Categories
కీర్తనలు

కీర్తనలు 53

ప్రధానగాయకునికి. మాహలతు అను రాగముమీద పాడదగినది. దావీదు రచించినది. దైవధ్యానము.

1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో

అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు

మేలుచేయువాడొకడును లేడు.

2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని

దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

3 వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు

ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు

మేలుచేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.

4 దేవునికి ప్రార్థనచేయక ఆహారము మ్రింగునట్లుగా

నా ప్రజలను మ్రింగు పాపాత్ములకు తెలివిలేదా?

5 భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి.

నన్ను ముట్టడివేయువారి యెముకలను దేవుడు చెదర గొట్టియున్నాడు

దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని

సిగ్గుపరచితివి.

6 సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణకలుగును గాక.

దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు

యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/53-3516b8ecff97014cbfd38a1c9c18890c.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 54

ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగియున్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము.

1 దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము

నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.

2 దేవా, నా ప్రార్థన ఆలకింపుము

నా నోటి మాటలు చెవినిబెట్టుము.

3 అన్యులు నా మీదికి లేచియున్నారు

బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారువారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు.(సెలా.)

4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు

ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు

5 నా శత్రువులుచేయు కీడు ఆయన వారిమీదికి

రప్పించును

నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము

స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించెదను.

6 యెహోవా, నీ నామము ఉత్తమము

నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

7 ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి

యున్నాడు

నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/54-bdb25aa0079e1a63f49d5164f5e1ad90.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 55

ప్రధానగాయకునికి. తంతివాద్యములమీద పాడదగినది. దావీదు రచించినది. దైవధ్యానము.

1 దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము

నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

2-3 నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.

శత్రువుల శబ్దమునుబట్టియు

దుష్టుల బలాత్కారమునుబట్టియు

నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు

చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు

ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.

4 నా గుండె నాలో వేదనపడుచున్నది

మరణభయము నాలో పుట్టుచున్నది

5 దిగులును వణకును నాకు కలుగుచున్నవి

మహా భయము నన్ను ముంచివేసెను.

6 ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల

నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే

7 త్వరపడి దూరముగా పారిపోయి

పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని

8 అరణ్యములో నివసించియుందునే అను

కొంటిని.

9 పట్టణములో బలాత్కార కలహములు జరుగుట

నేను చూచుచున్నాను.

ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము

చేయుము వారి నాలుకలు ఛేదించుము.

10 రాత్రింబగళ్లువారు పట్టణపు ప్రాకారములమీద

తిరుగుచున్నారు

పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.

11 దానిమధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి

వంచనయు కపటమును దాని అంగడి వీధులలో

మానక జరుగుచున్నవి.

12 నన్ను దూషించువాడు శత్రువు కాడు

శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును

నామీద మిట్టిపడువాడు నాయందు పగపెట్టినవాడు

కాడు

అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.

13 ఈ పనిచేసిన నీవు నా సహకారివి

నా చెలికాడవు నా పరిచయుడవు.

14 మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము

ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర

మునకు పోయి యున్నవారము.

15 వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక

సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు

గాక

చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము

నందును ఉన్నది

16 అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును

యెహోవా నన్ను రక్షించును.

17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను

ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును

ఆయన నా ప్రార్థన నాలకించును

18 నా శత్రువులు అనేకులై యున్నారు

అయినను వారు నామీదికి రాకుండునట్లు

సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును

విమోచించియున్నాడు.

19 పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు,

మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర

మిచ్చును.

20 తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా

త్కారము చేయుదురు

తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.

21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి

అయితే వారి హృదయములో కలహమున్నది.

వారి మాటలు చమురుకంటె నునుపైనవి

అయితే అవి వరదీసిన కత్తులే.

22 నీ భారము యెహోవామీద మోపుము

ఆయనే నిన్ను ఆదుకొనును

నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

23 దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు

రక్తాపరాధులును వంచకులును

సగముకాలమైన బ్రదుకరు.

నేనైతే నీయందు నమ్మికయుంచియున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/55-4422e05ba4b129c35601a68564bbde75.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 56

ప్రధానగాయకునికి. యోనతేలెమ్ రెహోకీమ్ అను రాగముమీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. అనుపదగీతము.

1 దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను

మ్రింగవలెనని యున్నారు

దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.

2 అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు

దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మ్రింగ

వలెనని యున్నారు

3 నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర

యించుచున్నాను.

4 దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను

దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయ

పడను

శరీరధారులు నన్నేమి చేయగలరు?

5 దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు

నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము

పుట్టుచున్నవి.

6 వారు గుంపుకూడి పొంచియుందురు

నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు

జాడలు కనిపెట్టుదురు.

7 తాముచేయు దోషక్రియలచేత వారు తప్పించు

కొందురా?

దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము

8 నా సంచారములను నీవు లెక్కించియున్నావు

నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి

అవి నీ కవిలెలోకనబడును గదా.

9 నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు

తిరుగుదురు.

దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును.

10 దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను

యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను

11 నేను దేవునియందు నమ్మికయుంచియున్నాను

నేను భయపడను

నరులు నన్నేమి చేయగలరు?

12 దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును

తప్పించియున్నావు

నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు

నట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించి

యున్నావు.

13 నేను నీకు మ్రొక్కుకొని యున్నాను

నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/56-93786b8cfd1a477cd1a45eeca552e971.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 57

ప్రధానగాయకునికి. అల్ తష్హేతు అను రాగముమీద పాడదగినది. గుహలో దావీదు సౌలునొద్దనుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. అనుపదగీతము.

1 నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము

నేను నీ శరణుజొచ్చియున్నాను

ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను

శరణుజొచ్చియున్నాను.

2 మహోన్నతుడైన దేవునికి

నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ

పెట్టుచున్నాను.

3 ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును

నన్ను మ్రింగగోరువారు దూషణలు పలుకునప్పుడు

దేవుడు తన కృపాసత్యములను పంపును.(సెలా.)

4 నా ప్రాణము సింహములమధ్య నున్నది

కోపోద్రేకులమధ్యను నేను పండుకొనుచున్నాను

వారి దంతములు శూలములు అవి అంబులువారి నాలుక వాడిగల కత్తి.

5 దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను

కనుపరచుకొనుము

నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.

6 నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి

నా ప్రాణము క్రుంగియున్నది.

నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి.(సెలా.)

7 నా హృదయము నిబ్బరముగా నున్నది

దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది

నేను పాడుచు స్తుతిగానము చేసెదను.

8 నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా

సితారా, మేలుకొనుడి

నేను వేకువనే లేచెదను.

9 నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది

నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.

10 ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను

చెల్లించెదను

ప్రజలలో నిన్ను కీర్తించెదను.

11 దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను

కనుపరచుకొనుము.

నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/57-a1e927d32ba313c3c8b903c9604d6bb5.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 58

ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. దావీదు రచించిన కీర్తన. అనుపదగీతము.

1 అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు

రన్నది నిజమా?

నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు

దురా?

2 లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము

జరిగించుచున్నారు

దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.

3 తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు

పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

4 వారి విషము నాగుపాము విషమువంటిది

5 మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననువారి స్వరము తనకు వినబడకుండునట్లు

చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.

6 దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము

యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ

గొట్టుము.

7 పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు

అతడు తన బాణములను సంధింపగా

అవి తునాతునకలై పోవును.

8 వారు కరగిపోయిన నత్తవలె నుందురు

సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.

9 మీకుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే

అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర

గొట్టుచున్నాడు,

10 ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూచి సంతో

షించుదురు

భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.

11 కావున–నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు

ననియు

నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో

నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/58-0e87e96d1d587187b700b8e7dda808f8.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 59

ప్రధానగాయకునికి. అల్‌తష్హేతు అను రాగముమీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపినవారు ఇంటియొద్ద పొంచియున్నప్పుడు అతడు రచించినది. అనుపదగీతము.

1 నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం

పుము.

నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.

2 పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము.

రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.

3 నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు

యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాప

మునుబట్టికాదు

ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.

4 నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు

లెత్తి సిద్ధపడుచున్నారు

నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.

5 సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రా

యేలు దేవా,

అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము

అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.)

6 సాయంకాలమునవారు మరల వచ్చెదరు

కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.

7 వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి

మాటలు వెళ్లగ్రక్కుదురు.వారి పెదవులలో కత్తులున్నవి.

8 యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు

అన్యజనులందరిని నీవు అపహసించుదువు.

9 నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను

నా ఉన్నతమైన దుర్గము దేవుడే.

10 నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను

నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని

దేవుడు నాకు చూపించును.

11 వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని

మరచిపోదురేమో.

మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా

చెదరు చేసి అణగగొట్టుము.

12 వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప

మునుబట్టియువారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియువారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.

13 కోపముచేత వారిని నిర్మూలము చేయుమువారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము

దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని

భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు

చేయుము.(సెలా.)

14 సాయంకాలమునవారు మరల వచ్చెదరు

కుక్కవలె మొఱుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు

15 తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు

తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.

16 నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు

ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు.

నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను

ఉదయమున నీకృపనుగూర్చిఉత్సాహగానము చేసెదను

17 దేవుడు నాకు ఎత్తయిన కోటగాను

కృపగల దేవుడుగాను ఉన్నాడు

నా బలమా, నిన్నే కీర్తించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/59-bc5c53013694d34aa42a3411809b04e2.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 60

ప్రధానగాయకునికి. షూషనేదూతుమీద పాడదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను అరమోజబాయీయులతోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పుపల్లములో పండ్రెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది. అనుపదగీతము.

1 దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదర

గొట్టి యున్నావు

నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.

2 నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని

బద్దలు చేసియున్నావు

అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు

చేయుము.

3 నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి

తూలునట్లుచేయు మద్యమును మాకు త్రాగించితివి

4 సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై

నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము

నిచ్చియున్నావు.(సెలా.)

5 నీ ప్రియులు విమోచింపబడునట్లు

నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము

6 తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చి

యున్నాడు

నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను

సుక్కోతు లోయను కొలిపించెదను.

7 గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు

శిరస్త్రాణము

యూదా నా రాజదండము.

8 మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము

ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును

ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.

9 కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొనిపోవును?

ఎదోములోనికి నన్నెవడు నడిపించును?

10 దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా?

దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని

యున్నావు గదా?

11 మనుష్యుల సహాయము వ్యర్థము

శత్రువులను జయించుటకు మాకు సహాయము దయ

చేయుము.

12 దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము

మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/60-af1e3c2aeb39ee5851877f6f02054331.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 61

ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన.

1 దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము

నా ప్రార్థనకు చెవియొగ్గుము

2 నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు

మొఱ్ఱపెట్టుచున్నాను

నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కిం

చుము.

3 నీవు నాకు ఆశ్రయముగా నుంటిని.

శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి

4 యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను

నీ రెక్కల చాటున దాగుకొందును(సెలా.)

5 దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి

యున్నావు

నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము

నీవు నాకనుగ్రహించియున్నావు.

6 రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక

అతని సంవత్సరములు తరతరములుగడచును గాక.

7 దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక

అతని కాపాడుటకై కృపాసత్యములను నియమిం

చుము.

8 దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు

నట్లు

నీ నామమును నిత్యము కీర్తించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/61-a799ddf7b5d5a427c24c65a525a8a21f.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 62

ప్రధానగాయకునికి. యెదూతూను అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.

1 నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది.

ఆయనవలన నాకు రక్షణ కలుగును.

2 ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త

ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప

బడను.

3 ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?

ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ

ద్రోయునట్లు మీ రందరు ఎన్నాళ్లు ఒకని పడ

ద్రోయ చూచుదురు?

4 అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకేవారు ఆలోచించుదురు

అబద్ధమాడుట వారికి సంతోషమువారు తమ నోటితో శుభవచనములు పలుకుచు

అంతరంగములో దూషించుదురు.(సెలా.)

5 నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా

నుండుము

ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.

6 ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము

నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.

7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము.

నా బలమైన ఆశ్రయదుర్గము

నా యాశ్రయము దేవునియందే యున్నది.

8 జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక

యుంచుడి

ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి

దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)

9 అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు.

ఘనులైనవారు మాయస్వరూపులు

త్రాసులో వారందరు తేలిపోవుదురు

వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు

10 బలాత్కారమందు నమ్మికయుంచకుడి

దోచుకొనుటచేత గర్వపడకుడి

ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.

11 –బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను

రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

12 ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల

చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు.

కాగా కృపచూపుటయు నీది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/62-0598630fa3fa009207b5a472d7b6a4da.mp3?version_id=1787—