Categories
కీర్తనలు

కీర్తనలు 143

దావీదు కీర్తన.

1 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము

నా విన్నపములకు చెవి యొగ్గుము

నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు

ఉత్తరమిమ్ము.

2 నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము

సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా

ఎంచబడడు.

3 శత్రువులు నన్ను తరుముచున్నారువారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు

చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు

గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు.

4 కావున నా ఆత్మ నాలో క్రుంగియున్నది

నాలో నా హృదయము విస్మయమొందెను.

5 పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను

నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను.

నేను నీచేతుల పని యోచించుచున్నాను

6 నీతట్టు నా చేతులు చాపుచున్నాను

ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ

పడుచున్నది.

7 యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది

త్వరగా నాకు ఉత్తరమిమ్ము

నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు

నీ ముఖమును నాకు మరుగుచేయకుము

8 నీయందు నేను నమ్మిక యుంచియున్నాను

ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము

నీవైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను.

నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.

9 యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను

నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము

10 నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు

నాకు నేర్పుము

దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను

నడిపించును గాక.

11 యెహోవా, నీ నామమునుబట్టి నన్ను బ్రదికిం

పుము

నీ నీతినిబట్టి నా ప్రాణమును శ్రమలోనుండి తప్పిం

పుము.

12 నేను నీ సేవకుడను నీ కృపనుబట్టి నా శత్రువులను

సంహరింపుము

నా ప్రాణమును బాధపరచువారినందరిని నశింపజేయుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/143-fc3eb902821ab627b3f780113e81d643.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 144

దావీదు కీర్తన.

1 నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింప

బడును గాక

ఆయన నా చేతులకు యుద్ధమును

నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.

2 ఆయన నాకు కృపానిధి నా కోట

నా దుర్గము నన్ను తప్పించువాడు

నా కేడెము నే నాశ్రయించువాడు

ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు.

3 యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు

ఏపాటివారు?

నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటివారు?

4 నరులు వట్టి ఊపిరిని పోలియున్నారువారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.

5 యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము

పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము

6 మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము

నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము.

7 పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము

మహా జలములలోనుండి

అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము.

8 వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.

9 దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను

పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.

10 నీవే రాజులకు విజయము దయచేయువాడవు

దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును

తప్పించువాడవు

11 నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్ను విడి

పింపుమువారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.

12 మా కుమారులు తమ యౌవన కాలమందు

ఎదిగిన మొక్కలవలె ఉన్నారు

మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె

ఉన్నారు.

13 మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు

నిధులుగా ఉన్నవి

మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా

గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.

14 మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి

మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట

యైనను లేదు

వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు

15 ఇట్టి స్థితిగలవారు ధన్యులు.

యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/144-1140ba20dc102cb06853b94ed71ccfc5.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 145

స్తుతికీర్తన. దావీదుది.

1 రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను.

నీ నామమును నిత్యము సన్నుతించెదను

2 అనుదినము నేను నిన్ను స్తుతించెదను

నిత్యము నీ నామమును స్తుతించెదను.

3 యెహోవా మహాత్మ్యముగలవాడు

ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు

ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది

4 ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ

క్రియలను కొనియాడుదురు

నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు

5 మహోన్నతమైన నీ ప్రభావమహిమను

నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను

6 నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు

నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.

7 నీ మహా దయాళుత్వమునుగూర్చిన కీర్తిని వారు

ప్రకటించెదరు

నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు

8 యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు

ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.

9 యెహోవా అందరికి ఉపకారి

ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద

నున్నవి.

10 యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుచున్నవి

నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.

11 ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన

బలమును

నరులకు తెలియజేయుటకై

12 నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు

నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు

13 నీ రాజ్యము శాశ్వతరాజ్యము

నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.

14 యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు

క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు

15 సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి

తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.

16 నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి

పరచుచున్నావు.

17 యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు

తన క్రియలన్నిటిలో కృపచూపువాడు

18 తనకు మొఱ్ఱపెట్టువారికందరికి

తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారికందరికి యెహోవా

సమీపముగా ఉన్నాడు.

19 తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర

వేర్చునువారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.

20 యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా

డును

అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.

21 నా నోరు యెహోవాను స్తోత్రము చేయును

శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము

సన్నుతించుదురు గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/145-8cfa6487510083a2aac6e07be32a93f6.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 146

1 యెహోవాను స్తుతించుడి.

నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము

2 నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె

దను

నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను

3 రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి

4 వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు

దురు.వారి సంకల్పములు నాడే నశించును.

5 ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో

ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు

కొనునో వాడు ధన్యుడు

6 ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని

లోని సర్వమును సృజించినవాడు

ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

7 బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును

ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును

యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.

8 యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు

యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు

యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు

9 యెహోవా పరదేశులను కాపాడువాడు

ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు

వాడు

భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా

చేయును.

10 యెహోవా నిరంతరము ఏలును

సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము

చేయును

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/146-e83e61e0b277bb465c0f3e0d4ee62bc3.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 147

1 యెహోవాను స్తుతించుడి.

మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది

అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.

2 యెహోవాయే యెరూషలేమును కట్టువాడు

చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు

3 గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు.

4 నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు

వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.

5 మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు

ఆయన జ్ఞానమునకు మితిలేదు.

6 యెహోవా దీనులను లేవనెత్తువాడు

భక్తిహీనులను ఆయన నేలను కూల్చును.

7 కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి.

సితారాతో మన దేవుని కీర్తించుడి.

8 ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు

భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు

పర్వతములమీద గడ్డి మొలిపించువాడు

9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును

ఆయన ఆహారమిచ్చువాడు.

10 గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు

నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు.

11 తనయందు భయభక్తులుగలవారియందు

తన కృపకొరకు కనిపెట్టువారియందు

యెహోవా ఆనందించువాడైయున్నాడు.

12 యెరూషలేమా, యెహోవాను కొనియాడుము

సీయోనూ, నీ దేవుని కొనియాడుము.

13 ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు

నీమధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు.

14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు

ఆయనే

మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే

15 భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే

ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.

16 గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే

బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.

17 ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే.

ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?

18 ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును

ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,

19 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను

తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు

తెలియజేసెను.

20 ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు

ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి.

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/147-b7e75cf0c8def7e212950399d75ac101.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 148

1 యెహోవాను స్తుతించుడి.

ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి

2 ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి

ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి

ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి

3 సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి

కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను

స్తుతించుడి.

4 పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా,

ఆయనను స్తుతించుడి.

5 యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను

అవి యెహోవా నామమును స్తుతించును గాక

6 ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి

యున్నాడు

ఆయన వాటికి కట్టడ నియమించెను

ఏదియు దాని నతిక్రమింపదు.

7 భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా,

యెహోవాను స్తుతించుడి

8 అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరీ,

ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,

9 పర్వతములారా, సమస్తమైన గుట్టలారా,

ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము

లారా,

10 మృగములారా, పశువులారా,

నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు

లారా,

11 భూరాజులారా, సమస్త ప్రజలారా,

భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి

పతులారా,

యెహోవాను స్తుతించుడి.

12 యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు

13 అందరును యెహోవా నామమును స్తుతించుదురు

గాక

ఆయన నామము మహోన్నతమైన నామము

ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా

నున్నది.

14 ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి

యున్నాడు.

అది ఆయన భక్తులకందరికిని

ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును

ప్రఖ్యాతికరముగా నున్నది.

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/148-952f34a1d3b5517245d4256bf1ef9542.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 149

1 యెహోవాను స్తుతించుడి

యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి

భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర

గీతము పాడుడి.

2 ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి

సంతోషించుదురు గాక

సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక.

3 నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు

దురు గాక

తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము

చేయుదురు గాక.

4 యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు.

ఆయన దీనులను రక్షణతో అలంకరించును.

5 భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాకవారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ

గానము చేయుదురు గాక.

6 వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము

లున్నవి.

7 అన్యజనులకు ప్రతి దండన చేయుటకును ప్రజలను

శిక్షించుటకును

8 గొలుసులతో వారి రాజులను

ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును

9 విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకునువారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది.

ఆయన భక్తులకందరికి ఘనత యిదే

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/149-a98726a0cb3dff4b3b0c277917da2b06.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 150

1 యెహోవాను స్తుతించుడి.

ఆయన పరిశుద్ధాలయమునందు

దేవుని స్తుతించుడి.

ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు

ఆయనను స్తుతించుడి.

2 ఆయన పరాక్రమ కార్యములనుబట్టి

ఆయనను స్తుతించుడి.

ఆయన మహా ప్రభావమునుబట్టి

ఆయనను స్తుతించుడి.

3 బూరధ్వనితో

ఆయనను స్తుతించుడి.

స్వరమండలముతోను సితారాతోను

ఆయనను స్తుతించుడి.

4 తంబురతోను నాట్యముతోను

ఆయనను స్తుతించుడి.

తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను

ఆయనను స్తుతించుడి.

5 మ్రోగు తాళములతో

ఆయనను స్తుతించుడి.

గంభీరధ్వనిగల తాళములతో

ఆయనను స్తుతించుడి.

6 సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/150-76362165eda55b1a6ae9643fae57699a.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 1

1 దావీదు కుమారుడును ఇశ్రాయేలురాజునైన

సొలొమోను సామెతలు.

2 జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును

వివేక సల్లాపములను గ్రహించుటకును

3 నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు

బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును

4 జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును

యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.

5 జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును

వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.

6 వీటిచేత సామెతలను భావసూచక విషయములను

జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.

7 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి

వికి మూలము

మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము

నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.

9 అవి నీ తలకు సొగసైన మాలికయు

నీ కంఠమునకు హారములునై యుండును

10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా

ఒప్పకుము.

11 –మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై

పొంచియుందము

నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

12 పాతాళము మనుష్యులను మ్రింగివేయునట్లు వారిని

జీవముతోనే మ్రింగివేయుదము

సమాధిలోనికి దిగువారు మ్రింగబడునట్లువారు పూర్ణ

బలముతోనుండగా మనము వారిని మ్రింగివేయు

దము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.

13 –పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును

మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము

14 నీవు మాతో పాలివాడవై యుండుము

మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు

నీతో చెప్పుదురు.

15 నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి

త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు

తీసికొనుము.

16 కీడుచేయుటకై వారి పాదములు పరుగులెత్తును

నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.

17 పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.

18 వారు స్వనాశనమునకే పొంచియుందురు

తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.

19 ఆశాపాతకులందరి గతి అట్టిదే

దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.

20 జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది

సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

21 గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది

పురద్వారములలోను పట్టణములోను

జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది

22 –ఎట్లనగా, జ్ఞానములేనివారలారా,

మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు?

అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు

ఆనందింతురు?

బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు

కొందురు?

23 నా గద్దింపు విని తిరుగుడి

ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును

నా ఉపదేశమును మీకు తెలిపెదను.

24 నేను పిలువగా మీరు వినకపోతిరి.

నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

25 నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి

నేను గద్దింపగా లోబడకపోతిరి.

26 కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను

నవ్వెదను

మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము

చేసెదను

27 భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు

సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు

మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను

అపహాస్యము చేసెదను.

28 అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని

నేను ప్రత్యుత్తరమియ్యకుందును

నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును.

29 జ్ఞానము వారికి అసహ్యమాయెను

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి

కిష్టము లేకపోయెను.

30 నా ఆలోచన విననొల్లకపోయిరి

నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు

తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

32 జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు.

బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.

33 నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా

నివసించును

వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగానుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/1-db4d279cd4c066d1a68e1e00e9297818.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 2

1 నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా

ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల

2 జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా

వివేచన నభ్యసించినయెడల

3 తెలివికై మొఱ్ఱపెట్టినయెడల

వివేచనకై మనవి చేసినయెడల

4 వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల

దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల

5 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట

యెట్టిదో నీవు గ్రహించెదవు

దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.

6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు

తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును

యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

8 న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును

తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.

9 అప్పుడు నీతి న్యాయములను

యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.

10 జ్ఞానము నీ హృదయమున జొచ్చును

తెలివి నీకు మనోహరముగానుండును

11 బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.

12 అది దుష్టుల మార్గమునుండియు

మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్నురక్షించును.

13 అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని

యథార్థమార్గములను విడిచిపెట్టెదరు

14 కీడుచేయ సంతోషించుదురు

అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.

15 వారు నడుచుకొను త్రోవలు వంకరవివారు కుటిలవర్తనులు

16 మరియు అది జారస్త్రీనుండి

మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును.

17 అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది

తన దేవుని నిబంధనను మరచునది.

18 దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును

అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును

19 దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు

జీవమార్గములు వారికి దక్కవు.

నా మాటలు వినినయెడల

20 నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు

నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు.

21 యథార్థవంతులు దేశమందు నివసించుదురు

లోపములేనివారు దానిలో నిలిచియుందురు.

22 భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.

విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/2-2773c128b409c74d7d8b4c58ae8c403a.mp3?version_id=1787—