Categories
కీర్తనలు

కీర్తనలు 113

1 యెహోవాను స్తుతించుడి

యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి.

యెహోవా నామమును స్తుతించుడి.

2 ఇది మొదలుకొని యెల్లకాలము

యెహోవా నామము సన్నుతింపబడునుగాక.

3 సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము

వరకు

యెహోవా నామము స్తుతి నొందదగినది.

4 యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు

ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి

యున్నది

5 ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో

వాను పోలియున్నవాడెవడు?

6 ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను

గ్రహించుచున్నాడు.

7 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని

కూర్చుండబెట్టుటకై

8 ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు

పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు

9 ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను

కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును.

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/113-eba167612a306288119b293f5c42a8fb.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 114

1 ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు

అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు

వెళ్లినప్పుడు

2 యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను

ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.

3 సముద్రము దానిని చూచి పారిపోయెను

యొర్దాను నది వెనుకకు మళ్లెను.

4 కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱెపిల్లలవలెను

గంతులు వేసెను.

5 సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి

నది?

యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది?

6 కొండలారా, మీరు పొట్లేళ్లవలెను

గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయు

టకు మీకేమి సంభవించినది?

7 భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని

ధిని వణకుము

8 ఆయన బండను నీటిమడుగుగాను

చెకుముకి రాతిబండను నీటి ఊటలుగానుచేయు

వాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/114-be06aee2c8001b56f153f4361b624611.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 115

1 మాకు కాదు, యెహోవా మాకు కాదు

నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ

కలుగునుగాక

2 –వారి దేవుడేడి అని

అన్యజనులెందుకు చెప్పుకొందురు?

3 మా దేవుడు ఆకాశమందున్నాడు

తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయు

చున్నాడు

4 వారి విగ్రహములు వెండి బంగారువి

అవి మనుష్యుల చేతిపనులు

5 వాటికి నోరుండియు పలుకవు

కన్నులుండియు చూడవు

6 చెవులుండియు వినవు

ముక్కులుండియు వాసనచూడవు

7 చేతులుండియు ముట్టుకొనవు

పాదములుండియు నడువవు

గొంతుకతో మాటలాడవు.

8 వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు

వారందరును వాటివంటివారై యున్నారు.

9 ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి.

ఆయన వారికి సహాయము వారికి కేడెము

10 అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి.

ఆయన వారికి సహాయము వారికి కేడెము

11 యెహోవాయందు భయభక్తులుగలవారలారా

యెహోవాయందు నమ్మిక యుంచుడి

ఆయన వారికి సహాయము వారికి కేడెము.

12 యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన

మమ్ము నాశీర్వదించును

ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును

అహరోను వంశస్థుల నాశీర్వదించును

13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును.

14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

15 భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత

మీరు ఆశీర్వదింపబడినవారు.

16 ఆకాశములు యెహోవావశము

భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.

17 మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును

యెహోవాను స్తుతింపరు

18 మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను

స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/115-72a92b37122c982bde390d5dec2e866c.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 116

1 యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు.

కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.

2 ఆయన నాకు చెవియొగ్గెను

కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ

పెట్టుదును

3 మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను

పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను

శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.

4 అప్పుడు–యెహోవా, దయచేసి నా ప్రాణమును

విడిపింపుమని

యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.

5 యెహోవా దయాళుడు నీతిమంతుడు

మన దేవుడు వాత్సల్యతగలవాడు.

6 యెహోవా సాధువులను కాపాడువాడు.

నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.

7 నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప

జేసియున్నాడు.

తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.

8 మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను

జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

9 సజీవులున్న దేశములలో

యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.

10 నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని.

నేను మిగుల బాధపడినవాడను.

11 నేను తొందరపడినవాడనై

–ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.

12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి

నేనాయనకేమి చెల్లించుదును?

13 రక్షణపాత్రను చేతపుచ్చుకొని

యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

14 యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను.

ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను

15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది

16 యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను,

నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను

నీవు నాకట్లు విప్పియున్నావు.

17 నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను,

యెహోవా నామమున ప్రార్థనచేసెదను

18 ఆయన ప్రజలందరియెదుటను

యెహోవా మందిరపు ఆవరణములలోను

19 యెరూషలేమా, నీమధ్యను

నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను.

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/116-d7b83db221efc2a8f67ba33f128bf648.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 117

1 యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది

ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.

2 కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను

స్తుతించుడి

సర్వజనములారా, ఆయనను కొనియాడుడి

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/117-67565715f4c9bb1808a5439d02dc77f3.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 118

1 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము

నిలుచును

ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి

2 ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు

అందురు గాక.

3 ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ

స్థులు అందురు గాక.

4 ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా

యందు భయభక్తులుగలవారు అందురు గాక.

5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని

విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను

6 యెహోవా నా పక్షముననున్నాడు నేను భయ

పడను

నరులు నాకేమి చేయగలరు?

7 యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై

యున్నాడు

నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట

చూచెదను.

8 మనుష్యులను నమ్ముకొనుటకంటె

యెహోవాను ఆశ్రయించుట మేలు.

9 రాజులను నమ్ముకొనుటకంటె

యెహోవాను ఆశ్రయించుట మేలు.

10 అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు

యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము

చేసెదను.

11 నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు

యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము

చేసెదను.

12 కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు

ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లువారు నశించి

పోయిరి

యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము

చేసెదను.

13 నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి

యెహోవా నాకు సహాయము చేసెను.

14 యెహోవా నా దుర్గము నా గానము

ఆయన నాకు రక్షణాధారమాయెను.

15 నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన

ఉత్సాహ సునాదము వినబడును

యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను

చేయును.

16 యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను

యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను

చేయును.

17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ

రించెదను.

18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని

ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.

19 నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి

నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా

స్తుతులు చెల్లించెదను.

20 ఇది యెహోవా గుమ్మము

నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.

21 నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి

యున్నావు

నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి

మూలకు తలరాయి ఆయెను.

23 అది యెహోవావలన కలిగినది

అది మన కన్నులకు ఆశ్చర్యము

24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము

దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.

25 యెహోవా, దయచేసి నన్ను రక్షించుము

యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.

26 యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును

గాక

యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు

చున్నాము.

27 యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను

గ్రహించియున్నాడు

ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు

కట్టుడి.

28 నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించెదను

నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.

29 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము

నిలుచుచున్నది

ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/118-43faa643f2f5ec9b8c54851e3c7e49d2.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 119

ఆలెఫ్.

1 యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి

నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు

2 ఆయన శాసనములను గైకొనుచు

పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.

3 వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ

పాపమును చేయరు

4 నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని

నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.

5 ఆహా నీ కట్టడలను గైకొనునట్లు

నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు.

6 నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు

నాకు అవమానము కలుగనేరదు.

7 నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు

యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

8 నీ కట్టడలను నేను గైకొందును

నన్ను బొత్తిగా విడనాడకుము.

బేత్.

9 యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు?

నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట

చేతనే గదా?

10 నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను

నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.

11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు

నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని

యున్నాను.

12 యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు

నీ కట్టడలను నాకు బోధించుము.

13 నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని

నా పెదవులతో వివరించుదును.

14 సర్వసంపదలు దొరికినట్లు

నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు

చున్నాను.

15 నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను

నీ త్రోవలను మన్నించెదను.

16 నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను.

నీ వాక్యమును నేను మరువకయుందును.

గీమెల్.

17 నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ

దయారసము చూపుము

నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.

18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు

లను చూచునట్లు నా కన్నులు తెరువుము.

19 నేను భూమిమీద పరదేశినై యున్నాను

నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.

20 నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది

దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.

21 గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు.

నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.

22 నేను నీ శాసనముల ననుసరించుచున్నాను.

నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల

గింపుము.

23 అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాట

లాడుకొందురు

నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.

24 నీ శాసనములు నాకు సంతోషకరములు

అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.

దాలెత్.

25 నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది

నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.

26 నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు

ఉత్తరమిచ్చితివి

నీ కట్టడలను నాకు బోధింపుము

27 నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము.

నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.

28 వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను

నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.

29 కపటపు నడత నాకు దూరము చేయుము

నీ ఉపదేశమును నాకు దయచేయుము

30 సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను

నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని

యున్నాను

31 యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని

యున్నాను

నన్ను సిగ్గుపడనియ్యకుము.

32 నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు

నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.

హే.

33 యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు

నేర్పుము.

అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.

34 నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ

చేయుము

అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా

రము నడుచుకొందును.

35 నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను

దానియందు నన్ను నడువజేయుము.

36 లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద

యము త్రిప్పుము.

37 వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము

నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం

పుము.

38 నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును

పుట్టించుచున్నది

నీ సేవకునికి దాని స్థిరపరచుము.

39 నీ న్యాయవిధులు ఉత్తమములు

నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును

కొట్టివేయుము.

40 నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు

నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.

వావ్.

41 యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము

నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.

42 అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ

గలను

ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.

43 నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి

వేయకుము

నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.

44 నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును

నేను నిత్యము దాని ననుసరించుదును

45 నేను నీ ఉపదేశములను వెదకువాడను

నిర్బంధములేక నడుచుకొందును

46 సిగ్గుపడక రాజులయెదుట

నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.

47 నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను

అవి నాకు ప్రియములు.

48 నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు

లెత్తెదను

నీ కట్టడలను నేను ధ్యానించుదును.

జాయిన్.

49 నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము

దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.

50 నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది

నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

51 గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి

అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక

యున్నాను.

52 యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ

విధులను జ్ఞాపకము చేసికొని

నేను ఓదార్పు నొందితిని.

53 నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా

నాకు అధిక రోషము పుట్టుచున్నది

54 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు

నీ కట్టడలు హేతువులాయెను.

55 యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయు

చున్నాను

నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను

56 నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను

ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది.

హేత్.

57 యెహోవా, నీవే నా భాగము

నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను

నిశ్చయించుకొని యున్నాను.

58 కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను

బతిమాలుకొనుచున్నాను

నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.

59 నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని

నీ శాసనములతట్టు మరలుకొంటిని.

60 నీ ఆజ్ఞలను అనుసరించుటకు

నేను జాగుచేయక త్వరపడితిని.

61 భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను

నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు

62 న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుటకు

అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.

63 నీయందు భయభక్తులు గలవారందరికిని

నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి

కాడను.

64 యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది

నీ కట్టడలను నాకు బోధింపుము.

తేత్.

65 యెహోవా, నీ మాటచొప్పున

నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.

66 నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను

మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.

67 శ్రమకలుగకమునుపు నేను త్రోవ విడిచితిని

ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను

చున్నాను.

68 నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు

నీ కట్టడలను నాకు బోధింపుము.

69 గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు

అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ

ములను అనుసరింతును.

70 వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది

నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.

71 నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు

శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.

72 వేలకొలది వెండి బంగారు నాణెములకంటె

నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.

యోద్.

73 నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను

నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ

చేయుము.

74 నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను

నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో

షింతురు

75 యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు

విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.

76 నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున

నీ కృప నన్ను ఆదరించును గాక.

77 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.

నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు

కలుగును గాక.

78 నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను.

గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక.

79 నీయందు భయభక్తులుగలవారును

నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున

నుందురు గాక.

80 నేను సిగ్గుపడకుండునట్లు

నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును

గాక.

కఫ్.

81 నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది.

నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను

82 –నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని

నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి

83 నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని

అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.

84 నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను?

నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు?

85 నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు

నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.

86 నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి

పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు

నాకు సహాయముచేయుము.

87 భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము

చేయుటకు కొంచెమే తప్పెను

అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.

88 నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు

నీ కృపచేత నన్ను బ్రదికింపుము.

లామెద్.

89 యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము

నిలకడగా నున్నది.

90 నీ విశ్వాస్యత తరతరములుండును.

నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది

91 సమస్తము నీకు సేవచేయుచున్నవి

కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి

92 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల

నా శ్రమయందు నేను నశించియుందును.

93 నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి

నేనెన్నడును వాటిని మరువను.

94 నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను

నేను నీవాడనే నన్ను రక్షించుము.

95 నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు

పొంచియున్నారు

అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.

96 సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను

నీ ధర్మోపదేశము అపరిమితమైనది.

మేమ్.

97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది

దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.

98 నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి.

నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ

జేయుచున్నవి.

99 నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను

కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము

కలదు.

100 నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను

కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.

101 నేను నీ వాక్యము ననుసరించునట్లు

దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను

102 నీవు నాకు బోధించితివి గనుక

నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను.

103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు

అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

104 నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను

తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.

నూన్.

105 నీ వాక్యము నా పాదములకు దీపమును

నా త్రోవకు వెలుగునై యున్నది.

106 నీ న్యాయవిధులను నేననుసరించెదనని

నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర

వేర్చుదును.

107 యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను

నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.

108 యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక

రించుము.

నీ న్యాయవిధులను నాకు బోధింపుము

109 నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది.

అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.

110 నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి

అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు.

111 నీ శాసనములు నాకు హృదయానందకరములు

అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.

112 నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను

లోపరచుకొనియున్నాను

ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.

సామెహ్.

113 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను

నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.

114 నాకు మరుగుచోటు నా కేడెము నీవే

నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.

115 నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను

దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి

తొలగుడి.

116 నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము

నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక.

117 నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము

అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.

118 నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు

దువువారి కపటాలోచన మోసమే.

119 భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు

కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి

120 నీ భయమువలన నా శరీరము వణకుచున్నది

నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.

అయిన్.

121 నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను.

నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము.

122 మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము

గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.

123 నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు

నా కన్నులు క్షీణించుచున్నవి.

124 నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము

నీ కట్టడలను నాకు బోధింపుము

125 నేను నీ సేవకుడను

నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము

126 జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు

యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము.

127 బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు

ప్రియముగానున్నవి.

128 నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని

మన్నించుచున్నాను

అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.

పే.

129 నీ శాసనములు ఆశ్చర్యములు

కావుననే నేను వాటిని గైకొనుచున్నాను.

130 నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును

అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును

131 నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత

నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.

132 నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు

నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.

133 నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము

ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.

134 నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు

మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం

పుము.

135 నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము

నీ కట్టడలను నాకు బోధింపుము.

136 జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు

నా కన్నీరు ఏరులై పారుచున్నది.

సాదె.

137 యెహోవా, నీవు నీతిమంతుడవు

నీ న్యాయవిధులు యథార్థములు

138 నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు

నీ శాసనములను నీవు నియమించితివి.

139 నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు

కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.

140 నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది

అది నీ సేవకునికి ప్రియమైనది.

141 నేను అల్పుడను నిరాకరింపబడినవాడను

అయినను నీ ఉపదేశములను నేను మరువను.

142 నీ నీతి శాశ్వతమైనది

నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.

143 శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి

అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి

144 నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి

నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

ఖొఫ్.

145 యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ

పెట్టుచున్నాను

నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము.

146 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను

నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము.

147 తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని

నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను

148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై

నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు

కొందును.

149 నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము

యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.

150 దుష్కార్యములు చేయువారును

నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు

సమీపించుచున్నారు

151 యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు.

నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.

152 నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని

నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని

యున్నాను.

రేష్.

153 నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను

నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము

154 నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము

నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.

155 భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు

గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.

156 యెహోవా, నీ కనికరములు మితిలేనివి

నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.

157 నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు

అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక

యున్నాను.

158 ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని

నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.

159 యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు

నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము

160 నీ వాక్య సారాంశము సత్యము

నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.

షీన్.

161 అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు

అయినను నీ వాక్యభయము నా హృదయమందు

నిలుచుచున్నది.

162 విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె

నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.

163 అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము

నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.

164 నీ న్యాయవిధులనుబట్టి

దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను.

165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదువారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు

166 యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను

నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను.

167 నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను

అవి నాకు అతి ప్రియములు.

168 నా మార్గములన్నియు నీయెదుట నున్నవి

నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను.

తౌ.

169 యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక

నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.

170 నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము

నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము.

171 నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు

నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును

172 నీ ఆజ్ఞలన్నియు న్యాయములు

నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును.

173 నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను

నీ చెయ్యి నాకు సహాయమగును గాక.

174 యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను

నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.

175 నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను

నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక

176 తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచితిరిగితిని

నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా

నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/119-2dcc4ff695da53266e3bd4302e23e150.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 120

యాత్రకీర్తన.

1 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని

ఆయన నాకు ఉత్తరమిచ్చెను.

2 యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు

మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును

విడిపించుము.

3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును?

ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

4 తంగేడునిప్పులతోకూడిన బాణములను

బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

5 అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను.

కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.

6 కలహప్రియునియొద్ద

నేను చిరకాలము నివసించినవాడను.

7 నేను కోరునది సమాధానమే

అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు

యుద్ధమునకు సిద్ధమగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/120-d42b9dc1e8102a6b8691aaf47cc471a9.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 121

యాత్రకీర్తన.

1 కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను

నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?

2 యెహోవావలననే నాకు సహాయము కలుగును

ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.

3 ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు

నిన్ను కాపాడువాడుకునుకడు.

4 ఇశ్రాయేలును కాపాడువాడుకునుకడు నిద్రపోడు

5 యెహోవాయే నిన్ను కాపాడువాడు

నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.

6 పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు.

రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.

7 ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను

కాపాడును

ఆయన నీ ప్రాణమును కాపాడును

8 ఇది మొదలుకొని నిరంతరము

నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/121-55e06826da3adccbb3c72917b1113f60.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 122

యాత్ర కీర్తన. దావీదుది.

1 –యెహోవా మందిరమునకు వెళ్లుదమని

జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.

2 యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో

నిలుచుచున్నవి

3 యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు

కట్టబడియున్నావు

4 ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమునుబట్టి

యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై

వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి

ఎక్కి వెళ్లును.

5 అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు

దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి

యున్నవి.

6 యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన

చేయుడి

యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.

7 నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక.

నీ నగరులలో క్షేమముండును గాక.

8 నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి

త్తమును

నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.

9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము

నీకు మేలుచేయ ప్రయత్నించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/122-ef94824350131dac8537a5815bfcd425.mp3?version_id=1787—