Categories
యెషయా

యెషయా 62

1 సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు

దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు

సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను

యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.

2 జనములు నీ నీతిని కనుగొనును

రాజులందరు నీ మహిమను చూచెదరు

యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట

బడును.

3 నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను

నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను

ఉందువు.

4 విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు

పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు

హెప్సీబాఅని నీకును బ్యూలాఅని నీ భూమికిని

పేళ్లు పెట్టబడును.

యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు

నీ దేశము వివాహితమగును.

5 యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు

నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు

పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించు

నట్లు

నీ దేవుడు నిన్నుగూర్చి సంతోషించును.

6 యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను

రేయైన పగలైనవారు మౌనముగా ఉండరు.

7 యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి

ఆయన యెరూషలేమును స్థాపించువరకు

లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు

ఆయనను విశ్రమింపనియ్యకుడి.

తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ

నియు

8 యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను

–నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు

ఆహారముగా నేనియ్యను

నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు

త్రాగరు.

9 ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు

స్తుతి చెల్లింతురు

పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో

దాని త్రాగుదురు.

10 గుమ్మములద్వారా రండి రండి

జనమునకు త్రోవ సిద్ధపరచుడి

రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి

రాళ్లను ఏరి పారవేయుడి

జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

11 ఆలకించుడి, భూదిగంతములవరకు

యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు

ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది

ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే

యున్నది

ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా

డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.

12 పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార

నియు వారికి పేరు పెట్టబడును.

యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని

పట్టణమనియు

నీకు పేరు కలుగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/62-e1071e3370d06bb5cdee58d5ab254616.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 63

1 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చు

చున్న యితడెవడు?

శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు

బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత

డెవడు?

నీతినిబట్టి మాటలాడుచున్న నేనే

రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

2 నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి?

నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని

బట్టలవలె ఉన్న వేమి?

3 ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో

ఎవడును నాతోకూడ ఉండలేదు

కోపగించుకొని వారిని త్రొక్కితిని

రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని

వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్ట

లన్నియు డాగులే.

4 పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను

విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

5 నేను చూచి ఆశ్చర్యపడితిని

సహాయము చేయువాడొకడును లేకపోయెను

ఆదరించువాడెవడును లేకపోయెను

కావున నా బాహువు నాకు సహాయము చేసెను

నా ఉగ్రత నాకాధారమాయెను.

6 కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని

ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితినివారి రక్తమును నేల పోసివేసితిని.

7 యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి

యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము

లను గానముచేతును.

తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును

బట్టియు

ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన

మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

8 –వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు

అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

9 వారి యావద్బాధలో ఆయన బాధనొందెను

ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను

ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను

పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు

మోసికొనుచు వచ్చెను.

10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను

దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను

తానే వారితో యుద్ధము చేసెను.

11 అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను

లను జ్ఞాపకము చేసికొనెను.

తన మందకాపరులకు సహకారియై సముద్రములో

నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

12-13 తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి?

మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును

పోనిచ్చినవాడేడి?

తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు

వారిముందర నీళ్లను విభజించినవాడేడి?

మైదానములో గుఱ్ఱము పడనిరీతిగావారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి?

యనుకొనిరి

14 పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు

యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను

నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడి

పించితివి

15 పరమునుండి చూడుము

మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి

దృష్టించుము

నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి?

నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి

పోయెనే.

16 మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక

పోయినను

ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను

యెహోవా, నీవే మా తండ్రివి

అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే

గదా.

17 యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా

మమ్మును ఎందుకు తొలగజేసితివి?

నీ భయము విడుచునట్లు

మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి?

నీ దాసుల నిమిత్తము

నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.

18 నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ

వించిరి

మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు.

19 నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి

నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/63-f765b607f58680e310134c56d2b64745.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 64

1 గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక

నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.

2 నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై

అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను

అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను

నీవు దిగివచ్చెదవు గాక.

3 జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు

నీవు చేయగా

అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక

నీవు దిగివచ్చెదవు గాక

నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.

4 తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప

తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని

ఎవడు నేకాలమున చూచియుండలేదు

అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు

వినబడలేదు

5 అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.

నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు

సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు

చున్నావు.

చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి

బహుకాలమునుండి పాపములలో పడియున్నాము

రక్షణ మాకు కలుగునా?

6 మేమందరము అపవిత్రులవంటివారమైతిమి

మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను

మేమందరము ఆకువలె వాడిపోతిమి

గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా

మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

7 నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక

పోయెను

నిన్ను ఆధారము చేసికొనుటకై

తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు

నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి

మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

8 యెహోవా, నీవే మాకు తండ్రివి

మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు

మేమందరము నీ చేతిపనియై యున్నాము.

9 యెహోవా, అత్యధికముగా కోపపడకుము

మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి

కొనకుము

చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమంద

రము నీ ప్రజలమే గదా.

10 నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను

సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

11 మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ

మందిరము.

మా శృంగారమైనమందిరము అగ్నిపాలాయెను

మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

12 యెహోవా, వీటిని చూచి ఊరకుందువా?

మౌనముగానుందువా?

అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/64-04a5ece66956b8994024bb96a28e1673.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 65

1 నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు .

రానిచ్చితిని

నన్ను వెదకనివారికి నేను దొరికితిని.

–నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు

పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.

2 తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు

కొనుచు

లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు

చాపుచున్నాను.

3 వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల

మీద ధూపము వేయుదురు

నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు.

4 వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో

ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు

అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి

5 వారు–మా దాపునకురావద్దు ఎడముగా ఉండుము

నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు;

వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను

దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.

6 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి

యున్నది

ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను

నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి

కారము చేసెదను.

7 నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీపితరుల

దోషములనుబట్టియు

అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన

దానినిబట్టియు

కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు

మొట్టమొదట వారి ఒడిలోనేవారి ప్రతికారము కొలిచి పోయుదును.

8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు

జనులు–ఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము

అని చెప్పుదురు గదా?

నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లువారినిబట్టి నేనాలాగే చేసెదను.

9 యాకోబునుండి సంతానమును యూదానుండి నా

పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించె

దను

నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు

కొందురు

నా సేవకులు అక్కడ నివసించెదరు.

10 నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము

షారోను గొఱ్ఱెల మేతభూమియగును

ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా

ఉండును.

11 యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి

గాదునకుబల్లను సిద్ధపరచువారలారా,

అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా,

నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు

12 నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి

చెడ్డదైనదాని చేసితిరి

నాకిష్టము కానిదాని కోరితిరి

నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును

మీరందరు వధకు లోనగుదురు.

13 కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు

చున్నాడు

–ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు

గాని మీరు ఆకలిగొనెదరు

నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనె

దరు.

నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు

14 నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని

మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు

మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.

15 నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా

చేసిపోయెదరు

ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును

ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.

16 దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరు

వాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని

కోరుకొనును

దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని

తోడని ప్రమాణము చేయును

పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును

అవి నా దృష్టికి మరుగవును.

17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును

క్రొత్త భూమిని సృజించుచున్నాను

మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.

18 నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు

హర్షించి ఆనందించుడి

నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన

స్థలముగాను

ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు

చున్నాను.

19 నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను

నా జనులనుగూర్చి హర్షించెదను

రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన

బడవు.

20 అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు

కాలమునిండని ముసలివారుండరు

బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని

పోవుదురు

పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు

సంవత్సరములు బ్రదుకును

21 జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు

ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభ

వింతురు.

22 వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరువారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు

నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును

నేను ఏర్పరచుకొనినవారు

తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ

వింతురు

23 వారు వృథాగా ప్రయాసపడరు

ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను

కనరువారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురువారి సంతానపువారు వారియొద్దనే యుందురు.

24 వారికీలాగున జరుగునువారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదనువారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.

25 తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును

సింహము ఎద్దువలె గడ్డి తినును

సర్పమునకు మన్ను ఆహారమగును

నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన

మైనను చేయకుండును

అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/65-181bc4fbf5eef0e5cc86ee27e9dd0718.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 66

1 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు

ఆకాశము నా సింహాసనము

భూమి నా పాద పీఠము

మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది?

నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది

ఏపాటిది?

2 అవన్నియు నా హస్తకృత్యములు

అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు

చున్నాడు.

ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట

విని వణకుచుండునో

వానినే నేను దృష్టించుచున్నాను.

3 ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే

గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను

విరుచువానివంటివాడే

నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని

వంటివాడే

ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి

వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరివారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగా

ఉన్నవి.

4 నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక

పోయెను

నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక

పోయెను

నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి

నాకిష్టము కానిదాని కోరుకొనిరి

కావున నేనును వారిని మోసములో ముంచుదునువారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.

5 యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన

మాట వినుడి

మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును

త్రోసివేయు మీ స్వజనులు

–మీ సంతోషము మాకు కనబడునట్లు

యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు

వారే సిగ్గునొందుదురు.

6 ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది

దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది

తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు

యెహోవా శబ్దము వినబడుచున్నది.

7 ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది

నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.

8 అట్టివార్త యెవరు వినియుండిరి?

అట్టి సంగతులు ఎవరు చూచిరి?

ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన

చాలునా?

ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?

సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను

కనెను.

9 నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా?

అని యెహోవా అడుగుచున్నాడు.

పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని

నీ దేవుడడుగుచున్నాడు.

10 యెరూషలేమును ప్రేమించువారలారా,

మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి.

ఆమెనుబట్టి దుఃఖించువారలారా,

మీరందరు ఆమెతో ఉత్సహించుడి

11 ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి

నొందెదరు

ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె

దరు.

12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు

పారజేయుదును

మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు

ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె

మీయొద్దకు దానిని రాజేతును

మీరు చంకను ఎత్తికొనబడెదరు

మోకాళ్లమీద ఆడింపబడెదరు.

13 ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద

రించెదను

యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును

మీ యెముకలు లేతగడ్డివలె బలియును

యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను

పరచబడును

ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

15 ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట

కును

అగ్నిజ్వాలలతో గద్దించుటకును

యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు

ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.

16 అగ్ని చేతను తన ఖడ్గముచేతను

శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును

యెహోవాచేత అనేకులు హతులవుదురు.

17 తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని

చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు

కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తు

వును పందికొక్కులను తినువారును

ఒకడును తప్పకుండ నశించెదరు

ఇదే యెహోవా వాక్కు.

18 వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి

అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట

లాడువారిని సమకూర్చెదనువారు వచ్చి నా మహిమను చూచెదరు.

19 నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదనువారిలో తప్పించుకొనినవారిని

విలుకాండైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్ద

కును

తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె

దను

నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి

మను చూడనట్టియు

దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

20 ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య

మును

యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా

గుఱ్ఱములమీదను రథములమీదను

డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను

ఎక్కించి

సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు

యెరూషలేమునకు

మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగావారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు

చున్నాడు.

21 మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై

నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును

అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–

22 నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త

భూమియు

లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు

నీ సంతతియు నీ నామమును నిలిచియుండును

ఇదే యెహోవా వాక్కు.

23 ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము

నను

నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె

దరు

అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

24 వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబర

ములను తేరి చూచెదరు

వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు

అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/66-2f2ab255fd1667bab3ac8082a162900b.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 1

1 బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు

2 –ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.౹

3 మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను.

4-5 యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.౹

6 అందుకు–అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

7 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను– నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.౹

8 వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹

9 అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను–ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.౹

10 పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనములమీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.

11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై –యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు – బాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా

12 యెహోవా–నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.౹

13 రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై–నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేను–మసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.౹

14 అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను–ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.౹

15 ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు.౹

16 అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.౹

17 కాబట్టి నీవు నడుముకట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.౹

18 యూదారాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.౹

19 వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందునవారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/1-ce5a0c81f8c025b3d33f67b276cfae32.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 2

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.౹

3 అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు.

4 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.౹

5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?

6 ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు.౹

7 దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.౹

8 యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్‍ప్రయోజనమైనవాటిని అనుసరింతురు

9 కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.౹

10 కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?

11 దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.౹

12 ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.౹

13 నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.౹

14 ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను?

15 కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశమును పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను.౹

16 నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.౹

17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹

18 నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.౹

19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

20 పూర్వకాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని–నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.౹

21 శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతానమైతివి?

22 నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.౹

23 –నేను అపవిత్రత నొందినదానను కాను, బయలుదేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,౹

24 అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.౹

25 జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు–ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.౹

26 దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు–నీవు మా తండ్రివని మ్రానుతోను –నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.౹

27 వారు నాతట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములో–లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.౹

28 నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.

29 మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.౹

30 నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.౹

31 ఈ తరమువారలారా, యెహోవా సెలవిచ్చుమాట లక్ష్యపెట్టుడి–నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతిమి; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?

32 కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.౹

33 కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.౹

34 మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.౹

35 అయినను నీవు–నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగో–పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.౹

36 నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.౹

37 చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/2-8d04ea3bbe924cdfbf0ed968816aa86d.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 3

1 మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతనియొద్దనుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమెయొద్దకు తిరిగిచేరునా? ఆలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా; అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నాయొద్దకు తిరిగిరమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

2 చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.౹

3 కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యముగలదు, సిగ్గు పడనొల్లకున్నావు.౹

4 అయినను ఇప్పుడు నీవు–నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?

5 ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.

6 మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను – ద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.౹

7 ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దాని చూచెను.౹

8 ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభిచారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది.౹

9 రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.౹

10 ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

11 కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది.౹

12 నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము–ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నాకోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.౹

13 –నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటుచేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.౹

14 భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.౹

15 నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.౹

16 మీరు ఆ దేశములో అభివృద్ధిపొంది విస్తరించు దినములలో జనులు–యెహోవా నిబంధనమందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.౹

17 ఆ కాలమున–యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనములన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.౹

18 ఆ దినములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీపితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.౹

19 నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెద ననుకొనియుంటిని. నీవు–నా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?

20 అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.౹

21 ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానినిబట్టి ఇశ్రాయేలీయులుచేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.౹

22 భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి; మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడవైన యెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము,౹

23 నిశ్చయముగా కొండలమీద జరిగినది మోస కరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.౹

24 అయినను మా బాల్యమునుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొఱ్ఱెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మ్రింగివేయుచున్నది.౹

25 సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యము నుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/3-9ad9c187be42cb90be93ae42d8245ab7.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 4

1 ఇదే యెహోవా వాక్కు–ఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి

2 సత్యమునుబట్టియు న్యాయమునుబట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణముచేసినయెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు.

3 యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి.౹

4 అవిధేయులైయుండుట మానుకొని మీ దుష్టక్రియలనుబట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.౹

5 యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా–ప్రాకారముగల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి.౹

6 సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను,౹

7 పొదలలోనుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశ కుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగానుండును.౹

8 ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి; రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మనమీదికి రాకుండ మానిపోలేదు;౹

9 ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులును ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయ మొందుదురు.౹

10 అప్పుడు నేనిట్లంటిని – కటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవు–మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.౹

11 ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును–అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.౹

12 అంతకంటె మిక్కుటమైన గాలి నామీద కొట్టుచున్నది. ఇప్పుడు వారిమీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు.౹

13 మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగముగలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితిమి.౹

14 యెరూష లేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?

15 దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు,౹

16 ముట్టడివేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.౹

17 ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.౹

18 నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?

19 నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఫెూష నీకు వినబడుచున్నది గదా?

20 కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి.౹

21 నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచు చుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?

22 నా జనులు అవివేకులువారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలుచేయుటకు వారికి బుద్ధి చాలదు.

23 నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.౹

24 పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.౹

25 నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షు లన్నియు ఎగిరిపోయియుండెను.౹

26 నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.౹

27 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.౹

28 దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.౹

29 రౌతులును విలు కాండ్రునుచేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవు చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలో నివాసులెవరును లేరు,౹

30 దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణభూషణములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు.౹

31 ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె–అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/4-65b1834e97ea9c71007a6ad07800e06a.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 5

1 యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.౹

2 యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.౹

3 యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృిష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.౹

4 నేనిట్లనుకొంటిని–వీరు ఎన్నికలేనివారై యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై యున్నారు.౹

5 ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపు కొనినవారుగాను ఉన్నారు.౹

6 వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.౹

7 నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును?

8 బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకిలించును

9 అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నాకోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.

10 దాని ప్రాకారములెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.౹

11 ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.౹

12 వారు– పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,౹

13 ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.౹

14 కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹

15 ఇశ్రాయేలు కుటుంబమువారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.౹

16 వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలాఢ్యులు,౹

17 వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱెలను నీ పశువులను నాశనముచేయుదురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడు చేయుదురు.౹

18 అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.౹

19 –మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము–మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచి నందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

20 యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి

21 –కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.౹

22 సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.౹

23 ఈ జనులు తిరుగుబాటును ద్రోహమునుచేయు మనస్సుగల వారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగి పోవుచున్నారు.౹

24 వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹

25 మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.౹

26 నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లువారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.౹

27 పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.౹

28 వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.౹

29 అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

30 ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగుచున్నది.౹

31 ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/5-de94ebf52d7091d271433df3a6bd6eeb.mp3?version_id=1787—