Categories
కీర్తనలు

కీర్తనలు 110

దావీదు కీర్తన.

1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు

–నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా

చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

2 యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి

సాగజేయుచున్నాడు

నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.

3 యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా

వచ్చెదరు.

నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు

వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు

4 –మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము

యాజకుడవైయుందువని

యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన

మాట తప్పనివాడు.

5 ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి

తన కోపదినమున రాజులను నలుగగొట్టును.

6 అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును

దేశము శవములతో నిండియుండును

విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.

7 మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/110-2bf66528bb448334c9792913152beaf6.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *