Categories
కీర్తనలు

కీర్తనలు 13

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు?

నిత్యము మరచెదవా?

నాకెంతకాలము విముఖుడవై యుందువు?

2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?

ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా

క్రాంతుడనై యుందును?

ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించు

కొనును?

3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు

ఉత్తరమిమ్ము

4 నేను మరణనిద్ర నొందకుండను–వాని గెలిచితినని

నా శత్రువు చెప్పుకొనకుండను

నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింప

కుండను

నా కన్నులకు వెలుగిమ్ము.

5 నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను

నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది

యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు

నేను ఆయనను కీర్తించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/13-d961e52e33f83dc83526f24c85361643.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 14

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 –దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.

మేలుచేయు వాడొకడును లేడు.

2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని

యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను

3 వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు

మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు

4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగు

నట్లు నా ప్రజలను మ్రింగుచు

పాపము చేయువారికందరికిని తెలివి లేదా?

పాపము చేయువారు బహుగా భయపడుదురు.

5 ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము

పక్షముననున్నాడు

6 బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు

అయినను యెహోవావారికి ఆశ్రయమై యున్నాడు.

7 సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును

గాక.

యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు

యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతో

షించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/14-0711f88ad11d4aa0f5b8ba34cca7ab43.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 15

దావీదు కీర్తన.

1 యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన

వాడెవడు?

నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు?

2 యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు

హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.

3 అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలి

కానికి కీడుచేయడు

తన పొరుగువానిమీద నింద మోపడు

4 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు

అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని

సన్మానించును

అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను

మాట తప్పడు.

5 తన ద్రవ్యము వడ్డికియ్యడు

నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు

ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చ

బడడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/15-d07636d4fe21a39987bfcd9107210fb9.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 16

దావీదు రసికకావ్యము.

1 దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.

2 –నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు

లేదని యెహోవాతో నేను మనవి చేయుదును

3 నేనీలాగందును–భూమిమీదనున్న భక్తులే శ్రేష్ఠులు;వారు నాకు కేవలము ఇష్టులు.

4 యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి

శ్రమలు విస్తరించును.

వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను.

5 యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము

నీవే నా భాగమును కాపాడుచున్నావు.

6 మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను

శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.

7 నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను

రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు

బోధించుచున్నది.

8 సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపు

చున్నాను.

ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక

నేను కదల్చబడను.

9 అందువలన నా హృదయము సంతోషించుచున్నది

నా ఆత్మహర్షించుచున్నది

నా శరీరము కూడ సురక్షితముగా నివసించుచున్నది

10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచి

పెట్టవు

నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు

11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు

నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు

నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/16-9092b50c59fc54e81fa8458313c972fc.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 17

దావీదు ప్రార్థన.

1 యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ

నంగీకరించుము

నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెద

వులనుండి వచ్చునదికాదు.

2 నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక

నీ కనుదృష్టి న్యాయముగా చూచును.

3 రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును

పరిశీలించితివి

నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు

కానరాలేదు

నోటిమాటచేత నేను అతిక్రమింపను

4 మనుష్యుల కార్యముల విషయమైతే

బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై

నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొని

యున్నాను.

5 నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని

యున్నాను.

నాకు కాలు జారలేదు.

6 నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను

దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు

నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము.

7 నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి

లోనుండి నీ కుడిచేత రక్షించువాడా,

8-9 నీ కృపాతిశయములను చూపుము.

ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను

కాపాడుము

నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము

నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్క

కుండను

నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము.

10 వారుతమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును.

11 మా అడుగుజాడలను గురుతుపెట్టి వారిప్పుడు

మమ్ము చుట్టుకొని యున్నారు

మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.

12 వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను

చాటైన స్థలములలో పొంచు కొదమసింహమువలెను

ఉన్నారు.

13 యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ

గొట్టుము

దుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము

14 లోకులచేతిలోనుండి

ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ

లోకుల చేతిలోనుండి

నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము.

నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులుకలిగి తృప్తినొందుదురు

తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.

15 నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను

నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో

నా ఆశను తీర్చుకొందును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/17-3cd58778914fdae937b1a659ecbd4218.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 18

ప్రధానగాయకునికి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలోనుండియు, సౌలు చేతిలోనుండియు యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి, అతడు ఇట్లనెను.

1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు

చున్నాను.

2 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు

వాడు

నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత

దుర్గము, నా దేవుడు

నేను ఆశ్రయించియున్న నా దుర్గము.

3 కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా

ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం

చును.

4 మరణ పాశములు నన్ను చుట్టుకొనగను,

భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను

5 పాతాళపు పాశములు నన్ను అరికట్టగను

మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

6 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని

నా దేవునికి ప్రార్థన చేసితిని

ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన

నంగీకరించెను

నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల

జొచ్చెను.

7 అప్పుడు భూమి కంపించి అదిరెను

పర్వతముల పునాదులు వణకెను

ఆయన కోపింపగా అవి కంపించెను.

8 ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను

ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను

9 నిప్పుకణములు రాజబెట్టెను.

మేఘములను వంచి ఆయన వచ్చెను

ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మి

యుండెను.

10 కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను

గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.

11 గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప

జేసెను

జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా

చేసికొనెను.

12 ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ

గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.

13 యెహోవా ఆకాశమందు గర్జనచేసెను

సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను

వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.

14 ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను

చెదరగొట్టెను

మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.

15 యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు

వడిగా విడువగా

నీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు

కనబడెను.

భూమి పునాదులు బయలుపడెను.

16 ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను

పట్టుకొనెను

17 నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు

నాకంటె బలిష్ఠులైయుండగావారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

18 ఆపత్కాలమందువారు నామీదికి రాగా

యెహోవా నన్ను ఆదుకొనెను.

19 విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని

వచ్చెను

నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను

తప్పించెను.

20 నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను

నా నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

21 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను

భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను

22 ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు

చున్నాను

ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను

23 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని

ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.

24 కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి

తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి

నాకు ప్రతిఫలమిచ్చెను.

25 దయగలవారియెడల నీవు దయచూపించుదువు

యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

26 సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు

దువు.

మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

27 శ్రమపడువారిని నీవు రక్షించెదవు

గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.

28 నా దీపము వెలిగించువాడవు నీవే

నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా

చేయును

29 నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును.

నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.

30 దేవుడు యథార్థవంతుడు

యెహోవా వాక్కు నిర్మలము

తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.

31 యెహోవా తప్ప దేవుడేడి?

మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

32 నాకు బలము ధరింపజేయువాడు ఆయనే

నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.

33 ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు

ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.

34 నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే

నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.

35 నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు

నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను

నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.

36 నా పాదములకు చోటు విశాలపరచితివి

నా చీలమండలు బెణకలేదు.

37 నా శత్రువులను తరిమి పట్టుకొందునువారిని నశింపజేయువరకు నేను తిరుగను.

38 వారు నా పాదముల క్రింద పడుదురువారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ

ద్రొక్కుదును

39 యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి

నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి

40 నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి

నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని

41 వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను

యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి ఉత్తరమియ్యకుండును.

42 అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని

పొడిగా కొట్టితిని

వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని

పారబోసితిని.

43 ప్రజలుచేయు కలహములలో పడకుండ నీవు నన్ను

విడిపించితివి

నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి

నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు

44 నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు

లగుదురు

అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు

45 అన్యులు నిస్తాణగలవారై వణకుచు

తమ దుర్గములను విడచి వచ్చెదరు.

46 యెహోవా జీవముగలవాడు

నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు

నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి

నొందునుగాక.

47 ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు

జనములను నాకు లోబరచువాడు ఆయనే.

48 ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి

పించును.

నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను

హెచ్చించుదువు

బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి

నీవు నన్ను విడిపించుదువు

49 అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను

ఘనపరచెదను

నీ నామకీర్తన గానము చేసెదను.

50 నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ

జేయువాడవు

అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును

నిత్యము కనికరము చూపువాడవు

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/18-3b444204f52e0ec1ea1fe372c6a6ed46.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 19

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి

అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

2 పగటికి పగలు బోధచేయుచున్నది.

రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

3 వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము విన

బడదు.

4 వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి

యున్నది

లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి

వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.

5 అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి

కుమారుని వలె ఉన్నాడు

శూరుడు పరుగెత్త నుల్లిసించునట్లు తన పథమునందు

పరుగెత్త నుల్లిసించుచున్నాడు.

6 అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ

దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు

అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.

7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ

మైనది

అది ప్రాణమును తెప్పరిల్లజేయును

యెహోవా శాసనము నమ్మదగినది

అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి

హృదయమును సంతోషపరచును

యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది

కన్నులకు వెలుగిచ్చును.

9 యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది

నిత్యము నిలుచును

యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవ

లము న్యాయమైనవి.

10 అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు

కంటెను కోరదగినవి

తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.

11 వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును

వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.

12 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?

నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను

నిర్దోషినిగా తీర్చుము.

13 దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని

ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము

అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము

చేయకుండ నిందా రహితుడనగుదును.

14 యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా,

నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును

నీ దృష్టికి అంగీకారములగును గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/19-8e90e4a773a91274c007b6742193636f.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 20

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక

యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.

2 పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము

చేయును గాక

సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.

3 ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును

గాక

నీ దహనబలులను అంగీకరించును గాక.

4 నీ కోరికను సిద్ధింపజేసి

నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.

5 యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము

చేయుచున్నాము

మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు

చున్నాము

నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

6 యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు

తెలియును

రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును

తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును.

7 కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను

బట్టియు అతిశయపడుదురు

మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి

అతిశయపడుదము.

8 వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి

చక్కగా నిలుచుచున్నాము.

9 యెహోవా, రక్షించుము

మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకు ఉత్తరమిచ్చును

గాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/20-4415dc17e12e2390e5c946138e44ccb4.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 21

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు

చున్నాడు

నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.

2 అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు

అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక

అంగీకరించుచున్నావు.(సెలా.)

3 శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని

ఎదుర్కొనుచున్నావు

అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచి

యున్నావు.

4 ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు

దానిని అతని కనుగ్రహించియున్నావు

సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి

యున్నావు.

5 నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను

గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి

యున్నావు.

6 నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని

నియమించియున్నావు

నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లిసింపజేసి

యున్నావు.

7 ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు

చున్నాడు

సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.

8 నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును

నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించు

కొనును.

9 నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె

అగుదురు

తన కోపమువలన యెహోవావారిని నిర్మూలము

చేయును

అగ్ని వారిని దహించును.

10 భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు

నాశనము చేసెదవు

నరులలో నుండకుండ వారి సంతానమును నశింప

జేసెదవు.

11 వారు నీకు కీడుచేయవలెనని ఉద్దేశించిరిదురు

పాయము పన్నిరి

కాని దానిని కొనసాగింప లేకపోయిరి.

12 నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు

నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద

కొట్టుదువు.

13 యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము

మేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించె

దము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/21-dcebf340a7bcecb1604a9c361b3db349.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 22

ప్రధానగాయకునికి. అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.

1 నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?

నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా

నున్నావు?

2 నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను

రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు

అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు.

3 నీవు ఇశ్రాయేలుచేయు స్తోత్రములమీద ఆసీనుడవై

యున్నావు.

4 మా పితరులు నీయందు నమ్మిక యుంచిరివారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని

రక్షించితివి.

5 వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి

నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.

6 నేను నరుడను కాను నేను పురుగును

నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీక

రింపబడిన వాడను.

7 నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం

చుచు నన్ను అపహసించుచున్నారు.

8 –యెహోవామీద నీ భారము మోపుము

ఆయన వానిని విడిపించునేమో

వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు

నేమో అందురు.

9 గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా

నేను నా తల్లియొద్ద స్తన్యపానముచేయుచుండగా

నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి.

10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే

నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు

నీవే.

11 శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును

లేడు

నాకు దూరముగా నుండకుము.

12 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి

బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి.

13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు

నోళ్లు తెరచుచున్నారు

14 నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను

నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి

నా హృదయము నా అంతరంగమందుమైనమువలె

కరగియున్నది.

15 నా బలము యెండిపోయి చిల్లపెంకు వలె ఆయెను

నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది

నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.

16 కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి

దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

17 నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు

18 నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు

నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

19 యెహోవా, దూరముగా నుండకుము

నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.

20 ఖడ్గమునుండి నా ప్రాణమును

కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.

21 సింహపు నోటనుండి నన్ను రక్షింపుము

గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి

నాకు ఉత్తరమిచ్చియున్నావు

22 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను

సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.

23 యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ

నను స్తుతించుడి

యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన

పరచుడి

ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు

భయపడుడి

24 ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని

చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన

ముఖమును దాచలేదు.

వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.

25 మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె

దను

ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా

మ్రొక్కుబడులు చెల్లించెదను.

26 దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు

యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు

మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.

27 భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని

యెహోవాతట్టు తిరిగెదరు

అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము

చేసెదరు

28 రాజ్యము యెహోవాదే

అన్యజనులలో ఏలువాడు ఆయనే.

29 భూమిమీద వర్ధిల్లుచున్నవారందరు అన్నపానములు

పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు

తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు

వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు

30 ఒక సంతతివారు ఆయనను సేవించెదరు

రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు.

31 వారు వచ్చి–ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు

తెలియజేతురు

ఆయన నీతిని వారికి ప్రచురపరతురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/22-f0da1802a796b66458ad267cf35f3c8e.mp3?version_id=1787—