Categories
యోబు

యోబు 5

1 నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా?

పరిశుద్ధదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?

2 దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు

బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.

3 మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను

అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమని

కనుగొంటిని.

4 అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు

గుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.

5 ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురు

ముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురు

బోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి

6 శ్రమ ధూళిలోనుండి పుట్టదు.

బాధ భూమిలోనుండి మొలవదు.

7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము

నకే పుట్టుచున్నారు.

8 అయితే నేను దేవుని నాశ్రయించుదును.

దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.

9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను

లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.

10 ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు

పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.

11 అట్లు ఆయన దీనులను ఉన్నతస్థలములలో నుంచును

దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.

12 వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండ

ఆయన వారి ఉపాయములను భంగపరచును

13 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును

కపటుల ఆలోచనను తలక్రిందుచేయును

14 పగటివేళ వారికి అంధకారము తారసిల్లును

రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడవులాడుదురు

15 బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండి

ఆయన దరిద్రులను రక్షించును.

16 కావున బీదలకు నిరీక్షణ కలుగును

అక్రమము నోరు మూసికొనును.

17 దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు

కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

18 ఆయన గాయపరచి గాయమును కట్టును

ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ

పరచును.

19 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును

ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

20 క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గ

బలమునుండియు ఆయన నిన్ను తప్పించును.

21 నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన

నిన్ను చాటుచేయును

ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.

22 పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని

యుందువు

అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.

23 ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని

నిర్లక్ష్యము చేయుదువు

అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు

24 నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును

నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు

పోయి యుండదు.

25 మరియు నీ సంతానము విస్తారమగుననియు

నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదు

రనియు నీకు తెలియును.

26 వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు

పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.

27 మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది

ఆలాగే యున్నది.

ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/5-8bba66ac6a21f1f7b625740ae362a51a.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 6

1 దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను–

2 నా దుఃఖము చక్కగా తూచబడును గాక

దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో

పెట్టబడును గాక.

3 ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల

ఇసుకకన్న బరువుగా కనబడును.

అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.

4 సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను

వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది

దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై

పంక్తులు తీరుచున్నవి.

5 అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?

ఎద్దు మేత చూచి రంకెవేయునా?

6 ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డు

లోని తెలుపులో రుచికలదా?

7 నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను

అవియే నాకు భోజనపదార్థములాయెను.

8 ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక

నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక

9 దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక

చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును

గాక.

10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొన

కుండ లేదని నేను ఆదరణ పొందుదును

మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి

హర్షించుదును

11 నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?

నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?

12 నా బలము రాళ్ల బలమువంటిదా?

నా శరీరము ఇత్తడిదా?

13 నాలో త్రాణ యేమియు లేదు గదా.

శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.

14 క్రుంగిపోయినవాడు

సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను

స్నేహితుడు వానికి దయచూపతగును.

15 నా స్నేహితులు ఎండిన వాగువలెను

మాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడనివారైరి.

16 మంచుగడ్డలుండుటవలనను

హిమము వాటిలో పడుటవలనను

అవి మురికిగా కనబడును

17 వేసవి రాగానే అవి మాయమై పోవును

వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.

18 వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు

లేకుండ అవి యింకిపోవును.

19 సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు

వాటిని వెదకుదురు

షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.

20 వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు

వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.

21 అటువలె మీరు లేనట్టుగానే యున్నారు

మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.

22 –ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా?

మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని

యడిగితినా?

23 పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?

బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని

యడిగితినా?

24 నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను

ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు

తెలియజేయుడి.

25 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి

అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

26 మాటలను గద్దించుదమని మీరనుకొందురా?

నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.

27 మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,

మీ స్నేహితులమీద బేరము సాగింతురు.

28 దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట

నేను అబద్ధమాడుదునా?

29 అన్యాయములేకుండ నా సంగతి మరల విచారించుడి

మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

30 నా నోట అన్యాయముండునా?

దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/6-01380205148d4a77b28a1ddef8c0b222.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 7

1 భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా?

2 నీడను మిగుల నపేక్షించు దాసునివలెను

కూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను

3 ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను.

ఆయాసముతోకూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి.

4 నేను పండుకొనునప్పుడెల్ల

–ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా?

అని యనుకొందును.

తెల్లవారువరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును.

5 నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప

బడియున్నది.

నా చర్మము మాని మరల పగులుచున్నది.

6 నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి

నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

7 నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము.

నా కన్ను ఇకను మేలు చూడదు.

8 నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు.

నీ కన్నులు నాతట్టు చూచునుగాని నేనుండక

పోదును.

9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు

పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు

10 అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు

అతని స్థలము అతని మరల నెరుగదు.

11 కావున నేను నా నోరు మూసికొనను

నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను

నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

12 నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగ

మునా?

నీవెందుకు నా మీద కావలియుంచెదవు?

13 –నా మంచము నాకు ఆదరణ ఇచ్చును.

నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని

నేననుకొనగా

14 నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు

దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

15 కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను

ఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట

నాకిష్టము.

16 అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా

కిష్టము లేదు

నా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

17 మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల?

అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?

18 ప్రతి పగలు నీవతని దర్శింపనేల?

ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?

19 ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?

నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?

20 నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా,

నేను నీ యెడల ఏమి చేయగలను?

నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?

21 నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము

నేల క్షమింపవు?

నేనిప్పుడు మంటిలో పండుకొనెదను

నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవుగాని నేను

లేక పోయెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/7-7bc250ceb94a355953efa01474bd7eb2.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 8

1 అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను

2 –ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు?

నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.

3 దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా?

సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?

4 నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసి

రేమో

కావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.

5 నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల

సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల

6 నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల

నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి

నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.

7 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను

తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.

8 మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు

భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.

9 మునుపటి తరమువారి సంగతులు విచారించుమువారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసికొనుము.

10 వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.

11 బురదలేకుండ జమ్ము పెరుగునా?

నీళ్లులేకుండ రెల్లు మొలచునా?

12 అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని

యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.

13 దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును

భక్తిహీనుని ఆశ నిరర్థకమగును

14 అతని ఆశ భంగమగును.

అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.

15 అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.

అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును.

16 ఎండకు అతడు పచ్చిపెట్టి బలియును

అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును.

17 అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనును

రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.

18 దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టిన

యెడల

అది–నేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడ

లేదనును.

19 ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము

అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.

20 ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసి

వేయడు.

ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.

21 నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు

దుష్టుల గుడారము ఇక నిలువకపోవును.

22 అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును.

ప్రహర్షముతో నీ పెదవులను నింపును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/8-ea62fe97fb80319d86531dc4f80f4f9b.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 9

1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 –వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.

నరుడు దేవునిదృష్టికి ఎట్లు నిర్దోషియగును?

3 వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల

వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు

ఉత్తరమియ్యలేడు.

4 ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు

ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

5 వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు

ఆయనే

ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే

6 భూమిని దాని స్థలములోనుండి కదలించువాడు

ఆయనే

దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే

7 ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా

అతడు ఉదయింపడు

ఆయన నక్షత్రములను మరుగుపరచును.

8 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు

వాడు

సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.

9 ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ

నక్షత్రరాసులను చేసినవాడు.

10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను

లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయనచేయు

చున్నాడు.

11 ఇదిగో ఆయన నా సమీపముగ గడచిపోవుచున్నాడు

గాని నేనాయనను కనుగొనలేను

నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు

కనబడడు.

12 ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవా

డెవడు?

–నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవా

డెవడు?

13 దేవుని కోపము చల్లారదు

రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

14 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి

వాడను?

ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకు

టకు నేనేపాటివాడను?

15 నేను నిర్దోషినైయుండినను ఆయనకు ప్రత్యుత్త

రము చెప్పజాలను

న్యాయకర్తయనినేనాయనను బతిమాలుకొనదగును.

16 నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను

ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

17 ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు

చున్నాడు

నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయు

చున్నాడు

18 ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు

చేదైనవాటిని నాకు తినిపించును.

19 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా–నేనే

యున్నానని ఆయన యనును

న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా–ప్రతివాదిగా

నుండ తెగించువాడెవడని ఆయన యనును?

20 నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నా

మీద నేరము మోపును

నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయననన్ను

నిరూపించును.

21 నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు

నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.

22 ఏమి చేసినను ఒక్కటే.

కావున–యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము

లేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని

నేను వాదించుచున్నాను.

23 సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము

చేయగా

నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.

24 భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ

ఆయన చేయును.

ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి

ఎవడు?

25 పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా

గతించుచున్నవి

క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.

26 రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును

ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

27 –నా శ్రమను మరచిపోయెదననియు

దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా

నుండెదననియు నేను అనుకొంటినా?

28 నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను

నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను

29 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా

కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?

30 నేను హిమముతో నన్ను కడుగుకొనినను

సబ్బుతో నా చేతులు కడుగుకొనినను

31 నీవు నన్ను గోతిలో ముంచెదవు

అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.

32 ఆయన నావలె నరుడు కాడు

నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను

మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.

33 మా యిద్దరిమీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.

34 ఆయన తన దండమును నామీదనుండి తీసివేయ

వలెను

నేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహా

త్మ్యమును నాకు కనుపరచకుండవలెను.

35 అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను,

ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను

చున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/9-ec7a25c624aca873661a9a52d525e6e2.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 10

1 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది

నేను అడ్డులేకుండ అంగలార్చెదను

నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

2 నా మీద నేరము మోపకుండుము

నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ

జేయుమని నేను దేవునితో చెప్పెదను.

3 దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా?

దుష్టుల ఆలోచనమీద దయాదృష్టియుంచుట

సంతోషమా?

నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

4 నీ నేత్రములు నరుల నేత్రములవంటివా?

నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?

5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా?

నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల

వంటివా?

6 నేను దోషిని కాననియు

7 నీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు

నీవు ఎరిగియుండియు

నీవేల నా దోషమునుగూర్చి విచారణచేయు

చున్నావు?

నా పాపమును ఏల వెదకుచున్నావు?

8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను

రూపించియున్నను

నీవు నన్ను మ్రింగివేయుచున్నావు.

9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి

జ్ఞాపకము చేసికొనుము

నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

10 ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా

జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేర

బెట్టితివి గదా.

11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి

ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

12 జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి

నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.

13 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ

ములో ఆలోచించితివి

ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

14 నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు

నా దోషమునకు పరిహారము చేయకుందువు.

15 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధ

కలుగును

నేను నిర్దోషినైయుండినను అతిశయపడను

అవమానముతో నిండుకొని

నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

16 నేను సంతోషించినయెడల

ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద

చూపుదువు.

సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు

17 ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు

ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు

ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా

మీదికి రాజేసెదవు.

18 గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి?

అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము

విడిచి యుండినయెడల మేలు;

19 అప్పుడు నేను లేనట్లే యుండియుందును

గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

20 నా దినములు కొంచెమే గదా

తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు

22 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు

భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు

వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు

కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు

నన్ను విడిచి నా జోలికి రాకుండుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/10-a2eb7106c18349360ab16bd8e74ef22e.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 11

1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున

ప్రత్యుత్తరమిచ్చెను–

2 ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము

చెప్పవలెను గదా.

వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?

3 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా

నుండవలెనా?

ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యము

చేయుదువా?

4 –నా ఉపదేశము నిర్దోషమనియు

దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.

5 దేవుడు నీతో మాటలాడిన మేలు

ఆయనే నీతో వాదించిన మేలు

6 ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు

అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు

తెలిసికొందువు

నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి

యున్నాడని తెలిసికొనుము.

7 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?

సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానము

కలుగునా?

8 అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి

చేయుదువు?

పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగు

దువు?

9 దాని పరిమాణము భూమికంటె అధికమైనది

దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది

10 ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి

వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు

ఆయన నడ్డగింప గలవాడెవడు?

11 పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా

పరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో

ఆయనే తెలిసికొనును గదా.

12 అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని

బుద్ధిహీనుడు వివేకికాడు.

13 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల

నీచేతులు ఆయనవైపు చాపినయెడల

14 పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దాని

విడిచినయెడల

నీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు

కొట్టివేసినయెడల

15 నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు

నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.

16 నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు

దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు

నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.

17 అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె

అధికముగా ప్రకాశించును

చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.

18 నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు

ధైర్యముగా ఉందువు.

నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు

కొందువు.

19 ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు

అనేకులు నీతో విన్నపములు చేసెదరు.

20 దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు

ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు

చూచుచుందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/11-3379c4697a06714e0bc58cb610e20875.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 12

1 అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర .

మిచ్చెను–

2 నిజముగా లోకములో మీరే జనులు

మీతోనే జ్ఞానము గతించి పోవును.

3 అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగి

యున్నది

నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను

మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు?

దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను

4 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా

నుండవలసివచ్చెను.

నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పద

ముగా నుండవలసి వచ్చెను.

5 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు.

కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

6 దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును

దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా

నుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.

7 అయినను మృగములను విచారించుము అవి నీకు

బోధించును

ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియ

జేయును.

8 భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు బోధించును

సముద్రములోని చేపలును నీకు దాని వివరించును

9 వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల

యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొన

లేనివాడెవడు?

10 జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును

ఆయన వశమున నున్నవి గదా.

11 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు

చెవి మాటలను పరీక్షింపదా?

12 వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన

కలుగుచున్నది అని మీరు చెప్పుదురు

13 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి

ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

14 ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరల

కట్టజాలరు

ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట

ఎవరికిని సాధ్యము కాదు.

15 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి

ఆరిపోవును

వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచి

వేయును.

16 బలమును జ్ఞానమును ఆయనకు

స్వభావలక్షణములు

మోసపడువారును మోసపుచ్చువారును ఆయన

వశముననున్నారు.

17 ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని

తోడుకొని పోవును.

న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

18 రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును.

19 యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొనిపోవును

స్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.

20 వాక్చాతుర్యముగలవారి పలుకును ఆయన నిరర్థకము

చేయును

పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.

21 అధిపతులను ఆయన తిరస్కారము చేయును

బలాఢ్యుల నడికట్లను విప్పును.

22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు

మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును

23 జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయును

సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

24 భూజనుల అధిపతుల వివేచనను ఆయన

నిరర్థక పరచును

త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ

చేయును.

25 వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు

మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూల

చేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/12-9a842eecedd81260c5b8794ac05ef2e7.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 13

1 ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను.

నా చెవి దాని విని గ్రహించియున్నది

2 మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది

నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.

3 నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరు

చున్నాను

దేవునితోనే వాదింప గోరుచున్నాను

4 మీరైతే అబద్ధములు కల్పించువారు.

మీరందరు పనికిమాలిన వైద్యులు.

5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు

అది మీకు జ్ఞానమని యెంచబడును.

6 దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము

నాలకించుడి.

7 దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?

ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

8 ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?

దేవుని పక్షమున మీరు వాదింతురా?

9 ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?

లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు

ఆయనను మోసముచేయుదురా?

10 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల

నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.

11 ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా?

ఆయన భయము మీ మీదికి రాదా?

12 మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.

మీ వాదములు మంటివాదములు

13 నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి

నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.

14 నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?

చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు

కనిపెట్టుచున్నాను.

ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు

పరతును.

16 ఇదియు నాకు రక్షణార్థమైనదగును

భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

17 నా వాఙ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి

నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొర

నీయుడి.

18 ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొని

యున్నాను

నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.

19 నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?

ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని

ప్రాణము విడిచెదను.

20 ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము

అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.

21 నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము

నీ భయము నన్ను బెదరింపనీయకుము

22 అప్పుడు నీవు పిలిచినయెడల నేను నీ కుత్తర మిచ్చెదను

నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము

23 నా దోషములెన్ని? నా పాపములెన్ని?

నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.

24 నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?

నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

25 ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు

వేధించెదవా?

ఎండిపోయిన చెత్తను తరుముదువా?

26 నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు

నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా

నీవు విధించియున్నావు

27 బొండలలో నా కాళ్లు బిగించియున్నావు

నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు

నా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు

28 మురిగి క్షీణించుచున్న వానిచుట్టు

చిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టు

గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/13-258541a8c58a48c45f4f2405ef9acb3d.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 14

1 స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడైమిక్కిలి

బాధనొందును.

2 పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును

నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.

3 అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు

తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించి

యున్నావు.

4 పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన

ఎంత మేలు?

ఆలాగున ఎవడును పుట్టనేరడు.

5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల

సంఖ్య నీకు తెలిసేయున్నది.

మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు

6 కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు

ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడక

యుండుము.

7 వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు

దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.

8 దాని వేరు భూమిలో పాతదై పోయినను

దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను

9 నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును

లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.

10 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.

నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు?

11 తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో

నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో

12 ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.

ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

13 నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో

మేలు

నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన

యెడల ఎంతో మేలు

నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను

జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు

చున్నాను.

14 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?

ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు

నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును

15 ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను

నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

16 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు

నా పాపమును సహింపలేకయున్నావు

17 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది

నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.

18 పర్వతమైనను పడిపోయి నాశనమగును

కొండయైనను దాని స్థానము తప్పును.

19 జలము రాళ్లను అరగదీయును

దాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టు

కొనిపోవును

నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.

20 నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు

గతించిపోవుదురు

నీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్ల

గొట్టుచున్నావు.

21 వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అదివారికి తెలియకపోవును.వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి

పట్టెనని వారు గ్రహింపకయుందురు.

22 తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు

తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/14-ab4116c174cb9ace1d34a5978a3f3b8f.mp3?version_id=1787—