దావీదు రసికకావ్యము.
1 దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
2 –నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు
లేదని యెహోవాతో నేను మనవి చేయుదును
3 నేనీలాగందును–భూమిమీదనున్న భక్తులే శ్రేష్ఠులు;వారు నాకు కేవలము ఇష్టులు.
4 యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి
శ్రమలు విస్తరించును.
వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను.
5 యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము
నీవే నా భాగమును కాపాడుచున్నావు.
6 మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను
శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
7 నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను
రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు
బోధించుచున్నది.
8 సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపు
చున్నాను.
ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక
నేను కదల్చబడను.
9 అందువలన నా హృదయము సంతోషించుచున్నది
నా ఆత్మహర్షించుచున్నది
నా శరీరము కూడ సురక్షితముగా నివసించుచున్నది
10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచి
పెట్టవు
నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు
నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు
నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/16-9092b50c59fc54e81fa8458313c972fc.mp3?version_id=1787—