Categories
కీర్తనలు

కీర్తనలు 103

దావీదు కీర్తన.

1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.

నా అంతరంగముననున్న సమస్తమా,

ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.

2 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము

ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

3 ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు

నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.

4 సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు

చున్నాడు

కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు

చున్నాడు

5 పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు

చుండునట్లు

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు

6 యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడువారికందరికి న్యాయము తీర్చును

7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను

ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను

8 యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు

దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.

9 ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు

ఆయన నిత్యము కోపించువాడు కాడు.

10 మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు

మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

11 భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో

ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన

కృప అంత అధికముగా ఉన్నది.

12 పడమటికి తూర్పు ఎంత దూరమో

ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర

పరచియున్నాడు.

13 తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు

యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల

జాలిపడును.

14 మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది

మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను

చున్నాడు.

15 నరుని ఆయువు గడ్డివలె నున్నది

అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.

16 దానిమీద గాలి వీచగా అది లేకపోవును

ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.

17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస

రించి నడచుకొను వారిమీద

యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

18 ఆయన కృప యుగయుగములు నిలుచును

ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.

19 యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర

పరచియున్నాడు.

ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు.

20 యెహోవాదూతలారా,

ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు

బలశూరులారా,

ఆయనను సన్నుతించుడి.

21 యెహోవా సైన్యములారా,

ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా,

మీరందరు ఆయనను సన్నుతించుడి.

22 యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న

ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతిం

చుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/103-91266a5a01807e3ada8b22cdf935aabf.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 104

1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.

యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన

వాడవు

నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.

2 వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు.

తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి

యున్నావు.

3 జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు.

మేఘములను తనకు వాహనముగా చేసికొని

గాలి రెక్కలమీద గమనముచేయుచున్నాడు

4 వాయువులను తనకు దూతలుగాను

అగ్నిజ్వాలలనుతనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.

5 భూమి యెన్నటికిని కదలకుండునట్లు

ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.

6 దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె

కప్పితివి.

కొండలకుపైగా నీళ్లు నిలిచెను.

7 నీవు గద్దింపగానే అవి పారిపోయెను

నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.

8 నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై

అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.

9 అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు

అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.

10 ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును

అవి మన్యములలో పారును.

11 అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును.

వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.

12 వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును

కొమ్మల నడుమ అవి సునాదము చేయును.

13 తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల

నిచ్చును

నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.

14 పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర

మొక్కలను

ఆయన మొలిపించుచున్నాడు

15 అందుమూలమున భూమిలోనుండి ఆహారమును

నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును

వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును

నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన

పుట్టించుచున్నాడు

16 యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి.

ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు

తృప్తిపొందుచున్నవి.

17 అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును

అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయుచున్నవి.

18 గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు

కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు

19 ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ

మించెను

సూర్యునికి తన అస్తమయకాలము తెలియును

20 నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది

అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.

21 సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి

తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన

జూచుచున్నవి.

22 సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి

తమ గుహలలో పండుకొనును.

23 సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు

కొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు.

24 యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా

నున్నవి !

జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి

నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.

25 అదిగో విశాలమైన మహాసముద్రము

అందులో లెక్కలేని జలచరములు

దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి.

26 అందులో ఓడలు నడుచుచున్నవి

దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము

లున్నవి.

27 తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని

ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి

28 నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును

నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి

పరచబడును.

29 నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును

నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు

విడిచి మంటి పాలగును.

30 నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును

అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.

31 యెహోవా మహిమ నిత్యముండునుగాక.

యెహోవా తన క్రియలను చూచి ఆనందించును

గాక.

32 ఆయన భూమిని చూడగా అది వణకును

ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును

33 నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు

పాడెదను

నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.

34 ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగానుండునుగాక

నేను యెహోవాయందు సంతోషించెదను.

35 పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక

భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/104-221c7346c3002e1911a0556bee6386a4.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 105

1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన

నామమును ప్రకటన చేయుడి

జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి.

2 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి

ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి

3 ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి.

యెహోవాను వెదకువారు హృదయమందు సంతో

షించుదురుగాక.

4 యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి

ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి

5 ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా

ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా

ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసికొనుడి

6 ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పు

లను జ్ఞాపకముచేసికొనుడి

7 ఆయన మన దేవుడైన యెహోవా

ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

8 తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు

అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను

9 ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును–

నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.

10 వారి సంఖ్య కొద్దిగా నుండగను

ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను

11 –కొలవబడిన స్వాస్థ్యముగా

కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను

12 ఆ మాట యాకోబునకు కట్టడగాను

ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి

యున్నాడు.

13 వారు జనమునుండి జనమునకును

ఒక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా

14 –నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు

నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ

ఇచ్చి

15 ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు

ఆయన వారికొరకు రాజులను గద్దించెను.

16 దేశముమీదికి ఆయన కరవు రప్పించెను

జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను.

17 వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను.

యోసేపు దాసుడుగా అమ్మబడెను.

18 వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి

ఇనుము అతని ప్రాణమును బాధించెను.

19 అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు

యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.

20 రాజు వర్తమానము పంపి అతని విడిపించెను.

ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను.

21 ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును

తన పెద్దలకు బుద్ధిచెప్పుటకును

22 తన యింటికి యజమానునిగాను

తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ

మించెను.

23 ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను

యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను.

24 ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ

జేసెను

వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను.

25 తన ప్రజలను పగజేయునట్లును

తన సేవకులయెడల కుయుక్తిగా నడచునట్లును

ఆయన వారి హృదయములను త్రిప్పెను.

26 ఆయన తన సేవకుడైన మోషేను

తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.

27 వారు ఐగుప్తీయులమధ్యను ఆయన సూచక క్రియలను

హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి

28 ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెనువారు ఆయన మాటను ఎదిరింపలేదు.

29 ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి

చేపలను చంపెను.

30 వారి దేశములో కప్పలు నిండెను

అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను.

31 ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెనువారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.

32 ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించెను.వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను.

33 వారి ద్రాక్షతీగెలను వారి అంజూరపు చెట్లను పడ

గొట్టెను

వారి ప్రాంతములయందలి వృక్షములను విరుగకొట్టెను.

34 ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును

లెక్కలేని చీడపురుగులును వచ్చెను,

35 అవి వారిదేశపు కూరచెట్లన్నిటినివారి భూమి పంటలను తినివేసెను.

36 వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులనువారి ప్రథమసంతానమునుఆయన హతముచేసెను.

37 అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో

ఆయన రప్పించెను

వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క

డైనను లేకపోయెను.

38 వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెనువారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి

39 వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును

కల్పించెను

రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.

40 వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను.

ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి

పరచెను.

41 బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను

ఎడారులలో అవి యేరులై పారెను.

42 ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును

తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని

43 ఆయన తన ప్రజలను సంతోషముతోను

తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలు

పలికి రప్పించెను.

44 వారు తన కట్టడలను గైకొనునట్లును

45 తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును

అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను

జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి.

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/105-a985845f41358831118cf0ec2b5a883d.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 106

1 యెహోవాను స్తుతించుడి

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుడి

ఆయన కృప నిత్యముండును.

2 యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప

గలడు?

ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?

3 న్యాయము ననుసరించువారు

ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.

4 యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను

చూచుచు

నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో

షించుచు

5 నీ స్వాస్థ్యమైనవారితోకూడి కొనియాడునట్లు

నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక

మునకు తెచ్చుకొనుము

నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.

6 మా పితరులవలెనే మేము పాపము చేసితిమి

దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి

7 ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను

గ్రహింపక యుండిరి

నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక

యుండిరి

సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు

బాటు చేసిరి.

8 అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై

ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.

9 ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను

మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము

లలో నడిపించెను.

10 వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను

శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.

11 నీళ్లు వారి శత్రువులను ముంచివేసెనువారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

12 అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి

ఆయన కీర్తి గానము చేసిరి.

13 అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి

ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.

14 అరణ్యములో వారు బహుగా ఆశించిరి

ఎడారిలో దేవుని శోధించిరి

15 వారు కోరినది ఆయన వారికిచ్చెను

అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.

16 వారు తమ దండు పాళెములో మోషేయందును

యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును

అసూయపడిరి.

17 భూమి నెరవిడిచి దాతానును మ్రింగెను

అది అబీరాము గుంపును కప్పివేసెను.

18 వారి సంఘములో అగ్ని రగిలెను

దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.

19 హోరేబులో వారు దూడను చేయించుకొనిరి.

పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి

20 తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు

రూపమునకు మార్చిరి.

21 ఐగుప్తులో గొప్ప కార్యములను

హాముదేశములో ఆశ్చర్యకార్యములను

22 ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను

చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.

23 అప్పుడు ఆయన–నేను వారిని నశింపజేసెదననెను.

అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన

కోపము చల్లార్చుటకై

ఆయన ఏర్పరచుకొనిన మోషే

ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను

24 వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి

ఆయన మాట నమ్మకపోయిరి

25 యెహోవా మాట ఆలకింపకవారు తమ గుడారములో సణుగుకొనిరి.

26 అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును

27 అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును

దేశములో వారిని చెదరగొట్టుటకును

ఆయన వారిమీద చెయ్యి యెత్తెను.

28 మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చినవారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి.

29 వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగావారిలో తెగులు రేగెను.

30 ఫీనెహాసు లేచి పరిహారముచేయగా

ఆ తెగులు ఆగిపోయెను.

31 నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను.

32 మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము

పుట్టించిరి

కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.

33 ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా

అతడు తన పెదవులతో కానిమాట పలికెను.

34 యెహోవావారికి ఆజ్ఞాపించినట్లువారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.

35 అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు

నేర్చుకొనిరి.

36 వారి విగ్రహములకు పూజచేసిరి

అవి వారికి ఉరి ఆయెను.

37 మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను

దయ్యములకు బలిగా అర్పించిరి.

38 నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ

కుమార్తెల రక్తము ఒలికించిరి

కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి

ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను.

39 తమ క్రియలవలనవారు అపవిత్రులైరి

తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.

40 కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద

రగులుకొనెను

ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.

41 ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెనువారి పగవారు వారిని ఏలుచుండిరి.

42 వారి శత్రువులు వారిని బాధపెట్టిరివారు శత్రువులచేతి క్రింద అణపబడిరి.

43 అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను

అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు

బాటు చేయుచువచ్చిరి.

తమ దోషముచేత హీనదశనొందిరి.

44 అయినను వారిరోదనము తనకు వినబడగావారికి కలిగినశ్రమను ఆయన చూచెను.

45 వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను

జ్ఞాపకము చేసికొనెను

తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.

46 వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను.

47 యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము

మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించునట్లును

నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును

అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.

48 ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా

యుగములన్నిటను స్తుతినొందును గాక

ప్రజలందరు–ఆమేన్ అందురుగాక.

యెహోవాను స్తుతించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/106-e414a02ed0b02a9cf979c9492022a81d.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 107

1 యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా

స్తుతులు చెల్లించుడి

ఆయన కృప నిత్యముండును.

2 యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు

గాక

విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును

3 తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి

దక్షిణము నుండియు

నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును

ఆమాట పలుకుదురుగాక.

4 వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి.

నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను.

5 ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.

6 వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి

ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను

7 వారొక నివాస పురము చేరునట్లు

చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.

8 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు

ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు

గాక

9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి

యున్నాడు.

ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి

యున్నాడు.

10 దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని

తీర్మానమును తృణీకరించినందున

11 బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై

చీకటిలోను మరణాంధకారములోను

నివాసముచేయువారి హృదయమును

12 ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను.వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.

13 కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి

ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను

14 వారి కట్లను తెంపివేసి

చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు

వారిని రప్పించెను.

15 ఆయన కృపనుబట్టియు

నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు

గాక.

16 ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి

యున్నాడు

ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.

17 బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము

చేతను బాధతెచ్చుకొందురు.

18 భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్యమగునువారు మరణద్వారములను సమీపించుదురు.

19 కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి

ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.

20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను

ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.

21 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు

ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు

గాక.

22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక

ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు

దురుగాక.

23 ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు

మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయువారు

24 యెహోవా కార్యములను

సముద్రములో ఆయనచేయు అద్భుతములను చూచిరి.

25 ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను

అది దాని తరంగములను పైకెత్తెను

26 వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు

దిగుచు నుండిరి

శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.

27 మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు

ఇటు అటు తూలుచుండిరివారు ఎటుతోచక యుండిరి.

28 శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి

ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.

29 ఆయన తుపానును ఆపివేయగా

దాని తరంగములు అణగిపోయెను.

30 అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరివారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.

31 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు

ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు

గాక.

32 జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక

పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక

33 దేశనివాసుల చెడుతనమునుబట్టి

34 ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన

నేలగాను

సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.

35 అరణ్యమును నీటిమడుగుగాను

ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన

మార్చి

36 వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును

పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి

37 వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును

ఆయన ఆకలిగొనినవారిని అచ్చట కాపురముంచెను

38 మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక

ముగా సంతానాభివృద్ధి నొందిరి

ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు

39 వారు బాధవలనను ఇబ్బందివలనను

దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు

40 రాజులను తృణీకరించుచు

త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు

వాడు.

41 అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను

వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.

42 యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు

మోసగాండ్రందరును మౌనముగా నుందురు.

43 బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును

యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/107-daa5714061d90cfd3f93bba8920d1855.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 108

గీతము. దావీదు కీర్తన.

1 దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది

నేను పాడుచు స్తుతిగానము చేసెదను

నా ఆత్మ పాడుచు గానముచేయును.

2 స్వరమండలమా సితారా, మేలుకొనుడి

నేను వేకువనే లేచెదను

3 జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

ప్రజలలో నిన్ను కీర్తించెదను

4 యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది

నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.

5-6 దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను

కనుపరచుకొనుము.

నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము

నీ ప్రియులు విమోచింపబడునట్లు

నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.

7 తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు

నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను

సుక్కోతు లోయను కొలిపించెదను.

8 గిలాదు నాది మనష్షే నాది

ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజ

దండము.

9 మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము

ఎదోముమీదికి నా చెప్పు విసరివేయుదును

ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.

10 కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొనిపోవును?

ఎదోములోనికి నన్నెవడు నడిపించును?

11 దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా?

దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని

యున్నావుగదా?

12 మనుష్యుల సహాయము వ్యర్థము.

శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము

దయచేయుము

13 దేవునివలన మేము శూరకార్యములు జరిగించెదము

మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/108-d6ac21399c61e834b4687fb245ece52b.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 109

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన

1 నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా

ఉండకుము

2 నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు

కపటముగల తమ నోరు తెరచియున్నారువారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.

3 నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు

నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు

4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ

పెట్టియున్నారు

అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.

5 నేను చేసిన మేలునకు ప్రతిగా కీడుచేయుచున్నారు.

నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష

ముంచుచున్నారు.

6 వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము

అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.

7 వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పునొందును గాక

వాని ప్రార్థన పాపమగునుగాక

8 వాని జీవితదినములు కొద్దివగును గాక

వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.

9 వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక

వాని భార్య విధవరాలగును గాక

10 వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక

పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము

వెదకుదురు గాక

11 వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు

కొందురు గాక

వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక

12 వానికి కృప చూపువారు లేకపోదురు గాక

తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక

పోదురు గాక

13 వాని వంశము నిర్మూలము చేయబడును గాక

వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక

14 వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు

కొనును గాక

వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక

15 ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి

వేయునట్లు

ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడు

చుండునుగాక.

16 ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి

శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము

గలవానిని

చంపవలెనని వాడు అతని తరిమెను.

17 శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి

యున్నది.

దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి

దూరమాయెను.

18 తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను

అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది

తైలమువలె వాని యెముకలలోచేరియున్నది

19 తాను కప్పుకొను వస్త్రమువలెను

తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని

వదలకుండును గాక.

20 నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట

లాడువారికి

ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము.

21 యెహోవా ప్రభువా,

నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము

నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.

22 నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ

బడియున్నది.

23 సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను

మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు

24 ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను

నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.

25 వారి నిందలకు నేను ఆస్పదుడనైతినివారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు

26-27 యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు

యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు

నట్లు

నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను

రక్షింపుము.

28 వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువువారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు

సంతోషించును.

29 నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక

తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక

30 నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు

మెండుగా చెల్లించెదను

అనేకులమధ్యను నేనాయనను స్తుతించెదను.

31 దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి

లోనుండి అతని రక్షించుటకై

యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/109-e2badd74c125ef6f2130e1da869d013a.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 110

దావీదు కీర్తన.

1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు

–నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా

చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

2 యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి

సాగజేయుచున్నాడు

నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.

3 యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా

వచ్చెదరు.

నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు

వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు

4 –మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము

యాజకుడవైయుందువని

యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన

మాట తప్పనివాడు.

5 ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి

తన కోపదినమున రాజులను నలుగగొట్టును.

6 అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును

దేశము శవములతో నిండియుండును

విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.

7 మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/110-2bf66528bb448334c9792913152beaf6.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 111

1 యెహోవాను స్తుతించుడి.

యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ

హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా

స్తుతులు చెల్లించెదను.

2 యెహోవా క్రియలు గొప్పవి

వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించుదురు.

3 ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది

ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.

4 ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను

నియమించియున్నాడు.

యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు

5 తనయందు భయభక్తులుగలవారికి ఆయన

ఆహారమిచ్చియున్నాడు

ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.

6 ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు

తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి

యున్నాడు.

7 ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి

ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.

8 అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి

సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి

యున్నవి.

9 ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు

తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు

వాడు.

ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.

10 యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము

ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు.

ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/111-b3d5e0ed971ef5a84be84865c23a1602.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 112

1 యెహోవాను స్తుతించుడి

యెహోవాయందు భయభక్తులుగలవాడు

ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు

ధన్యుడు.

2 వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు

యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు

3 కలిమియు సంపదయు వాని యింటనుండును

వాని నీతి నిత్యము నిలుచును.

4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునువారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.

5 దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు

న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును

6 అట్టివారు ఎప్పుడును కదలింపబడరు

నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.

7 వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర

ముగానుండును

వాడు దుర్వార్తకు జడియడు.

8 వాని మనస్సు స్థిరముగానుండును

తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు

వాడు భయపడడు.

9 వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును

వాని నీతి నిత్యము నిలుచును

వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.

10 భక్తిహీనులు దాని చూచి చింతపడుదురువారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు

భక్తిహీనుల ఆశ భంగమైపోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/112-10b35f634ce81f7fe8ebb46d613f3279.mp3?version_id=1787—