపులు నేనెరుగుదును

మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నా

గములు నాకు తెలిసినవి.

28 –అధిపతులమందిరము ఎక్కడ నున్నది?

భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది

అని మీరడుగుచున్నారే.

29 దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట

లేదా?

30 అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడ

బడుదురు

ఉగ్రతదినమందువారు తోడుకొని పోబడుదురు.

31 వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాట

లనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారముచేయు

వాడెవడు?

32 వారు సమాధికి తేబడుదురు

సమాధి శ్రద్ధగా కావలికాయబడును

33 పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి

మనుష్యులందరు వారివెంబడి పోవుదురు

ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగా

పోయిరి.

మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు

34 ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగునన్ను

ఓదార్చ జూచెదరు?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/21-a0804704a2b8cf752f0e11547585bb1f.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 22

1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున

ప్రత్యుత్తరమిచ్చెను–

2 నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు;

బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులైయున్నారు

3 నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి

సంతోషమా?

నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ

కరమా?

4 ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన

నిన్ను గద్దించునా?

నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?

5 నీ చెడుతనము గొప్పది కాదా?

నీ దోషములు మితిలేనివి కావా?

6 ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు

పుచ్చుకొంటివి

వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి

7 దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి

ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.

8 బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును

ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.

9 విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి

తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.

10 కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి

ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.

11 నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు

చూచుటలేదా?

నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు

చూచుటలేదా?

12 దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?

నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత

పైగా నున్నవి?

13 దేవునికి ఏమి తెలియును?

గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కను

గొనునా?

14 గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి,

ఆయన చూడలేడు

ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవను

కొనుచున్నావు.

15 పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు

అనుసరించెదవా?

16 వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని

పోయెను.

17 ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను

18 –మాయొద్దనుండి తొలగిపొమ్మనియు

సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు

దేవునితో అందురు.

భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.

19 –మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు

20 నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు

నిర్దోషులు వారిని హేళనచేయుదురు.

21 ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము

కలుగును

ఆలాగున నీకు మేలు కలుగును.

22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము

ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.

23 సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల

నీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగా

తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.

24 మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ

మును పారవేయుము

25 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన

వెండిగాను ఉండును.

26 అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవు

దేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.

27 నీవు ఆయనకు ప్రార్థనచేయగా

ఆయన నీ మనవి నాలకించును

నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.

28 మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకు

స్థిరపరచబడును

నీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.

29 నీవు పడద్రోయబడినప్పుడు–మీదు చూచెదనందువు

వినయముగలవానిని ఆయన రక్షించును.

30 నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును.

అతడు నీచేతుల శుద్ధివలన విడిపింపబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/22-a57ea3b1bfaaae95fb580745994ba51d.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 23

1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–

2 నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటుచేయు

చున్నాను

నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది

3 ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా

ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియ

బడును గాక.

4 ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశద

పరచెదను

వాదములతో నా నోరు నింపుకొనెదను.

5 ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది

నేను తెలిసికొందును

ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.

6 ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?

ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును

7 అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడ

వచ్చును.

కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన

శిక్ష నొందకపోవుదును.

8 నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు

పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు

9 ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను

ఆయన నాకు కానవచ్చుట లేదు

దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు

నేనాయనను కనుగొనలేను.

10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును

ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె

కనబడుదును.

11 నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక

నడచినవి

నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను

సరించితిని.

12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు

ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె

ఎక్కువగా ఎంచితిని.

13 అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చగలవాడెవడు?

ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.

14 నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును

అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై

యున్నాడు.

15 కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను

నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడు

చున్నాను.

16 దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే

నన్ను కలవరపరచెను.

17 అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను

కమ్మియుండినను

నేను నాశనముచేయబడి యుండలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/23-917b0bd7dae5d9c1704870c130828817.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 24

1 సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు

ఏర్పాటుచేయడు?

ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను

ఎందుచేత చూడకున్నారు?

2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరువారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని

వాటిని మేపుదురు.

3 తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు

విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

4 వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించి

వేయుదురు

దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ

దాగవలసివచ్చెను.

5 అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు

బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు

ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

6 పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు

దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.

7 బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు

చలిలో వస్త్రహీనులై పడియుందురు.

8 పర్వతములమీది జల్లులకు తడిసియుందురు

చాటులేనందున బండను కౌగలించుకొందురు.

9 తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు

10 దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు

ఆకలిగొని పనలను మోయుదురు.

11 వారు తమ యజమానుల గోడలలోపల నూనె

గానుగలను ఆడించుదురు

ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై

యుందురు.

12 జనముగల పట్టణములో మూలుగుదురు

గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు

అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.

13 వెలుగుమీద తిరుగబడువారు కలరు

వీరు దాని మార్గములను గురుతుపట్టరు

దాని త్రోవలలో నిలువరు.

14 తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును

వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును

రాత్రియందు వాడు దొంగతనము చేయును.

15 వ్యభిచారి–ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన

ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటి

కొరకు కనిపెట్టును.

16 చీకటిలో వారు కన్నము వేయుదురు

పగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు

17 వారందరు ఉదయమును మరణాంధకారముగా

ఎంచుదురు.

గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి

యున్నది.

జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు

18 వారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తము

ద్రాక్షతోటల మార్గమునవారు ఇకను నడువరు.

19 అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి

పోవునట్లు

పాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.

20 కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా

తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు

వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు

21 వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు

విధవరాండ్రకు మేలుచేయరు.

22 ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడు

చున్నాడు

కొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు

మరల బాగుపడుదురు.

23 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు

ఆధారము నొందుదురు

ఆయన వారి మార్గములమీద తన దృష్టి నుంచును

24 వారు హెచ్చింపబడినను

కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయ

బడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.

25 ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని

రుజువుపరచువాడెవడు?

నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/24-e547b15c5948651af5c54eacc450c861.mp3?version_id=1787—