ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1 యెహోవా శరణుజొచ్చియున్నాను
–పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము
అని మీరు నాతో చెప్పుట యేల?
2 దుష్టులు విల్లెక్కుపెట్టి యున్నారు
చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై
తమ బాణములు నారియందు సంధించియున్నారు
3 పునాదులు పాడైపోగా
నీతిమంతులేమి చేయగలరు?
4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు
యెహోవా సింహాసనము ఆకాశమందున్నది
ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు
తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
5 యెహోవా నీతిమంతులను పరిశీలించును
దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అస
హ్యులు,
6 దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును
అగ్నిగంధకములును వడగాలియువారి పానీయభాగమగును.
7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు
వాడు
యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/11-78ab34004580c254b4c88d0c175d9b46.mp3?version_id=1787—