1 ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.౹
2 తాను కూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.౹
3 ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.౹
4 మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.౹
5 అటువలె క్రీస్తు కూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని
–నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను
అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.౹
6 ఆప్రకారమే
–నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున
నిరంతరము యాజకుడవై యున్నావు
అని మరియొకచోట చెప్పుచున్నాడు.౹
7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.౹
8 ఆయన, కుమారుడైయుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.౹
9-10 మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
11 ఇందునుగూర్చిమేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.౹
12 కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింప వలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారేగాని బలమైన ఆహారము తినగలవారుకారు.౹
13 మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.౹
14 వయస్సు వచ్చినవారుఅభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HEB/5-00fd11a6c3f0b02bc09f85098fcdaede.mp3?version_id=1787—