Categories
కీర్తనలు

కీర్తనలు 73

ఆసాపు కీర్తన.

1 ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల

నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.

2 నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను

నా అడుగులు జార సిద్ధమాయెను.

3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు

గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.

4 మరణమందు వారికి యాతనలు లేవువారు పుష్టిగా నున్నారు.

5 ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు

ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.

6 కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది

వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.

7 క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవివారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి

8 ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును

గూర్చి వారు మాటలాడుదురు.

గర్వముగా మాటలాడుదురు.

9 ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురువారి నాలుక భూసంచారము చేయును.

10 వారి జనము వారిపక్షము చేరునువారు జలపానము సమృద్ధిగా చేయుదురు.

11 –దేవుడు ఎట్లు తెలిసికొనును

మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను

కొందురు.

12 ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు

నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.

13 నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట

వ్యర్థమే

నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే

14 దినమంతయు నాకు బాధ కలుగుచున్నది

ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.

15 –ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల

నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ

నగుదును.

16 అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు

17 నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయివారి అంతమునుగూర్చి ధ్యానించువరకు

ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.

18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే

ఉంచియున్నావువారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు

19 క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు

మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

20 మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు

ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక

రింతువు.

21 నా హృదయము మత్సరపడెను.

నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.

22 నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని

నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.

23 అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను

నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.

24 నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు.

తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు

25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?

నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర

లేదు.

26 నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను

దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.

27 నిన్ను విసర్జించువారు నశించెదరు

నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ

రించెదవు.

28 నాకైతే దేవుని పొందు ధన్యకరము

నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు

నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/73-2be0ec9c4251ce07bcb6ee4ff2936e22.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 74

ఆసాపు కీర్తన. దైవధ్యానము.

1 దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి?

నీవు మేపు గొఱ్ఱెలమీద నీ కోపము పొగరాజు

చున్నదేమి?

2 నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపా

దించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపక

మునకు తెచ్చుకొనుము.

నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపక

మునకు తెచ్చుకొనుము.

3 శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును

పాడుచేసియున్నారు

నిత్యము పాడైయుండు చోట్లకు విజయము

చేయుము.

4 నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు

విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు

5 దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి

నట్లుగా వారు కనబడుదురు

6 ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని

దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు.

7 నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు

నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు

దురు.

8 –దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద

మనుకొని

దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు.

9 సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను

ప్రవక్తయు లేకపోయెను.

ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు

మాలో ఎవడును లేడు.

10 దేవా, విరోధులు ఎందాక నిందింతురు?

శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?

11 నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు

కొని యున్నావు?

నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము

చేయుము.

12 పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై

యున్నాడు

దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.

13 నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి

జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల

గొట్టితివి.

14 మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి

తివి

అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.

15 బుగ్గలను నదులను పుట్టించితివి

నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక జేసితివి

16 పగలు నీదే రాత్రి నీదే

సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.

17 భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే

వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.

18 యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను

అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను

మనస్సునకు తెచ్చుకొనుము.

19 దుష్టమృగమునకు నీ గువ్వయొక్క ప్రాణము నప్ప

గింపకుము

శ్రమనొందు నీవారిని నిత్యము మరువకుము.

20 లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల

నివాసములతో నిండియున్నవి.

కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము

21 నలిగినవానిని అవమానముతో వెనుకకు మరల నియ్యకుము.

శ్రమ నొందువారును దరిద్రులును నీ నామము

సన్నుతించుదురు గాక.

22 దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము

అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాప

కము చేసికొనుము.

23 నీమీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది.

నీ విరోధులుచేయు గల్లత్తును మరువకుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/74-cc1fc32bfa121fc038157b54b49b3fb5.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 75

ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన. గీతము.

1 దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు

చున్నాము

నీవుసమీపముగా నున్నావని

కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము

నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు.

2 నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను

నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను.

3 భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు

నేనే దాని స్తంభములను నిలుపుదును.(సెలా.)

4 –అహంకారులై యుండకుడని అహంకారులకు నేను

ఆజ్ఞ ఇచ్చుచున్నాను.

5 –కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి

పొగరుపెట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను

ఆజ్ఞ ఇచ్చుచున్నాను.

6 తూర్పునుండియైనను పడమటినుండియైనను

అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.

7 దేవుడే తీర్పు తీర్చువాడు

ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును

8 యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది

అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది

సంబారముతో నిండియున్నది

ఆయన దానిలోనిది పోయుచున్నాడు

భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ

దానిని పీల్చి మ్రింగివేయవలెను.

9 నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురముచేయు

దును

యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.

10 భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను

నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/75-c8321472bddc4a197c74b84affc2e822.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 76

ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. ఆసాపు కీర్తన. గీతము.

1 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు

ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.

2 షాలేములో ఆయన గుడారమున్నది

సీయోనులో ఆయన ఆలయమున్నది.

3 అక్కడ వింటి అగ్ని బాణములను

కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన

విరుగగొట్టెను.(సెలా.)

4 దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె

నీవు అధిక తేజస్సుగలవాడవు.

5 కఠినహృదయులుదోచుకొనబడి యున్నారువారు నిద్రనొంది యున్నారు

పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.

6 యాకోబు దేవా, నీ గద్దింపునకు

రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.

7 నీవు, నీవే భయంకరుడవు

నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?

8 నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి

9 దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై

న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు

భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)

10 నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును

ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.

11 మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ

మ్రొక్కుబడులను చెల్లించుడి

ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు

ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.

12 అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు

భూరాజులకు ఆయన భీకరుడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/76-48c3aa1d97f55e728e6cb2362581e11c.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 77

ప్రధానగాయకునికి. యెదూతూను అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన.

1 నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు

మనవి చేయుదును

దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.

2 నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని

రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప

బడియున్నది.

నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.

3 దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు

విడుచుచున్నాను

నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది(సెలా.)

4 నీవు నా కన్నులు మూతపడనీయవు.

నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.

5 తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను

నేను మనస్సునకు తెచ్చుకొందును.

6 నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి

కొందును

హృదయమున ధ్యానించుకొందును.

దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.

7 ప్రభువు నిత్యము విడనాడునా?

ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

8 ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా?

ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి

పోయెనా?

9 దేవుడు కటాక్షింప మానెనా?

ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)

10 అందుకు–నేనీలాగు అనుకొనుచున్నాను

మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను

టకు నాకు కలిగినశ్రమయే కారణము.

11 యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ

ఆశ్చర్యకార్యములను

నేను మనస్సునకు తెచ్చుకొందును

12 నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును

నీ క్రియలను నేను ధ్యానించుకొందును.

13 దేవా, నీమార్గము పరిశుద్ధమైనది.

దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?

14 ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే

జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని

యున్నావు.

15 నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి

వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.

16 దేవా, జలములు నిన్ను చూచెను

జలములు నిన్ను చూచి దిగులుపడెను

అగాధజలములు గజగజలాడెను.

17 మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము

ఘోషించెను.

నీ బాణములు నలుదిక్కుల పారెను.

18 నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను

మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను

భూమి వణకి కంపించెను.

19 నీ మార్గము సముద్రములో నుండెను.

నీ త్రోవలు మహా జలములలో ఉండెను.

నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

20 మోషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి

పించితివి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/77-21da055ba33b7c430ce8f670d54f6dda.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 78

ఆసాపు కీర్తన. దైవధ్యానము.

1 నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి

నా నోటిమాటలకు చెవియొగ్గుడి

2 నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను

పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ

జెప్పెదను.

3 మాకు తెలిసిన సంగతులను

మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.

4 యెహోవా స్తోత్రార్హక్రియలను

ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్య

ములను దాచకుండ

వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.

5 రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు

నట్లునువారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును

వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ

లను మరువకయుండి

6 యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర

మనస్సులేనివారై తమపితరులవలె తిరుగబడకయు

7 మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి

యుండకయువారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును

8 ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ

మించెను

ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను

మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెననివారికాజ్ఞాపించెను

9 విండ్లను పట్టుకొని యుద్ధసన్నద్ధులైన ఎఫ్రాయిము

సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి

10 వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి

ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి

11 ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య

క్రియలను వారు మరచిపోయిరి.

12 ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి

పితరులు చూచుచుండగా

ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.

13 ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను

ఆయన నీటిని రాశిగా నిలిపెను

14 పగటివేళ మేఘములోనుండియు

రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు

ఆయన వారికి త్రోవ చూపెను

15 అరణ్యములో ఆయన బండలు చీల్చి

సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.

16 బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను

నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.

17 అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను

పాపముచేయుచునే వచ్చిరి

అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.

18 వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు

తమ హృదయములలో దేవుని శోధించిరి.

19 ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా

యనుచువారు దేవునికి విరోధముగా మాటలాడిరి.

20 ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను

నీళ్లు కాలువలై పారెను.

ఆయన ఆహారము ఇయ్యగలడా?

ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా?

అని వారు చెప్పుకొనిరి.

21 యెహోవా ఈ మాట విని కోపగించెను

యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను

ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము

పుట్టెను.

22 వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి.

ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.

23 అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా

పించెను.

అంతరిక్షద్వారములను తెరచెను

24 ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను

ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.

25 దేవదూతల ఆహారము నరులు భుజించిరి

భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా

పంపెను.

26 ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను

తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.

27 ధూళి అంత విస్తారముగా మాంసమును

సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు

గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.

28 వారి దండుమధ్యను వారి నివాసస్థలములచుట్టును

ఆయన వాటిని వ్రాలజేసెను.

29 వారు కడుపార తిని తనిసిరివారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.

30 వారి ఆశ తీరకమునుపే

ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే

31 దేవుని కోపము వారిమీదికి దిగెనువారిలో బలిసినవారిని ఆయన సంహరించెను

ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను.

32 ఇంత జరిగినను వారు ఇంకను పాపముచేయుచు

ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ముకొనక పోయిరి.

33 కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచి

పోజేసెను

వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను.

34 వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను

వెదకిరివారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి.

35 దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు

మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియువారు జ్ఞాపకము చేసికొనిరి.

36 అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగానుండలేదు

ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు

37 నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి

తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.

38 అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడైవారిని నశింపజేయక వారి దోషము పరిహరించు

వాడు.

తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక

పలుమారు కోపము అణచుకొనువాడు.

39 కాగా–వారు కేవలము శరీరులై యున్నారనియు

విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు

ఆయన జ్ఞాపకము చేసికొనెను.

40 అరణ్యమునవారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి

ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.

41 మాటిమాటికి వారు దేవుని శోధించిరి

మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము

కలిగించిరి.

42 ఆయన బాహుబలమునైనను

విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన

దినమునైననువారు స్మరణకు తెచ్చుకొనలేదు.

43 ఐగుప్తులో తన సూచక క్రియలను

సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన

చూపిన దినమునువారు జ్ఞిప్తికి తెచ్చుకొనలేదు.

44 ఐగుప్తీయులు త్రాగలేకుండ

నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను

45 ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను

అవి వారిని తినివేసెను

కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.

46 ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెనువారి కష్టఫలములను మిడతలకప్పగించెను.

47 వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను

హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు

చేసెను.

48 వారి పశువులను వడగండ్ల పాలుచేసెను.వారి మందలను పిడుగుల పాలుచేసెను.

49 ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను

మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.

50 తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను

మరణమునుండి వారి ప్రాణమును తప్పింపకవారి జీవమును తెగులునకు అప్పగించెను.

51 ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని

హాము గుడారములలోనున్న బలప్రారంభమైన

ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

52 అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు

కొనిపోయెను

ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయనవారిని నడిపించెను

53 వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా

నడిపించెను.వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.

54 తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు

తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము

నొద్దకు ఆయన వారిని రప్పించెను.

55 వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను.

కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి

యిచ్చెను.

ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివ

సింపజేసెను.

56 అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి

తిరుగుబాటు చేసిరి

ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.

57 తమపితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి

జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లువారు తొలగి

పోయిరి.

58 వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము

పుట్టించిరి

విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ

జేసిరి.

59 దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు

బహుగా అసహ్యించుకొనెను.

60 షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా

పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.

61 ఆయన తన బలమును చెరకును,

తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.

62 తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను.

ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను

63 అగ్ని వారి యౌవనస్థులను భక్షించెనువారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.

64 వారి యాజకులు కత్తిపాలుకాగావారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

65 అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను

మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను

ప్రభువు మేల్కొనెను.

66 ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను

నిత్యమైన నింద వారికి కలుగజేసెను.

67 పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను

ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.

68 యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను

పర్వతమును

ఆయన కోరుకొనెను.

69 తాను అంతరిక్షమును కట్టినట్లు

తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు

ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను

70 తన దాసుడైన దావీదును కోరుకొని

గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను.

71 పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి

తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా

యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.

72 అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను

కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/78-58750aba1a9c4a2f45811a335dd92cd6.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 79

ఆసాపు కీర్తన.

1 దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారువారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు

యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.

2 వారు నీ సేవకుల కళేబరములను ఆకాశపక్షులకు ఎరగాను

నీ భక్తుల శవములను భూజంతువులకు

ఆహారముగాను పారవేసి యున్నారు.

3 ఒకడు నీళ్లుపోసినట్లు యెరూషలేముచుట్టు వారి

రక్తము పారబోసియున్నారువారిని పాతిపెట్టువారెవరును లేరు.

4 మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి

మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు.

5 యెహోవా, ఎంతవరకు కోపపడుదువు?

ఎల్లప్పుడును కోపపడుదువా?

నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా?

6 నిన్నెరుగని అన్యజనులమీదను

నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను

నీ ఉగ్రతను కుమ్మరించుము.

7 వారు యాకోబు సంతతిని మ్రింగివేసియున్నారువారి నివాసమును పాడుచేసియున్నారు

8 మేము బహుగా క్రుంగియున్నాము.

మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని

నీవు మామీద కోపముగా నుండకుము

నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము

9 మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి

మాకు సహాయముచేయుము

నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి

మమ్మును రక్షింపుము.

10 –వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక

నేల?

మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్త

మునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు

అన్యజనులకు తెలియబడనిమ్ము.

11 చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము

నీ బాహుబలాతిశయమును చూపుము

చావునకు విధింపబడినవారిని కాపాడుము.

12 ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు

ప్రతిగా

వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము.

13 అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన

మేము

సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము

తరతరములవరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/79-207e046deab5c33a7c08da58f1a08039.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 80

ప్రధానగాయకునికి. షోషన్నీమ్ ఏదూత్ అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన.

1 ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము.

మందవలె యోసేపును నడిపించువాడా,

కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.

2 ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట

నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము.

3 దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము

మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.

4 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా,

నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము

పొగరాజనిచ్చెదవు?

5 కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు.

విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు

చున్నావు.

6 మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా

జేయుచున్నావు.

ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అప

హాస్యము చేయుచున్నారు.

7 సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము

రప్పించుము.

మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.

8 నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి

అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి

9 దానికి తగిన స్థలము సిద్ధపరచితివి

దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం

చెను

10 దాని నీడ కొండలను కప్పెను

దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ

రించెను.

11 దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను

యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను.

12 త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు

దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?

13 అడవిపంది దాని పెకలించుచున్నది

పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.

14 సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి

మరల చూడుము

ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము.

15 నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము

నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మనుకాయుము.

16 అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది

నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు.

17 నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను

నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను

నీ బాహుబలముండును గాక.

18 అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము

నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును

బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము

19 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో

నుండి మమ్ము రప్పించుము

మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/80-116ff62254f3f3916c540dcfc535049d.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 81

ప్రధానగాయకునికి. గిత్తీత్ అను రాగముమీద పాడదగినది. ఆసాపు కీర్తన.

1 మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి

యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి.

2 కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి

స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.

3 అమావాస్యనాడు కొమ్ము ఊదుడి

మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు

కొమ్ము ఊదుడి.

4 అది ఇశ్రాయేలీయులకు కట్టడ

యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.

5 ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు

యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను.

అక్కడ నేనెరుగని భాష వింటిని.

6 వారి భుజమునుండి నేను బరువును దింపగావారి చేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను.

7 ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను

విడిపించితిని

ఉరుము దాగు చోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని

మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని.(సెలా.)

8 నా ప్రజలారా, ఆలకింపుడి నేను మీకు సంగతి

తెలియజేతును

అయ్యో ఇశ్రాయేలూ, నీవు మా మాట వినినయెడల

ఎంత మేలు!

9 అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు

అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజచేయ

కూడదు.

10 ఐగుప్తీయుల దేశములోనుండి నిన్ను రప్పించిన నీ

దేవుడనగు యెహోవాను నేనే

నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను.

11 అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి

ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి.

12 కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు

కొనునట్లు

వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని.

13 అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల

ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంతమేలు!

14 అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ

ద్రొక్కుదునువారి విరోధులను కొట్టుదును.

15 యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురువారి కాలము శాశ్వతముగా నుండును.

16 అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని

పోషించుదును

కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/81-9a195b39ed690626378b9f86fcf30807.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 82

ఆసాపు కీర్తన.

1 దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు

దైవములమధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.

2 ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు?

ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు

దురు?(సెలా.)

3 పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి

శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.

4 దరిద్రులను నిరుపేదలను విడిపించుడి

భక్తిహీనులచేతిలోనుండి వారిని తప్పించుడి.

5 జనులకు తెలివి లేదువారు గ్రహింపరువారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు

దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.

6 –మీరు దైవములనియు

మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల

విచ్చియున్నాను.

7 అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును

చనిపోవుదురు

అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.

8 దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము

అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/82-65a69fa91f1719d20ab56e23898db2e1.mp3?version_id=1787—