Categories
కీర్తనలు

కీర్తనలు 63

దావీదు యూదా అరణ్యములోనుండగా రచించిన కీర్తన.

1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు

దును

2 నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని

పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని

పెట్టియున్నాను.

నీళ్లులేక యెండియున్న దేశమందు

నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది

నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము

కృశించుచున్నది.

3 నీ కృప జీవముకంటె ఉత్తమము

నా పెదవులు నిన్ను స్తుతించును.

4 నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని

రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

5 క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము

తృప్తిపొందుచున్నది

ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి

గానముచేయుచున్నది

6 కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను

స్తుతించెదను

నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.

7 నీవు నాకు సహాయకుడవై యుంటివి

నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని

చేసెదను.

8 నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది

నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.

9 నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని

వెదకుచున్నారువారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు

10 బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు

నక్కలపాలగుదురు.

11 రాజు దేవునిబట్టి సంతోషించును.

ఆయనతోడని ప్రమాణముచేయు ప్రతివాడును

అతిశయిల్లును

అబద్ధములాడువారి నోరు మూయబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/63-a191c785fd3259470aefb1e1e435f7e9.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 64

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము

శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.

2 కీడుచేయువారి కుట్రనుండి

దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము

3 ఒకడు కత్తికి పదును పెట్టునట్లువారు తమ నాలుక

లకు పదును పెట్టుదురు.

4 యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో

చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని

కొట్టెదరు

5 వారు దురాలోచన దృఢపరచుకొందురు

చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు

–మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు.

6 వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నిం

తురు

వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు

ప్రతివాని హృదయాంతరంగము అగాధము.

7 దేవుడు బాణముతో వారిని కొట్టునువారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.

8 వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే

కారణము.

9 వారిని చూచువారందరు తల ఊచుదురు

మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు

ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు

10 నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు

ఆయన శరణుజొచ్చెదరు

యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/64-87dcb3bdcd5a8ed08cc7fce81efb2e70.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 65

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. గీతము.

1 దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి

చెల్లించుటే

నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.

2 ప్రార్థన ఆలకించువాడా,

సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు

3 నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి

మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము

చేయుదువు.

4 నీ ఆవరణములలో నివసించునట్లు

నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు

నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత

మేము తృప్తిపొందెదము.

5 మాకు రక్షణకర్తవైన దేవా,

భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము

మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా,

నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు

చున్నావు

6 బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై

తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే

7 ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల

ఘోషను అణచువాడు

జనముల అల్లరిని చల్లార్చువాడు.

8 నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులును

భయపడుదురు

ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష

భరితములుగా చేయుచున్నావు.

9 నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు

దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు

దేవుని నది నీళ్లతో నిండియున్నది

నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాతవారి ధాన్యము దయచేయుచున్నావు.

10 దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి

దాని గనిమలను చదును చేయుచున్నావు.

వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు

అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు.

11 సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు

నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.

12 అడవి బీడులు సారము చిలకరించుచున్నవి

కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని

యున్నవి.

13 పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి.

లోయలు సస్యములతో కప్పబడియున్నవి

అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు

గానముచేయుచున్నవి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/65-432b11cd6e22c670cdbcde096a84e642.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 66

ప్రధానగాయకునికి. కీర్తన. గీతము.

1 సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష

గీతము పాడుడి.

ఆయన నామప్రభావము కీర్తించుడి

2 ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి

ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి.

3 –నీ కార్యములు ఎంతో భీకరమైనవి

నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ

యొద్దకు వచ్చెదరు

4 సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును

నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును.(సెలా.)

5 దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి

నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా

ఆయన భీకరుడై యున్నాడు.

6 ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను

జనులు కాలినడకచే దాటిరి.

అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి.

7 ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు?

అన్యజనులమీద ఆయన తన దృష్టియుంచియున్నాడు.

ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు.(సెలా.)

8 జనములారా, మా దేవుని సన్నుతించుడి

గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి.

9 జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే

ఆయన మా పాదములు కదలనియ్యడు.

10 దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు.

వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11 నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి

మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12 నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి

మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి

అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించి

యున్నావు.

13 దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి

వచ్చెదను.

14 నాకు శ్రమ కలిగినప్పుడు

నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను

నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు

చెల్లించెదను

15 పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని

నీకు దహనబలులు అర్పించెదను.

ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).

16 దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు

వచ్చి ఆలకించుడి

ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను విని

పించెదను.

17 ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని

అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను.

18 నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల

ప్రభువు నా మనవి వినకపోవును.

19 నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి

యున్నాడు

ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు

20 దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు

నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు;

ఆయన సన్నుతింపబడును గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/66-be8724f2c19ed03d4007187a748a05b3.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 67

ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. గీతము.

1 భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును

అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును

2 దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక

ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును

గాక.(సెలా.)

3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక.

ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.

న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు

భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)

4 జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును

గాక

5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక.

ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.

6 అప్పుడు భూమి దాని ఫలములిచ్చును

దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.

7 దేవుడు మమ్మును దీవించును

భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/67-25f842893a341e093be41df256a0e638.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 68

ప్రధానగాయకునికి. దావీదు రచించినది. గీతము.

1 దేవుడు లేచును గాక

ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక

ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి

పోవుదురు గాక.

2 పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము

అగ్నికిమైనము కరుగునట్లు

భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.

3 నీతిమంతులు సంతోషించుదురు గాకవారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాకవారు మహదానందము పొందుదురు గాక

4 దేవునిగూర్చిపాడుడి ఆయన నామమునుబట్టి స్తోత్ర

గానము చేయుడి

వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణముచేయు

దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి

యెహోవా అను ఆయన నామమునుబట్టి ఆయన

సన్నిధిని ప్రహర్షించుడి.

5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారి తండ్రియు

విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు

6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు.

ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల

జేయువాడు

విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.

7 దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు

అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు(సెలా.)

8 భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ

జారెను

ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను.

9 దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా

కురిపించితివి

అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.

10 నీ సమూహము దానిలో నివసించును

దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము

కలుగజేసితివి.

11 ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు

దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా

ఉన్నారు.

12 సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు

ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.

13 గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా

గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది

వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప

బడినట్టున్నది.

14 సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు

సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను.

15 బాషాను పర్వతము దేవపర్వతము

బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము.

16 శిఖరములుగల పర్వతములారా,

దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల

ఓరచూపులు చూచుచున్నారు?

యెహోవా నిత్యము అందులోనే నివసించును.

17 దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు

ప్రభువు వాటిలో నున్నాడు

సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.

18 నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని

పోతివి

మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు.

యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు

విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి

కొని యున్నావు.

19 ప్రభువు స్తుతినొందును గాక

అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు

దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.

20 దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు

దేవుడై యున్నాడు

మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.

21 దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల

గొట్టును.

మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి

నెత్తిని ఆయన పగులగొట్టును.

22 ప్రభువు సెలవిచ్చినదేమనగా–నేను బాషానులోనుండి

వారిని రప్పించెదను

అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.

23 వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు

నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.

24 దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు

నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు.

చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా

25 కీర్తనలు పాడువారు ముందర నడచిరి.

తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.

26 సమాజములలో దేవుని స్తుతించుడి

ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు

వును స్తుతించుడి.

27 కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట

నున్నాడు.

యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది

జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును

ఉన్నారు.

28 నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు.

దేవా, నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము

29 యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి

రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు.

30 రెల్లులోని మృగమును

ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి,

వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము

కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.

31 ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు

కూషీయులు దేవునితట్టు తమ చేతులు చాచుకొని

పరుగెత్తివచ్చెదరు.

32 భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి

ప్రభువును కీర్తించుడి.(సెలా.)

33 అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని

కీర్తించుడి

ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన

స్వరము.

34 దేవునికి బలాతిశయము నారోపించుడి

మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు

చున్నాడు

అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది

35 తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు

ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ

ముల ననుగ్రహించుచున్నాడు

దేవుడు స్తుతినొందును గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/68-2ef13360ad86b07fb6edb393e9e936d5.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 69

ప్రధానగాయకునికి. షోషన్నీయులను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.

1 దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి

నన్ను రక్షింపుము.

2 నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను

దిగిపోవుచున్నాను

అగాధ జలములలో నేను దిగబడియున్నాను

వరదలు నన్ను ముంచివేయుచున్నవి.

3 నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా

గొంతుక యెండిపోయెను

నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు

క్షీణించిపోయెను.

4 నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు

నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు

అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప

గోరువారు అనేకులు

నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి

వచ్చెను.

5 దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది

నా అపరాధములు నీకు మరుగైనవి కావు.

6 ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా,

నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ

నియ్యకుము

ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన

అవమానము నొంద నియ్యకుము.

7 నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని

నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.

8 నా సహోదరులకు నేను అన్యుడనైతిని

నా తల్లి కుమారులకు పరుడనైతిని.

9 నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది

నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.

10 ఉపవాసముండి నేను కన్నీరు విడువగా

అది నాకు నిందాస్పదమాయెను.

11 నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడువారికి హాస్యాస్పదుడనైతిని.

12 గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు

త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

13 యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను

ప్రార్థించుచున్నాను.

దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి

నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.

14 నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము

నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి

నన్ను తప్పించుము.

15 నీటివరదలు నన్ను ముంచనియ్యకుము

అగాధసముద్రము నన్ను మ్రింగనియ్యకుము

గుంట నన్ను మ్రింగనియ్యకుము.

16 యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర

మిమ్ము

నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.

17 నీ సేవకునికి విముఖుడవై యుండకుము

నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.

18 నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము.

నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.

19 నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది.

నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.

20 నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా

కృశించియున్నాను

కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ

రును లేకపోయిరి.

ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును

కానరారైరి.

21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి

నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.

22 వారి భోజనము వారికి ఉరిగానుండును గాకవారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగానుండును గాక.

23 వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాకవారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.

24 వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము

నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక

25 వారి పాళెము పాడవును గాకవారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక

26 నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు

నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.

27 దోషముమీద దోషము వారికి తగులనిమ్ము

నీ నీతి వారికి అందనీయకుము.

28 జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము

నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.

29 నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను

దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.

30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను

కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను

31 ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె

కంటెను అది యెహోవాకు ప్రీతికరము

32 బాధపడువారు దాని చూచి సంతోషించుదురు

దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును

గాక.

33 యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు

ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు

వాడు కాడు.

34 భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక

సముద్రములును వాటియందు సంచరించు సమస్త

మును ఆయనను స్తుతించును గాక.

35 దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా

పట్టణములను కట్టించును

జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.

36 ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు

కొనును

ఆయన నామమును ప్రేమించువారు అందులో నివ

సించెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/69-4ce7a57604e3d9d4e04a54b58af986ba.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 70

ప్రధానగాయకునికి. దావీదు రచించినది. జ్ఞాపకార్థమైన కీర్తన.

1 దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము

యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.

2 నా ప్రాణము తీయగోరువారు

సిగ్గుపడి అవమానమొందుదురుగాక.

నాకు కీడుచేయగోరువారు

వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.

3 –ఆహా ఆహా అని పలుకువారు

తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందుదురుగాక

4 నిన్ను వెదకువారందరు

నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక.

నీ రక్షణను ప్రేమించువారందరు

–దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము

చెప్పుకొందురు గాక.

5 నేను శ్రమల పాలై దీనుడనైతిని

దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము

నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే

యెహోవా, ఆలస్యము చేయకుమీ.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/70-1553b350eff475f926120e90f59548eb.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 71

1 యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను.

నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము.

2 నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము

నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము.

3 నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా

ఉండుము

నా శైలము నా దుర్గము నీవే

నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు.

4 నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షిం

పుము.

కీడుచేయువారి పట్టులోనుండి బలాత్కారుని

పట్టులోనుండి నన్ను విడిపింపుము.

5 నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము

నీవే

బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.

6 గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై

యుంటివి

తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే

నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.

7 నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను

అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.

8 నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా

నోరు నిండియున్నది.

9 వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము

నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.

10 నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు

నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి

ఆలోచన చేయుచున్నారు.

11 –దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు

వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు.

12 దేవా, నాకు దూరముగా ఉండకుము.

నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము

13 నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక.

నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన

భంగము నొందుదురుగాక.

14 నేను ఎల్లప్పుడు నిరీక్షింతును

నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును

15 నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును

అవి నాకు ఎన్నశక్యము కావు.

16 ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను

బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను

నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.

17 దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు

వచ్చితివి

ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే

వచ్చితిని.

18 దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమునుగూర్చియు

పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు

నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు

వరకు నన్ను విడువకుము.

19 దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది

గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన

వాడెవడు?

20 అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసినవాడా,

నీవు మరల మమ్ము బ్రదికించెదవు

భూమియొక్క అగాధ స్థలములలోనుండి

నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.

21 నా గొప్పతనమును వృద్ధిచేయుము

నాతట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము

22 నా దేవా, నేను కూడ నీ సత్యమునుబట్టి

స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించె

దను.

23 నేను నిన్ను కీర్తించునప్పుడు

నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును

నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును.

24 నాకు కీడుచేయజూచువారు సిగ్గుపడియున్నారువారు అవమానము పొందియున్నారు

కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/71-98730c62a6e7d8d5bb8c3a276c90a413.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 72

సొలొమోను కీర్తన.

1 దేవా, రాజునకు నీ న్యాయవిధులను

రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము.

2 నీతినిబట్టి నీ ప్రజలకును

న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని

అతడు న్యాయము తీర్చును.

3 నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును

ప్రజలకు నెమ్మది పుట్టించును.

4 ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము

తీర్చును

బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.

5 సూర్యుడు నిలుచునంత కాలము

చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను

జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.

6 గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను

భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ

యము చేయును.

7 అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు

చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.

8 సముద్రమునుండి సముద్రమువరకు

యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు

అతడు రాజ్యము చేయును.

9 అరణ్యవాసులు అతనికి లోబడుదురు.

అతని శత్రువులు మన్ను నాకెదరు.

10 తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము

చెల్లించెదరు

షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని

వచ్చెదరు.

11 రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు.

అన్యజనులందరు అతని సేవించెదరు.

12 దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును.

దీనులను నిరాధారులను అతడు విడిపించును.

13 నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక

రించును

బీదల ప్రాణములను అతడు రక్షించును

14 కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ

మును విమోచించును.

వారి ప్రాణముఅతని దృష్టికి ప్రియముగా ఉండును.

15 అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి

ఇయ్యబడును.

అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థనచేయు

దురు

దినమంతయు అతని పొగడుదురు.

16 దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి

కలుగును

దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు

చుండును

నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.

17 అతని పేరు నిత్యము నిలుచును

అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు

చుండును

అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు

అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.

18 దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు

స్తుతింపబడును గాక

ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.

19 ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక

సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును

గాక. ఆమేన్ . ఆమేన్.

యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/72-6574f6761a507742261897dd03f1b7f1.mp3?version_id=1787—