Categories
కీర్తనలు

కీర్తనలు 32

దావీదు కీర్తన. దైవధ్యానము.

1 తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు

తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు

ధన్యుడు.

2 యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు

ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.

3 నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన

నా ఆర్తధ్వనివలన

నాయెముకలు క్షీణించినవి.

4 దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను

నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.(సెలా.)

5 నా దోషమును కప్పుకొనక

నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని

–యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు

కొందుననుకొంటిని.

నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.(సెలా.)

6 కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను

ప్రార్థనచేయుదురు.

విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను

నిశ్చయముగా అవి వారిమీదికి రావు.

7 నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను

రక్షించెదవు

విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు

8 నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ

మును నీకు బోధించెదను

నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను

9 బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద

వలెనైనను మీరు ఉండకుడి

అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను

కళ్లెముతోను బిగింపవలెను.

10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి

యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవ

రించుచున్నది.

11 నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి

ఉల్లసించుడి

యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము

చేయుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/32-bc1bf49574f74832a27076fdcdfccefb.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *