Categories
యిర్మీయా

యిర్మీయా 46

1 అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు . ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

2 ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారు డును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండునుగూర్చిన మాట.

3 డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి

4 గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి

శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును

పెట్టుడి కవచములు వేసికొనుడి.

5 నాకేమి కనబడుచున్నది?వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు

వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు

తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు

ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.

6 త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు

బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు

ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందువారు

తొట్రిల్లిపడుచున్నారు.

7 నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు?

ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి

8 ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది.

దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది.

–నేనెక్కి భూమిని కప్పెదను

పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.

9 గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి

బలాఢ్యులారా, బయలుదేరుడి

డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును

విలుకాండైన లూదీయులును బయలుదేరవలెను.

10 ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహో

వాకు పగతీర్చు దినము.

ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును

ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము

త్రాగును.

ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును

సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరి

గింప బోవుచున్నాడు.

11 ఐగుప్తుకుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము

తెచ్చుకొనుము

విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు

చికిత్స కలుగదు

12 నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను

నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది

బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు

ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.

13 బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి

ఐగుప్తీయులను హతముచేయుటనుగూర్చి

యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

14 ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి

నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి

ఏమనగా–ఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను

మ్రింగివేయుచున్నది

మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.

15 నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడుచున్నారు?

యెహోవావారిని తోలివేయుచున్నాడు

గనుకనే వారు నిలువకున్నారు.

16 ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు

వారొకనిమీద ఒకడు కూలుచు

–లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము

రండి

మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి

అని వారు చెప్పుకొందురు.

17 ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను

వాడనియు

వట్టిధ్వని మాత్రమేయనివారచ్చట చాటించిరి.

18 పర్వతములలో తాబోరు ఎట్టిదో

సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో

నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును

రాజును సైన్యములకధిపతియునగు యెహోవా

వాక్కు ఇదే.

19 ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును

అది నిర్జనమై కాల్చబడును

ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.

20 ఐగుప్తు అందమైన పెయ్య

ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చే

యున్నది.

21 పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు

దూడల వలె ఉన్నారు

వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ

పారిపోయిరివారి ఆపద్దినము వచ్చియున్నది

శిక్షాదినము వారికాసన్నమాయెను.

22 శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు

మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని

మీదికి వచ్చుచున్నారు

ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు

వలె వినబడుచున్నది

యెహోవా వాక్కు ఇదే–

23 లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు

చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయు

దురు.

24 ఐగుప్తు కుమారి అవమానపరచబడును

ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును

25 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

నోలోనుండు ఆమోను దేవతను

ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను

ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించు

చున్నాను.

26 వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబు

కద్రెజరుచేతికిని అతని సేవకులచేతికిని వారిని

అప్పగించుచున్నాను

ఆ తరువాత అదిమునుపటివలెనే నివాసస్థలమగును

ఇదే యెహోవా వాక్కు.

27 నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము

ఇశ్రాయేలూ, జడియకుము

దూరములోనుండి నిన్ను రక్షించుచున్నానువారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించు

చున్నాను

ఎవరి భయమునులేకుండ యాకోబు తిరిగివచ్చును

అతడు నిమ్మళించి నెమ్మదినొందును.

28 నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడై

యున్నాను భయపడకుము

నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ

ప్రజలను సమూల నాశనముచేసెదను

అయితే నిన్ను సమూల నాశనముచేయను

నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి

నిన్ను శిక్షించెదను

ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/46-5c431f8118a5d61c9a3c2fcfe7c97aed.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 47

1 ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

2 –యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లుగాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించువారిమీదను ప్రవహించును.౹

3 వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లలతట్టు తిరిగి చూడరు.౹

4 ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,౹

5 గాజా బోడియాయెను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?

6 యెహోవా ఖడ్గమా, యెంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్ర మించి ఊరకుండుము.౹

7 అష్కెలోనుమీదికిని సముద్ర తీరముమీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? –అచ్చ టికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/47-671d1e74dd5a86f1607ac0d36da54f16.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 48

1 మోయాబునుగూర్చినది.

ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు

చున్నాడు.

–నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది.

కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది

ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది

ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.

2 హెష్బోనులో వారు–అది ఇకను జనము కాకపోవు

నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు

దానికి కీడుచేయనుద్దేశించుచున్నారు

మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి.

ఖడ్గము నిన్ను తరుముచున్నది.

3 ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని

వినబడుచున్నది

దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభ

వించుచున్నది.

4 మోయాబు రాజ్యము లయమై పోయెను

దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.

5 హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని

వినబడుచున్నది

జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు

ఏడ్చుచు ఎక్కుచున్నారు.

6 పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి

అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.

7 నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను

నమ్ముకొంటివి

నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికిపోవును

ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును

చెరలోనికి పోవుదురు.

8 యెహోవా సెలవిచ్చునట్లు

సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును

ఏ పట్టణమును తప్పించుకొనజాలదు

లోయ కూడ నశించును మైదానము పాడైపోవును.

9 మోయాబునకు రెక్కలు పెట్టుడి

అది వేగిరముగా బయలుదేరి పోవలెను.

నివాసి యెవడునులేకుండ దాని పట్టణములు

పాడగును.

10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు

శాపగ్రస్తుడగును గాక

రక్తము ఓడ్చకుండ ఖడ్గము దూయువాడు శాపగ్రస్తు

డగును గాక.

11 మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను

ఈకుండలోనుండి ఆకుండలోనికి కుమ్మరింపబడకుండ

అది మడ్డిమీద నిలిచెను

అదెన్నడును చెరలోనికి పోయినది కాదు

అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది

దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.

12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు

వారిని పంపెదను.వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.

13 ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి

సిగ్గుపడినట్లు

మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు

14 –మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు

మీరెట్లు చెప్పుకొందురు?

15 మోయాబు పాడైపోవుచున్నది

శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు

వారి యౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు

సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు

సెలవిచ్చినమాట యిదే.

16 మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది

దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది.

17 దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి

దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి

బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము

విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.

18 దేబోనులో ఆసీనురాలై యుండుదానా,

మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు

చున్నాడు.

నీ కోటలను నశింపజేయుచున్నాడు.

నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము

ఎండినదేశములో కూర్చుండుము.

19 ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము

పారిపోవుచున్న వారియొద్ద విచారించుము

తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము

ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.

20 మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది

యున్నది

గోలయెత్తి కేకలువేయుము

మోయాబు అపజయము నొందెను.

21 అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి

మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది

హోలోనునకును యాహసునకును మేఫాతునకును

దీబోనుకును

22 నెబోకును బేత్–దిబ్లాతయీమునకును కిర్యతాయిమున

కును బేత్గామూలునకును

23 బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును

24 దూరమైనట్టియు సమీపమైనట్టియు

మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి

యున్నది.

25 మోయాబు శృంగము నరికివేయబడియున్నది

దాని బాహువు విరువబడియున్నది

యెహోవా వాక్కు ఇదే.

26 మోయాబు యెహోవాకు విరోధముగా తన్నుతాను

గొప్పచేసికొనెను

దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో

పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.

27 ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా?

అతడు దొంగలకు జతగాడైనట్టుగా

నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు

వచ్చితివి

28 మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి

కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె

కొండలో కాపురముండుడి.

29-30 మోయాబీయుల గర్వమునుగూర్చి వింటిమి,వారు బహు గర్వపోతులు

వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు

అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు

మాకు సమాచారము వచ్చెనువారి తామసమును వచించరాని వారి ప్రగల్భము

లును నాకు తెలిసేయున్నవి

చేయదగని క్రియలువారు బహుగా చేయుచున్నారు

ఇదే యెహోవా వాక్కు

31 కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు

చున్నాను

మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నానువారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు.

32 సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును

మించునట్లు

నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను

నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను

అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను

నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను

పాడుచేయువాడు పడెను.

33 ఫలభరితమైన పొలములోనుండియు

మోయాబు దేశములోనుండియు

ఆనందమును సంతోషమును తొలగిపోయెను

ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమునులేకుండచేయు

చున్నాను

జనులు సంతోషించుచు త్రొక్కరు

సంతోషము నిస్సంతోషమాయెను.

34 నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను

హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు

వరకును

సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును

జనులు కేకలువేయుచున్నారు.

35 ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని

దేవతలకు ధూపమువేయువారిని

మోయాబులోలేకుండజేసెను

ఇదే యెహోవా వాక్కు.

36 వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను

మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె

నాదము చేయుచున్నది

కీర్హరెశెతువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగుచున్నది.

37 నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను

ప్రతి గడ్డము గొరిగింపబడెను

చేతులన్నిటిమీద నరుకులును

నడుములమీద గోనెపట్టయు నున్నవి.

38 మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను

దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది

ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు

నేను మోయాబును పగులగొట్టుచున్నాను

ఇదే యెహోవా వాక్కు.

39 అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను

మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము.

మోయాబు తన చుట్టునున్న వారికందరికి

అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును.

40 యెహోవా సెలవిచ్చునదేమనగా

–పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద

తన రెక్కలను చాపుచున్నది.

41 కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి

యున్నవి.

ఆ దినమున మోయాబు శూరుల హృదయము

ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

42 మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయ పడగా

అది జనము కాకుండ నిర్మూలమాయెను.

43 మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు

నీమీదికి వచ్చియున్నవి

ఇదే యెహోవా వాక్కు.

44 భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు

గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు

మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను

రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు.

దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోను

నీడలో నిలిచియున్నారు.

45 హెష్బోనులోనుండి అగ్నియు

సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి

46 మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని

కాల్చివేయుచున్నవి.

మోయాబూ, నీకు శ్రమ

కెమోషుజనులు నశించియున్నారు

నీ కుమారులు చెరపట్టబడిరి

చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.

47 అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబువారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు.

ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/48-fa6f702cb05acf45bc3160b7205d66ac.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 49

1 అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు?

2 కాగా–యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు–రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధముయొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బ యగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

3 హెష్బోనూ, అంగలార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.౹

4 విశ్వాసఘాతకురాలా–నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసికొన్నదానా,౹

5 నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించుచున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

6 –నేను నీ చుట్టునున్న వారందరివలన నీకు భయము పుట్టించుచున్నాను; మీరందరు శత్రువుని కెదురుగా తరుమబడుదురు, పారిపోవువారిని సమకూర్చు వాడొకడును లేక పోవును, అటుతరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

7 సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు – తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?

8 ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయులారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.౹

9 ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?

10 నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగుచున్నారు, అతడును లేకపోవును.౹

11 అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.౹

12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్షనొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.౹

13 బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

14 యెహోవా యొద్దనుండి నాకు వర్తమానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.౹

15 జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.౹

16 నీవు భీకరు డవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నతస్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.౹

17 ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.౹

18 సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.౹

19 చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములోనుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?

20 ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.౹

21 వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రముదనుక వినబడెను.౹

22 శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

23 దమస్కునుగూర్చిన వాక్కు.

–హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు

పడుచున్నవి

అవి పరవశములాయెను

సముద్రముమీద విచారము కలదు

దానికి నెమ్మదిలేదు.

24 దమస్కు బలహీనమాయెను.

పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది

వణకు దానిని పట్టెను

ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని

పట్టెను.

25 ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను

నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువ

బడెను.

26 ఆమె యౌవనులు ఆమె వీధులలో కూలుదురు

ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు

ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.

27 నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను

అది బెన్హదదు నగరులను కాల్చివేయును.

28 బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును

గూర్చియు

హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల

విచ్చినమాట

–లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు

కొనుడి.

29 వారి గుడారములను గొఱ్ఱెల మందలను శత్రువులు

కొనిపోవుదురు

తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు

కొందురు

నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు

30 హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబు

కద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచనచేయు

చున్నాడు

మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు

యెహోవా వాక్కు ఇదే

–పారిపోవుడి బహులోతున వెళ్లుడి

అగాధస్థలములలో దాగుడి

31 మీరు లేచి ఒంటరిగా నివసించుచు

గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు

నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద

పడుడి.

32 వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండునువారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును

గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని

నఖముఖాల చెదరగొట్టుచున్నాను

నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను

ఇదే యెహోవా వాక్కు,

33 హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థల

ముగా ఉండును

అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు

ఏ నరుడును దానిలో బసచేయడు.

34-35 యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి ఈలాగు సెలవిచ్చెను–సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఏలాముయొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను.౹

36 నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చు వాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.౹

37 మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడజేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹

38 నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములోనుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.౹

39 అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/49-05ddfa11c2b1c0cc04c753329cd5cae1.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 50

1 బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయాద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు

2 –జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి

ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి

బబులోను పట్టబడును బేలు అవమానము నొందును

మెరోదకు నేల పడవేయబడును

బబులోను విగ్రహములు అవమానము నొందును

దాని బొమ్మలు బోర్లద్రోయబడును

3 ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చుచున్నది

ఏ నివాసియులేకుండ అది దాని దేశమును పాడు చేయును

మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు

అందరును తరలిపోవుదురు.

4 ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదావారును కూడి వచ్చెదరు

ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద

విచారించుటకై వచ్చెదరు

5 ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని

యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు

సీయోనుతట్టు అభిముఖులై అచ్చటికి వెళ్లు మార్గము

ఏదని అడుగుచు వచ్చెదరు

ఇదే యెహోవా వాక్కు.

6 నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారువారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని

పోయి వారిని త్రోవ తప్పించిరి

జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన

చోటు మరచిపోయిరి.

7 కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరివారి శత్రువులు–మేము అపరాధులము కాము

వీరు న్యాయమునకు నివాసమును తమపితరులకు

నిరీక్షణాధారమునగు యెహోవామీద

తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని

చెప్పుదురు.

8 బబులోనులోనుండి పారిపోవుడి

కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి

మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు

ముందర నడువుడి.

9 ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును

నేను రేపుచున్నాను

బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను

ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు

వారి మధ్యనుండియే ఆమె పట్టబడును

ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక

మరలని రీతిగా

వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.

10 కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను

వారందరు సంతుష్టి నొందెదరు

ఇదే యెహోవా వాక్కు.

11 నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా,

సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు

పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె

మీరు సకిలించుచున్నారే?

12 మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్ల

బోవును

ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును

అది యెడారియు ఎండినభూమియు అడవియునగును.

13 యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును

అది కేవలము పాడైపోవును

బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి

దాని తెగుళ్లన్నియు చూచి–ఆహా నీకీగతి పెట్టి

నదా? అందురు

14 ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది.

విల్లు త్రొక్కువారలారా,

మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు

యుద్ధపంక్తులు తీర్చుడి

ఎడతెగక దానిమీద బాణములు వేయుడి

15 చుట్టు కూడి దానినిబట్టి కేకలువేయుడి

అది లోబడ నొప్పుకొనుచున్నది

దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు

విరుగగొట్టబడుచున్నవి

ఇది యెహోవాచేయు ప్రతికారము.

దానిమీద పగతీర్చుకొనుడి

అది చేసినట్టే దానికి చేయుడి.

16 బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము

చేయుడి

కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము

చేయుడి

క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ

ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు

తమతమ దేశములకు పారిపోవుచున్నారు.

17 ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు

సింహములు వారిని తొలగగొట్టెను

మొదట అష్షూరురాజు వారిని భక్షించెను

కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి

యెముకలను నలుగగొట్టుచున్నాడు.

18 కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు

నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–అష్షూరు రాజును నేను దండించినట్లు

బబులోనురాజును అతని దేశమును దండించెదను.

19 ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి

రప్పించెదనువారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు

ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు

సంతుష్టినొందును.

20 ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును

వెదకినను అది కనబడకుండును.

యూదా పాపములు వెదకిను అవి దొరుకవు

శేషింపజేసినవారిని నేను క్షమించెదను

ఇదే యెహోవా వాక్కు.

21 దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము

పెకోదీయుల దేశముమీదికి పొమ్ము

వారిని హతముచేయుమువారు శాపగ్రస్తులని ప్రకటించుము

నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము.

22 ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది

అధిక నాశనధ్వని వినబడుచున్నది

23 సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ

గొట్టబడెను

అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.

24 బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి

యున్నాను

తెలియకయే నీవు పట్టబడియున్నావు

యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి

నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.

25 కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియు

నగు యెహోవాకు పనియున్నది

యెహోవా తన ఆయుధశాలను తెరచి

కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు

చున్నాడు.

26 నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి

దాని ధాన్యపుకొట్లను విప్పుడి

కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి

శేషమేమియులేకుండ నాశనము చేయుడి

27 దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను

అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను

వారి దండనకాలము వచ్చెను.

28 ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి

తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడుచున్నది

మన దేవుడగు యెహోవాచేయు ప్రతికార సమా

చారమును

తన ఆలయము విషయమై ఆయనచేయు ప్రతికార

సమాచారమును సీయోనులో ప్రకటించుడి.వారు వచ్చుచున్నారు.

29 బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి

విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు

దిగుడి.

అది యెహోవామీద గర్వపడినది

ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది

దానిలో నొకడును తప్పించుకొనకూడదు

దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి

అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము

చేయుడి.

30 కావున ఆ దినమున దాని యౌవనస్థులు దాని వీధులలో

కూలుదురు

దాని యోధులందరు తుడిచివేయబడుదురు

ఇదే యెహోవా వాక్కు.

31 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా

వాక్కు ఇదే

–గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను

నీ దినము వచ్చుచున్నది

నేను నిన్ను శిక్షించుకాలమువచ్చుచున్నది

32 గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును

అతని లేవనెత్తువాడెవడును లేకపోవును

నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను

అది అతని చుట్టుపెట్టులన్నిటిని కాల్చివేయును.

33 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు

చున్నాడు

–ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదావారును బాధింపబడిరి

వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు

వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు.

34 వారి విమోచకుడు బలవంతుడు

సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు

భూమికి విశ్రాంతి కలుగజేయుటకును

బబులోను నివాసులను కలవరపరచుటకును

ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ

ముట్టించును.

35 యెహోవా మాట యిదే

కల్దీయులును బబులోను నివాసులును

దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు

36 ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగు

దురు.

బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద

పడును

37 ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల

మీద పడును

ఖడ్గము వారిమీదికి దిగుటచేత

దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు

అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.

38 నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును

అది చెక్కబడిన విగ్రహములుగల దేశము

జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.

39 అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివ

సించును

నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును

ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును

తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.

40 యెహోవా వాక్కు ఇదే

–సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను

దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా

ఎవడును అక్కడ కాపురముండకపోవును

ఏ నరుడును దానిలో బసచేయడు.

41 జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు

మహాజనమును అనేక రాజులును

భూదిగంతములనుండి రేపబడెదరు.

42 వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరువారు క్రూరులు జాలిపడనివారు

వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నదివారు గుఱ్ఱములను ఎక్కువారు

బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా

వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.

43 బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు

డాయెను అతనికి బాధ కలిగెను

ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.

44 చిరకాల నివాసమును పట్టుకొనవలెనని

శత్రువులు యొర్దాను ప్రవాహములోనుండి సింహము

వలె వచ్చుచున్నారు

నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి

వేయుదును

నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదను

నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?

నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?

45 బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి

కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి

నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు

దురు

నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ

మొందును.

46 బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని

భూమి కంపించుచున్నది

జనములలో అంగలార్పు వినబడుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/50-a3afdf9d57acf523b5a00517fcbd04dc.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 51

1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపు

రముచేసి

నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన

వాయువును రప్పించెదను.

2 అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నానువారు ఆ దేశమును తూర్పారపెట్టి దాని వట్టిదిగా

చేయుదురు

ఆపద్దినమునవారు నలుదిక్కులనుండి దానిమీదికి

వచ్చెదరు.

3 విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను

కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను

కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును

దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును

4 యౌవనులను కొట్టక మానకుడి

దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి.

5 తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా

ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు

గాని ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా

తాము చేసిన అపరాధముతో వారిదేశము నిండి

యున్నది.

6 మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు

బబులోనులోనుండి పారిపోవుడి

మీ ప్రాణములు రక్షించుకొనుడి

ఇది యెహోవాకు ప్రతికారకాలము

అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము

చేయుచున్నాడు.

7 బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు

కలిగించు బంగారుపాత్రయైయుండెను.

దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు.

8 బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ

లాయెను

దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో

దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి.

9 మనము బబులోనును స్వస్థపరచగోరితిమి

అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి.

మన మన దేశములకు వెళ్లుదము రండి

దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది

అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది

10 యెహోవా మన న్యాయమును రుజువుపరచు

చున్నాడు

రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన

పని మనము వివరించుదము.

11 బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి

బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించు

చున్నాడు

మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు

చున్నాడు.

అది యెహోవాచేయు ప్రతి దండన

తన మందిరమునుగూర్చి ఆయనచేయు ప్రతి దండన.

12 బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము

నిలువబెట్టుడి

కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు

లను సిద్ధపరచుడి

బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని

బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను

జరిగింపబోవుచున్నాడు.

13 విస్తారజలములయొద్ద నివసించుదానా,

నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది

అన్యాయలాభము నీకిక దొరకదు.

14 గొంగళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను

నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయు

దురు

15 నా జీవముతోడని సైన్యములకధిపతియగు యెహోవా

ప్రమాణము చేయుచున్నాడు

ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను

తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను

తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

16 ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండల

ములో పుట్టును.

భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క

జేయును

వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును

తన ధనాగారములలోనుండి గాలిని రావించును.

17 తెలివిలేక ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు

పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును

బట్టి అవమానమొందును

అతడు పోతపోసినది మాయారూపము దానిలో

ప్రాణమేమియు లేదు.

18 అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు

విమర్శకాలమున అవి నశించిపోవును.

19 యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు

కాడు

ఆయన సమస్తమును నిర్మించువాడు

ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము

సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

20 నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు

యుద్ధాయుధమువంటివాడవు

నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను

నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.

21 నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను.

నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టు

చున్నాను.

22 నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను

నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను

నీవలన యౌవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను.

23 నీవలన గొఱ్ఱెలకాపరులను వారి గొఱ్ఱెలమందలను

విరుగగొట్టుచున్నాను

నీవలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగ

గొట్టుచున్నాను

నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను.

24 బబులోనును కల్దీయుల దేశనివాసులును

మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి

నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే

యెహోవా వాక్కు.

25 –సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా,

నేను నీకు విరోధిని

ఇదే యెహోవా వాక్కు.

నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను

క్రిందికి దొరలించుదును

26 చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.

మూలకుగాని పునాదికిగాని

నీలోనుండి యెవరును రాళ్లు తీసికొనరు

నీవు చిరకాలము పాడై యుందువు

ఇదే యెహోవా వాక్కు.

27 దేశములో ధ్వజములనెత్తుడి

జనములలో బాకానాదము చేయుడి

దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి

దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు

అను రాజ్యములను పిలిపించుడి

దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియ

మించుడి

రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము

లను దానిమీదికి రప్పించుడి.

28 దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి

అధిపతులను వారి యేలికలను

అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని

ప్రతిష్ఠించుడి

29 భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజలాడు చున్నది

ఒక్క నివాసియులేకుండ బబులోను దేశమును

పాడుగా చేయవలెనని

బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిర

మాయెను.

30-32 బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను

దురువారు తమ కోటలలో నిలుచుచున్నారువారి పరాక్రమము బలహీనత ఆయెనువారును స్త్రీలవంటివారైరివారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి

వారి అడ్డగడియలు విరిగిపోయెను

అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము

లును జమ్మును అగ్నిచేత కాల్చబడును

దాని యోధులు దిగులుపడిరి

అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును

దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు

నకు తెలియజేతురు.

దాని రేవులు శత్రువశమాయెను.

33 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–బబు

లోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను

ఇంక కొంతసేపటికి దానికి కోతకాలమువచ్చును.

34 బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును మ్రింగివేసెను

మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచి

యున్నాడు

భుజంగము మ్రింగునట్లు మమ్మును మ్రింగెను

మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును

పారవేసియున్నాడు.

35 నాకును నా దేహమునకును చేయబడిన హింస

బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును

గాక యని సీయోను నివాసి యనుకొనును

నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక

అని యెరూషలేము అనుకొనును.

36 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – ఆల

కించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును

నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును

దాని సముద్రమును నేనెండకట్టుదును

దాని ఊటను ఇంకిపోజేయుదును.

37 బబులోను నిర్జనమై కసవు దిబ్బలుగా ఉండును

నక్కలకు నివాసస్థలమగును

అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.వారు కూడి సింహములవలె బొబ్బరింతురు

సింహముల పిల్లలవలె గుఱ్ఱుపట్టుదురు.

38 వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర

నొందునట్లు

39 వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని

మత్తిల్లజేసెదను

ఇదే యెహోవా వాక్కు.

40 గొఱ్ఱెపిల్లలు వధకు పోవునట్లును

మేకపోతులును పొట్టేళ్లును వధకు పోవునట్లును

వారిని వధకు రప్పించెదను.

41 షేషకు పట్టబడెను

జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను

బబులోను జనములకు విస్మయాస్పదమాయెను.

42 సముద్రము బబులోనుమీదికి వచ్చెను

ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను.

43 దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను

అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను

ఏ నరుడును దానిమీదుగా ప్రయాణము చేయడు.

44 బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను

వాడు మ్రింగినదానిని వానినోటనుండి కక్కించు

చున్నాను

ఇకమీదట జనములు వానియొద్దకు సమూహములుగా

కూడి రావు

బబులోను ప్రాకారము కూలును;

45 నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు

వెళ్లుడి

యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి

మీ ప్రాణములను రక్షించుకొనుడి

46 ఏటేట వదంతి పుట్టుచువచ్చును

దేశములో బలాత్కారము జరుగుచున్నది

ఏలికమీద ఏలిక లేచుచున్నాడు

దేశములో వినబడు వదంతికి భయపడకుడి

మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి.

47 రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన

విగ్రహములను శిక్షింతును

దాని దేశమంతయు అవమానము నొందును

జనులు హతులై దానిమధ్యను కూలెదరు

48 దానిని పాడుచేయువారు ఉత్తరదిక్కునుండి దాని

యొద్దకు వచ్చుచున్నారని

ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును

బబులోను గతినిగూర్చి సంతోషించును

ఇదే యెహోవా వాక్కు

49 బబులోను ఇశ్రాయేలులో హతులైనవారిని కూలజేసి

నట్లు

సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైనవారు

కూలుదురు

50 ఖడ్గమును తప్పించుకొనినవారలారా,

ఆలస్యముచేయక వెళ్లుడి, దూరమునుండి

మీరు యెహోవాను జ్ఞాపకముచేసికొనుడి

యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియ్యుడి.

51 మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము

అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి

వచ్చియున్నారు

మా ముఖములు తెల్లబోవుచున్నవి

52 ఇదే యెహోవా వాక్కు.

–రాబోవు దినములలో నేను బబులోనుయొక్క

విగ్రహములను శిక్షింతును

ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గు

దురు.

53 బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా

చేసికొని ఆకాశమునకు ఎక్కినను

పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద

పడుదురు

ఇదే యెహోవా వాక్కు.

54 ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడుచున్నది

కల్దీయులదేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది.

55 యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు

దాని మహాఘోషను అణచివేయుచున్నాడు

వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించుచున్నవివారి ఆర్భాటము వినబడుచున్నది.

56 బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు

దాని బలాఢ్యులు పట్టబడియున్నారు

వారి విండ్లు విరిగిపోయినవి

యెహోవా ప్రతికారముచేయు దేవుడు గనుక

నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును.

57 దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి

పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదనువారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు

ఇదే రాజు వాక్కు

సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

58 సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల

విచ్చుచున్నాడు

విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడ

గొట్టబడును

దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయ

బడును

–జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు

అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు

ప్రజలు చూచి అలయుచున్నారు.

59 సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన ఆ శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట.౹

60 యిర్మీయా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనునుగూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములో వ్రాసెను.౹

61 కాగా యిర్మీయా శెరాయాతో ఇట్లనెను– నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను.౹

62 ఈలాగున నీవు ప్రకటింపవలెను– యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి.౹

63 ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి

64 నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/51-c1b79e5b787f3a548118058604d63d4d.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 52

1 సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువదియొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.౹

2 యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను.౹

3 యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటుచేయగా

4 అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవదినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగి నప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి.౹

5 ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను.౹

6 నాల్గవ నెల తొమ్మిదవదినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.౹

7 పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడలమధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తరలిపోయిరి.౹

8 కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.౹

9 వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను.౹

10 బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి

11 రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను.

12 అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోనురాజు ఎదుట నిలుచు నెబూజర దానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.౹

13-14 అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను. మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి

15 మరియు రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను.౹

16 అయితే రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను.౹

17 మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి.౹

18 అదియుగాక వారు బిందెలనుకుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవచేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి.౹

19 మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.౹

20 రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటి కన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.౹

21 వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల యెత్తుగలది, పండ్రెండు మూరల నూలు దాని చుట్టు తిరుగును, దాని దళసరి నాలుగు వ్రేళ్లు; అది గుల్లది.౹

22 దానిమీద ఇత్తడి పైపీట యుండెను; ఒక్క పైపీట అయి దేసి మూరల ఎత్తుగలది, పైపీటకు చుట్టు అల్లిన వల అల్లి కయు దానిమ్మ పండ్లును ఉండెను; అవి యన్నియు ఇత్త డివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును ఆలాగుననే దానిమ్మ పండ్లుండెను.౹

23 ప్రక్కలయందు తొంబది యారు దానిమ్మపండ్లుండెను; చుట్టు ఉండిన వల అల్లికమీద దానిమ్మపండ్లన్నియు నూరు.౹

24 మరియు రాజదేహసంరక్ష కుల యధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.౹

25 అతడు పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన యొక ఉద్యోగస్థుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగువానియొక్క లేఖరిని, పట్టణపుమధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.౹

26 రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలోనుండిన బబులోనురాజు నొద్దకు తీసికొని వచ్చెను.౹

27 బబులోనురాజు హమాతుదేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములోనుండి చెరగొనిపోయెను.౹

28 నెబుకద్రెజరు తన యేలుబడియందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను

29 నెబుకద్రెజరు ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు యెరూషలేమునుండి ఎనిమిదివందల ముప్పది యిద్దరిని చెరగొని పోయెను.౹

30 నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజదేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మనుష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.

31 యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవనెల యిరువదియైదవదినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడియందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి

32 అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.౹

33 మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనముచేయుచువచ్చెను.౹

34 మరియు అతడు చనిపోవువరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్యబడుచుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/52-76645af9ceb50bb71b95f0423e4ef4b3.mp3?version_id=1787—

Categories
విలాపవాక్యములు

విలాపవాక్యములు 1

1 జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా

క్రాంతమాయెను?

అది విధవరాలివంటిదాయెను.

అన్యజనులలో ఘనతకెక్కినది

సంస్థానములలో రాచకుమార్తెయైనది

ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?

2 రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది

కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది

దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక

డును లేడు

దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరివారు దానికి శత్రువులైరి.

3 యూదా బాధనొంది దాసురాలై

చెరలోనికి పోయియున్నది

అన్యజనులలో నివసించుచున్నది

విశ్రాంతినొందక పోయెను

దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు.

4 నియామక కూటములకు ఎవరును రారు గనుక

సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి

పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను

యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు

దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి

అదియు వ్యాకులభరితురాలాయెను.

5 దాని విరోధులు అధికారులైరి

దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు

దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని

శ్రమపరచుచున్నాడు.

విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి

6 సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను

దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారువారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి

పోయిరి.

7 యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు

నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది

దానికి కలిగినశ్రమానుభవ కాలమునందు సంచార

దినములయందు

సహాయము చేయువారెవరును లేక దాని జనము

శత్రువుచేతిలో పడినప్పుడు

విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని

నపహాస్యము చేసిరి.

8 యెరూషలేము ఘోరమైన పాపముచేసెను

అందుచేతను అది అపవిత్రురాలాయెను

దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి

దాని తృణీకరించుదురు.

అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది

9 దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది

దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక

యుండెను

అది ఎంతో వింతగా హీనదశ చెందినది

దాని నాదరించువాడొకడును లేకపోయెను.

యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత

నాకు కలిగినశ్రమను దృష్టించుము.

10 దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల

చేతిలో చిక్కెను

నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి

ఆజ్ఞాపించితివో

ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి

యుండుట అది చూచుచునేయున్నది

11 దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా

రము వెదకుదురు

తమ ప్రాణసంరక్షణకొరకు

తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము

కొందురు.

యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము.

12 త్రోవనునడుచువారలారా, ఈలాగు జరుగుట

చూడగా మీకు చింతలేదా?

యెహోవా తన ప్రచండకోప దినమున

నాకు కలుగజేసినశ్రమవంటి శ్రమ

మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి

చూడుడి.

13 పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని

ప్రయోగించియున్నాడు

అది యెడతెగక వాటిని కాల్చుచున్నది

నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి

యున్నాడు

నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు

ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల

జేసియున్నాడు.

14 కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు

కట్టియున్నాడు

అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను

నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు

ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు

నేను వారియెదుట లేవలేకపోతిని.

15 నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యుల

నందరిని కొట్టివేసెను

నా యౌవనులను అణగద్రొక్కవలెనని

ఆయన నామీద నియామక కూటముకూడను చాటిం

చెను.

యెహోవా కన్యకయైన యూదా కుమారిని

ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు.

16 వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను

నా కంట నీరు ఒలుకుచున్నది

నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసినవారు నాకు దూరస్థులైరి

శత్రువులు ప్రబలియున్నారు

నా పిల్లలు నాశనమైపోయిరి.

17 ఆదరించువాడులేక సీయోను చేతులు చాపుచున్నది

యెహోవా యాకోబునకు చుట్టునున్నవారిని

విరోధులైయుండ నియమించియున్నాడు

యెరూషలేము వారికి హేయమైనదాయెను.

18 యెహోవా న్యాయస్థుడు

నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని

సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి

నా శ్రమ చూడుడి

నా కన్యకలును నా యౌవనులును చెరలోనికిపోయియున్నారు

19 నా విటకాండ్రను నేను పిలువనంపగావారు నన్ను మోసపుచ్చిరి

నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై

ఆహారము వెదకపోయి

పట్టణములో ప్రాణము విడిచినవారైరి.

20 యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను

నా అంతరంగము క్షోభిల్లుచున్నది

నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి

నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది

వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది

ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.

21 నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువా

డొకడును లేడాయెను

నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త

నా విరోధులందరు విని సంతోషించుచున్నారు.

నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు

అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.

22 వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును

నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను

నా మనస్సు క్రుంగిపోయెను

నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి

నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LAM/1-3c74d4c26041887b8aff8f50b0a01a81.mp3?version_id=1787—

Categories
విలాపవాక్యములు

విలాపవాక్యములు 2

1 ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో

కప్పియున్నాడు

ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి

భూమిమీదికి పడవేసెను

కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము

చేసికొనకపోయెను.

2 ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస

స్థలములన్నిటిని నాశనముచేసియున్నాడు

మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి

యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు

ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర

పరచియున్నాడు.

3 కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగ

మును

ఆయన విరుగగొట్టియున్నాడు

శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు

తీసియున్నాడు

నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు

ఆయన యాకోబును కాల్చివేసి యున్నాడు.

4 శత్రువువలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలె కుడి

చెయ్యి చాపియున్నాడు

కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనముచేసి

యున్నాడు

అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను

సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించి

యున్నాడు.

5 ప్రభువు శత్రువాయెను

ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు

దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు

దాని కోటలను పాడుచేసియున్నాడు

యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన

కలుగజేసియున్నాడు.

6 ఒకడు తోటను కొట్టివేయునట్లు

తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి

యున్నాడు

తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు

యెహోవా సీయోనులో నియామక కాలము

విశ్రాంతిదినము

మరువబడునట్లు చేసియున్నాడు

కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి

యున్నాడు.

7 ప్రభువు తన బలిపీఠము విడనాడెను

తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను

దాని నగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్ప

గించెనువారు నియామక కాలమున జనులు చేయునట్లు

యెహోవామందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.

8 సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడు

చేయుటకు యెహోవా ఉద్దేశించెను

నాశనముచేయుటకు తన చెయ్యి వెనుకతీయక

ఆయన కొలనూలు సాగలాగెను.

ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి

అవి యేకరీతిగా క్షీణించుచున్నవి.

9 పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను

దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు

చేసెను

దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు

అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను

యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట

లేదు.

10 సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు

తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు

కొందురు

యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు

కొందురు.

11 నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా

నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి

నా యంతరంగము క్షోభిల్లుచున్నది

నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది.

శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో

మూర్ఛిల్లెదరు.

12 గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు

తల్లుల రొమ్ము నానుకొని–అన్నము ద్రాక్షారసము

ఏదియని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచె

దరు.

13 యెరూషలేము కుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చ

రించుదును?

దేనితో నిన్ను సాటిచేయుదును?

సీయోను కుమారీ, కన్యకా,

నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును?

నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది

నిన్ను స్వస్థపరచగలవాడెవడు?

14 నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు

నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకైవారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు.వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి

త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.

15 త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు

కొట్టెదరువారు యెరూషలేము కుమారిని చూచి

–పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు

సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు

జనులు ఈ పట్టణమునుగూర్చియేనా చెప్పిరి?

అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు

16 నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరువారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు

–దాని మ్రింగివేసియున్నాము

ఇదేగదా మనము కనిపెట్టినదినము

అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము

అని యనుకొనెదరు.

17 యెహోవా తాను యోచించిన కార్యము ముగించి

యున్నాడు

పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి

యున్నాడు

శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు

నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసి

యున్నాడు

నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.

18 జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ

పెట్టుదురు.

సీయోను కుమారి ప్రాకారమా,

నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము

విరామము కలుగనియ్యకుము

నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.

19 నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము

నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ

మును కుమ్మరించుము

నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయన

తట్టు ఎత్తుము

ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు

20 నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో

యెహోవా, దృష్టించి చూడుము.

తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి

పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా?

యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి

శుద్ధాలయమునందు హతులగుట తగునా?

21 యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు

నా కన్యకలును నా యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు

నీ ఉగ్రతదినమున నీవు వారిని హతము చేసితివి

దయ తలచక వారినందరిని వధించితివి.

22 ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా

నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను

రప్పించితివి.

యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేక

పోయెను

శేషమేమియు నిలువకపోయెను

నేను చేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు

హరించివేసియున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LAM/2-0f55ecd421e73e26553170d053d6a4c7.mp3?version_id=1787—

Categories
విలాపవాక్యములు

విలాపవాక్యములు 3

1 నేను ఆయన ఆగ్రహదండముచేత బాధననుభవించిన

నరుడను.

2 ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి

దానిలో నన్ను నడిపించుచున్నాడు.

3 మాటి మాటికి దినమెల్ల

ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు

4 ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప

జేయుచున్నాడు.

నా యెముకలను విరుగగొట్టుచున్నాడు

5 నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు

విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి

యున్నాడు

6 పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు

ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి

యున్నాడు

7 ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు

నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు

వేసియున్నాడు

8 నేను బతిమాలి మొరలిడినను

నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని

యున్నాడు.

9 ఆయన నా మార్గములకు అడ్డముగా

చెక్కుడురాళ్లు కట్టియున్నాడు

నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి

యున్నాడు

10 నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి

వలె ఉన్నాడు

చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు

11 నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి

యున్నాడు

నాకు దిక్కులేకుండ చేసియున్నాడు

12 విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా

ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు

13 తన అంబులపొదిలోని బాణములన్నియు

ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.

14 నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను

దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ

నైతిని.

15 చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను

మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను

16 రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను

బుగ్గిలో నన్ను పొర్లించెను.

17 నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి

యున్నాడు

మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.

18 నాకు బలము ఉడిగెను అనుకొంటిని

యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.

19 నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి

పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.

20 ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో

క్రుంగియున్నది

అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.

21 నేను దీని జ్ఞాపకము చేసికొనగా

నాకు ఆశ పుట్టుచున్నది.

22 యెహోవా కృపగలవాడు

ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక

మనము నిర్మూలము కాకున్నవారము.

23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది

నీవు ఎంతైన నమ్మదగినవాడవు.

24 యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను

ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.

25 తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా

ళుడు

తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

26 నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ

కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.

27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.

28 అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే.

గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ

వలెను.

29 నిరీక్షణాధారము కలుగునేమో యని

అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.

30 అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప

వలెను.

అతడు నిందతో నింపబడవలెను

31 ప్రభువు సర్వకాలము విడనాడడు.

32 ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి

పడును.

33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము

నైనను బాధనైనను కలుగజేయడు.

34 దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద

త్రొక్కుటయు

35 మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల

గించుటయు

36 ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు

ప్రభువు మెచ్చుకార్యములు కావు.

37 ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా

డెవడు?

38 మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును

బయలు వెళ్లునుగదా?

39 సజీవులేల మూల్గుదురు?

నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?

40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని

మనము యెహోవాతట్టు తిరుగుదము.

41 ఆకాశమందున్న దేవునితట్టు

మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.

42 మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము

నీవు మమ్మును క్షమింపలేదు.

43 కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము

చున్నావు

దయ తలచక మమ్మును చంపుచున్నావు.

44 మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత

నిన్ను కప్పుకొనియున్నావు.

45 జనములమధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి

యున్నావు.

46 మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి

చేసెదరు.

47 భయమును గుంటయు పాడును నాశనమును మాకు

తటస్థించినవి.

48 నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా

కన్నీరు ఏరులై పారుచున్నది.

49 యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు

వరకు

50 నా కన్నీరు ఎడతెగక కారుచుండును.

51 నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు

నేను దుఃఖాక్రాంతుడనైతిని.

52 ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా

నన్ను వెనువెంట తరుముదురు.

53 వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి

నాపైన రాయి యుంచిరి

54 నీళ్లు నా తలమీదుగా పారెను

నాశనమైతినని నేననుకొంటిని.

55 యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి

నేను నీ నామమునుబట్టి మొరలిడగా

56 నీవు నా శబ్దము ఆలకించితివి

సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా

చెవిని మూసికొనకుము.

57 నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు

వచ్చితివి

–భయపడకుమి అని నీవు చెప్పితివి.

58 ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము

లను వాదించితివి

నా జీవమును విమోచించితివి.

59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి

యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.

60 పగతీర్చుకొనవలెనని వారు నామీదచేయు ఆలోచన

లన్నియు నీవెరుగుదువు.

61 యెహోవా, వారి దూషణయువారు నామీదచేయు ఆలోచనలన్నిటిని

62 నామీదికి లేచినవారు పలుకు మాటలును

దినమెల్ల వారు నామీదచేయు ఆలోచనయు నీవు

వినియున్నావు.

63 వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని

పెట్టుము

నేను వారి పాటలకు ఆస్పదమైతిని.

64 యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ

కారము చేయుదువు.

65 వారికి హృదయకాఠిన్యము నిత్తువువారిని శపించుదువు.

66 నీవు కోపావేశుడవై వారిని తరిమి

యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LAM/3-d509529422b79a658afe03d6074523db.mp3?version_id=1787—