Categories
యెషయా

యెషయా 52

1 సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము

పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర

ములను ధరించుకొనుము

ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను

అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

2 ధూళి దులుపుకొనుము యెరూషలేమా,

లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ,

నీ మెడకట్లు విప్పివేసికొనుము.

3 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–మీరు ఊరకయే అమ్మబడితిరి గదా

రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

4 దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా

తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా

జనులు ఐగుప్తునకు పోయిరి.

మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.

5 నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు

వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు

ఇదే యెహోవా వాక్కు

దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

6 కావున ఇచ్చట నేనేమి చేయవలెను?

ఇదే యెహోవా వాక్కు.

నా జనులు నా నామము తెలిసికొందురు

నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దిన

మున తెలిసికొందురు.

7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు

సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము

ప్రచురించువాని పాదములు,

నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న

వాని పాదములు

పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

8 ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు

కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు

యెహోవా సీయోనును మరల రప్పించగా వారు

కన్నులార చూచుచున్నారు.

9 యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా,

ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి

యెహోవా తన జనులను ఆదరించెను యెరూష

లేమును విమోచించెను.

10 సమస్తజనముల కన్నులయెదుట

యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి

యున్నాడు.

భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ

చూచెదరు.

11 పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి

అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి

తొలగిపోవుడి

యెహోవా సేవోపకరణములను మోయువారలారా,

మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి

12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా

వెళ్లరు.

యెహోవా మీ ముందర నడచును

ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును

కావలికాయును

13 ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును

అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా

ఎంచబడును.

14 నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖ

మును, నరరూపముకంటె అతని రూపమును చాల

వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరో

15 ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును

రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు

తమకు తెలియజేయబడని సంగతులువారు చూచెదరు

తాము విననిదానిని గ్రహింతురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/52-db8c6ca570a1225cf22cd4b3e6b8a140.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 53

1 మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?

యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

2 లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన

మొక్కవలెను

అతడు ఆయనయెదుట పెరిగెను.

అతనికి సురూపమైనను సొగసైనను లేదు

మనమతని చూచి, అపేక్షించునట్లుగా

అతనియందు సురూపము లేదు.

3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను

మనుష్యులవలన విసర్జింపబడినవాడును

వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు

గాను

మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను.

అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని

ఎన్నికచేయకపోతిమి.

4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను

మన వ్యసనములను వహించెను

అయినను మొత్తబడినవానిగాను

దేవునివలన బాధింపబడినవానిగాను

శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ

బడెను

మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను

మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను

అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.

6 మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి

మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను

యెహోవా మన యందరి దోషమును అతనిమీద

మోపెను.

7 అతడు దౌర్జన్యము నొందెను

బాధింపబడినను అతడు నోరు తెరవలేదు

వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు

బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు

మౌనముగా నుండునట్లు

అతడు నోరు తెరవలేదు.

8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను

అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను

గదా.

సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను

అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో

చించినవారెవరు?

9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి

నియమింపబడెను

ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను

నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు

అతని నోట ఏ కపటమును లేదు.

10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను

ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.

అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా

అతని సంతానము చూచును.

అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము

అతనివలన సఫలమగును.

11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును.

నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి

తనకున్న అనుభవజ్ఞానము చేత

అనేకులను నిర్దోషులుగా చేయును.

12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను

ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును.

ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ

మును ధారపోసెను

అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను

అనేకుల పాపమును భరించుచు

తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/53-d1bbb6717c120bc026a318b93a4215be.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 54

1 గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము

ప్రసవవేదన పడనిదానా, జయకీర్తననెత్తి ఆనంద

పడుము

సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార

మగుదురని

యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2 నీ గుడారపు స్థలమును విశాలపరచుము

నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము,

నీ త్రాళ్లను పొడుగుచేయుము

నీ మేకులను దిగగొట్టుము.

3 కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు

నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు

కొనును

పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

4 భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు

అవమానమును తలంచకుము

నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు

సిగ్గును మరచుదువు

నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.

5 నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు

సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు

పేరు.

ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు

సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.

6 నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు

–విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు

షుడు రప్పించినట్లును

తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు

రప్పించినట్లును

యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.

7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని

గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

8 మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ

నైతిని

నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును

అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు

చున్నాడు.

9 నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను

చేసినట్లు చేయుదును

జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని

నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు

నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు

నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.

10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను

నా కృప నిన్ను విడిచిపోదు

సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు

అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు

చున్నాడు.

11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక

యున్నదానా,

నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును

నీలములతో నీ పునాదులను వేయుదును

12 మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను

సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును

ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు

దును.

13 నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు

నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

14 నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు

నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర

ముగా నుందురు

భీతి నీకు దూరముగా ఉండును

అది నీ దగ్గరకు రానేరాదు.

15 జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు

నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు

దురు.

16 ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పని

ముట్టుచేయు కమ్మరిని సృజించువాడను నేనే

నాశనము చేయుటకై పాడుచేయువాని సృజించు

వాడను నేనే

17 నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును

వర్ధిల్లదు

న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి

వానికి నీవు నేరస్థాపన చేసెదవు

యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము,

ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/54-ffd2c983d77651215b22333aca7ad6bb.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 55

1 దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి

రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము

చేయుడి.

రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే

ద్రాక్షారసమును పాలను కొనుడి.

2 ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు?

సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును

ఎందుకు వ్యయపరచెదరు?

నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము

భుజించుడి

మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి.

3 చెవియొగ్గి నాయొద్దకు రండి

మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు

నేను మీతో నిత్యనిబంధన చేసెదను

దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.

4 ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని

జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి

తిని

5 నీవెరుగని జనులను నీవు పిలిచెదవు

నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా

చూచి

నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ

దేవునిబట్టి

నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.

6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను

వెదకుడి

ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు

కొనుడి.

7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను

దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి

యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా

క్షమించును.

8 నా తలంపులు మీ తలంపులవంటిని కావు

మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు

ఇదే యెహోవా వాక్కు

9 ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో

మీ మార్గములకంటె నా మార్గములు

మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా

ఉన్నవి.

10 వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి

ఏలాగు మరలక

భూమిని తడిపి విత్తువానికి విత్తనమును

భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి

వర్ధిల్లునట్లు చేయునో

ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11 నిష్ఫలముగా నాయొద్దకు మరలక

అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును

నేను పంపిన కార్యమును సఫలముచేయును.

12 మీరు సంతోషముగా బయలువెళ్లుదురు

సమాధానము పొంది తోడుకొని పోబడుదురు

మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము

చేయును

పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

13 ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు

చును

దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు

గును

అది యెహోవాకు ఖ్యాతిగాను

ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన

గాను ఉండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/55-bb3d678f7e3d7109361497c910a078ed.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 56

1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది

నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది.

న్యాయవిధిని అనుసరించుడి

నీతిని అనుసరించి నడుచుకొనుడి.

2 నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ

కుండ దానిని అనుసరించుచు

ఏ కీడుచేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు

ఆప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు

ధన్యుడు.

3 యెహోవాను హత్తుకొను అన్యుడు–

నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను

వెలివేయునని అనుకొనవద్దు.

షండుడు–నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

4 నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు

నాకిష్టమైనవాటిని కోరుకొనుచు

నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను

గూర్చి

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

5 –నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ

మును వారికిచ్చెదను

కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె

శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను

కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

6 విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు

నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు

దాసులై యెహోవా నామమును ప్రేమించుచు

ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున

చేరు అన్యులను

నా పరిశుద్ధపర్వతమునకు తోడుకొని వచ్చెదను

7 నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను

నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు

లును నాకు అంగీకారములగును

నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన

బడును.

8 ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు

ప్రభువగు యెహోవా వాక్కు ఇదే

–నేను సమకూర్చిన ఇశ్రాయేలువారికిపైగా ఇతరు

లను కూర్చెదను.

9 పొలములోని సమస్త జంతువులారా,

అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు

రండి.

10 వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు

వారందరు మూగకుక్కలు మొరుగలేరు

కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.

11 కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి

తృప్తిలేదు.

ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు

వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు

ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా

రించుకొందురు.

12 వారిట్లందురు–నేను ద్రాక్షారసము తెప్పించెదను

మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి

నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/56-afde5de4ecb8e5eb41df20b5a63bbc57.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 57

1 నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని

మనస్సున పెట్టరు

భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు

కీడు చూడకుండ నీతిమంతులుకొనిపోబడుచున్నారని

యెవనికిని తోచదు.

2 వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు

తమకు సూటిగానున్న మార్గమున నడచువారు

తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.

3 మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార

సంతానమా,

వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.

4 మీరెవని ఎగతాళి చేయుచున్నారు?

ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు?

మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును

కారా?

5 మస్తచావృక్షములనుచూచి పచ్చని ప్రతిచెట్టు

క్రిందను కామము రేపుకొనువారలారా,

లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార

లారా,

6 నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది

అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము

చేయుచున్నావు

వాటికే నైవేద్యము నర్పించుచున్నావు.

ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

7 ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి

కొంటివి

బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి

తలుపువెనుకను ద్వారబంధము వెనుకను

నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి

8 నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి

నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో

నిబంధన చేసితివి

నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం

చితివి.

9 నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి

పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని

నీ రాయబారులను దూరమునకు పంపితివి

పాతాళమంత లోతుగా నీవు లొంగితివి

10 నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను

అది అసాధ్యమని నీవనుకొనలేదు

నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.

11 ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్క

రింపకపోతివి?

నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి

బహుకాలమునుండి నేను మౌనముగానుండినందుననే

గదా

నీవు నాకు భయపడుట లేదు?

12 నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు

నీకు నిష్‌ప్రయోజనములగును.

13 నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను

తప్పించునేమో

గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా?

ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు

కొట్టుకొనిపోవును

నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు

కొందురు

నా పరిశుద్ధపర్వతమును స్వాధీనపరచుకొందురు.

14 –ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి

త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల

మార్గములోనుండి తీసివేయుడి

అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.

15 మహా ఘనుడును మహోన్నతుడును

పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల

విచ్చుచున్నాడు

–నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు

వాడను

అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప

జేయుటకును

నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును

వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను

నివసించుచున్నాను.

16 నేను నిత్యము పోరాడువాడను కాను

ఎల్లప్పుడును కోపించువాడను కాను

ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణిం

చును

నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.

17 వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను

ఆగ్రహపడి వారిని కొట్టితిని

నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితినివారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు

వచ్చిరి.

18 నేను వారి ప్రవర్తనను చూచితిని

వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతునువారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.

19 వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు

దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమా

ధానమని చెప్పి

నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు

చున్నాడు.

20 భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు

అది నిమ్మళింపనేరదు

దాని జలములు బురదను మైలను పైకివేయును.

21 దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు

చున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/57-44bff839cc4dee1d43abba32e9b50554.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 58

1 తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలువేయుమువారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము

యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము

2 తమ దేవుని న్యాయవిధిని విడువక

నీతిని అనుసరించువారైనట్టు

అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు

నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు

తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు

గుదురు

దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ

యింతురు.

3 మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు?

మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా

నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు

మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము

చేయుదురు.

మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు

4 మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ

ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు

మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు

ఉపవాసముండరు.

5 అట్టి ఉపవాసము నాకనుకూలమా?

మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన

దినము అట్టిదేనా?

ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని

బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా?

అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను

కొందురా?

6 దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు

కాడిమాను మోకులు తీయుటయు

బాధింపబడినవారిని విడిపించుటయు

ప్రతి కాడిని విరుగగొట్టుటయు

నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7-8 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త

సంబంధికి ముఖము తప్పింపకుండుటయు

దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము

లిచ్చుటయు

ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము?

ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క

వలె ఉదయించును

స్వస్థత నీకు శీఘ్రముగా లభించును

నీ నీతి నీ ముందర నడచును

యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును

కావలికాయును.

9 అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును

నీవు మొఱ్ఱపెట్టగా ఆయన–నేనున్నాననును.

ఇతరులను బాధించుటయు

వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు

చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని

10 ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని

తృప్తిపరచినయెడల

చీకటిలో నీ వెలుగు ప్రకాశించును

అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును

క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక

లను బలపరచును

నీవు నీరు కట్టిన తోటవలెను

ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

12 పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ

జనులు కట్టెదరు

అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను

నీవు మరల కట్టెదవు

విరుగబడినదానిని బాగుచేయువాడవనియు

దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడ

వనియు నీకు పేరు పెట్టబడును.

13 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ

నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల

విశ్రాంతిదినము మనోహరమైనదనియు

యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు

అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల

నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ

కయు

లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

14 నీవు యెహోవాయందు ఆనందించెదవు

దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం

చెదను

నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ

ములో ఉంచెదను

యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/58-4d458efd276ef564d768cbd0c991a5a7.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 59

1 రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము

కురుచకాలేదు

విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము

కాలేదు

2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా

వచ్చెను

మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు

పరచెను

గనుక ఆయన ఆలకింపకున్నాడు.

3 మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను

అపవిత్రపరచబడియున్నవి

మీ పెదవులు అబద్ధములాడుచున్నవి

మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

4 నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు

సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు

అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు

పలుకుదురు

చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.

5 వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు

సాలెపురుగు వల నేయుదురు

ఆ గుడ్లు తినువాడు చచ్చును

వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష

సర్పము పుట్టును.

6 వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదువారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో

గింపదు

వారి క్రియలు పాపక్రియలేవారు బలాత్కారము చేయువారే.

7 వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి

నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును

వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు

పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి

8 శాంతవర్తనమును వారెరుగరువారి నడవడులలో న్యాయము కనబడదువారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు

వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.

9 కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది

నీతి మమ్మును కలిసికొనుటలేదు

వెలుగుకొరకు మేముకనిపెట్టుకొనుచున్నాము గాని

చీకటియే ప్రాప్తించును

ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని

అంధకారములోనే నడచుచున్నాము

10 గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము

కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము

సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు

జారి పడుచున్నాము

బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి

వలె ఉన్నాము.

11 మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము

గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము

న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది

లభించుటలేదు

రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు

దూరముగా ఉన్నది

12 మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్త

రించియున్నవి

మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి

మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి.

మా దోషములు మాకు తెలిసేయున్నవి.

13 తిరుగుబాటు చేయుటయు

యెహోవాను విసర్జించుటయు

మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు

బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు

వచించుటయు

హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు

కుటయు

ఇవియే మావలన జరుగుచున్నవి.

14 న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది

నీతి దూరమున నిలుచుచున్నది

సత్యము సంతవీధిలో పడియున్నది

ధర్మము లోపల ప్రవేశింపనేరదు.

15 సత్యము లేకపోయెను

చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు

న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది

ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.

16 సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను

మధ్యవర్తిలేకుండుట చూచి ఆశ్చర్యపడెను.

కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము

చేసెను

ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.

17 నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను

రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను

18 ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను

ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను

వారి క్రియలనుబట్టి ఆయన ప్రతి దండన చేయును

తన శత్రువులకు రౌద్రము చూపును

తన విరోధులకు ప్రతికారము చేయును

ద్వీపస్థులకు ప్రతికారము చేయును.

19 పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు

భయపడుదురు

సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు

భయపడుదురు

యెహోవా పుట్టించుగాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ

జలమువలె ఆయన వచ్చును.

20 సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట

మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు

వచ్చును

ఇదే యెహోవా వాక్కు.

21 నేను వారితోచేయు నిబంధన యిది

–నీ మీదనున్న నా ఆత్మయు

నేను నీ నోటనుంచిన మాటలును

నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు

నీ పిల్లల పిల్లల నోటనుండియు

ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు

అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/59-a52adedf6e56aa35770d5a350f63bcaa.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 60

1 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము

యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

2 చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది

కటికచీకటి జనములను కమ్ముచున్నది

యెహోవా నీమీద ఉదయించుచున్నాడు

ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

3 జనములు నీ వెలుగునకు వచ్చెదరు

రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

4 కన్నులెత్తి చుట్టు చూడుము

వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు

నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు

నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

5 నీవు చూచి ప్రకాశింతువు

నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును

సముద్రవ్యాపారము నీవైపు త్రిప్పబడును

జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

6 ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె

లును నీ దేశముమీద వ్యాపించును

వారందరు షేబనుండి వచ్చెదరు

బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు

యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

7 నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును

నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము

లగును

అవి నా బలిపీఠముమీద అంగీకారములగును

నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.

8 మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి

వచ్చు వీరెవరు?

9 నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి

ఆయన నిన్ను శృంగారించినందున

ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి

దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము

లను తీసికొని వచ్చుటకు

ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి

తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

10 అన్యులు నీ ప్రాకారములను కట్టుదురువారి రాజులు నీకు ఉపచారము చేయుదురు

ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని

కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

11 నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లువారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు

నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక

నిత్యము తెరువబడి యుండును.

12 నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు

అట్టి జనములు నిర్మూలము చేయబడును.

13 నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై

లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును

సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును

నేను నా పాదస్థలమును మహిమపరచెదను.

14 నిన్ను బాధించినవారి సంతానపువారు

నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు

నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద

పడెదరు.

యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని

సీయోననియు నీకు పేరు పెట్టెదరు.

15 నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటను

బట్టియు

ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు.

నిన్ను శాశ్వత శోభాతిశయముగాను

బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.

16 యెహోవానగు నేను నీ రక్షకుడననియు

బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ

విమోచకుడననియు నీకు తెలియబడునట్లు

నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు

త్రాగెదవు.

17 నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను

ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని

రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను.

సమాధానమును నీకధికారులుగాను

నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

18 ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు

నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము

అను మాటగాని వినబడదు

రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ

గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.

19 ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా

ఉండదు

నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు

యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును

నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

20 నీ సూర్యుడికను అస్తమింపడు

నీ చంద్రుడు క్షీణింపడు

యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును

నీ దుఃఖదినములు సమాప్తములగును.

21 నీ జనులందరు నీతిమంతులైయుందురు

నన్ను నేను మహిమపరచుకొనునట్లువారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను

ఉండి

దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

22 వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును

ఎన్నికలేనివాడు బలమైన జనమగును

యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును

త్వరపెట్టుదును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/60-a323a1cb8cec33414a7a212f1432f6a4.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 61

1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది

దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా

నన్ను అభిషేకించెను

నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును

చెరలోనున్నవారికి విడుదలను

బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2 యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన

దినమును ప్రకటించుటకును

దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

3 సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు

ధరింపజేయుటకును

బూడిదెకు ప్రతిగా పూదండను

దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును

భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమునువారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు.

యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు

నీతి అను మస్తకివృక్షములనియు

యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట

బడును.

4 చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు

కట్టుదురు

పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు

పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు

తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు

చేయుదురు.

5 అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు

పరదేశులు మీకు వ్యవసాయకులును

మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు

6 మీరు యెహోవాకు యాజకులనబడుదురు

–వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును

గూర్చి చెప్పుదురు

జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురువారి ప్రభావమును పొంది అతిశయింతురు

7 మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు

దురు

నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించివారు సంతోషింతురువారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు

నిత్యానందము వారికి కలుగును.

8 ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు

నాకిష్టము

ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట

నాకసహ్యము.

సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచువారితో నిత్యనిబంధన చేయుదును.

9 జనములలో వారి సంతతి తెలియబడును

జనములమధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును

–వారు యెహోవా ఆశీర్వదించిన జనమనివారిని చూచినవారందరు ఒప్పుకొందురు

10 శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని

రీతిగాను

ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి

గాను

ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి

యున్నాడు

నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు

కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను

ఆనందించుచున్నాను

నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది

11 భూమి మొలకను మొలిపించునట్లుగాను

తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను

నిశ్చయముగా సమస్త జనముల యెదుట

ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప

జేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/61-1cb4a388e0f368b6c8a21da390b6d3d1.mp3?version_id=1787—