1 మరియు యెహోవా యోబునకు ఈలాగు .
ప్రత్యుత్తరమిచ్చెను–
2 ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో
వాదింపవచ్చునా?
దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర
మియ్యవలెను.
3 అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను–
4 చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని
ప్రత్యుత్తరమిచ్చెదను?
నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
5 ఒక మారుమాటలాడితిని నేను మరల నోరెత్తను.
రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
6 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు
యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను–
7 పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము
నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.
8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా?
నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప
రాధము మోపుదువా?
9 దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా?
ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప
గలవా?
10 ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము
గౌరవప్రభావములను ధరించుకొనుము.
11 నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము
గర్విష్ఠులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.
12 గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము
దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ
ద్రొక్కుము.
13 కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము
సమాధిలో వారిని బంధింపుము.
14 అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను
నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.
15 నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు
గదా
ఎద్దువలె అది గడ్డి మేయును.
16 దాని శక్తి దాని నడుములో ఉన్నది
దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.
17 దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను
వంచును
దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి
యున్నవి.
18 దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి
దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి
19 అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది
దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.
20 పర్వతములలో దానికి మేత మొలచును
అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.
21 తామర చెట్లక్రిందను
జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును
22 తామరచెట్ల నీడను అది ఆశ్రయించును
నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.
23 నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు
యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు
వచ్చినను అది ధైర్యము విడువదు.
24 అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా?
ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/40-755302b23624d7c3ce234fd9940475bf.mp3?version_id=1787—