Categories
కీర్తనలు

కీర్తనలు 2

1 అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?

జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

2 –మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము

రండి అని చెప్పుకొనుచు

3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని

విరోధముగా నిలువబడుచున్నారు

ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

4 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు

ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు

5 ఆయన ఉగ్రుడై వారితో పలుకును

ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును

6 –నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద

నా రాజును ఆసీనునిగా చేసియున్నాను

7 కట్టడను నేను వివరించెదను

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను

–నీవు నా కుమారుడవు

నేడు నిన్ను కనియున్నాను.

8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను

భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

9 ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు

కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా

పగులగొట్టెదవు

10 కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి

భూపతులారా, బోధనొందుడి.

11 భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి

గడగడ వణకుచు సంతోషించుడి.

12 ఆయన కోపము త్వరగా రగులుకొనును

కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన

కోపించును

అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.

ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/2-61e3874778916d15be395e7b4c9222eb.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *