Categories
కీర్తనలు

కీర్తనలు 120

యాత్రకీర్తన.

1 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని

ఆయన నాకు ఉత్తరమిచ్చెను.

2 యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు

మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును

విడిపించుము.

3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును?

ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

4 తంగేడునిప్పులతోకూడిన బాణములను

బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

5 అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను.

కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.

6 కలహప్రియునియొద్ద

నేను చిరకాలము నివసించినవాడను.

7 నేను కోరునది సమాధానమే

అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు

యుద్ధమునకు సిద్ధమగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/120-d42b9dc1e8102a6b8691aaf47cc471a9.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *