Categories
కీర్తనలు

కీర్తనలు 123

యాత్రకీర్తన.

1 ఆకాశమందు ఆసీనుడవైనవాడా,

నీతట్టు నా కన్ను లెత్తుచున్నాను.

2 దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును

దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు

మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు

మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.

3 యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి

అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును

మామీదికి అధికముగా వచ్చియున్నవి.

4 మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/123-9db9bfae12687942412ef7a4eb20a9f1.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 124

యాత్రకీర్తన. దావీదుది.

1 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు

యెహోవా మనకు తోడైయుండనియెడల

2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు

3 యెహోవా మనకు తోడైయుండనియెడలవారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు

4 జలములు మనలను ముంచివేసియుండును

ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లి పారి

యుండును

5 ప్రవాహములై ఘోషించు జలములు

మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని

ఇశ్రాయేలీయులు అందురు గాక.

6 వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా

స్తుతినొందును గాక.

7 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర

ఉరినుండి తప్పించుకొని యున్నది

ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.

8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే

మనకు సహాయము కలుగుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/124-996b36ab378b2f78e2afeed5994e3bea.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 125

యాత్రకీర్తన.

1 యెహోవాయందు నమ్మిక యుంచువారు

కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.

2 యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు

యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల

చుట్టు ఉండును.

3 నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప

కుండునట్లు

భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము

మీద నుండదు.

4 యెహోవా, మంచివారికి మేలుచేయుము

యథార్థహృదయులకు మేలుచేయుము.

5 తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని

పాపముచేయువారితోకూడ యెహోవా కొనిపోవును

ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/125-c1afcea570aa8353dd6838992efbf663.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 126

యాత్రకీర్తన.

1 సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో

నుండి రప్పించినప్పుడు

2 మనము కలకనినవారివలె నుంటిమి

మన నోటి నిండ నవ్వుండెను

మన నాలుక ఆనందగానముతో నిండియుండెను.

అప్పుడు–యెహోవా వీరికొరకు గొప్పకార్యములు

చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.

3 యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి

యున్నాడు

మనము సంతోషభరితులమైతిమి.

4 దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా

యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.

5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు

సంతోషగానముతో పంట కోసెదరు.

6 పిడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచుపోవు

విత్తువాడు

సంతోషగానముచేయుచు పనలు మోసికొనివచ్చును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/126-28a5e0686040db1b817aa7a21a63c9ce.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 127

యాత్రకీర్తన. సొలొమోనుది.

1 యెహోవా ఇల్లు కట్టించనియెడల

దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.

యెహోవా పట్టణమును కాపాడనియెడల

దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.

2 మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు

కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట

వ్యర్థమే.

తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి

కిచ్చుచున్నాడు.

3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము

గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే

4 యౌవనకాలమందు పుట్టిన కుమారులు

బలవంతుని చేతిలోని బాణములవంటివారు.

5 వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు

అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో

వాదించుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/127-31520b0bee93ed4930e417464d60b51f.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 128

యాత్రకీర్తన.

1 యెహోవాయందు భయభక్తులుకలిగి

ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

2 నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు

నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.

3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలెనుండును

నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు

ఒలీవ మొక్కలవలె నుందురు.

4 యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు

ఆశీర్వదింపబడును.

5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును

నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము

కలుగుట చూచెదవు

6 నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు.

ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/128-ef7d0454665533de12becb2705355cc6.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 129

యాత్రకీర్తన.

1 ఇశ్రాయేలు ఇట్లనును

–నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు

అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి

2 నా యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు

కలుగజేయుచు వచ్చిరి.

అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.

3 దున్నువారు నా వీపుమీద దున్నిరివారు చాళ్లను పొడుగుగా చేసిరి.

4 యెహోవా న్యాయవంతుడు

భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.

5 సీయోను పగవారందరు

సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.

6 వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక

ఎదుగకమునుపే అది వాడిపోవును

7 కోయువాడు తన గుప్పిలినైనను

పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు

కొనడు.

8 దారిన పోవువారు–యెహోవా ఆశీర్వాదము నీమీదనుండునుగాక

–యెహోవా నామమున మేము మిమ్ము దీవించు

చున్నాము అని అనకయుందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/129-3571e0ad23bd3adecf367b0c362f8d30.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 130

యాత్రకీర్తన.

1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు

మొఱ్ఱపెట్టుచున్నాను.

2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము.

నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.

3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల

ప్రభువా, ఎవడు నిలువగలడు?

4 అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు

నీయొద్ద క్షమాపణ దొరుకును.

5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను

నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది

ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

6 కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా

నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది

కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా

నా ప్రాణము కనిపెట్టుచున్నది.

7 ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము

యెహోవాయొద్ద కృప దొరుకును.

ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

8 ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని

విమోచించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/130-cb841994528b4c0f27d6eb92b8bc6417.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 131

యాత్రకీర్తన. దావీదుది.

1 యెహోవా, నా హృదయము అహంకారము గలది

కాదు

నా కన్నులు మీదు చూచునవి కావు

నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను

నేను అభ్యాసము చేసికొనుట లేదు.

2 నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను

సముదాయించుకొని యున్నాను

చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు

చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము

నాయొద్ద నున్నది.

3 ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవామీదనే ఆశపెట్టుకొనుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/131-93cf856e7929bfc2ad8b2ebe348cda97.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 132

యాత్రకీర్తన.

1 యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని

పక్షమున జ్ఞాపకము చేసికొనుము.

2 అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట

యిచ్చి

3-5 యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.

ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు

యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను

చూచువరకు

నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను

నేను పరుండు మంచముమీది కెక్కను

నా కన్నులకు నిద్ర రానియ్యను

నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.

6 అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి

యాయరు పొలములలో అది దొరికెను.

7 ఆయన నివాసస్థలములకు పోదము రండి

ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.

8 యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో

కూడ రమ్ము

నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.

9 నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక

నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.

10 నీ సేవకుడైన దావీదు నిమిత్తము

నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.

11 –నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ

మింతును.

నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల

నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినయెడల

వారి కుమారులు కూడ నీ సింహాసనముమీద నిత్యము

కూర్చుందురని

12 యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను

ఆయన మాట తప్పనివాడు.

13 యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు.

తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.

14 ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ

స్థానముగానుండును

ఇక్కడనే నేను నివసించెదను

15 దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను

దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను

16 దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప

జేసెదను

దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.

17 అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను

నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి

యున్నాను.

18 అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను

అతని కిరీటము అతనిమీదనేయుండి తేజరిల్లును అనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/132-73468e833ac25356fde99a5f91363da5.mp3?version_id=1787—