Categories
కీర్తనలు

కీర్తనలు 93

1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు

ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు

యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు

కొనియున్నాడు

కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.

2 పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను

సదాకాలము ఉన్నవాడవు నీవే

3 వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను

వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి

4 విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర

తరంగముల ఘోషలకంటెను

ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు

5 నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు

యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర

మునకు అనుకూలము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/93-f49ac445aae3eb298223613ac09cb26c.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 94

1 యెహోవా, ప్రతికారముచేయు దేవా,

ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము

2 భూలోక న్యాయాధిపతీ లెమ్ము

గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము

3 యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?

భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?

4 వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు

దోషము చేయువారందరు బింకములాడుచున్నారు.

5 –యెహోవా చూచుటలేదు

యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని

6 యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు

నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు

7 విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు

తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు.

8 జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి

బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?

9 చెవులను కలుగచేసినవాడు వినకుండునా?

కంటిని నిర్మించినవాడు కానకుండునా?

10 అన్యజనులను శిక్షించువాడు

మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?

11 నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి

యున్నది.

12 యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును

బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.

13 భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు

నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది

కలుగజేయుదువు.

14 యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు

తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.

15 నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును

యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.

16 దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును?

దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున

ఎవడు నిలుచును?

17 యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల

నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి

యుండును.

18 –నాకాలు జారెనని నేననుకొనగా

యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా

నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ

జేయుచున్నది.

20 కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు

పొందుకలుగునా?

21 దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద

పడుదురు

దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.

22 యెహోవా నాకు ఎత్తయిన కోట

నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.

23 ఆయన వారిదోషము వారిమీదికి రప్పించునువారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును.

మన దేవుడైన యెహోవావారిని సంహరించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/94-3eecd97740e149a753cff2570672f045.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 95

1 రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయు

దము

మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు

దము

2 కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము

కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము

చేయుదము.

3 యెహోవా మహా దేవుడు

దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు

4 భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి

పర్వతశిఖరములు ఆయనవే.

5 సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను

ఆయన హస్తములు భూమిని నిర్మించెను.

6 ఆయన మన దేవుడు

మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు

గొఱ్ఱెలము.

7 రండి నమస్కారము చేసి సాగిలపడుదము

మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు

దము

నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత

మేలు.

8 అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని

నట్లు

మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు

మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

9 అచ్చట మీపితరులు నన్ను పరీక్షించి శోధించి నా

కార్యములు చూచిరి

10 నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి

–వారు హృదయమున తప్పిపోవు ప్రజలువారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.

11 కావున నేను కోపించి–వీరెన్నడును నా విశ్రాంతిలో

ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/95-5a847597bed765d9ffa3485506be23dd.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 96

1 యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి

సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి

2 యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతిం

చుడి

అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.

3 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి

సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను

ప్రచురించుడి

4 యెహోవా మహాత్మ్యముగలవాడు

ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు

సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.

5 జనముల దేవతలందరు వట్టి విగ్రహములే

యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.

6 ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి

బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.

7 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి

మహిమబలములు యెహోవాకు చెల్లించుడి.

8 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు

చెల్లించుడి

నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి.

9 పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు

నమస్కారముచేయుడి

సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.

10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు

లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది

న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన

చేయును.

ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి

11 యెహోవా వేంచేయుచున్నాడు

ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును

గాక

సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక.

12 పొలమును దానియందుగల సర్వమును యెహోవా

సన్నిధిని ప్రహర్షించునుగాక.

వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.

13 భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు

చున్నాడు

న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి

జనములకు ఆయన తీర్పు తీర్చును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/96-16a61fa319c4bfeda416610ca699dcbd.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 97

1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూ

లోకము ఆనందించునుగాక

ద్వీపములన్నియు సంతోషించునుగాక.

2 మేఘాంధకారములు ఆయనచుట్టునుండును

నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.

3 అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది

అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది.

4 ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి

భూమి దాని చూచి కంపించుచున్నది.

5 యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని

పర్వతములుమైనమువలె కరగుచున్నవి.

6 ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది

సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది

7 వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు

చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడు

దురు

సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.

8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ

న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు

యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.

9 ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా

నీవు మహోన్నతుడవై యున్నావు

సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న

త్యము పొందియున్నావు.

10 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును

అసహ్యించుకొనుడి

తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు.

భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.

11 నీతిమంతులకొరకు వెలుగును

యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి

యున్నవి.

12 నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి

ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా

స్తుతులు చెల్లించుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/97-d7e7061b07eff0a613801aca53c236e0.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 98

గీతము.

1 యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు

ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి

ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు

ఆయనకు విజయము కలుగజేసియున్నది.

2 యెహోవా తన రక్షణను వెల్లడిచేసియున్నాడు

అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచి

యున్నాడు.

3 ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్య

తలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు

భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన

రక్షణను చూచిరి.

4 సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి

ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు

పాడుడి.

5 సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు

పాడుడి

సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.

6 బూరలతోను కొమ్ముల నాదముతోను

రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.

7 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును

గాక

లోకమును దాని నివాసులును కేకలువేయుదురు

గాక.

8 ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక

కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.

9 భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు

తీర్చుటకై

న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై

యెహోవా వేంచేసియున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/98-fcf95ae45c62808632427c4018d572d1.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 99

1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు

వణకును

ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.

2 సీయోనులో యెహోవా మహోన్నతుడు

జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.

3 భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు.

యెహోవా పరిశుద్ధుడు.

4 యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు

రాజును స్థిరపరచియున్నావు

యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను

జరిగించియున్నావు.

5 మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి

ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి

ఆయన పరిశుద్ధుడు.

6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి

ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో

సమూయేలు ఉండెను.వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా

ఆయన వారి కుత్తరమిచ్చెను.

7 మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట

లాడెనువారు ఆయన శాసనముల ననుసరించిరి

ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి

8 యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివివారిక్రియలనుబట్టి ప్రతికారము చేయుచునే

వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి.

9 మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు

మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి.

ఆయన పరిశుద్ధపర్వతము ఎదుట సాగిలపడుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/99-9e53f76122191d659e827c60eb3566b0.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 100

స్తుత్యర్పణ కీర్తన.

1 సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని

చేయుడి.

2 సంతోషముతో యెహోవాను సేవించుడి

ఉత్సాహగానముచేయుచు ఆయన సన్నిధికి రండి.

3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి

ఆయనే మనలను పుట్టించెనుమనము ఆయన

వారము

మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో

ప్రవేశించుడి

కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి

ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.

5 యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును

ఆయన సత్యము తరతరములుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/100-b0f5459e681198084b5791878d12ae23.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 101

దావీదు కీర్తన.

1 నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు

పాడెదను

యెహోవా, నిన్ను కీర్తించెదను.

2 నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను.

నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు?

నా యింట యథార్థహృదయముతో నడుచుకొం

దును

3 నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు

కొనను

భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య

ములు అవి నాకు అంటనియ్యను

4 మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను

దౌష్ట్యమును నేననుసరింపను.

5 తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను

సంహరించెదను

అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము

గలవారిని నేను సహింపను

6 నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైనవారిని నేను కనిపెట్టుచున్నాను

నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు

లగుదురు.

7 మోసము చేయువాడు నా యింట నివసింపరాదు

అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.

8 యెహోవా పట్టణములోనుండి

పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై

దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను

సంహరించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/101-a39df8985b6b2407825fdd07a53ddd56.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 102

దుఃఖముచేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొఱ్ఱ.

1 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము

నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.

2 నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము

నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి

నాకుత్తర మిమ్ము.

3 పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి

పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి

పోయి యున్నవి.

4 ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి

పోయి యున్నది

భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.

5 నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ

మునకు అంటుకొనిపోయినవి.

6 నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను

పాడైన స్థలములలోని పైడికంటెవలె నున్నాను.

7 రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా

నున్న పిచ్చుకవలె నున్నాను.

8 దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు

నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం

తురు.

9 నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు

బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.

10 నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను.

నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.

11 నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి

గడ్డివలె నేను వాడియున్నాను.

12 యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ

నామస్మరణ తరతరము లుండును.

13 నీవు లేచి సీయోనును కరుణించెదవు.

దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను

నిర్ణయకాలమే వచ్చెను.

14 దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములువారు దాని మంటిని కనికరించుదురు

15 అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును

భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు

16 ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు

ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను

17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపకవారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.

18 యెహోవాను సేవించుటకై జనములును

రాజ్యములును కూర్చబడునప్పుడు

19 మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను

యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు

నట్లు

20 చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును

చావునకు విధింపబడినవారిని విడిపించుటకును

21 ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు

ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు

22 వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ

వలెను

సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును

23 నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము

క్రుంగజేసెను

నా దినములు కొద్దిపరచెను.

24 నేనీలాగు మనవిచేసితిని–నా దేవా, నాదినముల

మధ్యను నన్ను కొనిపోకుము

నీ సంవత్సరములు తరతరములుండును.

25 ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి

ఆకాశములు కూడ నీ చేతిపనులే.

26 అవి నశించును గాని నీవు నిలచియుందువు

అవియన్నియు వస్త్రమువలె పాతగిలును

ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని

తీసివేయుదువు అవి మార్చబడును.

27 నీవు ఏకరీతిగా నుండువాడవు

నీ సంవత్సరములకు అంతము లేదు.

28 నీ సేవకుల కుమారులు నిలిచియుందురువారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/102-084f1edfe41ec59aeb65b82ebebd360a.mp3?version_id=1787—