Categories
కీర్తనలు

కీర్తనలు 33

1 నీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనంద గానము

చేయుడి.

స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.

2 సితారాతో యెహోవాను స్తుతించుడి

పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి

3 ఆయననుగూర్చి నూతన కీర్తన పాడుడి

ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.

4 యెహోవా వాక్యము యథార్థమైనది

ఆయన చేయునదంతయు నమ్మకమైనది.

5 ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు

లోకము యెహోవా కృపతో నిండియున్నది.

6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను

ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము

కలిగెను.

7 సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే.

అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.

8 లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను.

భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను.

9 ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను

ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.

10 అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును

జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.

11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును

ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.

12 యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.

ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు

ధన్యులు.

13 యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు

ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.

14 తానున్న నివాసస్థలములోనుండి

భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.

15 ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా

నిర్మించినవాడు

వారి క్రియలన్నియు విచారించువాడు వారిని

దర్శించువాడు.

16 ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు

ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.

17 రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు

అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప

జాలదు.

18 వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును

కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును

19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను

ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది.

20 మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మిక

యుంచియున్నాము.

ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది

21 మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది

ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై

యున్నాడు.

22 యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము

నీ కృప మామీదనుండును గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/33-b8e4d4fa96f776fb8d3308ee2c0cb9bc.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 34

దావీదు అబీమెలెకు ఎదుట వెఱ్ఱివానివలె ప్రవర్తించి అతనిచేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన.

1 నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను.

నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.

2 యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను.

దీనులు దానిని విని సంతోషించెదరు.

3 నాతోకూడి యెహోవాను ఘనపరచుడి

మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప

చేయుదము.

4 నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన

నాకుత్తరమిచ్చెను

నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను

తప్పించెను.

5 వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెనువారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.

6 ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను

అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.

7 యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు

ఆయనదూత కావలియుండి వారిని రక్షించును

8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి

ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

9 యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు

ఉంచుడి.

ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు

కొదువలేదు.

10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును

యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై

యుండదు.

11 పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి.

యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

12 బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?

మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా

డెవడైన నున్నాడా?

13 చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను

కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.

14 కీడుచేయుట మాని మేలుచేయుము

సమాధానము వెదకి దాని వెంటాడుము.

15 యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది.

ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.

16 దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద

నుండి కొట్టివేయుటకై

యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.

17 నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించునువారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.

18 విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు

నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు

వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం

చును.

20 ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును

వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.

21 చెడుతనము భక్తిహీనులను సంహరించును

నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ

బడుదురు

22 యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును

ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు

లుగా ఎంచబడరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/34-b60706f85377ac6f06b84117c75df959.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 35

దావీదు కీర్తన.

1 యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె

మాడుము

నాతో పోరాడువారితో పోరాడుము.

2 కేడెమును డాలును పట్టుకొని

నా సహాయమునకై లేచి నిలువుము.

3 ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము

–నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.

4 నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును

కలుగును గాక

నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప

బడి లజ్జపడుదురు గాక.

5 యెహోవాదూత వారిని పారదోలును గాకవారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు

గాక.

6 యెహోవాదూత వారిని తరుమును గాకవారి త్రోవ చీకటియై జారుడుగానుండును గాక.

7 నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో

తమ వల నొడ్డిరి

నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట

త్రవ్విరి.

8 వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక

తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక

వాడు ఆ చేటులోనే పడును గాక.

9 అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును

ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.

10 అప్పుడు–యెహోవా నీవంటివాడెవడు?

మించిన బలముగలవారి చేతినుండి దీనులను

దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి

పించువాడవు నీవే అని నా యెముకలన్నియు

చెప్పుకొనును.

11 కూటసాక్షులు లేచుచున్నారు

నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.

12 మేలునకు ప్రతిగా నాకు కీడుచేయుచున్నారు

నేను దిక్కులేనివాడనైతిని.

13 వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని

ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు

కొంటిని

అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి

యున్నది.

14 అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును

నేను నడుచుకొంటిని

తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు

వానివలె క్రుంగుచుంటిని.

15 నేను కూలియుండుట చూచి వారు సంతోషించి

గుంపుకూడిరి

నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి

మానక నన్ను నిందించిరి.

16 విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలెవారు నా మీద పండ్లుకొరికిరి.

17 ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు?వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం

పుము

నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము

18 అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను

బహుజనులలో నిన్ను నుతించెదను.

19 నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని

నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము

నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట

నియ్యకుము.

20 వారు సమాధానపు మాటలు ఆడరు

దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు

కపటయోచనలు చేయుదురు.

21 నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు

కొనుచున్నారు.

–ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి

నదే అనుచున్నారు.

22 యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన

ముగా నుండకుము

నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.

23 నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము

నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె

మాడుటకు లెమ్ము.

24 యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము

తీర్చుము

నన్నుబట్టి వారు సంతోషింపకుందురు గాక.

25 –ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను

కొనకపోదురు గాక

–వాని మ్రింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు

గాక

26 నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ

మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక

నా మీద అతిశయపడువారు

సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక

27 నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు

ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక

–తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు

యెహోవా ఘనపరచబడును గాక అని వారు

నిత్యము పలుకుదురు.

28 నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు

దినమెల్ల సల్లాపములు చేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/35-32c0824ea3db04cd0dff793a2924fa4b.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 36

ప్రధానగాయకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

1 భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె

పలుకుచున్నది

వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.

2 వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడువరకు

అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతిచేయు చున్నది.

3 వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును

ఆస్పదములు

బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి

యున్నాడు.

4 వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం

చును

వాడు కానినడతలు నడచువాడు

చెడుతనము వానికి అసహ్యము కాదు.

5 యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది

నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.

6 నీ నీతి దేవుని పర్వతములతో సమానము

నీ న్యాయవిధులు మహాగాధములు.

యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు

నీవే

7 దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది

నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.

8 నీ మందిరముయొక్క సమృద్ధివలనవారు సంతృప్తి

నొందుచున్నారు.

నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు

చున్నావు.

9 నీయొద్ద జీవపు ఊట కలదు

నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు

చున్నాము.

10 నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను

యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలు

పుము.

11 గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము

భక్తిహీనులచేతిని నన్ను పారదోలనియ్యకుము.

అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు

లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/36-adc4b9ef7ece130fbb95fce02bb4b2c2.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 37

దావీదు కీర్తన.

1 చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము

దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.

2 వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు.

పచ్చని కూరవలెనే వాడిపోవుదురు

3 యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము

దేశమందు నివసించి సత్యము ననుసరించుము

4 యెహోవానుబట్టి సంతోషించుము

ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము

నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము

నెరవేర్చును.

6 ఆయన వెలుగునువలె నీ నీతిని

మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.

7 యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు

కనిపెట్టుకొనుము.

తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము

దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన

పడకుము.

8 కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము

వ్యసనపడకుము అది కీడుకే కారణము

9 కీడుచేయువారు నిర్మూలమగుదురు

యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును

స్వతంత్రించుకొందురు.

10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురువారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు

కనబడకపోవుదురు.

11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు

బహు క్షేమము కలిగి సుఖించెదరు

12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురువారినిచూచి పండ్లు కొరుకుదురు.

13 వారి కాలమువచ్చుచుండుట ప్రభువు చూచు

చున్నాడు.వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.

14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై

యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై

భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు

15 వారి కత్తి వారి హృదయములోనే దూరునువారి విండ్లు విరువబడును.

16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను

బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్ఠము.

17 భక్తిహీనుల బాహువులు విరువబడును

నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు

18 నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడువారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.

19 ఆపత్కాలమందువారు సిగ్గునొందరు

కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.

20 భక్తిహీనులు నశించిపోవుదురు

యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి

యుందురు

అది కనబడకపోవునట్లువారు పొగవలె కనబడక

పోవుదురు.

21 భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు

నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.

22 యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని

స్వతంత్రించుకొందురు

ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.

23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును

వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.

24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు

గనుక

అతడు నేలను పడినను లేవలేక యుండడు.

25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై

యున్నాను

అయినను నీతిమంతులు విడువబడుట గానివారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి

యుండలేదు.

26 దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురువారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.

27 కీడుచేయుట మాని మేలుచేయుము అప్పుడు నీవు

నిత్యము నిలుచుదువు

28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు

ఆయన తన భక్తులను విడువడు

వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని

భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.

29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురువారు దానిలో నిత్యము నివసించెదరు.

30 నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించునువారి నాలుక న్యాయమును ప్రకటించును.

31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో

నున్నది వారి అడుగులు జారవు.

32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని

చంపజూతురు.

33 వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడువారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు

లుగా ఎంచడు.

34 యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము

ఆయన మార్గము ననుసరించుము

భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను

హెచ్చించును

భక్తిహీనులు నిర్మూలముకాగా నీవు చూచెదవు.

35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి

యుంటిని

అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు

వర్ధిల్లియుండెను.

36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు

లేకపోయెను

నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

37 నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము

సమాధానపరచువారి సంతతి నిలుచును గాని

38 ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు

భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.

39 యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము

బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము.

40 యెహోవావారికి సహాయుడై వారిని రక్షించునువారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక

ఆయన భక్తిహీనులచేతిలోనుండి వారిని విడిపించి

రక్షించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/37-eabdf24a69bfb430f18eaf6a9a55ad70.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 38

జ్ఞాపకార్థమైనది. దావీదు కీర్తన.

1 యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము.

నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము.

2 నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి.

నీ చెయ్యి నామీద భారముగా నున్నది.

3 నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి

పోయెను

నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.

4 నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి

నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి

యున్నవి.

5 నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన

గలవై స్రవించుచున్నవి.

6 నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను

దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.

7 నా నడుము తాపముతో నిండియున్నది

నా శరీరములో ఆరోగ్యము లేదు.

8 నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను

నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను

9 ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది

నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.

10 నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను

విడిచిపోయెను

నా కనుదృష్టియు తప్పిపోయెను.

11 నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు

చూచి యెడముగా నిలుచుచున్నారు

నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు

12 నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు

నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు

పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

13 చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను

మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.

14 నేను వినలేనివాడనైతిని

ఎదురుమాట పలుకలేనివాడనైతిని.

15 యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను

–నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ

పడుదురని నేననుకొనుచున్నాను.

ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు

16 నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.

17 నేను పడబోవునట్లున్నాను

నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.

18 నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను

నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను.

19 నా శత్రువులు చురుకైనవారును బలవంతులునైయున్నారు

నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.

20 మేలునకు ప్రతిగా వారు కీడుచేయుచున్నారు

నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు

నాకు శత్రువులైరి

21 యెహోవా, నన్ను విడువకుము

నా దేవా, నాకు దూరముగా నుండకుము.

22 రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు

త్వరగా రమ్ము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/38-c3b4643246f586123fad8cc1b4debb46.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 39

ప్రధానగాయకుడైన యెదూతూనునకు. దావీదు కీర్తన.

1 నా నాలుకతో పాపముచేయకుండునట్లు

నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును

భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు

నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని.

2 నేను ఏమియు మాటలాడక మౌనినైతిని

క్షేమమునుగూర్చియైనను పలుకక నేను మౌనముగా

నుంటిని

అయినను నా విచారము అధికమాయెను.

3 నా గుండె నాలో మండుచుండెను

నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను

అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని

4 –యెహోవా, నా అంతము ఎట్లుండునది

నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము.

నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన

గోరుచున్నాను.

5 నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి

యున్నావు

నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది.

ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి

వలె ఉన్నాడు.(సెలా.)

6 మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు.వారు తొందరపడుట గాలికే గదావారు ధనము కూర్చుకొందురు గాని

అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.

7 ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును?

నిన్నే నేను నమ్ముకొనియున్నాను.

8 నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము

నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.

9 దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని

నైతిని.

10 నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము.

నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.

11 దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో

శిక్షించునప్పుడు

చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ

గొట్టెదవు

నరులందరు వట్టి ఊపిరివంటివారు.(సెలా.)

12 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱకు

చెవియొగ్గుము

నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము

నీ దృష్టికి నేను అతిథివంటివాడను

నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను

13 నేను వెళ్లిపోయి లేకపోకమునుపు

నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/39-5b2a99b2466110407340d851542009bc.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 40

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు

కొంటిని

ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.

2 నాశనకరమైన గుంటలోనుండియు

జిగటగల దొంగఊబిలోనుండియు

ఆయన నన్ను పైకెత్తెను

నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర

పరచెను.

3 తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు

నా నోట నుంచెను.

అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా

యందు నమ్మికయుంచెదరు.

4 గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు

వారినైనను లక్ష్యపెట్టక

యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.

5 యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన

ఆశ్చర్యక్రియలును

మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు.

వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు

మించియున్నవి

నీకు సాటియైనవాడొకడును లేడు.

6 బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు.

నీవు నాకు చెవులు నిర్మించియున్నావు.

దహనబలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు

తెమ్మనలేదు.

7 అప్పుడు–పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన

ప్రకారము నేను వచ్చియున్నాను.

8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము

నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

9 నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి

సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని

యెహోవా, అది నీకు తెలిసేయున్నది.

10 నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర

కుండలేదు.

నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను

నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక

నేను వాటికి మరుగుచేయలేదు.

11 యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము

చేయవు

నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక

12 లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి

నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల

యెత్తి చూడలేకపోతిని

లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి

నా హృదయము అధైర్యపడి యున్నది.

13 యెహోవా, దయచేసి నన్ను రక్షించుము

యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.

14 నా ప్రాణము తీయుటకై యత్నించువారు

సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక

నాకు కీడుచేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి

సిగ్గునొందుదురు గాక.

15 నన్ను చూచి–ఆహా ఆహా అని పలుకువారు

తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.

16 నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి

సంతోషించుదురు గాక

నీ రక్షణ ప్రేమించువారు–యెహోవా మహిమ

పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు

గాక.

17 నేను శ్రమలపాలై దీనుడనైతిని

ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు.

నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే.

నా దేవా, ఆలస్యము చేయకుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/40-2b04f12e343a152730850c9450df6d13.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 41

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 బీదలను కటాక్షించువాడు ధన్యుడు

ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.

2 యెహోవా వానిని కాపాడి బ్రదికించును

భూమిమీద వాడు ధన్యుడగును

వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.

3 రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును

రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.

4 –యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి

యున్నాను

నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము

అని మనవి చేసియున్నాను.

5 అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట

లాడుచున్నారు

–వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు

మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.

6 ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ

మాడును

వాని హృదయము పాపమును పోగుచేసికొనుచున్నది.

వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.

7 నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస

లాడుచున్నారు

నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో

చించుచున్నారు.

8 –కుదురని రోగము వానికి సంభవించియున్నది

వాడు ఈ పడక విడిచితిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు.

9 నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ

నము చేసినవాడు.

నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను

10 యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము

అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను.

11 నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా

నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.

12 నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు

నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.

13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా

శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప

బడును గాక. ఆమేన్. ఆమేన్.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/41-1749eb3c1770736252e0bb1bf513990c.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 42

ప్రధానగాయకునికి. కోరహు కుమారులు రచించినది. దైవధ్యానము.

1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు

దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

2 నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది

జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది

దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన

సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?

3 –నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో

అనుచుండగా

రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము

లాయెను.

4 జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ

ముతో నేను వెళ్లిన సంగతిని

సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు

నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని

జ్ఞాపకము చేసికొనగా

నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.

5 నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు?

నాలో నీవేల తొందరపడుచున్నావు?

దేవునియందు నిరీక్షణ యుంచుము.

ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు

చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.

6 నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది

కావున యొర్దాను ప్రదేశమునుండియు

హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ

నుండియు

నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

7 నీ జలప్రవాహధారల ధ్వని విని కరడుకరడును

పిలుచుచున్నది

నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా

పొర్లి పారియున్నవి.

8 అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ

నాజ్ఞాపించును

రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు

నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు

తోడుగా ఉండును.

9 కావున–నీవేల నన్ను మరచియున్నావు?

శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ

వలసి వచ్చెనేమి అని

నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి

చేయుచున్నాను.

10 –నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల

అడుగుచున్నారు.వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.

11 నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు?

నాలో నీవేల తొందరపడుచున్నావు?

దేవునియందు నిరీక్షణ యుంచుము,

ఆయనే నా రక్షణకర్త నా దేవుడు

ఇంకను నేనాయనను స్తుతించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/42-ae46a7868eb6d44e3bf09e5d62666036.mp3?version_id=1787—