Categories
సామెతలు

సామెతలు 13

1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును.

అపహాసకుడు గద్దింపునకు లోబడడు.

2 నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును

విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.

3 తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును

ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.

4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు

దొరకదు

శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

5 నీతిమంతునికి కల్ల మాట అసహ్యము

భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.

6 యథార్థవర్తనునికి నీతియే రక్షకము

భక్తిహీనత పాపులను చెరిపివేయును.

7 ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు

దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.

8 ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము

చేయును

దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.

9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును

భక్తిహీనుల దీపము ఆరిపోవును.

10 గర్వమువలన జగడమే పుట్టును

ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.

11 మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును

కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి

కొనును.

12 కోరిక సఫలము కాకుండుటచేత హృదయము

నొచ్చును

సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.

13 ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును

ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.

14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట

అది మరణపాశములలోనుండి విడిపించును.

15 సుబుద్ధి దయను సంపాదించును

విశ్వాసఘాతకుల మార్గము కష్టము.

16 వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు

బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.

17 దుష్టుడైన దూత కీడునకు లోబడును.

నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.

18 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్యతలు

ప్రాప్తించును

గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

19 ఆశ తీరుట ప్రాణమునకు తీపి

చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.

20 జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును.

మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

21 కీడు పాపులను తరుమును

నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.

22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా

చేయును

పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.

23 బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా

పండును

అన్యాయమువలన నశించువారు కలరు.

24 బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి

కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.

25 నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును

భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/13-89f5c1b79ff7332a11dd352007fba5cf.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 14

1 జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును

మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ

బెరుకును.

2 యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు

భయభక్తులుగలవాడు

కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు,

3 మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది.

జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.

4 ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు

ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును

5 నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు

కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

6 అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము.

తెలివిగలవానికి జ్ఞానము సులభము.

7 బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము

జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?

8 తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము

మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.

9 మూఢులుచేయు అపరాధపరిహారార్థబలి వారిని

అపహాస్యము చేయును

యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు.

10 ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును

ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు.

11 భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును

యథార్థవంతుల గుడారము వర్ధిల్లును.

12 ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము

కలదు

అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ

వచ్చును.

సంతోషము తుదకు వ్యసనమగును.

14 భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును

మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.

15 జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును

వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.

16 జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును

బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.

17 త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును.

దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.

18 జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము

వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.

19 చెడ్డవారు మంచివారి యెదుటను

భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు.

20 దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు

ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.

21 తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు

బీదలను కటాక్షించువాడు ధన్యుడు.

22 కీడు కల్పించువారు తప్పిపోవుదురు

మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.

23 ఏ కష్టము చేసినను లాభమే కలుగును

వట్టిమాటలు లేమిడికి కారణములు.

24 జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము

బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.

25 నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును

అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.

26 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట

బహు ధైర్యము పుట్టించును

27 అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు.

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపుఊట

అది మరణపాశములలోనుండి విడిపించును

28 జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును

జనక్షయము రాజులకు వినాశకరము.

29 దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి

ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము

మత్సరము ఎముకలకు కుళ్లు.

31 దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు

బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.

32 అపాయము రాగా భక్తిహీనుడు నశించును

మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.

33 తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును

బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును

34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము

పాపము ప్రజలకు అవమానము తెచ్చును.

35 బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు

అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/14-24c0df1f0fdf32756485a096bdfecd61.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 15

1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును.

నొప్పించు మాట కోపమును రేపును.

2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును

బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

3 యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును

చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.

4 సాత్వికమైన నాలుక జీవవృక్షము

దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము

కలుగును.

5 మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును

గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.

6 నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి

భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.

7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును

బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు

8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు

యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.

9 భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము

నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.

10 మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును

గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.

11 పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన

బడుచున్నవి

నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కన

బడును గదా?

12 అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు

వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.

13 సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును.

మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.

14 బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును

బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు.

15 బాధపడువాని దినములన్నియు శ్రమకరములు

సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.

16 నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె

యెహోవాయందలి భయభక్తులతోకూడ కొంచెము

కలిగియుండుట మేలు.

17 పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె

ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుటమేలు.

18 కోపోద్రేకియగువాడు కలహము రేపును

దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

19 సోమరి మార్గము ముళ్లకంచె

యథార్థవంతుల త్రోవ రాజమార్గము.

20 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును

బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.

21 బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము

వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.

22 ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును

ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల

ఉద్దేశములు దృఢపడును.

23 సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును

సమయోచితమైన మాట యెంత మనోహరము!

24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని

బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును

25 గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును

విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.

26 దురాలోచనలు యెహోవాకు హేయములు

దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.

27 లోభి తన యింటివారిని బాధపెట్టును

లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును.

28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు

టకు ప్రయత్నించును

భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును

29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు

నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.

30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు

సంతోషకరము

మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.

31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి

జ్ఞానుల సహవాసము లభించును.

32 శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును

గద్దింపును వినువాడు వివేకియగును.

33 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట

జ్ఞానాభ్యాసమునకు సాధనము

ఘనతకు ముందు వినయముండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/15-bca359c0dcb7cdd309107e13148c8275.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 16

1 హృదయాలోచనలు మనుష్యుని వశము,

చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును.

2 ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా

కనబడును

యెహోవా ఆత్మలను పరిశోధించును.

3 నీ పనుల భారము యెహోవామీద నుంచుము

అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.

4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము

కలుగజేసెను

నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.

5 గర్వహృదయులందరు యెహోవాకు హేయులు

నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.

6 కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము

కలుగును

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన

మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.

7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు

ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా

చేయును.

8 అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె

నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.

9 ఒకడు తాను చేయబోవునది హృదయములో

యోచించుకొనును

యెహోవా వాని నడతను స్థిరపరచును

10 దేవోక్తి పలుకుట రాజువశము

న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము

తప్పదు.

11 న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా

యొక్క యేర్పాటులు

సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.

12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది

నీతివలన సింహాసనము స్థిరపరచబడును.

13 నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు

యథార్థవాదులు వారికి ప్రియులు.

14 రాజు క్రోధము మరణదూత

జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.

15 రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగునువారి కటాక్షము కడవరి వానమబ్బు.

16 అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా

దించుట ఎంతో శ్రేష్ఠము

వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట

ఎంతో మేలు.

17 చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు

రాజమార్గము

తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును

కాపాడుకొనును.

18 నాశనమునకు ముందు గర్వము నడచును.

పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు

నడచును

19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె

దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.

20 ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును

యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.

21 జ్ఞానహృదయుడు వివేకి యనబడును

రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.

22 తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట

మూఢులకు వారి మూఢత్వమే శిక్ష

23 జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును

వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.

24 ఇంపైన మాటలు తేనెపట్టువంటివి

అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య

కరమైనవి.

25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును

అయినను తుదకు అది మరణమునకు చేరును.

26 కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత

కష్టము చేయించును

వాని కడుపు వానిని తొందరపెట్టును.

27 పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును

వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.

28 మూర్ఖుడు కలహము పుట్టించును

కొండెగాడు మిత్రభేదము చేయును.

29 బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును

కానిమార్గములో వాని నడిపించును.

30 కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని

తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.

31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము

అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.

32 పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు

పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన

పరచుకొనువాడు శ్రేష్ఠుడు

33 చీట్లు ఒడిలో వేయబడును

వాటివలని తీర్పు యెహోవా వశము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/16-5522a8841489613aaf396476ab86b282.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 17

1 రుచియైన భోజన పదార్థములున్నను

కలహముతోకూడియుండిన ఇంటనుండుటకంటె

నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.

2 బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడిచేయును

అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచుకొనును.

3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది

హృదయ పరిశోధకుడు యెహోవాయే.

4 చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును

నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి

కుడు చెవియొగ్గును.

5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు.

ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు.

6 కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము

తండ్రులే కుమారులకు అలంకారము.

7 అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు

అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.

8 లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును

అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును.

9 ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును.

జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదముచేయును.

10 బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె

బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.

11 తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును

అట్టివానివెంట క్రూరదూత పంపబడును.

12 పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన

వచ్చును గాని

మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన

రాదు

13 మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు

తొలగిపోదు.

14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట

వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.

15 దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు

16 వీరిద్దరును యెహోవాకు హేయులు.

బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు

సొమ్ముండ నేల?

వానికి బుద్ధి లేదు గదా?

17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును

దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.

18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు

తెలివిమాలినవాడు.

19 కలహప్రియుడు దుర్మార్గప్రియుడు

తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.

20 కుటిలవర్తనుడు మేలుపొందడు

మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.

21 బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును

తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.

22 సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.

నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.

23 న్యాయవిధులను చెరుపుటకై

దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.

24 జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది

బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును.

25 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము

తెచ్చును

తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును

26 నీతిమంతులను దండించుట న్యాయము కాదు

అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము

చేయుటే.

27 మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు

శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.

28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని

అని యెంచబడును

అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని

యెంచబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/17-877ffcc30d15c2ec1695430773a51bc5.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 18

1 వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు

అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.

2 బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక

తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో

షించును.

3 భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును

అవమానము రాగానే నింద వచ్చును.

4 మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి

అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.

5 తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము

చూపుటయు

నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమముకాదు.

6 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి.

దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.

7 బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును

వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.

8 కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు

అవి లోకడుపులోనికి దిగిపోవును.

9 పనిలో జాగుచేయువాడు

నష్టము చేయువానికి సోదరుడు.

10 యెహోవా నామము బలమైన దుర్గము.

నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.

11 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము

వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.

12 ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును

ఘనతకు ముందు వినయముండును.

13 సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు

తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.

14 నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును

నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?

15 జ్ఞానుల చెవి తెలివిని వెదకును

వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.

16 ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును

అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును

17 వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును

అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి

తేటపడును.

18 చీట్లు వేయుటచేత వివాదములు మానును

అది పరాక్రమశాలులను సమాధానపరచును.

19 బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె

ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశ పరచు

కొనుట కష్టతరము.

వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు.

20 ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును

తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును.

21 జీవమరణములు నాలుక వశము

దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

22 భార్య దొరికినవానికి మేలు దొరికెను

అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు.

23 దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును

ధనవంతుడుదురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.

24 బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును

సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి

తుడు కలడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/18-2630b180b8771fd8b3b4843e42804e61.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 19

1 బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె

యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.

2 ఒకడు తెలివిలేకుండుట మంచిది కాదు

తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును.

3 ఒకనిమూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును

అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.

4 ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు,

దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును.

5 కూటసాక్షి శిక్ష నొందకపోడు

అబద్ధములాడువాడు తప్పించుకొనడు.

6 అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు

దాతకు అందరు స్నేహితులే.

7 బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు

అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు

వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.

8 బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి

వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.

9 కూటసాక్షి శిక్షనొందకపోడు

అబద్ధములాడువాడు నశించును.

10 భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు

రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.

11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును

తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

12 రాజు కోపము సింహగర్జనవంటిది

అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.

13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు

తెచ్చును

భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.

14 గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము

సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.

15 సోమరితనము గాఢనిద్రలో పడవేయును

సోమరివాడు పస్తు పడియుండును.

16 ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు

తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు

చచ్చును.

17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు

వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము

చేయును.

18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము

అయితే వాడు చావవలెనని కోరవద్దు.

19 మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు

వాని తప్పించినను వాడు మరల కోపించుచునే

యుండును.

20 నీవు ముందుకు జ్ఞానివగుటకై

ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.

21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా

పుట్టును

యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

22 కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును

అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.

23 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ

సాధనము

అది కలిగినవాడు తృప్తుడై అపాయములేకుండ

బ్రదుకును.

24 సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని

తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.

25 అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు

వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.

26 తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు

అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.

27 నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు

మీరగోరితివా?

ఉపదేశము వినుట ఇక మానుకొనుము.

28 వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును

భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.

29 అపహాసకులకు తీర్పులును

బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/19-a9d13db48b1c33ea5ce72d19eca029d2.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 20

1 ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును

మద్యము అల్లరి పుట్టించును

దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.

2 రాజువలని భయము సింహగర్జనవంటిది

రాజునకు క్రోధము పుట్టించువారు తమకు

ప్రాణమోసము తెచ్చుకొందురు

3 కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత

మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

4 విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు

కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

5 నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల

వంటిది

వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.

6 దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట

స్థించును

నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

7 యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు

వాని తదనంతరము ధన్యులగుదురు.

8 న్యాయసింహాసనాసీనుడైన రాజు

తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.

9 – నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను

పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన

వాడెవడు?

10 వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు

ఈ రెండును యెహోవాకు హేయములు.

11 బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో

యథార్థమైనదో కాదో

తన చేష్టలవలన తెలియజేయును.

12 వినగల చెవి చూడగల కన్ను

ఈ రెండును యెహోవా కలుగచేసినవే.

13 లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము

నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి

పొందుదువు.

14 కొనువాడు–జబ్బుది జబ్బుది అనును

అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.

15 బంగారును విస్తారమైన ముత్యములును కలవు.

తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

16 అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చుకొనుము

పరులకొరకు వానినే కుదువపెట్టించుము

17 మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు

బహు ఇంపుగా ఉండును

పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.

18 ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును

వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.

19 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట

పెట్టును

కావున వదరుబోతుల జోలికి పోకుము.

20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము

కారుచీకటిలో ఆరిపోవును.

21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము

తుదకు దీవెన నొందకపోవును.

22 – కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు

యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను

రక్షించును.

23 వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు

దొంగత్రాసు అనుకూలము కాదు.

24 ఒకని నడతలు యెహోవా వశము

తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన

గలడు?

25 వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు

మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించు

టయు ఒకనికి ఉరియగును.

26 జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టునువారిమీద చక్రము దొర్లించును.

27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము

అది అంతరంగములన్నియు శోధించును.

28 కృపాసత్యములు రాజును కాపాడును

కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు

కొనును.

29 యౌవనస్థుల బలము వారికి అలంకారము

తలనెరపు వృద్ధులకు సౌందర్యము

30 గాయములుచేయు దెబ్బలు

అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం

చును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/20-e14b6635fea9b2d4a439a005c8194d54.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 21

1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల

వలెనున్నది.

ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.

2 ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన

దృష్టికది న్యాయముగానే అగపడును

యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు.

3 నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట

బలులనర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.

4 అహంకార దృష్టియు గర్వ హృదయమును

భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.

5 శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు

తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును

6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట

ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును

కోరుకొందురు.

7 భక్తిహీనులు న్యాయము చేయనొల్లరువారుచేయు బలాత్కారము వారిని కొట్టుకొనిపోవును.

8 దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము

పవిత్రుల కార్యము యథార్థము.

9 గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె

మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.

10 భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును

వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.

11 అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును

జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.

12 నీతిమంతుడైనవాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కనిపెట్టును

భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.

13 దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు

తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.

14 చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును

ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును.

15 న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి

సంతోషకరము

పాపము చేయువారికి అది భయంకరము.

16 వివేకమార్గము విడిచి తిరుగువాడు

ప్రేతల గుంపులో కాపురముండును.

17 సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును

ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.

18 నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు

యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు

19 ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము

చేయుటకంటె

అరణ్యభూమిలో నివసించుట మేలు.

20 విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును

బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.

21 నీతిని కృపను అనుసరించువాడు

జీవమును నీతిని ఘనతను పొందును.

22 జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార

మెక్కును

అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.

23 నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు

శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

24 అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు

అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.

25 సోమరివాని చేతులు పనిచేయనొల్లవు

వాని యిచ్ఛ వాని చంపును.

26 దినమెల్ల ఆశలు పుట్టుచుండును

నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.

27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు

దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.

28 కూటసాక్షి నశించును

విని మాటలాడువాడు సత్యము పలుకును.

29 భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును

యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.

30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను

ఆలోచనయైనను నిలువదు.

31 యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని

రక్షణ యెహోవా అధీనము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/21-3f22d90376bf85c40f1389397ad3f21d.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 22

1 గొప్ప ఐశ్వర్యముకంటె మంచిపేరును

వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.

2 ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు

వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.

3 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును

జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.

4 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ

మునకు ప్రతిఫలము

ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.

5 ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి

తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా

ఉండును.

6 బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము

వాడు పెద్దవాడైనప్పుడుదానినుండి తొలగిపోడు.

7 ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును

అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.

8 దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును

వాని క్రోధమను దండము కాలిపోవును.

9 దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని

కిచ్చును

అట్టివాడు దీవెననొందును.

10 తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు

మానును

పోరు తీరి అవమానము మానిపోవును.

11 హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు

పలుకువానికి రాజు స్నేహితుడగును.

12 యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును.

విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.

13 సోమరి –బయట సింహమున్నది

వీధులలో నేను చంపబడుదుననును.

14 వేశ్య నోరు లోతైనగొయ్యి

యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.

15 బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా

పుట్టును

శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.

16 లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయముచేయు

వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.

17 చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము

నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.

18 నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతోమంచిది

పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము.

19 నీవు యెహోవాను ఆశ్రయించునట్లు

నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి

యున్నాను?

20 నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర

మిచ్చునట్లు

సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై

21 ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు

నేను నీకొరకు రచించితిని.

22 దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు

గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.

23 యెహోవావారి పక్షమున వ్యాజ్యెమాడును

ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును.

24 కోపచిత్తునితో సహవాసము చేయకుము

క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము

25 నీవు వాని మార్గములను అనుసరించి

నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.

26 చేతిలో చెయ్యి వేయువారితోను

అప్పులకు పూటబడువారితోను చేరకుము.

27 చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా

వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?

28 నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని

నీవు తీసివేయకూడదు.

29 తన పనిలో నిపుణతగలవానిని చూచితివా?

అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/22-42db7d2638c28d7ec722f3c78241dac8.mp3?version_id=1787—