Categories
యోబు

యోబు 35

1 మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

2 –నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభముకన్న

నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది

నీకు ప్రయోజనమేమి? అని

నీవు చెప్పుచున్నావే?

3 ఇదే న్యాయమని నీకు తోచినదా?–

దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను

చున్నావా?

4 నీతోను నీతోకూడనున్న నీ సహవాసులతోను నేను

వాదమాడెదను.

5 ఆకాశమువైపు నిదానించి చూడుము

నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు

చూడుము.

6 నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా?

నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన

చేసితివా?

7 నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు

చున్నావా?

ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?

8 నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును

నరులకే నీ నీతి ఫలము చెందును.

9 అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలువేయుదురు

బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై

కేకలు వేయుదురు.

10 అయితే–రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే

పించుచు

11 భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు

ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ

జేయుచు

నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను

కొనువారెవరును లేరు.

12 కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి

మొఱ్ఱపెట్టుదురు గాని

ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు.

13 నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని

బెట్టడు

సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.

14 –ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము

ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము

నీవు కనిపెట్టవలెను.

15 ఆయన కోపముతో దండింపక పోయినందునను

నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక

పోయినందునను

16 నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు

తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/35-65584857165cf76b028c685952d72a4a.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 36

1 మరియు ఎలీహు ఇంక యిట్లనెను

2 –కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు

తెలియజేసెదను.

ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ

వలసియున్నది.

3 దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును

నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.

4 నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు

పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.

5 ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన

ఎవనిని తిరస్కారము చేయడు

ఆయన వివేచనాశక్తి బహుబలమైనది.

6 భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు

ఆయన దీనులకు న్యాయము జరిగించును.

7 నీతిమంతులను ఆయన చూడకపోడు

సింహాసనముమీద కూర్చుండు రాజులతో

ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టునువారు ఘనపరచబడుదురు.

8 వారు సంకెళ్లతో కట్టబడినయెడలను

బాధాపాశములచేత పట్టబడినయెడలను

9 అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని

ఆయన వారి వారికార్యములను వారి వారి దోషము

లను వారికి తెలియజేయును.

10 ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును.

పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.

11 వారు ఆలకించి ఆయనను సేవించినయెడల

తమ దినములను క్షేమముగాను

తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.

12 వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి

నశించెదరు.

జ్ఞానములేక చనిపోయెదరు.

13 అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేనివారు క్రోధము నుంచుకొందురు.

ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.

14 కావునవారు యౌవనమందే మృతినొందుదురువారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.

15 శ్రమపడువారిని వారికి కలిగినశ్రమవలనఆయన

విడిపించును.

బాధవలన వారిని విధేయులుగా చేయును.

16 అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పించును.

ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొనిపోవును

నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.

17 దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది

న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.

18 నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ

తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము

నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు

19 మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.

నీవు మొఱ్ఱపెట్టుటయు

బల ప్రయత్నములు చేయుటయు

బాధనొందకుండ నిన్ను తప్పించునా?

20 జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి

రావలెనని కోరుకొనకుము.

21 జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము.

దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు

కొనియున్నావు.

22 ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత

వహించినవాడు

ఆయనను పోలిన బోధకుడెవడు?

23 ఆయనకు మార్గము నియమించినవాడెవడు?

–నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో

ఎవడు పలుక తెగించును?

24 మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును

మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.

25 మనుష్యులందరు దాని చూచెదరు

నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.

26 ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము

ఆయనను ఎరుగము

ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.

27 ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును

మంచుతోకూడిన వర్షమువలె అవి పడును

28 మేఘములు వాటిని కుమ్మరించును

మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.

29 మేఘములు వ్యాపించు విధమును

ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును

ఎవడైనను గ్రహింపజాలునా?

30 ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును

సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.

31 వీటివలన ఆయన ఆయా ప్రజలకు తీర్పుతీర్చును.

ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు

32 ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును

గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును

33 ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును

తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/36-683eef1ceb59c7bf55018c9238728a52.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 37

1 దీనినిబట్టి నా హృదయము వణకుచున్నది

దాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.

2 ఆయన స్వరగర్జనమును వినుడి

ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.

3 ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును

భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును.

4 దాని తరువాత ఉరుముధ్వని గర్జించును

ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును

ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును

నిలిపివేయడు

5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును

మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన

చేయును.

6 –నీవు భూమిమీద పడుమని హిమముతోను

వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ

ఇచ్చుచున్నాడు.

7 మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును

తెలిసికొనునట్లు

ప్రతిమనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసియున్నాడు.

8 జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి

వాటి బిలములలో వసించును.

9 మరుగుస్థానములోనుండి తుపాను వచ్చును

ఉత్తరదిక్కునుండి చలి వచ్చును

10 దేవుని ఊపిరివలన మంచు పుట్టును

జలముల పైభాగమంతయు గట్టిపడును.

11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో

నింపును

తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.

12-13 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాస

యోగ్యమైన భూగోళము మీద

మెరుపును మేఘములును సంచారము చేయును

ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును

శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప

చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి

నెరవేర్చును.

14 యోబూ, ఈ మాట ఆలకింపుము

ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.

15 దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని

యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా?

16 మేఘములను తేలచేయుటయు

పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా?

17 దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు

నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?

18 పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును

ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?

19 మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు

తెలుపుము.

చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది

20 నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా?

ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?

21 ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ

యిప్పుడు కనబడకయున్నను

గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కను

పరచును.

22 ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును

దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు.

23 సర్వశక్తుడగు దేవుడు

మహాత్మ్యముగలవాడు.

ఆయన మనకు అగోచరుడు.

న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు.

24 అందువలన నరులు ఆయనయందు భయభక్తులుకలిగి

యుందురు.

తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును

లక్ష్యపెట్టడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/37-24c847a821d40fdc8b3233a8ecf2698f.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 38

1 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున

యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను–

2 జ్ఞానములేని మాటలు చెప్పి–ఆలోచనను చెరుపుచున్న

వీడెవడు?

3 పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము

నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు

తెలియజెప్పుము.

4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ

నుంటివి?

నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన

వాడెవడో చెప్పుము.

6 దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము.

దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో

చెప్పుము.

7 ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు

దేవదూతలందరునుఆనందించి జయధ్వనులు చేసినప్పుడు

దాని మూలరాతిని వేసినవాడెవడు?

8 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా

తలుపులచేత దానిని మూసినవాడెవడు?

9 నేను మేఘమును దానికి వస్త్రముగాను

గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?

10 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను

తలుపులను పెట్టించినప్పుడు

11 –నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు

ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు

నేను చెప్పినప్పుడు నీవుంటివా?

12-13 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును

అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును

నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా?

అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?

14 ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా

భూముఖము మార్పునొందును

విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన

బడును.

15 దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును

వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.

16 సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?

మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?

17 మరణద్వారములు నీకు తెరవబడెనా?

మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?

18 భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా?

నీకేమైన తెలిసినయెడల చెప్పుము.

19-20 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?

చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?

దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా?

దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?

21 ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. నీవు బహు

వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.

22 నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?

23 ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ

దినముకొరకును నేను దాచియుంచిన

వడగండ్ల నిధులను నీవు చూచితివా?

24 వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది?

తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ

ముఖములను వ్యాపించును?

25 నిర్మానుష్య ప్రదేశముమీదను

26 జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును

27 పాడైన యెడారిని తృప్తిపరచుటకును

లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను

ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించు

వాడెవడు?

28 వర్షమునకు తండ్రి యున్నాడా?

మంచు బిందువులను పుట్టించువాడెవడు?

29 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును?

ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?

30 జలములు రాతివలె గడ్డకట్టును

అగాధజలముల ముఖము గట్టిపరచబడును.

31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా?

మృగశీర్షకు కట్లను విప్పగలవా?

32 వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు

నట్లు చేయగలవా?

సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు

నడిపింపగలవా?

33 ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా?

దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప

గలవా?

34 జలరాసులు నిన్ను కప్పునట్లు

మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?

35 మెరుపులు బయలువెళ్లి

–చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు

నీవు వాటిని బయటికి రప్పింపగలవా?

36 అంతరింద్రియములలోజ్ఞానముంచిన వాడెవడు?

హృదయమునకుతెలివి నిచ్చినవాడెవడు?

37 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?

38 ధూళి బురదయై పారునట్లును

మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును

ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు

వాడెవడు?

39 ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?

40 సింహపుపిల్లలు తమతమ గుహలలో పండుకొనునప్పుడు

తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి

ఆకలి తీర్చెదవా?

41 తిండిలేక తిరుగులాడుచు

కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు

కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/38-fee012033839d61ceb51b220a7c61439.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 39

1 అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు

తెలియునా?

లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?

2 అవి మోయు మాసములను నీవు లెక్కపెట్టగలవా?

అవి యీనుకాలము ఎరుగుదువా?

3 అవి వంగి తమ పిల్లలను కనును

తమపిల్లలను వేయును.

4 వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును

అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.

5 అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు?

అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?

6 నేను అరణ్యమును దానికి ఇల్లుగాను

ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.

7 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును

తోలువాని కేకలను అది వినదు.

8 పర్వతముల పంక్తియే దానికి మేతభూమి

ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.

9 గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా?

అది నీ శాలలో నిలుచునా?

10 పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట

గలవా?

అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?

11 దాని బలము గొప్పదని దాని నమ్ముదువా?

దానికి నీ పని అప్పగించెదవా?

12 అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న

ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?

13 నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును.

రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది

వాత్సల్యము కలదిగా నున్నదా?

14 లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును

ధూళిలో వాటిని కాచును.

15 దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను

అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను

అనుకొనకయే యున్నది.

16 తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము

చూపును

దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

17 దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను

ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ

లేదు.

18 అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును

తిరస్కరించును.

19 గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా?

జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?

20 మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా?

దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

21 మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి

సంతోషించును

అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.

22 అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద

కుండును

ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.

23 అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును

దానిమీద గలగలలాడించబడునప్పుడు

24 ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును

అది బాకానాదము విని ఊరకుండదు.

25 బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా

అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి

కొనును

సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఫెూషను వినును.

డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా?

26 అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు

చాచునా?

27 పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా?

తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?

28 అది రాతికొండమీద నివసించును

కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు

చోటను గూడు కట్టుకొనును.

29 అక్కడనుండియే తన యెరను వెదకును.

దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.

30 దాని పిల్లలు రక్తము పీల్చును

హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది

యుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/39-c5729a86886284cc076f43f2c0fee266.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 40

1 మరియు యెహోవా యోబునకు ఈలాగు .

ప్రత్యుత్తరమిచ్చెను–

2 ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో

వాదింపవచ్చునా?

దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర

మియ్యవలెను.

3 అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున

ప్రత్యుత్తరమిచ్చెను–

4 చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని

ప్రత్యుత్తరమిచ్చెదను?

నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.

5 ఒక మారుమాటలాడితిని నేను మరల నోరెత్తను.

రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.

6 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు

యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను–

7 పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము

నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.

8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా?

నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప

రాధము మోపుదువా?

9 దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా?

ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప

గలవా?

10 ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము

గౌరవప్రభావములను ధరించుకొనుము.

11 నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము

గర్విష్ఠులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.

12 గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము

దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ

ద్రొక్కుము.

13 కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము

సమాధిలో వారిని బంధింపుము.

14 అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను

నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.

15 నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు

గదా

ఎద్దువలె అది గడ్డి మేయును.

16 దాని శక్తి దాని నడుములో ఉన్నది

దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.

17 దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను

వంచును

దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి

యున్నవి.

18 దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి

దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి

19 అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది

దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.

20 పర్వతములలో దానికి మేత మొలచును

అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.

21 తామర చెట్లక్రిందను

జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును

22 తామరచెట్ల నీడను అది ఆశ్రయించును

నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.

23 నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు

యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు

వచ్చినను అది ధైర్యము విడువదు.

24 అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా?

ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/40-755302b23624d7c3ce234fd9940475bf.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 41

1 నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? .

దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?

2 నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా?

దాని దవడకు గాలము ఎక్కింపగలవా?

3 అది నీతో విన్నపములు చేయునా?

మృదువైన మాటలు నీతో పలుకునా?

4 నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు

అది నీతో నిబంధనచేయునా?

5 నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట

లాడెదవా?

నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?

6 బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా?వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము

చేయుదురా?

7 దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా?

దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?

8 దానిమీద నీ చెయ్యి వేసి చూడుము

దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన

యెడల

నీవు మరల ఆలాగున చేయకుందువు.

9 దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు

కొందుమన్న ఆశ విడిచెదరు

దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను

గుండెలు అవిసిపోవును గదా.

10 దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు.

అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?

11 నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను

ఏమైనను ఇచ్చెనా?

ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే

గదా

12 దాని అవయవములనుగూర్చియైనను దాని మహాబల

మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి

యైనను పలుకక మౌనముగా నుండను.

13 ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా?

దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?

14 దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు?

దాని పళ్లచుట్టు భయకంపములు కలవు

15 దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము

ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి

యున్నవి.

16 అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి.

వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.

17 ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి

భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి

కలిసికొని యున్నవి.

18 అది తుమ్మగా వెలుగు ప్రకాశించును

దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి

19 దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును

అగ్ని కణములు దానినుండి లేచును.

20 ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు

చున్న బానలోనుండి పొగ లేచునట్లు

దాని నాసికారంధ్రములలోనుండి లేచును.

21 దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును

దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును

22 దాని మెడ బలమునకు స్థానము

భయము దానియెదుట తాండవమాడుచుండును

23 దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది

అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి

రాదు.

24 దాని గుండె రాతివలె గట్టిగా నున్నది

అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.

25 అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు

అధిక భయముచేత వారు మైమరతురు.

26 దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే

ఈట్లైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు.

27 ఇది ఇనుమును గడ్డిపోచగాను

ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.

28 బాణము దానిని పారదోలజాలదు

వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.

29 దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును

అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.

30 దాని క్రిందిభాగములు కరుకైన చిల్లపెంకు లవలె ఉన్నవి.

అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును

పరచుకొనును.

31 కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ

జేయును

సముద్రమును తైలమువలె చేయును.

32 అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప

జేయును

చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా

తోచును.

33 అది భయములేనిదిగా సృజింపబడినది

భూమిమీద దానివంటిదేదియు లేదు.

34 అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును

గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/41-543ab552c5b4e3e4843cc649fc2d7180.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 42

1 అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు

త్తరమిచ్చెను–

2 నీవు సమస్తక్రియలను చేయగలవనియు

నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు

నేనిప్పుడు తెలిసికొంటిని.

3 జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు?

ఆలాగున వివేచనలేనివాడనైన నేను

ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను

గూర్చి మాటలాడితిని.

4 నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట

ఆలకింపుము

ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ

జెప్పుము.

5 వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని

అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు

చున్నాను.

6 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను

బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను–

నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి

యుక్తమైనది పలుకలేదు గనుక

నాకోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను

మండుచున్నది.

8 కాబట్టి యేడుఎడ్లను ఏడుపొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.

9 తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవావారిపక్షమున యోబును అంగీకరించెను.

10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

11 అప్పుడు అతని సహోదరులందరును అతని అక్కచెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైనవారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహానుఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.

12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగు వేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.

13 మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

14 అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.

15 ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.

16 అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/42-2b78dbd003fedb37a4f863528dfdf818.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 1

1 దుష్టుల ఆలోచనచొప్పున నడువక

పాపుల మార్గమున నిలువక

అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు

దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

3 అతడు నీటికాలువల యోరను నాటబడినదై

ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును

అతడు చేయునదంతయు సఫలమగును.

4 దుష్టులు ఆలాగున నుండక

గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

5 కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును

నీతిమంతుల సభలో పాపులును నిలువరు.

6 నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును

దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/1-f734c0fb672bdb35302ae2eaddc0a31b.mp3?version_id=1787—

Categories
కీర్తనలు

కీర్తనలు 2

1 అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?

జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

2 –మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము

రండి అని చెప్పుకొనుచు

3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని

విరోధముగా నిలువబడుచున్నారు

ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

4 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు

ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు

5 ఆయన ఉగ్రుడై వారితో పలుకును

ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును

6 –నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద

నా రాజును ఆసీనునిగా చేసియున్నాను

7 కట్టడను నేను వివరించెదను

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను

–నీవు నా కుమారుడవు

నేడు నిన్ను కనియున్నాను.

8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను

భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

9 ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు

కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా

పగులగొట్టెదవు

10 కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి

భూపతులారా, బోధనొందుడి.

11 భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి

గడగడ వణకుచు సంతోషించుడి.

12 ఆయన కోపము త్వరగా రగులుకొనును

కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన

కోపించును

అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.

ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/2-61e3874778916d15be395e7b4c9222eb.mp3?version_id=1787—