Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 3

1 దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,౹

2 గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవవాడు,౹

3 అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లా కనిన ఇత్రెయాము ఆరవవాడు,౹

4 ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,౹

5 యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు

6-8 ఇభారు ఎలీషామా ఎలీ పేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.౹

9 ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.౹

10 సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు

11 యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,౹

12 యోవాషునకు అమజ్యా కుమారుడు, అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు

13 యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,౹

14 మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.౹

15 యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.౹

16 యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.౹

17 యెకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు

18 మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.౹

19 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలో మీతు వారికి సహోదరి.౹

20 హషుబా ఓహెలు బెరెక్యా హసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి.౹

21 హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.౹

22 షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.౹

23 నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యో యేనై హిజ్కియా అజ్రీకాము;౹

24 ఎల్యోయేనై కుమారులు ఏడుగురు; హోదవ్యా ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయ్యా అనాని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/3-b6b16e2413c69adb31f4ffda6c26056d.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 4

1 యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.౹

2 శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.౹

3 అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.౹

4 మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.౹

5 తెకోవ తండ్రియైన అష్షూరునకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.౹

6 నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు.౹

7 హెలా కుమారులెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.౹

8 కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.౹

9 యబ్బేజుతన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను–వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.౹

10 యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి–నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసినదానిని అతనికి దయచేసెను.౹

11 షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.౹

12 ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.౹

13 కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.౹

14 మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవాబును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.౹

15 యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.౹

16 యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.౹

17 ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.౹

18 అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.౹

19 మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.౹

20 షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు.౹

21 యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును

22 యోకీ మీయులకును కోజేబాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూబిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.౹

23 వారు కుమ్మరివాండ్లయి నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమముచేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.

24 షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.౹

25 షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శామునకు మిష్మా కుమారుడు.౹

26 మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.౹

27 షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలుగ లేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.౹

28 వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను

29-31 బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడివరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.౹

32 ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.౹

33 బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.౹

34 వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,౹

35 యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.౹

36 ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా;౹

37 షెమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.౹

38 పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరులయిండ్లు బహుగా వర్ధిల్లెను.౹

39 వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి

40 మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వమందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి.౹

41 పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱెలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.౹

42 షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధిపతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి

43 అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/4-94315ec6bc637231cb1c0d1db50504a3.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 5

1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెనుగాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మస్వాతంత్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు.౹

2 యూదా తన సహోదరులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్యము యోసేపు దాయెను.౹

3 ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.౹

4 యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,౹

5 షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు,౹

6 బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను.౹

7 వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును,౹

8 యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.౹

9 వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారముకాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి.౹

10 సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.

11 గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.౹

12 వారిలో యోవేలు తెగ వారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.౹

13 వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబ యోరై యకాను జీయ ఏబెరు.౹

14 వీరు హూరీ అను వానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యరోయ గిలాదునకు గిలాదు మిఖాయేలునకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.౹

15 గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరులయిండ్లవారికి పెద్ద.౹

16 వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామములయందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.౹

17 వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలురాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.

18 రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.౹

19 వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.౹

20 యుద్ధమందువారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను

21 గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.౹

22 యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడువరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.

23 మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతమువరకును వ్యాపించిరి.౹

24 వారి పితరులయిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమపితరులయిండ్లకు పెద్దలైరి.౹

25 అయితే వారు తమపితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.౹

26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపెట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/5-4ada0865166815bdc06f9a50fbdcfb8f.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 6

1 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.౹

2 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.౹

3 అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.౹

4 ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను,౹

5 అబీషూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,౹

6 ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,౹

7 మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,౹

8 అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,౹

9 అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,౹

10 యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.౹

11 అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,౹

12 అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,౹

13 షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,౹

14 అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.౹

15 యెహోవా నెబుకద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొనిపోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.౹

16 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.౹

17 గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.౹

18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.౹

19 మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

20 గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,౹

21 జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.౹

22 కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,౹

23 అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,౹

24 అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.౹

25 ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.౹

26 ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,౹

27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.౹

28 సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.౹

29 మెరారి కుమారులలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా

30 ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.

31 నిబంధనమందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవామందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.౹

32 సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుం డిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.౹

33 ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు

34 సమూయేలు ఎల్కా నాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయహునకు పుట్టెను,౹

35 తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,౹

36 అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,౹

37 జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,౹

38 కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.౹

39 హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,౹

40 షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు, బయశేయా మల్కీయా కుమారుడు,౹

41 మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,౹

42 అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు,౹

43 షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.

44 మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు,౹

45 హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,౹

46 హిల్కీయా అమ్జీ కుమారుడు, అమ్జీ బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు,౹

47 షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.౹

48 వీరి సహోదరు లైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి.

49 అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండ వలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.౹

50 అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,౹

51 అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,౹

52 జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,౹

53 అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.

54 అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావు లనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.౹

55 యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.౹

56 అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.౹

57 అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,౹

58 హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,౹

59 ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు.౹

60 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లె మెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

61 కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్రస్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్రస్థానములోనుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.

62 గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థానములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములోనుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.౹

63 మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను.౹

64 ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి.౹

65 వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములోనుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.౹

66 కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.౹

67 ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములును, గెజెరును దాని గ్రామములును,౹

68 యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,౹

69 అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.౹

70 మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.౹

71 మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,౹

72 ఇశ్శాఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,౹

73 రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,౹

74 ఆషేరు గోత్రస్థానములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,౹

75 హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;౹

76 నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను.౹

77 మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూలూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు,౹

78 యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగాఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,౹

79 కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,౹

80 గాదు గోత్రస్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,౹

81 హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/6-c1664d044cdf6ca912bb5dbb3e13fb1d.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 7

1 ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు

2 తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమపితరులయిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమశాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్య యిరు వది రెండువేల ఆరువందలు.౹

3 ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.౹

4 వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరులయిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.౹

5 మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబదియేడువేలమంది యుండిరి.

6 బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.౹

7 బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమపితరులయిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.౹

8 బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమ్రీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.౹

9 వీరు తమపితరులయిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు.౹

10 యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.౹

11 యెదీయవేలు కుమారులైన వీరందరును తమపితరులయిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.౹

12 షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.౹

13 నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.

14 మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదునకు పెద్దైయెన మాకీరును కూడ కనెను.౹

15 మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.౹

16 మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు షెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.౹

17 ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.౹

18 మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీ యెజెరును మహలాను కనెను.౹

19 షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.

20 ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,౹

21 తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.౹

22 వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.౹

23 తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను; తన యింటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.౹

24 అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‍హోరోనును దక్షిణపు బేత్‍హోరోనును ఉజ్జెన్‌షెయెరాను కట్టించెను.౹

25 వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహను,౹

26 తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,౹

27 ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.౹

28 వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.౹

29 మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతివారు కాపురముండిరి.

30 ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.౹

31 బెరీయా కుమారులు హెబెరు మల్కీ యేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.౹

32 హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.౹

33 యప్లేటు కుమారులెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.౹

34 షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.౹

35 వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.౹

36 జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా

37 బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.౹

38 ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.౹

39 ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.౹

40 ఆషేరు సంతతివారైన వీరందరును తమపితరులయిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునైయుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/7-c8bf2e4753a4bbe56ca28a4342c86ec4.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 8

1 బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,౹

2 మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.౹

3 బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

4 అబీషూవ నయమాను అహోయహు

5 గెరా షెపూపాను హూరాము.౹

6 ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;౹

7 నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొనిపోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.౹

8 వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

9 తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

10 యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమపితరులయిండ్లకు పెద్దలుగా ఉండిరి.౹

11 హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.౹

12 ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.౹

13 బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.౹

14 అహ్యో షాషకు యెరేమోతు

15 జెబద్యా అరాదు ఏదెరు

16 మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.౹

17 జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

18 ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.౹

19 యాకీము జిఖ్రీ జిబ్ది

20 ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.౹

21 అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు.౹

22-25 ఇష్పాను ఏబెరు ఎలీయేలు అబ్దోను జిఖ్రీ హానాను హనన్యా ఏలాము అంతోతీయా ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.౹

26 షంషెరై షెహర్యా అతల్యా యహరెష్యా ఏలీయ్యా

27 జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.౹

28 వీరు తమతమ తరములన్నిటిలో పితరులయిండ్లకు పెద్దలును, ప్రముఖులునైయుండి యెరూషలేమునందు కాపురముండిరి.

29 గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా;౹

30 ఇతని పెద్దకుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు

31 గెదోరు అహ్యో జెకెరు అనువారు.౹

32 మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతోకూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి.౹

33 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనా దాబును ఎష్బయలును కనెను.౹

34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.౹

35 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.౹

36 ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాదా ఆలెమెతును అజ్మావెతును జిమ్రీని కనెను, జిమ్రీ మోజాను కనెను.౹

37 మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.౹

38 ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీ కాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.౹

39 అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.౹

40 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణు లైన పరాక్రమశాలులు; వీరికి నూటయేబదిమంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యామీనీయులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/8-7fdb8f75aac3db09cc3d5fad2e3cdfcd.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 9

1 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.౹

2 తమ స్వాస్థ్యములైన పట్టణములలోమునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును.౹

3 యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా

4 యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.౹

5 షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.౹

6 జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది,౹

7 బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,౹

8 యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.౹

9 వీరును వీరి సహోదరులును తమతమ వంశముల పట్టీల చొప్పున తొమ్మిదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమపితరుల వంశములనుబట్టి తమపితరులయిండ్లకు పెద్దలు.

10 యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,౹

11 దేవుని మందిరములో అధిపతియైన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;౹

12 మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.౹

13 మరియు తమపితరులయిండ్లకు పెద్దలైన వెయ్యిన్ని యేడువందల అరువది మంది కుటుంబికులు. వీరు దేవుని మందిరసేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు.౹

14 మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,౹

15 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,౹

16 యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.౹

17 ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహోదరులును. వీరిలో షల్లూము పెద్ద.౹

18 లేవీయుల సమూహములలో వీరు తూర్పుననుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు.౹

19 మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీద నుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.౹

20 ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసుమునుపు వారిమీద అధికారియైయుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.౹

21 మరియు మెషె లెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి.౹

22 గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడ బడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.౹

23 వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరముయొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని గలిగియుండెను.౹

24 గుమ్మముల కావలి వారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.౹

25 వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారి వారియొద్దకు వచ్చుటకద్దు.౹

26 లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.౹

27 వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపనివారిదే.౹

28 వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొని పోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.౹

29 మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.౹

30 యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు.౹

31 లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్దకుమారుడైన మత్తిత్యా పిండివంటలమీద నుంచబడెను.౹

32 వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతిదినమున సముఖపు రొట్టెలు సిద్ధముచేయుపని కలిగియుండెను.౹

33 లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగి యున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.౹

34 వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.౹

35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.౹

36 ఇతని పెద్దకుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు

37 గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.౹

38 మిక్లోతు షిమ్యాను కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతోకూడ తమ సహోదరులకు ఎదురుగా నున్న యిండ్లలోనే కాపురముండిరి.౹

39 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూ వను అబీనాదాబును ఎష్బయలును కనెను.౹

40 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.౹

41 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు.)

42 ఆహాజు యరాను కనెను; యరా ఆలెమె తును అజ్మావెతును జిమ్రీని కనెను, జిమ్రీ మోజాను కనెను.౹

43 మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.౹

44 ఆజేలునకు ఆరుగురు కుమారు లుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లుగలవారు; వీరు ఆజేలు కుమారులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/9-8c0ab52d89d485b74dcfb77dfda98b14.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 10

1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.౹

2 ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.౹

3 యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.౹

4 అప్పుడు సౌలు–ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.౹

5 సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.౹

6 ఆప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి.౹

7 జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చివాటిలో కాపురముండిరి.

8 హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చిపడియుండుట చూచి

9 అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధములను తీసికొనిపోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.౹

10 వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.౹

11-12 ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు వినినప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి, సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సింధూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.౹

13 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచములయొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.౹

14 అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/10-d96088d9c217d5feb82310f980413a9e.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 11

1 అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చి–చిత్తగించుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.౹

2 ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివి–నా జనులగు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.౹

3 ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకురాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూయేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.౹

4 తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.౹

5 అప్పుడు–నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.౹

6 ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆయాధిపత్యమును పొందెను.౹

7 తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపుర మను పేరు కలిగెను.౹

8 దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.౹

9 సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.

10 ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.౹

11 దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.౹

12 ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమశాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.౹

13 ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.౹

14 వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.౹

15 ముప్పదిమంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.౹

16 దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.౹

17 దావీదు ఆశపడి–బేత్లెహేమునందలి ఊరి గవినియొద్ద బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా

18 ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ద బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి

19 –నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.౹

20 యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.౹

21 ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెనుగాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.౹

22 మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను; మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.౹

23 అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేతపట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడలాగి దానితో వానిని చంపెను.౹

24 యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.౹

25 ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెనుగాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకులకధిపతిగా ఉంచెను.

26 మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,౹

27 హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,౹

28 తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,౹

29 హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,౹

30 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,౹

31 బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,౹

32 గాయషులోయవాడైన హూరై, అర్బా తీయుడైన అబీయేలు,౹

33 బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,౹

34 గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను,౹

35 హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,౹

36 మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,౹

37 కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,౹

38 నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,౹

39 అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబుయొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,౹

40 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,౹

41 హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,౹

42 రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,౹

43 మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,౹

44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీయేలు,౹

45 షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,౹

46 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,౹

47 ఎలీయేలు ఓబేదు, మెజో బాయా ఊరివాడైన యహశీయేలు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/11-3705034cee497fb8b3405e9e1d0a2129.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 12

1 దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.౹

2 వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు.౹

3 వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,౹

4 ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పదిమందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,౹

5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,౹

6 కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,౹

7 గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.౹

8 మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములుగలవారు, కొండలలోనుండు జింకలంతపాద వేగము గలవారు.౹

9 వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,౹

10 నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,౹

11 ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,౹

12 ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,౹

13 పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.౹

14 గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,౹

15 యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.౹

16 మరియు బెన్యామీనీయులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.౹

17 దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను–మీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.౹

18 అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై–దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.౹

19 సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతోకూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.౹

20 అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.౹

21 వారందరును పరాక్రమశాలులును సైన్యాధిపతులునైయుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి.౹

22 దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చుచుండిరి.

23 యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్కయెంతయనగా

24 యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.౹

25 షిమ్యోనీయులలో యుద్ధమునకు తగినశూరులు ఏడువేల నూరుమంది.౹

26 లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.౹

27 అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడువందలమంది.౹

28 పరాక్రమశాలియైన సాదోకు అను యౌవనునితోకూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.౹

29 సౌలు సంబంధులగు బెన్యామీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.౹

30 తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రా యిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.౹

31 మనేష్షయొక్క అర్ధగోత్రపువారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.౹

32 ఇశ్శాఖారీయులలో సమయో చిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.౹

33 జెబూలూ నీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.౹

34 నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనినవారు ముప్పదియేడువేలమంది.౹

35 దానీయులలో యుద్ధ సన్నద్ధులైనవారు ఇరువది యెనిమిదివేల ఆరు వందలమంది.౹

36 ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.౹

37 మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలె నన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.౹

38 ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి.౹

39 వారి సహోదరులు వారి కొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడుదినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి.౹

40 ఇశ్రాయేలీయులకు సంతో షము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదలమీదను ఎద్దులమీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్లగెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱెలను పశువులను విస్తారముగా తీసికొనివచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/12-6b2317704e5010033490992282db0ca1.mp3?version_id=1787—