Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 23

1 దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించెను.౹

2 మరియు అతడు ఇశ్రాయేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.౹

3 అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురు షులు.౹

4 వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.౹

5 నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి నాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.౹

6 గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.౹

7-8 లద్దాను కుమారులు ముగ్గురు; పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

9 షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.౹

10 యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.౹

11 యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమపితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.౹

12 కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.౹

13 అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమునుబట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.౹

14 దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.౹

15 మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.౹

16 గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.౹

17 ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడుతప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.౹

18 ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.౹

19 హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.౹

20 ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.౹

21 మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.౹

22 ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.౹

23 మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.౹

24 వీరు తమపితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరులయిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమతమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయుపనివారైయుండిరి.౹

25 –ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు

26 లేవీయులు కూడ ఇక మీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.౹

27 దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.౹

28 వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పనిచూచుటకును, వారి వశముననున్న యెహోవామందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,౹

29 సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చుదానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములుగలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,౹

30 అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింప వలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.౹

31 సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/23-9f54e10a8d83ccca5d5596065ba30d18.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 24

1 అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.౹

2 నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.౹

3 దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతా మారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.౹

4 వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమపితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమతమపితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.౹

5 ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.౹

6 లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరులయిండ్లపద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను.

7 మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు,౹

8 మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీమునకు,౹

9 అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,౹

10-12 ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పద కొండవది ఎల్యాషీబునకు, పండ్రెండవది యాకీమునకు,౹

13 పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబు నకు,౹

14 పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరు నకు,౹

15 పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,౹

16 పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,౹

17 ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,౹

18 ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.౹

19 ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.

20 శేషించిన లేవీ సంతతివారెవరనగా – అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,౹

21 రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,౹

22 ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,౹

23 హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,౹

24 ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,౹

25 ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,౹

26 మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.౹

27 యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.౹

28 మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.౹

29 కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.౹

30 మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమపితరులయిండ్లనుబట్టి లేవీయులు.౹

31 వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లురాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరులయిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/24-ef4a6b839d47280bd6f50fe62fd8b113.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 25

1 మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా

2 ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు.౹

3 యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా షిమీ హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.౹

4 హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమ్తీయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.౹

5 వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి యుండెను.౹

6 వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానముచేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి.౹

7 యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతోకూడనున్న ప్రవీణులైన గాయకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.౹

8 తాముచేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదములేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.౹

9 మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.౹

10 మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

11 నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

12 అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

13 ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

14 ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

15 ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

16 తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

17 పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

18 పదకొండ వది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

19 పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.౹

20 పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

21 పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

22 పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

23 పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.౹

24 పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

25 పదు నెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

26 పందొమ్మిదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

27 ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

28 ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

29 ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

30 ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.౹

31 ఇరువది నాలుగవది రోమమ్తీయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/25-22804860d7524348f4e77214cc1c6bd2.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 26

1 ద్వారపాలకుల విభాగమునుగూర్చినది. ఆసాపు . కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.౹

2 మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,౹

3 ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యో యేనై యేడవవాడు.౹

4 దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెత నేలు అయిదవవాడు,౹

5 అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.౹

6 వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరాక్రమశాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.౹

7 షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.౹

8 ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.౹

9 మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.౹

10 మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను,౹

11 రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.౹

12 ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాల కులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి.౹

13 చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టియొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.౹

14 తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,౹

15 ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.౹

16 షుప్పీమునకును హోసాకును పడమటితట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటి పడెను.౹

17 తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,౹

18 బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.౹

19 కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.

20 కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.౹

21 లద్దాను కుమారులనుగూర్చినది–గెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమపితరులయిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.౹

22 యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు.౹

23 అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.౹

24 మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్క సముమీద ప్రధానిగా నియమింపబడెను.౹

25 ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.౹

26-27 యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయు వారైరి.౹

28 దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలో మీతుచేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.౹

29 ఇస్హారీయులనుగూర్చినది–వారిలో కెనన్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.౹

30 హెబ్రోనీయులనుగూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమశాలులును వేయిన్ని యేడు వందల సంఖ్యగలవారు, వీరు యొర్దాను ఈవల పడమటి వైపుననుండు ఇశ్రాయేలీయులమీద యెహోవా సేవనుగూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పనివిషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.౹

31 హెబ్రోనీయులనుగూర్చినది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్నవారు పరాక్రమశాలులుగా కనబడిరి.౹

32 పరాక్రమశాలులగువాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయులమీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/26-4f95aefb584b38778ec13817c273c67b.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 27

1 జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటిపెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.౹

2 మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేలమంది యుండిరి.౹

3 పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.౹

4 రెండవనెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

5 మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

6 ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పదిమందికి అధిపతియైయుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను.౹

7 నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

8 అయిదవ నెలను ఇశ్రాహే తీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

9 ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

10 ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

11 ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

12 తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

13 పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

14 పద కొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.౹

15 పండ్రెండవనెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

16 మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,౹

17 కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను.౹

18 దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,౹

19 ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,౹

20 అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను,౹

21 గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను,౹

22 దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.౹

23 ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.౹

24 జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనేగాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.

25 రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోనుఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియ మింపబడెను.౹

26 పొలములో పనిచేయువారిమీదను, భూమి దున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను.౹

27 ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిప్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.౹

28 షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.౹

29 షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపా తును నియమింపబడిరి.౹

30 ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీయుడైన యెహె ద్యాహును నియమింపబడిరి.౹

31 గొఱ్ఱెలమీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజు కున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు.

32 దావీదు పినతండ్రియైన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయైయుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను, హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారులయొద్ద ఉండుటకు నియమింపబడెను.౹

33 అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.౹

34 అహీతోపెలు చనిపోయినమీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యా తారును మంత్రులైరి; యోవాబు రాజుయొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/27-431e440b0b75ebd65df7591692a56b66.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 28

1 గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధు లైన పరాక్రమశాలులనందరిని రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను.౹

2 అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను–నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధనమందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరముకట్టించ వలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని.౹

3 అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను.౹

4 ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునైయుండుటకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు.౹

5 యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసియున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను

6 –నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.౹

7 మరియు నేటిదినమున చేయుచున్నట్లు అతడు ధైర్యమువహించి నా ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించినయెడల, నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును.౹

8 కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.౹

9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.౹

10 పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.

11 అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును

12 వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.౹

13 మరియు యాజకులును లేవీయులును సేవచేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను.౹

14 మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తుప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతని కప్పగించెను.౹

15 బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదెలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదెలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారము గాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక దీపస్తంభమునకును, దాని దాని ప్రమిదెలకును కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,౹

16 సన్నిధిరొట్టెలు ఉంచు ఒక్కొక బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండిబల్లలకు కావలసినంత వెండిని,౹

17 ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,౹

18 ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధనమందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతని కప్పగించెను.౹

19 ఇవియన్నియు అప్పగించి–యెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పనియంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను.౹

20 మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగా–నీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవనుగూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.౹

21 దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకారము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పనియంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణు లైనవారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులును జనులందరును నీకు సహాయులగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/28-46dbbc463a8cf5632e8328c24298eb7e.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 29

1 తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెను–దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.౹

2 నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.౹

3 మరియు నా దేవుని మందిరముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులుగాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.౹

4 గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారుచేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

5 ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?

6 అప్పుడు పితరులయిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి

7 మనః పూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.౹

8 తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.౹

9 వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.

10 రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.౹

11 యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹

12 ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹

13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.౹

14 ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.౹

15 మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు

16 మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమ కూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది.౹

17 నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచు న్నాను.౹

18 అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.౹

19 నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును, నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము.౹

20 ఈలాగు పలికిన తరువాత దావీదు–ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమపితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.౹

21 తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱె పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱెపిల్లలను వాటి పానార్పణలతోకూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.౹

22 ఆ దినమునవారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.౹

23 అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.౹

24 అధిపతులందరును యోధులందరునురాజైన దావీదు కుమారులందరునురాజైన సొలొమోనునకు లోబడిరి.౹

25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదుటను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.

26 యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.౹

27 అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.౹

28 అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముది మిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.౹

29 రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,౹

30 దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలనుబట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/29-da44e76e58f2c97c11b61240b21ebe40.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 1

1 దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితోకూడ ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను.౹

2 యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక

3 సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరులయిండ్లకు పెద్దలైనవారికందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును

4 సొలొమోనుతోకూడ కలసి గిబియోనునందుండు బలిపీఠము నొద్దకు పోయిరి; దావీదు దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తెప్పించి యెరూషలేమునందు దానికొరకు గుడారమువేసి తాను సిద్ధపరచిన స్థలమున నుంచెను.౹

5 హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.౹

6 సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.

7 ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగు మని సెలవియ్యగా

8 సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెను–నీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించియున్నావు గనుక

9 దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైనజనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు

10 ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.౹

11 అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు ఈ ప్రకారము యోచించుకొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.౹

12 కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.౹

13 పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను.

14 సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమకూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.౹

15 రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.౹

16 సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.౹

17 వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/1-0daf727f24d22136056f8ec4d3f5d1d7.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 2

1 సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని

2 బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని ఏర్పరచుకొని వీరిమీద మూడువేల ఆరువందలమందిని అధిపతులుగా ఉంచెను.౹

3 సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము.౹

4 నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.౹

5 నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక

6 ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.౹

7 నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడై యుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలుతోను చేయుపనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము.౹

8 మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది.౹

9 కాగా లెబానోనునుండి సరళమ్రానులను దేవదారుమ్రానులను చందనపుమ్రానులను నాకు పంపుము; నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితోకూడ పోవుదురు.౹

10 మ్రానులుకొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను.

11 అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసిపంపిన ఉత్తరమేమనగా–యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారిమీద రాజుగా నియమించియున్నాడు.౹

12 యెహోవాఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక.౹

13 తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను.౹

14 అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గల వాడు.౹

15 ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల

16 మేము నీకు కావలసిన మ్రానులన్నియు లెబానోనునందు కొట్టించి వాటిని నీకొరకు సముద్రముమీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము, తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొన వచ్చును అని వ్రాసెను.

17 సొలొమోను తన తండ్రియైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్షయెనుబదిమూడువేల ఆరువందలమందియైరి.౹

18 వీరిలో బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని పర్వతములందు మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని, జనులమీద అధిపతులుగానుండి పనిచేయించుటకు మూడువేల ఆరు వందలమందిని అతడు ఏర్పరచెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/2-ba1fc465642786af51f8bcd8ac68d8d4.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 3

1 తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారం భించెను.౹

2 తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవనెల రెండవదినమందు దాని కట్టనారంభించెను.౹

3 దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.౹

4 మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను.౹

5 మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి

6 ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీమునుండి వచ్చినది.౹

7 మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను.౹

8 మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పునుబట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను.౹

9 మేకుల యెత్తు ఏబది తులముల బంగారు; మీది గదులను బంగారముతో పొదిగించెను.౹

10 అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను.౹

11-12 ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు, ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను, రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను.౹

13 ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు ఇరువది మూరలు వ్యాపించెను, కెరూబులు పాదములమీద నిలువబడెను, వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి యుండెను.౹

14 అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.౹

15 ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై ముప్పదియయిదు మూరల యెత్తుగల రెండు స్తంభములను వాటిమీదికి అయిదు మూరల యెత్తుగల పీటలను చేయించెను.౹

16 గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను.౹

17 ఆ రెండు స్తంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమతట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేళ్లు పెట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/3-5b01efc2d37891dfb49e3f29f964608b.mp3?version_id=1787—