Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 8

1 మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీపితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.౹

2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము.౹

3 ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ జేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.౹

4 ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.౹

5 ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని

6 ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను.౹

7 నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలోనుండియు కొండలలోనుండియు పారు ఊటలును అగాధజలములునుగల దేశము.౹

8 అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లునుగల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.౹

9 కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.౹

10 నీవుతిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.౹

11 నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని

12 మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,౹

13 నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు

14 నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.౹

15 తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,౹

16 తుదకు నీకు మేలుచేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.౹

17 అయితే మీరు–మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.౹

18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.౹

19 నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను.౹

20 నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/8-0d9c8c93bc7babbb4f654898d166aaa7.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 9

1 ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములుగల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు.౹

2 ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా.౹

3 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు.౹

4 నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలివేసినతరువాత–నేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.౹

5 నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవావారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు.౹

6 మీరు లోబడ నొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను.౹

7 అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.౹

8 హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీమీద తెచ్చుకొనెను.౹

9 ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధమైన పలకలను తీసికొనుటకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.౹

10 అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను.౹

11 ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి

12 –నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారికాజ్ఞాపించిన త్రోవలోనుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.౹

13 మరియు యెహోవా–నేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.౹

14 నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహుజనముగా చేసెదనని నాతో చెప్పగా

15 నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.౹

16 నేను చూచి నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి.౹

17 అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని, నా రెండు చేతులలోనుండి మీకన్నుల యెదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి

18 మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి,మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని.౹

19 ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను.౹

20 మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోప పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని

21 అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.౹

22 మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతుహత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి.౹

23 యెహోవా– మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటిమాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు.౹

24 నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు.౹

25 కాగా నేనుమునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవా –మిమ్మును నశింపజేసెదననగా

26 నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని–ప్రభువా యెహోవా, నీవు నీ మహిమవలన విమోచించి బాహుబలమువలన ఐగుప్తులోనుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము.౹

27 నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకముచేసికొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము;౹

28 ఏలయనగా నీవు ఏ దేశములోనుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు–యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుటవలనను, వారిని ద్వేషించుటవలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో.౹

29 నీవు నీ అధికబలముచేతను నీవు చాపిన నీ బాహువుచేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలును వీరే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/9-57054445d6313458cbe2308a7dcb9866.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 10

1 ఆ కాలమందు యెహోవా–మునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.౹

2 నీవు పగులగొట్టిన మొదటి పలకలమీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.౹

3 కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించిమునుపటివాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని.౹

4 ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలనుమునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి

5 నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.౹

6 ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.౹

7 అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులుగల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి.౹

8 నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధనమందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.౹

9 కాబట్టి తమ సహోదరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవావారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.౹

10 నేనుమునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను.౹

11 మరియు యెహోవా నాతో ఇట్లనెను–ఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను.

12 కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,౹

13 నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?

14 చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.౹

15 అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను.౹

16 కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్క రులుకాకుండుడి

17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.౹

18 ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.౹

19 మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.౹

20 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.౹

21 ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.౹

22 నీ పితరులు డెబ్బదిమందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/10-c13a89fbb3392ad716e41da13ad619d0.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 11

1 కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించినవాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడు గైకొనవలెను.౹

2 నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మిహమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని

3 ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను

4 ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్రజలమును వారిమీద ప్రవహింపజేసిన దానిని

5 యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని

6 రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్దనున్న సమస్త జీవరాసులను ఇశ్రాయేలీయులందరిమధ్యను మ్రింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.౹

7 యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.౹

8 మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును

9 యెహోవావారికిని వారి సంతానమునకును దయచేసెదనని మీపితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను.౹

10 మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.౹

11 మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.౹

12 అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.

13 కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల

14 మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు.౹

15 మరియు నీవుతిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.౹

16 మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.౹

17 లేనియెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండ మీరు శీఘ్రముగా నశించెదరు.౹

18 కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.౹

19 నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి

20 నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.౹

21 ఆలాగు చేసినయెడల యెహోవా మీపితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.౹

22 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మీకాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచు కొనవలెను.౹

23 అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠు లైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.౹

24 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునదిమొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.౹

25 ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీ భయము పుట్టించును.౹

26 చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.౹

27 నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక

28 నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుసరించినయెడల శాపమును మీకు కలుగును.

29 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండమీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.౹

30 అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.౹

31 మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.౹

32 అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/11-5c33d2297f013620da4e253f78b91ee7.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 12

1 మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.౹

2 మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతములమీదనేమి మెట్టలమీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్క డెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.౹

3 వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చటలేకుండ నశింపజేయవలెను.౹

4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవానుగూర్చి చేయకూడదు.౹

5 మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.౹

6 అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలువాటిని తీసికొని రావలెను.౹

7 మీరును మీ దేవుడైన యెహోవా మిమ్ము నాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటియందు సంతోషింపవలెను.౹

8 నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతిమనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు.౹

9 నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.౹

10 మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువులందరులేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు

11 నేను మీకాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొని రావలెను.౹

12 మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలోఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.౹

13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.౹

14 యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.౹

15 అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలదియిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.౹

16 మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.౹

17 నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛా ర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక

18 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవుచేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.౹

19 నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమీ.

20 నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాటచొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును.౹

21 నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచు కొను స్థలము మీకు దూరముగా ఉండినయెడల

22 యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదములేకుండ తినవచ్చును.౹

23 అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;౹

24 నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.౹

25 నీవు యెహోవా దృష్టికి యుక్తమైనదానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలుకలుగునట్లు దాని తినకూడదు.౹

26 నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొని పోవలెను.౹

27 నీ దహనబలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠముమీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠముమీద పోయవలెను; వాటి మాంసము నీవు తినవలెను.౹

28 నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతివారికిని నిత్యము మేలుకలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ మాటలన్నిటిని నీవు జాగ్ర త్తగా వినవలెను.

29 నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లు చున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి నాశముచేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించునప్పుడు, వారు నీ యెదుటనుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి,౹

30 వారి దేవతలను ఆశ్ర యింపగోరి–ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను.౹

31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవానుగూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా.౹

32 నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/12-7f04916cb8a9047dcd24d05ada6e6de9.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 13

1 ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి

2 నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల

3 అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.౹

4 మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.౹

5 నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.

6 నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని

7 భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించినయెడల

8 వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.౹

9 చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.౹

10 రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములోనుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు.౹

11 అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.

12 నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న నీ పురములలో ఏదోయొకదానియందు

13 పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.౹

14 అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల

15 ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.౹

16 దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్ట బడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును.౹

17 నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు

18 నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిచేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కని కరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/13-9a2242b697c150ee6ccd456dc5d5e562.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 14

1 మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మలమధ్య బోడిచేసికొనకూడదు.౹

2 ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.

3 నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా

4-5 ఎద్దు, గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే.౹

6 జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును.౹

7 నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగల వాటిలోనిదేకాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.౹

8 మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు.

9 నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు ననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును.౹

10 రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము.౹

11-20 పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా–పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచుపక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడికంటె, గుడ్లగూబ, హంస, గూడ బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును.

21 చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును.వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.

22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.౹

23 నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను.౹

24 మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని,౹

25 నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను

26 ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.౹

27 లేవీ యులను విడువకూడదు; నీమధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైననులేదు.

28 నీ దేవుడైన యెహోవా నీవుచేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరముల కొకసారి, ఆయేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను.౹

29 అప్పుడు నీమధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/14-9c1e5636befcbdd40d10ae442bb8cb77.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 15

1 ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువురీతి యేదనగా

2 తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు.౹

3 అన్యుని నిర్బంధింప వచ్చునుగాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.౹

4 నీవు స్వాధీన పరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును.౹

5 కావున నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచు కొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు ఉండనే ఉండరు.౹

6 ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు.

7 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు.౹

8 నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.౹

9 విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును.౹

10 నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.౹

11 బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.

12 నీ సహోదరులలో హెబ్రీయుడేగాని హెబ్రీయురాలేగాని నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయవలెను.౹

13 అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు.౹

14 నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను.౹

15 ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీ కాజ్ఞాపించియున్నాను.౹

16 అయితే నీయొద్ద వానికి మేలు కలిగినందున–నిన్నును నీ యింటివారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పినయెడల

17 నీవు కదురును పట్టుకొని, తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడైయుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను.౹

18 వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగావాడు ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.

19 నీ గోవులలోనేమి నీ గొఱ్ఱె మేకలలోనేమి తొలి చూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు.౹

20 యెహోవా యేర్పరచుకొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను.౹

21 దానిలో లోపము, అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు.౹

22 జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/15-ef63b81a86b7639d401e8bc3b8d78dc5.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 16

1 ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను రప్పించెను.౹

2 యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱె మేకలలోగాని గోవులలోగాని బలి అర్పింపవలెను.౹

3 పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.౹

4 నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండకూడదు.౹

5 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు.౹

6 నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి

7 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను.౹

8 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యేపనియు చేయకూడదు.

9 ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వారములను లెక్కించి

10 నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలది దాని నియ్యవలెను.౹

11 అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.౹

12 నీవు ఐగుప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకముచేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.

13 నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.౹

14 ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను.౹

15 నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.౹

16 ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.౹

17 వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.

18 నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమునుబట్టి జనులకు తీర్పుతీర్చవలెను.౹

19 నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.౹

20 నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను.

21 నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏవిధమైన వృక్షమును నాటకూడదు, దేవతాస్తంభమును ఏర్పరచకూడదు.౹

22 నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైన నిలువబెట్టకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/16-8ebee345274d9303e0c3bd9ad7d34959.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 17

1 నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైననుగల యెద్దునేగాని గొఱ్ఱె మేకలనేగాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు; అది నీ దేవుడైన యెహోవాకు హేయము.

2 నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానినిచేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు

3 అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీయులలో జరిగియుండుట వాస్తవమైనయెడల

4 ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునిగాని స్త్రీనిగాని నీ గ్రామముల వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టవలెను.౹

5 ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను.౹

6 ఒక్క సాక్షి మాటమీద వానికి విధింపకూడదు.౹

7 వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.

8 హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకాని యెడల

9 నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు.౹

10 యెహోవా ఏర్పరచు కొను స్థలమునవారు నీకు తెలుపు తీర్పుచొప్పున నీవు జరి గించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పుతీర్చుటకు జాగ్రత్తపడవలెను.౹

11 వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పుచొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటనుండి కుడికిగాని యెడమకుగాని నీవు తిరుగకూడదు.౹

12 మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనేగాని ఆ న్యాయాధిపతి మాటనేగాని విననొల్లనియెడలవాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలోనుండి పరిహరింపవలెను.౹

13 అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు.

14 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి –నా చుట్టునున్న సమస్త జనమువలె నామీద రాజును నియమించుకొందుననుకొనినయెడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను.౹

15 నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.౹

16 అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా–ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.౹

17 తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసికొనకూడదు.౹

18 మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను;౹

19-20 అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలుమధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై

21-22 తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకుగాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/17-0270bd2255d0cfce8f96d3201181ded6.mp3?version_id=1787—