దావీదు కీర్తన.
1 నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు
పాడెదను
యెహోవా, నిన్ను కీర్తించెదను.
2 నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను.
నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు?
నా యింట యథార్థహృదయముతో నడుచుకొం
దును
3 నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు
కొనను
భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య
ములు అవి నాకు అంటనియ్యను
4 మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను
దౌష్ట్యమును నేననుసరింపను.
5 తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను
సంహరించెదను
అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము
గలవారిని నేను సహింపను
6 నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైనవారిని నేను కనిపెట్టుచున్నాను
నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు
లగుదురు.
7 మోసము చేయువాడు నా యింట నివసింపరాదు
అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.
8 యెహోవా పట్టణములోనుండి
పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై
దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను
సంహరించెదను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/101-a39df8985b6b2407825fdd07a53ddd56.mp3?version_id=1787—