1 కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.
2 –అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని;
రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని
అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.౹
3 మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక౹
4 శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును౹
5 దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,౹
6 పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను౹
7 సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,౹
8-10 ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుం డియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము; దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
11 ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాటలాడుచున్నాను,మా హృదయము విశాలపరచబడి యున్నది.౹
12 మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.౹
13 మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పు చున్నాను.
14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?౹
15 క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?౹
16-18 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.
–నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి
దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
–కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి
ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని
ముట్టకుడనిప్రభువుచెప్పుచున్నాడు. –మరియు
నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై
యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై
యుందురని సర్వశక్తిగలప్రభువుచెప్పుచున్నాడు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CO/6-98a0f941924b92cd3a896b67e90cee92.mp3?version_id=1787—