Categories
కీర్తనలు

కీర్తనలు 83

ఆసాపు కీర్తన. గీతము.

1 దేవా, ఊరకుండకుము

దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.

2 నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు

నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు.

3 నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్నుచున్నారు

నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచనచేయుచున్నారు

4 వారు–ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక

పోవునట్లు

జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని

చెప్పుకొనుచున్నారు.

5 ఏకమనస్సుతో వారు ఆలోచనచేసికొనియున్నారు

నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.

6-7 గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును

మోయాబీయులును హగ్రీయీలును

గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును

ఫిలిష్తీయులును తూరు నివాసులును

నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.

8 అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు

లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)

9 మిద్యానునకు నీవు చేసినట్లు

కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును

చేసినట్లు వారికిని చేయుము.

10 వారు ఏన్దోరులో నశించిరి

భూమికి పెంట అయిరి.

11 ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి

ప్రధానులకును చేయుము

జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లువారి సకల రాజులకును చేయుము.

12 –దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు

కొందమని వారు చెప్పుకొనుచున్నారు.

13 నా దేవా, సుడి తిరుగు ధూళివలెను

గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము

14 అగ్ని అడవిని కాల్చునట్లు

కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు

15 నీ తుపానుచేత వారిని తరుముము

నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.

16 యెహోవా, వారు నీ నామమును వెదకునట్లువారికి పూర్ణావమానము కలుగజేయుము.

17 వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాకవారు భ్రమసి నశించుదురు గాక.

18 యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే

సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు

గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/83-ccbd0662492c8ae713008c092bea40e3.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 84

ప్రధానగాయకునికి గిత్తీత్ అను రాగముమీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన.

1 సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు

ఎంత రమ్యములు

2 యెహోవామందిరావరణములను చూడవలెనని

నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ

సిల్లుచున్నది

జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును

నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.

3 సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా

దేవా,

నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను

పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.

4 నీ మందిరమునందు నివసించువారు ధన్యులువారు నిత్యము నిన్ను స్తుతించుదురు.(సెలా.)

5 నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు

యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.

6 వారు బాకా లోయలోబడి వెళ్లుచు

దానిని జలమయముగా చేయుదురు

తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.

7 వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము

చేయుదురు

వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని

కనబడును.

8 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన

ఆలకింపుము

యాకోబు దేవా, చెవియొగ్గుము.(సెలా.)

9 దేవా, మా కేడెమా, దృష్టించుము

నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.

10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన

ములకంటె శ్రేష్ఠము.

భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె

నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.

11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై

యున్నాడు

యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును

యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును

చేయక మానడు.

12 సైన్యములకధిపతివగు యెహోవా,

నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/84-4e0a37e4116325f1e6862537b7e3ff9d.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 85

ప్రధానగాయకునికి. కోరహు కుమారుల కీర్తన.

1 యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి

యున్నావు

చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు

రప్పించియున్నావు.

2 నీ ప్రజల దోషమును పరిహరించియున్నావువారి పాపమంతయు కప్పివేసి యున్నావు(సెలా.)

3 నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు

నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు

4 మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.

మా మీదనున్న నీ కోపము చాలించుము.

5 ఎల్లకాలము మామీద కోపగించెదవా?

తరతరములు నీ కోపము సాగించెదవా?

6 నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు

నీవు మరల మమ్మును బ్రదికింపవా?

7 యెహోవా, నీ కృప మాకు కనుపరచుము

నీ రక్షణ మాకు దయచేయుము.

8 దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని

బెట్టెదను

ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ

వచనము సెలవిచ్చునువారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.

9 మన దేశములో మహిమ నివసించునట్లు

ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.

10 కృపాసత్యములు కలిసికొనినవి

నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.

11 భూమిలోనుండి సత్యము మొలుచును

ఆకాశములోనుండి నీతి పారజూచును.

12 యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును

మన భూమి దాని ఫలమునిచ్చును.

13 నీతి ఆయనకు ముందు నడచును

ఆయన అడుగుజాడలలో అది నడచును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/85-7ea198f7099731ee5f597bacad58a649.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 86

దావీదు కీర్తన.

1 యెహోవా, నేను దీనుడను దరిద్రుడను

చెవియొగ్గి నాకుత్తరమిమ్ము

2 నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము.

నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము.

3 ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను

నన్ను కరుణింపుము

4 ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను

నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.

5 ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన

మనస్సుగలవాడవు

నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గలవాడవు.

6 యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము

నా మనవుల ధ్వని ఆలకింపుము,

7 నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు

గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టె

దను.

8 ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య

ములు చేయువాడవు

నీవే అద్వితీయ దేవుడవు.

9 ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు

నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.

10 నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ

సన్నిధిని నమస్కారము చేయుదురు

నీ నామమును ఘనపరచుదురు

11 యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు

కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము.

నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు

ఏకదృష్టి కలుగజేయుము.

12 నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు

తులు చెల్లించెదను

నీ నామమును నిత్యము మహిమపరచెదను.

13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప

అధికమైనది

పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి

యున్నావు.

14 దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు

బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ

జూచుచున్నారువారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు.

15 ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు

దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు

16 నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము

నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము

నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.

17 యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు

చున్నావు

నా పగవారు చూచి సిగ్గుపడునట్లు

శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/86-d10ef61c9c5212509b4c5f774e82f54e.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 87

కోరహు కుమారుల కీర్తన. గీతము.

1 ఆయన పట్టణపు పునాది పరిశుద్ధపర్వతములమీద

వేయబడియున్నది

2 యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ

ములు యెహోవాకు ప్రియములై యున్నవి

3 దేవుని పట్టణమా,

మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు

చెప్పుకొందురు.(సెలా.)

4 రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని

నేను తెలియజెప్పుచున్నాను

ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము

వీరు అచ్చట జన్మించిరనియందురు.

5 ప్రతి జనము దానిలోనే జన్మించెననియు

సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు

సీయోనునుగూర్చి చెప్పుకొందురు.

6 యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు

–ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును.(సెలా.)

7 పాటలు పాడుచు వాద్యములు వాయించుచు

–మా ఊటలన్నియు నీయందే యున్నవని వారం

దురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/87-4ec18755a9cd9d1269e51941ce432938.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 88

ప్రధాన గాయకునికి. మహలతు లయన్నోత్ అను రాగముమీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము. కోరహు కుమారుల కీర్తన. గీతము.

1 యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా,

రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు

2 నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక

నా మొఱ్ఱకు చెవి యొగ్గుము

3 నేను ఆపదలతో నిండియున్నాను

నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.

4 సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని.

నేను త్రాణలేనివానివలె అయితిని.

5 చచ్చినవారిలో విడువబడినవాడనైతిని

నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె

అయితిని

నీవిక స్మరింపనివారివలె అయితినివారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు

గదా.

6 అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను

అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి

యున్నావు.

7 నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది

నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి.(సెలా.)

8 నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి

యున్నావు

నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు

వెలుపలికి రావల్లగాకుండ నేను బంధింపబడి

యున్నాను

9 బాధచేత నా కన్ను క్షీణించుచున్నది

యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు

చున్నాను

నీవైపు నా చేతులు చాపుచున్నాను.

10 మృతులకు నీవు అద్భుతములు చూపెదవా?

ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా.)

11 సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా?

నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు

కొందురా?

12 అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా?

పాతాళములో నీ నీతి తెలియనగునా?

13 యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను

ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.

14 యెహోవా, నీవు నన్ను విడుచుట యేల?

నీ ముఖము నాకు చాటు చేయుట యేల?

15 బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని

నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.

16 నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది

నీ మహా భయములు నన్ను సంహరించియున్నవి.

17 నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి

అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి

18 నా ప్రియులను స్నేహితులను నీవు నాకు

దూరముగా ఉంచియున్నావు

చీకటియే నాకు బంధువర్గమాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/88-e5ad9ecadf2667fa8752c5b3abc1e7b7.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 89

ఎజ్రాహీయుడైన ఏతాను రచించినది. దైవధ్యానము.

1 యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను

కీర్తించెదను

తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ

జేసెదను.

2 –కృప నిత్యము స్థాపింపబడుననియు

ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు

నేననుకొనుచున్నాను.

3 –నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి

యున్నాను

నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను

4 తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి

నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి

యున్నాను.(సెలా.)

5 యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము

లను స్తుతించుచున్నది

పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతనుబట్టి

నీకు స్తుతులు కలుగుచున్నవి.

6 మింటను యెహోవాకు సాటియైనవాడెవడు?

దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?

7 పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు

తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.

8 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా,

యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు?

నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

9 సముద్రపు పొంగు నణచువాడవు నీవే

దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి

వేయుచున్నావు.

10 చంపబడినదానితో సమానముగా నీవు రహబును,

ఐగుప్తును నలిపివేసితివి

నీ బాహుబలముచేత నీ శత్రువులను చెదరగొట్టితివి.

11 ఆకాశము నీదే భూమి నీదే

లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.

12 ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి.

తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ

ధ్వని చేయుచున్నవి.

13 పరాక్రమముగల బాహువు నీకు కలదు

నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.

14 నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు

కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.

15 శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు

యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు

కొనుచున్నారు.

16 నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు.

నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు.

17 వారి బలమునకు అతిశయాస్పదము నీవే

నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.

18 మా కేడెము యెహోవావశము

మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు.

19 అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి

–నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను

ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను

హెచ్చించియున్నాను.

20 నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను

నా పరిశుద్ధైతెలముతో అతని నభిషేకించియున్నాను.

21 నా చెయ్యి యెడతెగక అతనికి తోడై యుండును

నా బాహుబలము అతని బలపరచును.

22 ఏ శత్రువును అతనిమీద జయము నొందడు

దోషకారులు అతని బాధపరచరు.

23 అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను

పడగొట్టెదను.

అతనిమీద పగపట్టువారిని మొత్తెదను.

24 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును.

నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.

25 నేను సముద్రముమీద అతనిచేతిని

నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను.

26 –నీవు నా తండ్రివి నా దేవుడవు

నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.

27 కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాచేయు

దును

భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.

28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను

నా నిబంధన అతనితో స్థిరముగానుండును.

29 శాశ్వతకాలమువరకు అతని సంతానమును

ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను

నిలిపెదను.

30 అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి

నా న్యాయవిధుల నాచరింపనియెడల

31 వారు నా కట్టడలను అపవిత్రపరచి

నా ఆజ్ఞలను గైకొననియెడల

32 నేను వారి తిరుగుబాటునకు దండముతోనువారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.

33 కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను

అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను.

34 నా నిబంధనను నేను రద్దుపరచను

నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను.

35 అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు

అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా

సన్నిధిని ఉండుననియు

36 చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు

మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర

పరచబడుననియు

37 నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని

దావీదుతో నేను అబద్ధమాడను.

38 ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి

విసర్జించియున్నావు

నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి

యున్నావు.

39 నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను

అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి

యున్నావు.

40 అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు

అతని కోటలు పాడుచేసియున్నావు

41 త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు

అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.

42 అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు

అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి

యున్నావు

43 అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు

యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు

44 అతని వైభవమును మాన్పియున్నావు

అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు

45 అతని యౌవనదినములను తగ్గించియున్నావు.

సిగ్గుతో అతని కప్పియున్నావు(సెలా.)

46 యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యముదాగియుందువా?

ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

47 నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసికొనుము

ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి

యున్నావు?

48 మరణమును చూడక బ్రదుకు నరుడెవడు?

పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను

తప్పించుకొనగలవాడెవడు?

49 ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమా

ణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ?

50 ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము

చేసికొనుము

బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను

భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.

51 యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు

నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.

52 యెహోవా నిత్యము స్తుతినొందును గాక

ఆమేన్ ఆమేన్.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/89-aeac88ec2d5f7abea23294d4180bd04e.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 90

దైవజనుడైన మోషేచేసిన ప్రార్థన.

1 ప్రభువా, తరతరములనుండి

మాకు నివాసస్థలము నీవే.

2 పర్వతములు పుట్టకమునుపు

భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు

యుగయుగములు నీవే దేవుడవు

3 నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు

–నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

4 నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి

వలెనున్నవి

రాత్రియందలి యొక జామువలెనున్నవి.

5 వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు

నిద్రింతురు.

ప్రొద్దునవారు పచ్చ గడ్డివలె చిగిరింతురు

6 ప్రొద్దున అది మొలిచి చిగిరించును

సాయంకాలమున అది కోయబడి వాడబారును.

7 నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము

నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

8 మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని

యున్నావు

నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.

9 నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు

గడిపితిమి.

నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు

కొందుము.

10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు

అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును

అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే

అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

11 నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును?

నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము

ఎంతో ఎవరికి తెలియును?

12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము

మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

13 యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు?

నీ సేవకులను చూచి సంతాపపడుము.

14 ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము

అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి

సంతోషించెదము.

15 నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది

మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము.

16 నీ సేవకులకు నీ కార్యము కనుపరచుమువారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.

17 మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీదనుండును గాక

మా చేతిపనిని మాకు స్థిరపరచుము

మా చేతిపనిని స్థిరపరచుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/90-19482ce3776e885c8ca144156b0ae982.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 91

1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని

నీడను విశ్రమించువాడు.

2 –ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము

కొను నా దేవుడని

నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.

3 వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును

నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును

4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును

ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును

ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

5 రాత్రివేళ కలుగు భయమునకైనను

పగటివేళ ఎగురు బాణమునకైనను

6 చీకటిలో సంచరించు తెగులునకైనను

మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను

నీవు భయపడకుందువు.

7 నీ ప్రక్కను వేయి మంది పడినను

నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను

అపాయము నీ యొద్దకురాదు.

8 నీవు కన్నులార చూచుచుండగా

భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును

9 –యెహోవా, నీవే నా ఆశ్రయము అని

నీవు మహోన్నతుడైన దేవుని నీకు

నివాసస్థలముగా చేసికొనియున్నావు

10 నీకు అపాయమేమియు రాదు

ఏ తెగులును నీ గుడారమును సమీపించదు

11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు

ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించును

12 నీ పాదములకు రాయి తగులకుండవారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు

13 నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు

కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు.

14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని

తప్పించెదను

అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని

ఘనపరచెదను

15 అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె

దను

శ్రమలో నేనతనికి తోడై యుండెదను

అతని విడిపించి అతని గొప్ప చేసెదను

16 దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను

నా రక్షణ అతనికి చూపించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/91-4f7413e8ba86fb887c6998623aa88b2f.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 92

విశ్రాంతిదినమునకు తగిన కీర్తన. గీతము.

1 యెహోవాను స్తుతించుట మంచిది

2-3 మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.

ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను

పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల

సితారాతోను ప్రచురించుట మంచిది.

4 ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను

సంతోషపరచుచున్నావు

నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.

5 యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి!

నీ ఆలోచనలు అతిగంభీరములు,

6 పశుప్రాయులు వాటిని గ్రహింపరు

అవివేకులు వివేచింపరు.

7 నిత్యనాశనము నొందుటకే గదా

భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు.

చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.

8 యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా

నుందువు

9 నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిం

చెదరు

చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.

10 గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి

క్రొత్త తైలముతో నేను అంటబడితిని.

11 నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర

చూచెను

నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది

నా చెవులకు వినబడెను

12 నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్యువేయుదురు

లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు

ఎదుగుదురు

13 యెహోవా మందిరములో నాటబడినవారైవారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.

14 నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు

డనియు

ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి

చేయుటకై

15 వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు

సారము కలిగి పచ్చగా నుందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/92-42016b1ee1a5c3043561ffcf028ccb7d.mp3?version_id=1787—