Categories
కీర్తనలు

కీర్తనలు 43

1 దేవా, నాకు న్యాయము తీర్చుము

భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె

మాడుము

కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి

నీవు నన్ను విడిపించుదువు.

2 నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి

వేమి?

నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప

నేల?

3 నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము;

అవి నాకు త్రోవచూపును

అవి నీ పరిశుద్ధపర్వతమునకును నీ నివాసస్థలములకును

నన్ను తోడుకొని వచ్చును.

4 అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు

నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని

యొద్దకు చేరుదును

దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత

జ్ఞతాస్తుతులు చెల్లించెదను

5 నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు?

నాలో నీవేల తొందరపడుచున్నావు?

దేవునియందు నిరీక్షణ యుంచుము

ఆయన నా రక్షణకర్త నా దేవుడు

ఇంకను నేనాయనను స్తుతించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/43-99847a8fae5384bd904930d55ac26317.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 44

ప్రధానగాయకునికి కోరహు కుమారులు చేసినది. దైవధ్యానము.

1 దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో

నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని

యున్నాము

మా పితరులు దానిని మాకు వివరించిరి

2 నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా

పితరులను నాటితివి

జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.

3 వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు

కొనలేదు

వారి బాహువు వారికి జయమియ్యలేదు

నీవు వారిని కటాక్షించితివి గనుక

నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియేవారికి విజయము కలుగజేసెను.

4 దేవా, నీవే నా రాజవు

యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.

5 నీవలన మా విరోధులను అణచివేయుదుము

నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము

త్రొక్కి వేయుదుము.

6 నేను నా వింటిని నమ్ముకొనను

నా కత్తియు నన్ను రక్షింపజాలదు

7 మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు

వాడవు నీవే

మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.

8 దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము

నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుచున్నాము.(సెలా.)

9 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన

పరచియున్నావు.

మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.

10 శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు

పారిపోజేయుచున్నావు

మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును

దోచుకొనుచున్నారు.

11 భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు

నీవు మమ్మును అప్పగించియున్నావు

అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు

12 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే

నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు

13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద

ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి

దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ

ముగాను

మమ్మును ఉంచియున్నావు.

14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను

ప్రజలు తల ఆడించుటకు కారణముగాను

మమ్మును ఉంచియున్నావు.

15-16 నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా

శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు

నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను

సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.

17 ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు

నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.

18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు

మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

19 అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా

నలిపియున్నావు

గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు

20 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల

అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల

21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు

ఆ సంగతిని పరిశోధింపక మానునా?

22 నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము

వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడు

చున్నాము

23 ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు?

లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.

24 నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు?

మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి

యున్నావు?

25 మా ప్రాణము నేలకు క్రుంగియున్నది

మా శరీరము నేలను పెట్టియున్నది.

26 మా సహాయమునకు లెమ్ము

నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/44-a973edf53776b72d0552f10590ea8ea4.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 45

ప్రధానగాయకునికి షోషనీయులను రాగముమీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన దైవధ్యానము. ప్రేమనుగూర్చిన గీతము.

1 ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా

ఉప్పొంగుచున్నది

నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను.

నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె

నున్నది.

2 నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు

నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది

కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.

3 శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము

నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.

4 సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు

నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు

దేరుము

నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు

నేర్పును.

5 నీ బాణములు వాడిగలవి

ప్రజలు నీచేత కూలుదురు.

నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.

6 దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును

నీ రాజదండము న్యాయార్థమైన దండము.

7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు

కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ

గునట్లుగా

నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు.

8 నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే

లవంగిపట్ట వాసనే

దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు

నిన్ను సంతోషపెట్టుచున్నవి.

9 నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు.

రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని

నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.

10 కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము

నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము

11 ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును

కోరినవాడు

అతనికి నమస్కరించుము.

12 తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో

ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

13 అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము

మహిమ గలది

ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది.

14 విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు

నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది

ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు

నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు.

15 ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు

రాజనగరులో ప్రవేశించుచున్నారు.

16 నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు

భూమియందంతట నీవు వారిని అధికారులనుగా

నియమించెదవు.

17 తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను

చేయుదును

కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/45-ac29a310d60e1b9d7ba6deaab7c120b9.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 46

ప్రధానగాయకునికి. కోరహు కుమారులది. అలామోతు అను రాగముమీద పాడదగినది. గీతము.

1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు

ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

2 కావున భూమి మార్పునొందినను నడిసముద్రము

లలో పర్వతములు మునిగినను

3 వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను

ఆ పొంగునకు పర్వతములు కదలినను

మనము భయపడము.(సెలా.)

4 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును

సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష

పరచుచున్నవి.

5 దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము

లేదు

అరుణోదయమున దేవుడు దానికి సహాయముచేయు

చున్నాడు.

6 జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి

ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి

పోవుచున్నది.

7 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై

యున్నాడు.

యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై

యున్నాడు.

8 యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి.

ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.

9 ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు

వాడు.

విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును

ఆయనే

యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు

ఆయనే.

10 –ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి

అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును

భూమిమీద నేను మహోన్నతుడనగుదును

11 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై

యున్నాడు

యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై

యున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/46-2a340eea92b69d5da4926f33ca6c14d4.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 47

ప్రధానగాయకునికి. కోరహు కుమారులు చేసినది. గీతము.

1 సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి

జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.

2 యెహోవా మహోన్నతుడు భయంకరుడు

ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.

3 ఆయన జనములను మనకు లోపరచును

మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.

4 తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద

ముగా మన స్వాస్థ్యమును

ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.

5 దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను

బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.

6 దేవుని కీర్తించుడి కీర్తించుడి

మన రాజును కీర్తించుడి కీర్తించుడి.

7 దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు

రమ్యముగా కీర్తనలు పాడుడి.

8 దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు

దేవుడు తన పరిశుద్ధిసంహాసనముమీద ఆసీనుడై

యున్నాడు.

9 జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి

జనులై కూడుకొనియున్నారు.

10 భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి

ఆయన మహోన్నతుడాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/47-7d2a1e3fb3ec5e14893c00434bdc60d1.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 48

కోరహు కుమారులది. గీతము.

1 మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధపర్వతమందు

యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై

యున్నాడు.

2 ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము

రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి

సంతోషకరముగా నున్నది

3 దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష

మగుచున్నాడు.

4 రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.

5 వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి

భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.

6 వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేద

నయు వారిని పట్టెను.

7 తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు.

8 సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు

మన దేవుని పట్టణమునందు

మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి

యున్నాము

దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు.(సెలా.)

9 దేవా, మేము నీ ఆలయమునందు

నీ కృపను ధ్యానించితిమి.

10 దేవా, నీ నామము ఎంత గొప్పదో

నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది

నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది.

11 నీ న్యాయవిధులనుబట్టి

సీయోను పర్వతము సంతోషించును గాక

యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.

12 ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు

చెప్పునట్లు

సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి

13 దాని బురుజులను లెక్కించుడి

దాని ప్రాకారములను నిదానించి చూడుడి

దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.

14 ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు

మరణమువరకు ఆయన మనలను నడిపించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/48-fbd5c8cb01bdc6fba636a608bca7b3fa.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 49

ప్రధానగాయకునికి. కోరహు కుమారులది. గీతము.

1 సర్వజనులారా ఆలకించుడి.

2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి

లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి

యొగ్గుడి.

3 నా నోరు విజ్ఞానవిషయములను పలుకును

నా హృదయధ్యానము

పూర్ణవివేకమునుగూర్చినదై యుండును.

4 గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను

సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచె

దను.

5 నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టు

కొనినప్పుడు

ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?

6 తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి

తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల

భయపడవలెను?

7 ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు

8 వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు

వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము

చేయగలవాడు ఎవడును లేడు

9 వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది

అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.

10 జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ

పోదు

మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.

11 వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ

యిండ్లు నిరంతరము నిలుచుననియు

తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను

కొందురు

తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.

12 ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు

వాడు నశించు మృగములను పోలినవాడు.

13 స్వాతిశయ పూర్ణులకునువారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.

14 వారు పాతాళములో మందగా కూర్చబడుదురు

మరణము వారికి కాపరియై యుండును

ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురువారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో

క్షయమైపోవును.

15 దేవుడు నన్ను చేర్చుకొనును

పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును

విమోచించును.(సెలా.)

16 ఒకడు ధనసంపన్నుడైనప్పుడు

వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.

17 వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు

వాని ఘనత వానివెంట దిగదు.

18 –నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను

స్తుతించినను

తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను

19 అతడు తన పితరుల తరమునకు చేరవలెనువారు మరి ఎన్నడును వెలుగు చూడరు.

20 ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు

నశించు జంతువులను పోలియున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/49-a4d78b8582b25e717f522ccf19296bd8.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 50

ఆసాపు కీర్తన.

1 దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు

తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు

భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.

2 పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు

ప్రకాశించుచున్నాడు

3 మన దేవుడు వేంచేయుచున్నాడు

ఆయన మౌనముగా నుండడు.

ఆయన ముందర అగ్ని మండుచున్నది

ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.

4-5 ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై

–బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన

నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని

మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.

6 దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు.

ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.)

7 నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆల

కించుడి

ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవు

డను నేను నీ మీద సాక్ష్యము పలికెదను

8 నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు

నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

9 నీ యింటనుండి కోడెనైనను

నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

10 అడవిమృగములన్నియు

వేయికొండలమీది పశువులన్నియు నావేగదా

11 కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును

పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

12 లోకమును దాని పరిపూర్ణతయు నావే.

నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

13 వృషభముల మాంసము నేను తిందునా?

పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

14 దేవునికి స్తుతి యాగము చేయుము

మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

15 ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము

నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర

చెదవు.

16 భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు

–నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని?

నా నిబంధన నీనోట వచించెదవేమి?

17 దిద్దుబాటు నీకు అసహ్యముగదా

నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.

18 నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు

వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.

19 కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు

నీ నాలుక కపటము కల్పించుచున్నది.

20 నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు

చెప్పుచున్నావు

నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.

21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని

అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి

అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను

వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను

22 దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి

లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును

23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ

పరచుచున్నాడు

నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు

మార్గము సిద్ధపరచుకొనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/50-d8ba41a6e878b9e4ec7be605b4d87fbf.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 51

ప్రధానగాయకునికి. దావీదు బత్షెబయొద్దకు వెళ్లిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన.

1 దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము

నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున

నా అతిక్రమములను తుడిచివేయుము

2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము.

నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.

3 నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి

నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.

4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి

యున్నాను

నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను

కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా

అగపడుదువు

తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

5 నేను పాపములో పుట్టినవాడను

పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.

6 నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు

ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.

7 నేను పవిత్రుడనగునట్లు

హిస్సోపుతో నా పాపము పరిహరింపుము.

హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు

నీవు నన్ను కడుగుము.

8 ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము

అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.

9 నా పాపములకు విముఖుడవు కమ్ము

నా దోషములన్నిటిని తుడిచివేయుము.

10 దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము

నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన

ముగా పుట్టించుము.

11 నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము

నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.

12 నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము

సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.

13 అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను

బోధించెదను

పాపులును నీతట్టు తిరుగుదురు.

14 దేవా, నా రక్షణకర్తయగు దేవా

రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము

అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము

చేయును.

15 ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు

నా పెదవులను తెరువుము.

16 నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను

అర్పించుదును

దహనబలి నీకిష్టమైనది కాదు.

17 విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు

దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము

చేయవు.

18 నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము

యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.

19 అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును

సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును

అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/51-a2a81d2708eefa2e89a9fa9e9c8a91f2.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 52

ప్రధానగాయకునికి. ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము.

1 శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ

పడుచున్నావు?

దేవుని కృప నిత్యముండును.

2 మోసము చేయువాడా,

వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ

నుద్దేశించుచున్నది

3 మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె

అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.)

4 కపటమైన నాలుక గలవాడా,

అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

5 కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును

నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి

నిన్ను పెల్లగించును

సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)

6 నీతిమంతులు చూచి భయభక్తులుకలిగి

7 –ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక

తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి

తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు

కొనుచు వానిని చూచి నవ్వుదురు.

8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను

నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను

9 నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను

స్తుతించెదను.

నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది

నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/52-f09bdd67033f8477f0b82fe95accbbe4.mp3?version_id=1787—