1 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము
నిలుచును
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
2 ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు
అందురు గాక.
3 ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ
స్థులు అందురు గాక.
4 ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా
యందు భయభక్తులుగలవారు అందురు గాక.
5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని
విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
6 యెహోవా నా పక్షముననున్నాడు నేను భయ
పడను
నరులు నాకేమి చేయగలరు?
7 యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై
యున్నాడు
నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట
చూచెదను.
8 మనుష్యులను నమ్ముకొనుటకంటె
యెహోవాను ఆశ్రయించుట మేలు.
9 రాజులను నమ్ముకొనుటకంటె
యెహోవాను ఆశ్రయించుట మేలు.
10 అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు
యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము
చేసెదను.
11 నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు
యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము
చేసెదను.
12 కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు
ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లువారు నశించి
పోయిరి
యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము
చేసెదను.
13 నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి
యెహోవా నాకు సహాయము చేసెను.
14 యెహోవా నా దుర్గము నా గానము
ఆయన నాకు రక్షణాధారమాయెను.
15 నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన
ఉత్సాహ సునాదము వినబడును
యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను
చేయును.
16 యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను
యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను
చేయును.
17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ
రించెదను.
18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని
ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
19 నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి
నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించెదను.
20 ఇది యెహోవా గుమ్మము
నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
21 నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి
యున్నావు
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి
మూలకు తలరాయి ఆయెను.
23 అది యెహోవావలన కలిగినది
అది మన కన్నులకు ఆశ్చర్యము
24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము
దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
25 యెహోవా, దయచేసి నన్ను రక్షించుము
యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
26 యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును
గాక
యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు
చున్నాము.
27 యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను
గ్రహించియున్నాడు
ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు
కట్టుడి.
28 నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించెదను
నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.
29 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము
నిలుచుచున్నది
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/118-43faa643f2f5ec9b8c54851e3c7e49d2.mp3?version_id=1787—