Categories
ఆదికాండము

ఆదికాండము 31

1 లాబాను కుమారులు–మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.౹

2 మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.౹

3 అప్పుడు యెహోవా–నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా

4 యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.౹

5 –మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు;౹

6 మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.౹

7 మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.౹

8 అతడు–పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.౹

9 అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.౹

10 మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.౹

11 మరియు ఆ స్వప్నమందు దేవుని దూత –యాకోబూ అని నన్ను పిలువగా–చిత్తము ప్రభువా అని చెప్పితిని.౹

12 అప్పుడు ఆయన–నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని

13 నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.౹

14 అందుకు రాహేలును లేయాయు– యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి?

15 అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.౹

16 దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికి ఉత్తరమియ్యగా

17 యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి

18 కనానుదేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను.౹

19 లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.౹

20 యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను.౹

21 అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.౹

22 యాకోబు పారిపోయెనని మూడవదినమున లాబానుకు తెలుపబడెను.౹

23 అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొనిపోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.౹

24 ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి–నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.౹

25 లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.౹

26 అప్పుడు లాబాను యాకోబుతో–నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?

27 నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.౹

28 అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొననియ్యక పిచ్చిపెట్టి యిట్లు చేసితివి.౹

29 మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు–నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుక కుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.౹

30 నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా

31 యాకోబు –నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని

32 ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.౹

33 లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెనుగాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములోనుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను.౹

34 రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు.౹

35 ఆమె తన తండ్రితో–తమ యెదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.౹

36 యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో–నీవిట్లు మండిపడి నన్ను తరుమ నేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి?

37 నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయులమధ్య తీర్పు తీర్చుదురు.౹

38 ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.౹

39 దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.౹

40 పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను.౹

41 ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.౹

42 నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.౹

43 అందుకు లాబాను–ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను?

44 కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా

45 యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.౹

46 మరియు యాకోబు–రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్పయొద్ద భోజనముచేసిరి.౹

47 లాబాను దానికి యగర్ శాహదూతాఅను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.౹

48 లాబాను–నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు–మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.౹

49-50 అంతట లాబాను–నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము, మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.౹

51 మరియు లాబాను–నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.౹

52 హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.౹

53 అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.౹

54 యాకోబు ఆ కొండమీదబలి యర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.౹

55 తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/31-af77590a5e34b12d612bc3c73ea3a472.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 32

1 యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.౹

2 యాకోబు వారిని చూచి–ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహన యీముఅను పేరు పెట్టెను.

3-4 యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి–మీరు నా ప్రభువైన ఏశావుతో –ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;౹

5 నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికాజ్ఞాపించెను.౹

6 ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి–మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితిమి; అతడు నాలుగువందలమందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా

7 యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి

8 –ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.౹

9 అప్పుడు యాకోబు–నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, –నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,౹

10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.౹

11 నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.౹

12 నీవు –నేను నీకు తోడై నిశ్చయముగా మేలుచేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

13 అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను

14 అనగా రెండువందల మేకలను ఇరువది మేకపోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను

15 ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా

16 తన దాసులచేతి కప్పగించి–మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.౹

17 మరియు వారిలో మొదటివానితో–నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని–నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల

18 నీవు–ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.౹

19 అట్లతడు–నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని–మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు

20 మీరు–ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.౹

21 అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.

22 ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.౹

23 యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను.౹

24 యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారువరకు అతనితో పెనుగులాడెను.౹

25 తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడు వసిలెను.౹

26 ఆయన–తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు–నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనియ్యననెను.౹

27 ఆయన–నీ పేరేమని యడుగగా అతడు–యాకోబు అని చెప్పెను.౹

28 అప్పుడు ఆయన–నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను.౹

29 అప్పుడు యాకోబు–నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన–నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.౹

30 యాకోబు–నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలుఅను పేరు పెట్టెను.౹

31 అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.౹

32 అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/32-643ff077a74a5dfec810e7dbd2e31261.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 33

1 యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.౹

2 అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి

3 తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.౹

4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.౹

5 ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి –వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.౹

6 అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి.౹

7 లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.౹

8 ఏశావు–నాకు ఎదురుగావచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు–నా ప్రభువు కటాక్షము నామీద వచ్చుటకే అని చెప్పెను.౹

9 అప్పుడు ఏశావు–సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.౹

10 అప్పుడు యాకోబు–అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా;౹

11 నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్త గించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని

12 –మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా

13 అతడు–నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.౹

14 నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను.౹

15 అప్పుడు ఏశావు–నీ కిష్టమైనయెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా–అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను.౹

16 ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.౹

17 అప్పుడు యాకోబు సుక్కోతుకుప్రయాణమై పోయి తనకొక యిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.౹

18 అట్లు యాకోబు పద్దనరాములోనుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.౹

19 మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని

20 అక్కడ ఒక బలిపీఠముకట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలుఅను పేరు పెట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/33-bd95203e5b38d0e754a91812bb238254.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 34

1 లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.౹

2 ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.౹

3 అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి

4 ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.౹

5 తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలోనుండినందునవారు వచ్చువరకు ఊరకుండెను.౹

6 షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను.౹

7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను.౹

8 అప్పుడు హమోరు వారితో–షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తెమీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి.౹

9 మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి.౹

10 ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.౹

11 మరియు షెకెము–మీ కటాక్షము నామీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.౹

12 ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.౹

13 అయితే తమ సహోదరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా

14 –మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొననివానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవ మానమగును.౹

15 మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలె నుండినయెడల సరి;౹

16 ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని, మీ మధ్య నివసించెదము, అప్పుడు మనము ఏకజనమగుదుము.౹

17 మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లను తీసికొని పోవుదుమని చెప్పగా

18 వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను.౹

19 ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు

20 హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరిగవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు

21 –ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండ నిచ్చి యిందులో వ్యాపారము చేయనియ్యుడి; ఈ భూమి వారికిని చాలినంత విశాలమైయున్నదిగదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసికొని మన పిల్లలను వారికి ఇత్తము.౹

22 అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేకజనముగా నుందురు.౹

23 వారి మందలు వారిఆస్తి వారి పశువులన్నియు మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా

24 హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరిగవినిద్వారా వెళ్లు వారందరు వినిరి. అప్పుడతని ఊరి గవినిద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.౹

25 మూడవదినమునవారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీదపడి ప్రతి పురుషుని చంపిరి.౹

26 వారు హమో రును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొని వెళ్లిపోయిరి

27 తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని

28 వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి

29 వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లల నందరిని వారి స్త్రీలను చెరపెట్టి, యిండ్లలోనున్నదంతయు దోచుకొనిరి.౹

30 అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు; నేనును నాయింటివారును నాశన మగుదుమని చెప్పెను.౹

31 అందుకు వారు–వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/34-6e96353bffadc04c50c2b9ffe031e46c.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 35

1 దేవుడు యాకోబుతో–నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటనుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా

2-3 యాకోబు తన యింటివారితోను తనయొద్దనున్న వారందరితోను–మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమదినమున నా కుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.౹

4 వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.౹

5 వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.౹

6 యాకోబును అతనితోనున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.౹

7 అతడు తన సహోదరుని యెదుటనుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలనుపేరుపెట్టిరి.౹

8 రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్అను పేరు పెట్టబడెను.

9 యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.౹

10 అప్పుడు దేవుడు అతనితో–నీపేరు యాకోబు; ఇకమీదట నీపేరు యాకోబు అనబడదు; నీపేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.

11 మరియు దేవుడు–నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.౹

12 నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.౹

13 దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.౹

14 ఆయన తనతో మాటలాడినచోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభముకట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.౹

15 తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి.౹

16 ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాస పడెను.౹

17 ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో–భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.౹

18 ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె– అతని పేరు బెనోనిఅనెను; అతని తండ్రి అతనికి బెన్యామీనుఅను పేరు పెట్టెను.౹

19 అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను.౹

20 యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభముకట్టించెను. అది నేటివరకు రాహేలు సమాధి స్తంభము.౹

21 ఇశ్రాయేలు ప్రయా ణమై పోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను.౹

22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్న ప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

23 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.౹

24 రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.౹

25 రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.౹

26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.౹

27 అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.

28 ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.౹

29 ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/35-c97336e5730f259142e5a92a1ac7f962.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 36

1 ఎదోమను ఏశావు వంశావళి ఇదే,౹

2 ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,౹

3 ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాశెమతును పెండ్లియాడెను.౹

4 ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.౹

5 అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.

6 ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;౹

7 వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందునవారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.౹

8 అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.

9 శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,౹

10 ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును.౹

11 ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.౹

12 ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.౹

13 రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.౹

14 ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.౹

15 ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,౹

16 కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.౹

17 వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.౹

18 వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.౹

19 ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.

20 ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా

21 దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.౹

22 లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా

23 శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.౹

24 సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు.౹

25 అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.౹

26 దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను

27 ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.౹

28 దీషాను కుమారులు ఊజు అరాను.౹

29 హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు

30 దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయ కుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.

31 మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయులమీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరి పాలన చేసినరాజు లెవరనగా

32 బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా

33 బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను.౹

34 యోబాబు చనిపోయిన తరువాత తేమ నీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.౹

35 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.౹

36 హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శవ్లూ అతనికి ప్రతిగా రాజాయెను.౹

37 శవ్లూ చనిపోయిన తరువాత నదీతీరమందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను.౹

38 షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను.౹

39 అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె

40 మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు

41 అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు

42 కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు

43 మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/36-347047b559668126fac7134af019ce48.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 37

1 యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.౹

2 యాకోబువంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతోకూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.౹

3 మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.౹

4 అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిమీద పగపెట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.౹

5 యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపెట్టిరి.౹

6 అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.౹

7 అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.౹

8 అందుకతని సహోదరులు– నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపెట్టిరి.౹

9 అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి– ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.౹

10 అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడు దుమా అని అతని గద్దించెను.౹

11 అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.

12 అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.౹

13 అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి–నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు–మంచిదని అతనితో చెప్పెను.౹

14 అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.౹

15 అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి–నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.౹

16 అందుకతడు–నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపు మని అడిగెను.౹

17 అందుకు ఆ మనుష్యుడు–ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు–దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కను గొనెను.౹

18 అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచనచేసిరి.౹

19 వారు–ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;౹

20 వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.౹

21 రూబేను ఆ మాట విని– మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను.౹

22 ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచి–రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.౹

23 యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,౹

24 అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.౹

25 వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.౹

26 అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

27 ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి;వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.౹

28 మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.౹

29 రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకొని

30 తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి–చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్క డికి పోదుననగా

31 వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచి

32 ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి–ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి

33 అతడు దానిని గురుతుపెట్టి –ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.౹

34 యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా

35 అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొంద నొల్లక–నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.౹

36 మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/37-1bea6243894355cd7a38dbecc8341c68.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 38

1 ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను.౹

2 అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను.౹

3 ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను.౹

4 ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను.౹

5 ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను.

6 యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.౹

7 యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.౹

8 అప్పుడు యూదా ఓనానుతో–నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.౹

9 ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.౹

10 అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను.౹

11 అప్పుడు యూదా–ఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొని–నా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.౹

12 చాలాదినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చని పోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించు వారియొద్దకు వెళ్లెను

13 దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లు చున్నాడని తామారునకు తెలుపబడెను.౹

14 అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోనుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా

15 యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పు కొనినందున వేశ్య అనుకొని

16 ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక–నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామె–నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.౹

17 అందుకతడు–నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె–అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.౹

18 అతడు–నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె–నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతియాయెను.౹

19 అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసి కొనెను.౹

20 తరువాత యూదా ఆ స్త్రీ యొద్దనుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.౹

21 కాబట్టి అతడు–మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు–ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి.౹

22 కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి–ఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులు –ఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అని నప్పుడు

23 యూదా–మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచు కొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను.౹

24 రమా రమి మూడు నెలలైన తరువాత–నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వమువలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా–ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.౹

25 ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి–ఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను.౹

26 యూదా వాటిని గురుతు పెట్టి–నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.౹

27 ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి.౹

28 ఆమె ప్రసవించుచున్న ప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వాని చేతికి కట్టి–ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను.౹

29 అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె–నీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసుఅను పేరు పెట్టబడెను.౹

30 తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/38-866bc7b7f03e0d60a2441422545217dc.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 39

1 యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.౹

2 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.౹

3 యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతనిచేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు

4 యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను.౹

5 అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను.౹

6 అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.౹

7 అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి–తనతో శయ నించుమని చెప్పెను

8 అయితే అతడు ఒప్పక–నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.౹

9 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.౹

10 దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెనుగాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుట కైనను ఆమె మాట విన్నవాడుకాడు.౹

11 అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.౹

12 అప్పు డామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.౹

13 అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొనిపోవుట ఆమె చూచినప్పుడు

14 తన యింటి మనుష్యులను పిలిచి–చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకురాగా నేను పెద్దకేక వేసితిని.౹

15 నేను బిగ్గరగా కేకవేయుటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి

16 అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచు కొనెను.౹

17 అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను –నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.౹

18 నేను బిగ్గరగా కేక వేసినప్పుడువాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారి పోయెననెను

19 కాబట్టి అతని యజమానుడు–ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి

20 అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.౹

21 అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను.౹

22 చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు.౹

23 యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిచేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణచేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/39-40b7dcb48c50c66fece84e5b5dd0b2eb.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 40

1 అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి

2 గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థులమీద కోపపడి

3 వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.౹

4 ఆ సేనాధిపతి వారిని యోసేపు వశముచేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలోనుండినతరువాత

5 వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను.౹

6 తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి.౹

7 అతడు–ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.౹

8 అందుకు వారు–మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి–భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.౹

9 అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి–నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;౹

10 ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.౹

11 మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.౹

12 అప్పుడు యోసేపు–దాని భావ మిదే; ఆ మూడు తీగెలు మూడుదినములు;౹

13 ఇంక మూడుదినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పాన దాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతనిచేతికప్పగించెదవు

14 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.౹

15 ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.౹

16 అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను–నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను.౹

17 మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను.౹

18 అందుకు యోసేపు–దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడుదినములు

19 ఇంక మూడుదినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీదనుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.

20 మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందుచేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి

21 పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.౹

22 మరియు యోసేపు వారికి తెలిపిన భావముచొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.౹

23 అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/40-f2ee0d4ab1f8059838e1e122af4561fe.mp3?version_id=1787—