Categories
యెషయా

యెషయా 12

1 ఆ దినమున మీరీలాగందురు

–యెహోవా, నీవు నామీద కోపపడితివి

నీ కోపము చల్లారెను

నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి

యున్నావు.

2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు,

నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను

యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే

నా కీర్తనకాస్పదము

ఆయన నాకు రక్షణాధారమాయెను

3 కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు

లలోనుండి నీళ్లు చేదుకొందురు

ఆ దినమున మీరీలాగందురు

4 –యెహోవాను స్తుతించుడి ఆయన నామమును

ప్రకటించుడి

జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి

ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు

కొనుడి.

5 యెహోవానుగూర్చి కీర్తన పాడుడి

ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను

భూమియందంతటను ఇది తెలియబడును.

6 సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము

నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు

ఘనుడై యున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/12-4336c66523395ed7da1aeb44e3092c69.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 13

1 ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి

ప్రత్యక్షమైన దేవోక్తి–

2 జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు

చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి

ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.

3 నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను

నాకోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలు

రను పిలిపించియున్నాను

నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించి

యున్నాను.

4 బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహము

వలన కలుగు శబ్దము వినుడి

కూడుకొను రాజ్యముల జనములుచేయు అల్లరి

శబ్దము వినుడి

సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధమునకై తన

సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు

5 సర్వలోకమును పాడుచేయుటకై

ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతముల

నుండి

యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధ

ములును వచ్చుచున్నారు.

6 యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి

అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి

వచ్చును.

7 అందుచేత బాహువులన్నియు దుర్బలములగును

ప్రతివాని గుండె కరగిపోవును

8 జనులు విభ్రాంతినొందుదురు

వేదనలు దుఃఖములు వారికి కలుగును

ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు

ఒకరినొకరు తేరి చూతురువారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.

9 యెహోవా దినము వచ్చుచున్నది.

దేశమును పాడుచేయుటకును

పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట

కును

క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము

తోను అది వచ్చును.

10 ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ

వెలుగు ప్రకాశింపనియ్యవు

ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును

చంద్రుడు ప్రకాశింపడు.

11 లోకుల చెడుతనమునుబట్టియు

దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు

చున్నాను

అహంకారుల అతిశయమును మాన్పించెదను

బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

12 బంగారుకంటె మనుష్యులును

ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును

అరుదుగా ఉండ జేసెదను.

13 సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును

ఆయన కోపాగ్ని దినమునకును

ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పు

నట్లును నేను చేసెదను.

14 అప్పుడు తరుమబడుచున్న జింకవలెను

పోగుచేయని గొఱ్ఱెలవలెను

జనులు తమతమ స్వజనులతట్టు తిరుగుదురు

తమతమ స్వదేశములకు పారిపోవుదురు.

15 పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును

తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును

16 వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ

గొట్టబడుదురు

వారి యిండ్లు దోచుకొనబడునువారి భార్యలు చెరుపబడుదురు.

17 వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను

వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడ వారికి

రమ్యమైనది కాదు

18 వారి విండ్లు యౌవనస్థులను నలుగగొట్టును

గర్భఫలమందువారు జాలిపడరు

పిల్లలను చూచి కరుణింపరు.

19 అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ

యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను

దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.

20 అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు

తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు

అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము

వేయడు

గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ

నియ్యరు

21 నక్కలు అక్కడ పండుకొనును

గురుపోతులు వారి యిండ్లలో ఉండును

నిప్పుకోళ్లు అక్కడ నివసించును

కొండమేకలు అక్కడ గంతులు వేయును

22 వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాసమందిర

ములలో అడవికుక్కలును మొరలిడును

ఆ దేశమునకు కాలము సమీపించియున్నది

దాని దినములు సంకుచితములు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/13-5b0f1287048f70ad17ebfbed5e8e2c63.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 14

1 ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును

ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును

వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులువారిని కలిసికొందురువారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు

2 జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమునవారిని ప్రవేశపెట్టుదురు

ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని

దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు

కొందురువారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

తమ్మును బాధించినవారిని ఏలుదురు.

3-4 నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన

కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను

విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును

గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున

పాడుదువు

బాధించినవారు ఎట్లు నశించిపోయిరి?

రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?

5 దుష్టుల దుడ్డుకఱ్ఱను

మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన

ఏలికల రాజదండమును

యెహోవా విరుగగొట్టియున్నాడు.

6 వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనము

లను లోబరచిరి.

7 భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది

జనములు పాడసాగుదురు.

నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా

మీదికి రాలేదని

8 నిన్నుగూర్చి తమాలవృక్షములు

లెబానోను దేవదారువృక్షములు హర్షించును

9 నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై

క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది.

అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది

భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల

నందరిని

వారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది

10 వారందరు నిన్ను చూచి–నీవును మావలె బలహీనుడ

వైతివా?

నీవును మాబోటివాడవైతివా? అందురు.

11 నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును

పాతాళమున పడవేయబడెను.

నీ క్రింద పురుగులు వ్యాపించును

కీటకములు నిన్ను కప్పును.

12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా,

నీవెట్లు ఆకాశమునుండి పడితివి?

జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు

నరకబడితివి?

13 –నేను ఆకాశమున కెక్కిపోయెదను

దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును

హెచ్చింతును

ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14 మేఘమండలముమీది కెక్కుదును

మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును

అని

నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు

త్రోయబడితివే.

16-17 నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు

తలపోయుదురు

–భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు

ఇతడేనా?

లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు

చేసినవాడు ఇతడేనా?

తాను చెరపెట్టినవారిని తమ నివాసస్థలమునకు పో

నియ్యనివాడు ఇతడేనా?

18 జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ

తమ నగరులయందు నిద్రించుచున్నారు.

19 నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె

నున్నావు.

ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్ప

బడినవాడవైతివి

త్రొక్కబడిన పీనుగువలెనైతివి

బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె

నున్నావు

20 నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి

నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు

దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

21 వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము

లతో లోకమును నింపకుండునట్లు

తమపితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం

చుటకు దొడ్డి సిద్ధపరచుడి.

22 సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే

–నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును

శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని

యెహోవా సెలవిచ్చుచున్నాడు.

23 నేను దానిని ముళ్ళ పందికి స్వాధీనముగాను నీటి మడు

గులగాను చేయుదును.

నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను

అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు

చున్నాడు.

24 సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ

కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

–నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును

నేను యోచించినట్లు స్థిరపడును.

25 నా దేశములో అష్షూరును సంహరించెదను

నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను

వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును

వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప

బడును.

26 సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే

జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.

27 సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి

యున్నాడు

రద్దుపరచగలవాడెవడు?

బాహువు చాచినవాడు ఆయనే

దాని త్రిప్పగలవాడెవడు?

28 రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన

దేవోక్తి

29 –ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా

విరువబడెనని అంతగా సంతోషింపకుము

సర్పబీజమునుండి మిడునాగు పుట్టును

దాని ఫలము ఎగురు సర్పము.

30 అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు

దరిద్రులు సురక్షితముగా పండుకొందురు

కరవుచేత నీ బీజమును చంపెదను

అది నీ శేషమును హతము చేయును.

31 గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ.

ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు

ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది

వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును

లేడు.

32 జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది?

యెహోవా సీయోనును స్థాపించియున్నాడు

ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్ర

యింతురు అని చెప్పవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/14-cd310986260ee49a6662b35d0f5d7fe7.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 15

1 మోయాబునుగూర్చిన దేవోక్తి

–ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును

ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

2 ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న

దీబోనుకును వెళ్లుచున్నారు

నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు

ప్రలాపించుచున్నారు

వారందరి తలలమీద బోడితనమున్నది

ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది

3 తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురువారి మేడలమీదను వారి విశాలస్థలములలోను

వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు

దురు.

4 హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి

యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది

మోయాబీయుల యోధులు కేకలువేయుదురు

మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.

5 మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది

దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు

వరకు పారిపోవుదురు

లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు

నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొ

నయీము త్రోవను పోవుదురు.

6 ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను

అది ఇంకను అడవిగా ఉండును.

గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి

పచ్చనిది ఎక్కడను కనబడదు

7 ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన

పదార్థములను

నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని

పోవుదురు.

8 రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను

అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును

వినబడెను.

9 ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను.

మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పిం

చెదను.

మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని

ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును

రప్పించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/15-845a0ccba12a36b62b5e3e75adaf598a.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 16

1 అరణ్యపుతట్టుననున్న సెలనుండి

దేశము నేలువానికి తగిన గొఱ్ఱెపిల్లలను కప్పముగా

2 సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి

గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె

అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన

బడుదురు.

3 ఆలోచన చెప్పుము విమర్శచేయుము.

చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద

ఉండనియ్యుము.

చెదరినవారిని దాచిపెట్టుము

పారిపోయినవారిని పెట్టియ్యకుము

4 నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము

దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయా

బీయులకు ఆశ్రయముగా ఉండుము

బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మాని

పోయెను.

అణగద్రొక్కువారు దేశములోలేకుండ నశించిరి.

5 కృపవలన సింహాసనము స్థాపింపబడును

సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి

తీర్పుతీర్చు నొకడు కలడు

దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము

విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

6 మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నామువారి గర్వమునుగూర్చియు

వారి అహంకార గర్వక్రోధములనుగూర్చియు విని

యున్నాము.వారు వదరుట వ్యర్థము.

7 కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగలార్చుదురు

అందరును అంగలార్చుదురు

మోయాబీయులారా

కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు

దొరకక మీరు మూలుగుదురు.

8 ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా

వల్లులు వాడిపోయెను

దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు

అణగద్రొక్కిరి.

అవి యాజరువరకు వ్యాపించెను

అరణ్యములోనికి ప్రాకెను

దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును

దాటెను.

9 అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా

వల్లుల నిమిత్తము ఏడ్చెదను

హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె

దను

ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు

నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత

మీదను పడి కేకలు వేయుదురు.

10 ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను

ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ

ధ్వని వినబడదు

గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును

లేడు

ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను

మాన్పించియున్నాను.

11 మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది

కీర్హరెశెతు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె

వాగుచున్నవి.

12 మోయాబీయులు ఉన్నతస్థలమునకు వచ్చి ఆయాస

పడి

ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడువారికేమియు దొరకకపోవును.

13 పూర్వకాలమున యెహోవా మోయాబునుగూర్చి

సెలవిచ్చిన వాక్యము ఇదే; అయితే యెహోవా

ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు

14 –కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా

మోయాబీయులయొక్క ప్రభావమును వారి గొప్ప

వారి సమూహమును అవమానపరచబడును

శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్ప

ముగా నుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/16-bfd807b6456ddf3022b2b47cf36bdfdf.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 17

1 దమస్కునుగూర్చిన దేవోక్తి

2 – దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను

అది పాడై దిబ్బగానగును

అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును

అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును

ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట

పండుకొనును.

3 ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును

దమస్కునకు రాజ్యములేకుండును

ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో

నుండి శేషించినవారికి జరుగును

సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల

విచ్చుచున్నాడు.

4 ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించిపోవును

వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును

5 చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి

వెన్నులను కోయునట్లుండును

రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుం

డును

6 అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను

రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు

ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు

నాలుగు పండ్లు మిగిలియుండునట్లు

దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవు

డైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7 ఆ దినమునవారు తమ చేతులు చేసిన బలిపీఠముల

తట్టు చూడరు

దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను

తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు.

8 మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురువారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని

లక్ష్యపెట్టును

9 ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు

ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ

శిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలముల

వలెనగును.

ఆ దేశము పాడగును

10 ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి

నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన

లేదు

అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చి

తివి

వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి

11 నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి

ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి

గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు

దినమున

పంట కుప్పలుగా కూర్చబడును.

12 ఓహో బహుజనములు సముద్రముల ఆర్భాటమువలె

ఆర్భటించును.

జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును

13 జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును

ఆయన వారిని బెదరించునువారు దూరముగా పారిపోవుదురు

కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు

తుపాను ఎదుట గిరగిర తిరుగు కసవు ఎగిరిపోవునట్లువారును తరుమబడుదురు.

14 సాయంకాలమున తల్లడిల్లుదురు

ఉదయము కాకమునుపు లేకపోవుదురు

ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము

దొంగిలువారికి పట్టు గతి యిదే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/17-756d541e1785bc9ff8215108dc0afa7c.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 18

1 ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొను

చున్న రెక్కలుగల దేశమా!

2 అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ

లలో రాయబారులను పంపుచున్నది

–వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన

చర్మముగలవారునగు జనమునొద్దకు

దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి.

నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన

ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు

పోవుడి.

3 పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక

నివాసులైన మీరు

భూమిమీద కాపురముండు మీరు చూడుడి

బాకా ఊదునప్పుడు ఆలకించుడి.

4 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు

–ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ

ములు మంచు కురియుచుండగాను

నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.

5 కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు

వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా

ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు

లతాతంతులను కోసివేయును.

6 అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న

మృగములకును విడువబడును

వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి

మీదనున్న మృగములును వాటిని తినును.

7 ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగలవారును

దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు

దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు

సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా

ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను

పర్వతమునకు తేబడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/18-94e6e1b3e6c7b38a151b44988d157ade.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 19

1 ఐగుప్తునుగూర్చిన దేవోక్తి

–యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు

వచ్చుచున్నాడు

ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును

ఐగుప్తీయుల గుండె కరగుచున్నది

2 నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను

సహోదరులమీదికి సహోదరులు

పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు

పట్టణముతో పట్టణము యుద్ధము చేయును

రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును

3 ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించునువారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను

కావునవారు విగ్రహములయొద్దకును గొణుగువారి

యొద్దకును

కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును

విచారింప వెళ్లుదురు.

4 నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె

దను

బలాత్కారుడైన రాజు వారి నేలును

అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా

సెలవిచ్చుచున్నాడు.

5 సముద్రజలములు ఇంకిపోవును

నదియును ఎండి పొడినేల యగును

6 ఏటి పాయలును కంపుకొట్టును

ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును

రెల్లును తుంగలును వాడిపోవును.

7 నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును

దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని

పోయి కనబడక పోవును.

8 జాలరులును దుఃఖించెదరు

నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించె

దరు

జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు

9 దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును

తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు.

రాజ్య స్తంభములు పడగొట్టబడును

10 కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.

11 ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు

సోయను అధిపతులు కేవలము అవివేకులైరి.

ఆలోచనశక్తి పశుప్రాయమాయెను

నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని

ఫరోతో మీరెట్లు చెప్పుదురు?

12 నీ జ్ఞానులు ఏమైరి?

సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి

నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్ప

వలెను గదా?

13 సోయను అధిపతులు అవివేకులైరి

నోపు అధిపతులు మోసపోయిరి.

ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు

చేసిరి

14 యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి

యున్నాడు

మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు

ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు

15 తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లు అయినను

ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు

16 ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు.

సైన్యములకధిపతియగు యెహోవావారిపైన తన

చెయ్యి ఆడించును

ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయ

పడుదురు.

17 యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును

తమకు విరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా

ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల

ఐగుప్తీయులు వణకుదురు.

18 ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా

వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు

ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి

నాశనపురము.

19 ఆ దినమున ఐగుప్తుదేశముమధ్యను యెహోవాకు ఒక

బలిపీఠమును

దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన

యొక స్తంభమును ఉండును.

20 అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో

వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును.

బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా

ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని

పంపును

అతడు వారిని విమోచించును.

21 ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను

వెల్లడిపరచుకొనును

ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి

కొందురువారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు

యెహోవాకు మ్రొక్కుకొనెదరు

తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.

22 యెహోవావారిని కొట్టును

స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టునువారు యెహోవావైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన

నంగీకరించి వారిని స్వస్థపరచును.

23 ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ

మేర్పడును

అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున

కును వచ్చుచు పోవుచునుందురు

ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవిర

చెదరు.

24 ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు

మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగనుండును.

25 సైన్యములకధిపతియగు యెహోవా

–నా జనమైన ఐగుప్తీయులారా,

నా చేతుల పనియైన అష్షూరీయులారా,

నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,

మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వ

దించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/19-08215e734c446847ead8a163185b10af.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 20

1 అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు . అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను.౹

2 ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను–నీవు పోయి నీ నడుముమీది గోనె పట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచుచుండగా

3 యెహోవా–నా సేవకుడైన యెషయా ఐగుప్తునుగూర్చియు కూషునుగూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము

4 అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.౹

5 వారు తాము నమ్ముకొనిన కూషీయులనుగూర్చియు, తాము అతిశయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులనుగూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.౹

6 ఆ దినమున సముద్రతీర నివాసులు–అష్షూరు రాజు చేతిలోనుండి విడిపింపబడ వలెనని సహాయముకొరకు మనము పారిపోయి ఆశ్ర యించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/20-938b3727e3c53a02ee84b6ff3a378e5b.mp3?version_id=1787—

Categories
యెషయా

యెషయా 21

1 సముద్రతీరముననున్న అడవిదేశమునుగూర్చిన దేవోక్తి

–దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు

అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.

2 కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను

గ్రహింపబడియున్నది.

మోసముచేయువారు మోసము చేయుదురు

దోచుకొనువారు దోచుకొందురు

ఏలామూ, బయలుదేరుము

మాద్యా, ముట్టడివేయుము

వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

3 కావున నా నడుము బహు నొప్పిగా నున్నది

ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పెట్టి

యున్నది

బాధచేత నేను వినలేకుండ నున్నాను

విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.

4 నా గుండె తటతట కొట్టుకొనుచున్నది

మహా భయము నన్ను కలవరపరచుచున్నది

నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.

5 వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు

తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు.

అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి;

ప్రభువు నాతో ఇట్లనెను

6 –నీవు వెళ్లి కావలివాని నియమింపుము

అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.

7 జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు

గాడిదలును

వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా

అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి

చూచును

8 సింహము గర్జించునట్టు కేకలు వేసి

–నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును

కావలి బురుజుమీద నిలుచుచున్నాను

రాత్రి అంతయు కావలి కాయుచున్నాను

9 ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని

చెప్పెను.

బబులోను కూలెను కూలెను

దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను

పడవేసియున్నాడు

ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని

చెప్పుచు వచ్చెను.

10 నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ

బడినవాడా,

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు

యెహోవావలన నేను వినిన సంగతి నీకు

తెలియజెప్పియున్నాను.

11 దూమానుగూర్చిన దేవోక్తి

–కావలివాడా, రాత్రి యెంత వేళైనది?

కావలివాడా, రాత్రి యెంత వేళైనది?

అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను

అడుగుచున్నాడు

12 కావలివాడు

–ఉదయమునగును రాత్రియునగును

మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల

రండి అనుచున్నాడు.

13 అరేబియానుగూర్చిన దేవోక్తి

–దెదానీయులైన సార్థవాహులారా,

సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.

14 తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి

పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని

రండి

15 ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయముచేతను

ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను

క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవుచున్నారు

16 ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు–కూలివారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే

కేదారు ప్రభావమంతయు నశించిపోవును.

17 కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు.

ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా

సెలవిచ్చియున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ISA/21-a537a4fbfa5748c2ca0aae078c1ea876.mp3?version_id=1787—