1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యు
త్తరమిచ్చెను–
2 అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి
ఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగ
జేయును.
3 ఆయన సేనలను లెక్కింప శక్యమా?
ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?
4 నరుడు దేవునిదృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?
స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు
కాగలడు?
5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు
నక్షత్రములు పవిత్రమైనవి కావు.
6 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు
పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/25-1edde2b5dbf9050d335cf18244d202f0.mp3?version_id=1787—