1 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు
నన్ను ఎగతాళి చేయుదురు.
వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో
నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
2 వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును?వారి పౌరుషము పోయినది.
3 దారిద్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై
ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య
ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు
తిరుగులాడుదురు
4 వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు
తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
5 వారు నరులమధ్యనుండి తరిమివేయబడినవారు
దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులువారిని తరుముచు కేకలు వేయుదురు.
భయంకరమైన లోయలలోను
6 నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర
ముండవలసి వచ్చెను.
7 తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు
ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.
8 వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని
పుట్టినవారువారు దేశములోనుండి తరుమబడినవారు.
9 అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు
నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
10 వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి
దూరముగా పోవుదురు
నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు
11 ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను
కావునవారు నాకు లోబడక కళ్లెము వదలించు
కొందురు.
12 నా కుడిప్రక్కను అల్లరిమూక లేచునువారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు
పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన
ప్రయత్నములను నామీద సాగింతురు.
13 వారు నిరాధారులైనను
నా మార్గమును పాడుచేయుదురు
నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ
జేయుదురు
14 గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లువారు
వచ్చెదరు
ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
15 భీకరమైనవి నామీద పడెను
గాలి కొట్టివేయునట్లువారు నా ప్రభావమును కొట్టి
వేయుదురు
మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
16 నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది
ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి
17 రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడు
నట్లున్నవి
నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
18 మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును
మెడచుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను
ఇరికించుచున్నది.
19 ఆయన నన్ను బురదలోనికి త్రోసెను
నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
20 నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర
మేమియు నియ్యకున్నావు
నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
21 నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి
నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు
22 గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని
పోజేయుచున్నావు
తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు
23 మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత
సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని
నాకు తెలియును.
24 ఒకడు పడిపోవునెడల వాడు చెయ్యిచాపడా?
ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడా?
25 బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?
దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా?
26 నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు
కీడు సంభవించెను
వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.
27 నా పేగులు మానక మండుచున్నవి
అపాయదినములు నన్నెదుర్కొనెను.
28 సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను
సంచరించుచున్నాను
సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.
29 నేను నక్కలకు సోదరుడనైతిని
నిప్పుకోళ్ల జతకాడనైతిని.
30 నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది
కాకవలన నా యెముకలు కాగిపోయెను.
నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది
నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/30-a15395399b40d54a2cb8efedef0c1e96.mp3?version_id=1787—