Categories
కీర్తనలు

కీర్తనలు 13

ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు?

నిత్యము మరచెదవా?

నాకెంతకాలము విముఖుడవై యుందువు?

2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?

ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా

క్రాంతుడనై యుందును?

ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించు

కొనును?

3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు

ఉత్తరమిమ్ము

4 నేను మరణనిద్ర నొందకుండను–వాని గెలిచితినని

నా శత్రువు చెప్పుకొనకుండను

నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింప

కుండను

నా కన్నులకు వెలుగిమ్ము.

5 నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను

నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది

యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు

నేను ఆయనను కీర్తించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/13-d961e52e33f83dc83526f24c85361643.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *