Categories
కీర్తనలు

కీర్తనలు 73

ఆసాపు కీర్తన.

1 ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల

నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.

2 నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను

నా అడుగులు జార సిద్ధమాయెను.

3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు

గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.

4 మరణమందు వారికి యాతనలు లేవువారు పుష్టిగా నున్నారు.

5 ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు

ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.

6 కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది

వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.

7 క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవివారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి

8 ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును

గూర్చి వారు మాటలాడుదురు.

గర్వముగా మాటలాడుదురు.

9 ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురువారి నాలుక భూసంచారము చేయును.

10 వారి జనము వారిపక్షము చేరునువారు జలపానము సమృద్ధిగా చేయుదురు.

11 –దేవుడు ఎట్లు తెలిసికొనును

మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను

కొందురు.

12 ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు

నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.

13 నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట

వ్యర్థమే

నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే

14 దినమంతయు నాకు బాధ కలుగుచున్నది

ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.

15 –ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల

నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ

నగుదును.

16 అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు

17 నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయివారి అంతమునుగూర్చి ధ్యానించువరకు

ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.

18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే

ఉంచియున్నావువారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు

19 క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు

మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

20 మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు

ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక

రింతువు.

21 నా హృదయము మత్సరపడెను.

నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.

22 నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని

నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.

23 అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను

నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.

24 నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు.

తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు

25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?

నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర

లేదు.

26 నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను

దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.

27 నిన్ను విసర్జించువారు నశించెదరు

నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ

రించెదవు.

28 నాకైతే దేవుని పొందు ధన్యకరము

నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు

నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/73-2be0ec9c4251ce07bcb6ee4ff2936e22.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *